కారు ప్రమాదం నుంచి బయటపడ్డ ష్వార్జ్‌నెగ్గర్‌ | Arnold Schwarzenegger escapes unhurt from a car accident | Sakshi
Sakshi News home page

Arnold Schwarzenegger: కారు ప్రమాదం నుంచి బయటపడ్డ ష్వార్జ్‌నెగ్గర్‌

Jan 23 2022 6:20 AM | Updated on Jan 23 2022 11:25 AM

Arnold Schwarzenegger escapes unhurt from a car accident - Sakshi

లాస్‌ఏంజెలిస్‌: హాలీవుడ్‌ ‘టెర్మినేటర్‌’ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ త్రుటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఆర్నాల్డ్‌ డ్రైవింగ్‌ చేస్తున్న కారు రోడ్డుపై మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ స్వల్పగాయాలపాలయ్యారు. ప్రమాద ఫలితంగా మరో రెండు కార్లు కూడా ఇరుక్కుపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆర్నాల్డ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, యువతి ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని, ప్ర మాద స్థలిలో పోలీసులతో ఆయన మాట్లాడారని ఆర్నాల్డ్‌ ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement