హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు! | hollywood super star Arnold Schwarzenegger died with heart attack..? | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు!

Published Sat, Aug 29 2015 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు!

హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు!

లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్, ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మృతి చెందినట్లు వదంతులు వెలువడ్డాయి. లాస్ ఏంజెల్స్లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్త హల్చల్ చేసింది.  ఆర్నాల్డ్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా MSMBC అనే అంతర్జాతీయ వెబ్సైట్  రెండు రోజుల క్రితం వార్త పోస్ట్ చేసింది. అయితే ఆయన మరణవార్తపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ వార్తను ఇప్పటివరకూ ఖండించలేదు. కాగా ఆర్నాల్డ్...ట్విట్టర్ అకౌంట్ కూడా 13 గంటల క్రితం వరకూ యాక్టివ్ గానే ఉంది.

కాగా టెర్మినేటర్ చిత్రం ద్వారా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నఆర్నాల్డ్ ... ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించారు.  కాలిఫోర్నియా గవర్నర్గా సేవలందించిన ఆర్నాల్డ్ బుధవారం రాత్రి 9.30 సమయంలో లాజ్ ఏంజిల్స్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టుగా ఓ వార్తను  MSMBC వెబ్సైట్  పోస్ట్  చేయటమే కాకుండా, ఆర్నాల్డ్ మరణాన్ని ఆయన కుటుంబం కూడా ధృవీకరించినట్టుగా తెలిపారు వెబ్ సైట్ నిర్వాహకులు. గతంలోను పలువురు సెలబ్రిటీల విషయంలో కొన్ని వెబ్ సైట్స్ అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్బాలు చాలా ఉన్నాయి.. మరి ఆర్నాల్డ్ విషయంలో నిజా నిజాలు తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement