‘టెర్మినేటర్‌’ ఇక రాడు! | No more Terminator genisys sequel, Paramount pictures says | Sakshi
Sakshi News home page

‘టెర్మినేటర్‌’ ఇక రాడు!

Published Mon, Mar 20 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

‘టెర్మినేటర్‌’ ఇక రాడు!

‘టెర్మినేటర్‌’ ఇక రాడు!

హాలీవుడ్‌: చిన్నపిల్లల దగ్గర నుంచి యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే కుర్రకారు వరకు అందరినీ అలరించిన ‘టెర్మినేటర్‌’ చిత్రాలు ఇక రావు. వరుస సీక్వెల్స్‌తో అలరించిన టెర్మినేటర్‌ సీరిస్‌ చిత్రాలను ఇకపై నిర్మించబోమని నిర్మాణ సంస్థ పారామౌంట్‌ స్టూడియోస్‌ ప్రకటిం చింది. ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌ నెగ్గర్‌ కథానాయకుడి గా వచ్చిన ఈ చిత్రాలకు ఇక ముగింపు పలకనున్నట్లు సోమవారం ప్రకటించింది.

‘టెర్మినేటర్‌ అండ్‌ ఆర్నాల్డ్‌.. శకం ముగిసింది. మా నిర్మాణ సంస్థ ఈ స్వీక్వెల్స్‌కు ముగింపు పలకాలని నిర్ణయించింది. దీంతో ఇకపై టెర్మినేటర్‌కు సంబంధించి ఎటువంటి ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇకపై జరగవు. దీని అర్థం.. టెర్మినేటర్‌ ఇక ప్రేక్షకుల ముందుకు రాబోడు. నిజానికి టెర్మినేటర్‌ సీరిస్‌ను దీర్ఘకాలంపాటు కొనసాగిద్దామని అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా అన్నీ జరగవు కదా..! ఇది కూడా అలాగే మధ్యలోనే నిలిపివేయాల్సివస్తోంద’ని పారామౌంట్‌ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement