Terminator
-
నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
I warned you guys in 1984 and you didn't listen: కెనడియన్ చలనచిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేగవంతమైన విస్తరణ ప్రమాదాల గురించి 1984లోను తాను హెచ్చరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'ది టెర్మినేటర్' మూవీలో దీనికి సంబంధించి ఒక హెచ్చరికగా పనిచేసి ఉండవలసిందన్నారు.న్యూస్ హౌస్కిచ్చిన ఇంటర్వ్యూలో విపరీతమైన ఏఐ వాడకం విపత్తు పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు) కొంతమంది పరిశ్రమ నాయకులు భయపడుతున్నట్టుగా మానవాళి అంతరించిపోవడానికి కారణమయ్యే కృత్రిమ మేధస్సు గురించి అడిగినప్పుడు, కచ్చితంగా తనకు కూడా ఆందోళన ఉందన్నారు. వాస్తవానికి దీనిపై 1984లోనే హెచ్చరించాను కానీ మీరే వినలేదని పేర్కొన్నారు. తన సెన్సేషనల్ మూవీ 'ది టెర్మినేటర్' గురించి ప్రస్తావించిన కామెరూన్ ఇది స్కైనెట్ అని పిలువబడే తెలివైన సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్నెటిక్ హంతకుడు చుట్టూ తిరుగుతుంది కదా అని గుర్తు చేశారు. దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. అణు ఆయుధ పోటీకి సమానమైన పోటీ ఇదని భావించారు. మనం మిన్నకుంటే ఇతరులు దూసుకొస్తారనే పోటీ మధ్య ఇది మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధభూమిలో ఏఐ గురించి ప్రస్తావించిన కామెరూన్ కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి, మానవులు జోక్యం చేసుకోలేరు, శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ అనే చాన్స్ ఉండదు. ఈనేపథ్యంలో డీ-ఎస్కలేషన్‌పై దృష్టి పెట్టడం అవసరం, కానీ ఏఐ సిస్టమ్‌లు అటువంటి సూత్రాలకు కట్టుబడి ఉంటాయనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏఐకి సంబంధించి కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని , ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లు ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాయి.మనకు తెలియ కుండానే, అన్ని మీడియా , సమాచారంపై పూర్తిగా పట్టు దక్కించుకోనుందని పేర్కొన్నారు. అలాగే ఓపెన్ఏఐ, గూగుల్, డీప్‌మైండ్, టెక్ దిగ్గజాలతోపాటు, ఈ రంగంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు , వ్యవస్థాపకులతో పాటు, AIతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి, అణు యుద్ధ ప్రమాదాలను పరిష్కరించడంతో సమానంగా ఈ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని కామెరూన్ నొక్కి వక్కాణించారు. -
కారు ప్రమాదం నుంచి బయటపడ్డ ష్వార్జ్‌నెగ్గర్
లాస్ఏంజెలిస్: హాలీవుడ్ ‘టెర్మినేటర్’ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ త్రుటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఆర్నాల్డ్ డ్రైవింగ్ చేస్తున్న కారు రోడ్డుపై మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ స్వల్పగాయాలపాలయ్యారు. ప్రమాద ఫలితంగా మరో రెండు కార్లు కూడా ఇరుక్కుపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆర్నాల్డ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, యువతి ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని, ప్ర మాద స్థలిలో పోలీసులతో ఆయన మాట్లాడారని ఆర్నాల్డ్ ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి. సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్‌తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి. ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
మా అమ్మే నా సూపర్ హీరో
టెర్మినేటర్ సిరీస్‌లో వస్తోన్న తాజా చిత్రం ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’. హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నవంబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. నేను విడుదల చేసిన ఈ ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. తొలిసారి నేను హాలీవుడ్ మూవీ ‘300’ను తెలుగు డబ్బింగ్లో చూశాను. అప్పట్లో హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ విచిత్రంగా ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో బాగా క్వాలిటీ పెరిగింది. హాలీవుడ్ సినిమాలను మా చేత ప్రచారం చేయిస్తున్నారు. మా సినిమాలను కూడా యూఎస్‌లో ప్రమోట్ చేసేలా డిస్నీ సంస్థ ఆలోచించాలి. ఇలాంటి యాక్షన్ సినిమాలను ప్రభాస్ అన్నలాంటి హీరోలు చేస్తే బాగుంటుంది. ఇక పూరీగారి దర్శకత్వంలో నేను హీరోగా నటించాల్సిన ‘ఫైటర్’ సినిమా కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సి ఉంది. హాలీడేకి వెళ్లి ఇప్పుడే తిరిగొచ్చాను. ఈ హాలీడేలో ఐదారు కేజీలు పెరిగాను. వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తానా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు. ‘డిస్నీ సంస్థలో సూపర్‌హీరోస్ సినిమాలు వస్తుంటాయి. మీ లైఫ్‌లో ఉన్న సూపర్ హీరో ఎవరు?’ అన్న ప్రశ్నకు ‘‘మా అమ్మే నా సూపర్ హీరో’’ అన్నారు విజయ్. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్. ‘అలాద్దీన్, అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలను దక్షిణాదిలో విడుదల చేసినప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులు తమ ప్రాంతీయ భాషల్లో చూడటానికి ఇష్టపడ్డట్లు గమనించాం. అందుకే ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు డిస్నీ సంస్థ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
అలాంటి సినిమాలు ప్రభాస్ అన్నే చేయాలి..
గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా అనువాద చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. జేమ్స్ బాండ్, అవెంజర్స్, టెర్మినేటర్, లాంటి యాక్షన్ మూవీ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా టెర్మినేటర్ సిరీస్‌లోని ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్కూల్లో చదువుకునే రోజుల్లో ‘టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే’ సినిమా చూశానని చెప్పాడు. అప్పట్లో ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపాడు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల తెలుగు డబ్బింగ్ చూస్తే ఇరిటేషన్ వచ్చేదని.. ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగా పెరిగిందన్నాడు. ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’లో డబ్బింగ్ చాలా బాగున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తను ఇంకా చిన్నవాడినని.. ప్రభాస్ లాంటి వారు టెర్మినేటర్ లాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తెలుగులోకి హాలీవుడ్ సినిమాలను తీసుకొస్తున్న డిస్నీ సంస్థ మన ‘సాహో’, ‘సైరా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలను హాలీవుడ్‌కి తీసుకెళ్లాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. -
ఐ యామ్ బ్యాక్
...కామన్ ఆడియన్స్‌కు ఇది మామూలు ఫ్రేస్ కావొచ్చు. కానీ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అభిమానులకు, ‘టెర్మినేటర్’ మూవీ సిరీస్ ఫ్యాన్స్‌కు ‘ఐ యామ్ బ్యాక్’ అనే లైన్ ఒక ఎమోషన్. ‘ఐ యామ్ బ్యాక్’ అనే పంచ్‌లైన్ ఆర్నాల్డ్ ఫస్ట్ ‘టెర్మినేటర్’ సినిమాలోనే వాడారు. సినిమా రిలీజై పెద్ద హిట్ అయిన తర్వాత నుంచి ఈ లైన్ ఆర్నాల్డ్ స్టైల్ స్టైట్మెంట్లో ఒక భాగమైపోయింది. ఈ మధ్య ఆర్నాల్డ్ ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. దాంతో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆర్నాల్డ్ ఎలా ఉన్నారు? అని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దాంతో ఆర్నాల్డ్ తన ఫ్యాన్స్ కోసం తన హెల్త్ గురించిన అప్డేట్ ఇవ్వాలని ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్. నేను బావున్నాను అని మీ అందరికీ తెలియజేయడానికే ఈ వీడియో మెసేజ్. ఎంత పాజిటీవ్‌గా చెప్పాలనుకున్నా ఐ యామ్ నాట్ గ్రేట్. బట్ గుడ్. గ్రేట్ అంటే అది వేరే లెవల్. ప్రస్తుతానికైతే ఐ యామ్ గుడ్. నాకు మంచి డాక్టర్స్, నర్సస్ ఉన్నారు. వాళ్ల బాగా కేర్ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్’’ అని పేర్కొన్నారు ఆర్నాల్డ్. విశేషం ఏంటంటే సర్జరీ జరిగిన తర్వాత మేలుకొన్న వెంటనే ఆర్నాల్డ్ ‘ఐ యామ్ బ్యాక్’ అని అన్నారట. -
మనం మెచ్చిన హాలీవుడ్!
హాలీవుడ్‌కు ప్రపంచమంతా మార్కెట్ ఉన్న రోజుల్లో, ఆ సినిమాలు ఆడని ఒకే ఒక్క మార్కెట్ ఇండియా అంటారు. అలాంటి ఇండియన్ సినిమా మార్కెట్లోకీ హాలీవుడ్ చొచ్చుకొచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఈ రెండు దశాబ్దాల్లో ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ‘జురాసిక్ పార్క్’ చూసి సంబరపడిపోయాం. ‘టైటానిక్’ చూసి అద్భుతం అనేసుకున్నాం. ‘స్పైడర్‌మేన్’ అన్నాం. ‘టెర్మినేటర్’ వెంటపడ్డాం. ‘అవతార్’ ప్రపంచంలో కొట్టుకుపోయాం. ‘ఇంటర్స్టెల్లార్’ను వింతగా చూశాం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అద్భుతాలు సృష్టించగల పేరున్న హాలీవుడ్ సినిమాలు ఇండియాలోనూ ఆ పేరుతోనే పాపులర్ అయ్యాయి. ఆ జానర్ సినిమాలే ఇక్కడ ఫేమస్. ఇక గతేడాది హాలీవుడ్‌కు ఇండియన్ సినిమా మంచి మార్కెట్‌గా అవతరించింది. 2017లో వండర్‌వుమన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు ఇండియాలో దుమ్మురేపాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్, అడ్వెంచరస్ సినిమాలకే ఇండియాలో ఇప్పటికీ క్రేజ్ కనిపిస్తుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇక 2017కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమా అభిమాని టేస్ట్‌కి తగ్గ భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు 2018లోనూ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చాలా సినిమాలే దుమ్మురేపుతాయని ట్రేడ్ భావిస్తోంది. ముఖ్యంగా ‘జురాసిక్ వరల్డ్ 2’, ‘అవెంజర్స్’, ‘డెడ్‌పూల్ 2’, ‘బ్లాక్ పాంథర్’, ‘ఎక్స్ మెన్’ తదితర సినిమాలపై ట్రేడ్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అన్నది ఇండియాలో హాలీవుడ్ సినిమాకు కామన్ అయిపోయింది. ఈ ఏడాది సరికొత్త రికార్డులు సెట్ చేసే సినిమాలు వస్తున్నాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ భారీ బడ్జెట్ సినిమాలు అందుకుంటాయా? చూడాలి! -
ఆరోసారి వస్తున్న టెర్మినేటర్
లాస్ఏంజెల్స్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ కు కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టిన టెర్మినేటర్‌కు మరో సీక్వెల్ రాబోతోంది. ష్వాజ్ నెగర్ హీరోగా టెర్మినేటర్-6 ను 2019 లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సారా కానర్‌గా టెర్మినేటర్-1లో నటించి మెప్పించిన లిండా హామిల్టన్నే ఇందులోనూ స్వ్కార్జ్నెగ్గర్తో పాటు నటించనున్నారు. సినిమా విడుదలకు 2019 జూలై 26 వ తేదీని ఖరారు చేశామని ప్రొడ్యూసర్ జేమ్స్ కామెరాన్ తెలిపారు. అయితే, కథకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ సినిమా డైరెక్టర్ టిమ్ మిల్లర్, స్క్కిప్ట్ రైటర్‌గా కామరూన్ వ్యవహరిస్తున్నారు. -
కామెడీ చేస్తోన్న కండల వీరుడు
టెర్మినేటర్, కేనన్, ఎక్స్‌పాండబుల్స్ చిత్రాలతో యాక్షన్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్. ఇప్పటి వరకు తన బాడీకి తగ్గట్టుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ సీనియర్ హీరో ఇప్పుడు రూట్ మారుస్తున్నాడు. త్వరలో ఓ కామెడీ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్. వై వియార్ కిల్లింగ్ గంథర్ పేరుతో తెరకెక్కుతున్న కామెడీ డ్రామాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు ఆర్నాల్డ్. ఈ సినిమాలో కిరాయి హంతుకుల ముఠా సభ్యుడిగా నటిస్తున్నాడు. తమకు ప్రత్యర్థి అయిన కరుడుగట్టిన హంతుకుడి గంథర్ను ఎలాగైన దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది ఆర్నాల్డ్ టీం. అయితే గంథర్ గ్యాంగ్ వీళ్ల ఎత్తులను ముందే పసిగట్టి ఆ ఎటాక్‌లను తిప్పికొడుతుంది. ఇలా టామ్ అండ్ జెర్రీల గేమ్‌లా జరిగే కథ కడుపుబ్బ నవ్వించనుంది. శాటర్ డే నైట్ సినిమాలో కీలక పాత్రలో నటించిన టారన్ కిల్లమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
మరో వారసుడొస్తున్నాడు
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్‌లోనూ వారసుల హవా కనిపిస్తోంది. ఇప్పటికే జాకీచాన్, విల్ స్మిత్ లాంటి టాప్ స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, మరో హాలీవుడ్ టాప్ స్టార్ తన వారసుడిని సినిమాల కోసం సిద్దం చేస్తున్నాడు. ప్రిడేటర్, టెర్మినేటర్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తన తనయుడు జోసెఫ్ బేనాను సినిమాల కోసం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే జోసేఫ్ ఫిజిక్ మీద దృష్టి పెట్టిన ఆర్నాల్డ్ స్వయంగా తానే దగ్గరుండి జోసెఫ్‌తో జిమ్ చేయిస్తున్నాడు. తాజాగా వెనిస్ లోని గోల్డ్స్ జిమ్‌లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. 18 ఏళ్ల జోసెఫ్ ప్రస్తుతం మిస్టర్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు. -
త్వరలో టర్మినేటర్ 6
హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని సినిమా సీరీస్ టర్మినేటర్. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్ స్క్వాజ్‌నెగ్గర్ హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్‌లో ఇప్పటికే 5 భాగాలు విడుదలయ్యాయి. అయితే చివరగా రిలీజ్ అయిన టర్నినేటర్ జెనిసిస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ సీరీస్‌లో మరో సినిమా వస్తుందో, లేదో అన్న అనుమానం కలిగింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టర్నినేటర్ సీరీస్‌లో మరో సినిమా ఉంటుందంటూ ప్రకంటించాడు హీరో ఆర్నాల్డ్. 2015లో రిలీజ్ అయిన టర్మినేటర్ జెనిసిస్‌కు రిలీజ్ అయిన తొలి రోజు నుంచే నెగెటివ్ రివ్యూస్ రావటంతో కలెక్షన్ల విషయంలోనూ వెనకబడింది. నార్త్ అమెరికాలో 100 మిలియన్ డాలర్లు కూడా వసూళు చేయలేకపోయిన టర్మినేటర్ 5, చైనాలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మరోసారి టర్మినేటర్గా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్. -
హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు!
లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్, ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మృతి చెందినట్లు వదంతులు వెలువడ్డాయి. లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్త హల్చల్ చేసింది. ఆర్నాల్డ్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా MSMBC అనే అంతర్జాతీయ వెబ్సైట్ రెండు రోజుల క్రితం వార్త పోస్ట్ చేసింది. అయితే ఆయన మరణవార్తపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ వార్తను ఇప్పటివరకూ ఖండించలేదు. కాగా ఆర్నాల్డ్...ట్విట్టర్ అకౌంట్ కూడా 13 గంటల క్రితం వరకూ యాక్టివ్ గానే ఉంది. కాగా టెర్మినేటర్ చిత్రం ద్వారా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నఆర్నాల్డ్ ... ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించారు. కాలిఫోర్నియా గవర్నర్‌గా సేవలందించిన ఆర్నాల్డ్ బుధవారం రాత్రి 9.30 సమయంలో లాజ్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టుగా ఓ వార్తను MSMBC వెబ్సైట్ పోస్ట్ చేయటమే కాకుండా, ఆర్నాల్డ్ మరణాన్ని ఆయన కుటుంబం కూడా ధృవీకరించినట్టుగా తెలిపారు వెబ్ సైట్ నిర్వాహకులు. గతంలోను పలువురు సెలబ్రిటీల విషయంలో కొన్ని వెబ్ సైట్స్ అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్బాలు చాలా ఉన్నాయి.. మరి ఆర్నాల్డ్ విషయంలో నిజా నిజాలు తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
మేకింగ్ ఆఫ్ మూవీ : టెర్మినేటర్
-
తెలుగుసినిమాలపై టెర్మినేటర్ ప్రభావం...?
-
నాలుగోసారి టెర్మినేటర్‌గా..!
ఆర్నాల్డ్ ష్వాజెనెగ్గర్ నటించిన సంచలనాత్మక చిత్రం ‘టెర్మినేటర్’ చిత్రం గుర్తుంది కదా..! ఆ చిత్రం రెండు, మూడు భాగాల్లోనూ ఆయనే నటించారు. నాలుగో భాగంలో మాత్రం ఆర్నాల్డ్ నటించలేదు. ఇప్పుడు ఐదో భాగం ‘టెర్మినేటర్ జెనిసిస్’లో ఆయనే హీరో. అలెన్ టేలర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆకారం మార్చుకునే రసాయన రోబోలు...
హాలీవుడ్ సినిమా టర్మినేటర్లో మాదిరిగా.. కరిగిపోయినా, వస్తువుల మధ్య ఇరుక్కుపోయి కుంచించుకుపోయినా.. తిరిగి మామూలు స్థితికి రాగలిగే వినూత్న రోబోలు త్వరలోనే రానున్నాయట. ఇలాంటి రోబోల తయారీకి ఉపయోగపడే ప్రత్యేక పదార్థాన్ని తాము సృష్టించామని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చిత్రంలో మెత్తని ప్లాస్టిక్‌లా కనిపిస్తున్న వస్తువు ఆ పదార్థంతో తయారు చేసిందే. ఒకరకమైన మైనం, నురగను కలిపి చేసిన పదార్థాన్ని సన్నని తీగలకు పూసి దీనిని రూపొందించారు. తీగలకు కరెంటును పంపినప్పుడు మైనం వేడెక్కి ఇది ద్రవస్థితిలోకి మారుతుందని, అలాగే కరెంటును ఆపేసినప్పుడు తిరిగి ఘనస్థితిలోకి మారుతుందని, దీనివల్ల ఈ వస్తువు ఆకారాన్ని మార్చుకోవడంతోపాటు ఎక్కడైనా దెబ్బతింటే కూడా తిరిగి బాగు చేసుకుంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పదార్థంతో సూక్ష్మస్థాయి రోబోలను తయారుచేస్తే.. ఆకారం మార్చుకునే లక్షణం వల్ల ఇవి మనిషి శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాయని, అందువల్ల వైద్య పరీక్షలకు, చికిత్సలకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. కాస్త పెద్దస్థాయి రోబోలను తయారు చేస్తే.. భవనాలు కూలినప్పుడు శిథిలాల సందుల్లోంచి దూరిపోయి బాధితుల సమాచారం తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయట. -
షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్'
ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటున్నాడు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ (66). నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినిమా కెరీర్లో దాదాపు ప్రతి సారీ ఆయన గాయపడుతూనే ఉన్నాడు. వాటిలో చాలాసార్లు ఆయన ఎమర్జెన్సీలోకూడా చేరాడు. ఇప్పుడు మరోసారి యాక్షన్ సినిమాలో నటిస్తూ ఈ బాడీబిల్డర్ హీరో గాయపడ్డాడు. తాను గాయపడటం నిర్మాతలకు ఏమాత్రం ఇష్టం ఉండదని, అలా గాయపడితే కొన్నాళ్ల పాటు సినిమా ఆగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారని, అయినా కూడా సినిమాల్లో అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో చేసేటప్పుడు గాయాలు తప్పవని ఆయన అన్నాడు. చాలా సార్లు తాను ఎమర్జెన్సీ రూం నుంచి నేరుగా వచ్చి షూటింగులో పాల్గొన్నానని, కానీ కాలో చెయ్యో విరిగితే మాత్రం కొన్నాళ్ల పాటు అన్నీమూసేయక తప్పదని చెప్పాడు. గతంలో బాడీబిల్డింగ్ ఛాంపియన్‌గా కూడా నిలిచిన ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్.. టెర్మినేటర్ లాంటి సినిమాలతో భారత ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. -
మనిషిలానే సాయం చేస్తుంది..
అమెరికా రక్షణ రంగ శాస్త్రవేత్తలు రూపొందించిన మనిషి రూపంలోని నిలువెత్తు ‘అట్లాస్ రోబో’ ఇది. చూడటానికి హాలీవుడ్ సినిమా ‘టర్మినేటర్’లోని రోబోను తలపిస్తున్నా.. వాస్తవానికి ఇది యుద్ధ కార్యకలాపాల్లో కాకుండా సహాయక చర్యల్లో మాత్రమే పాల్గొంటుంది. భవనాలు కూలడం, భూకంపాలు సంభవించడం, సైనికులు గాయపడటం వంటివి జరిగినప్పుడు ప్రమాదకర పరిస్థితుల నుంచి బాధితులను రక్షిస్తుంది. విపత్తుల సమయంలో బాధితులను రక్షించే మనిషి రూపంలోని రోబోను సృష్టించే పోటీలో భాగంగా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) 6 అడుగుల 2 అంగుళాల పొడవు, 150 కేజీల బరువైన ఈ రోబోను తయారు చేసింది. ఎలాంటి ప్రదేశంలోనైనా, ఎగుడుదిగుళ్లు, శిథిలాల మధ్య నుంచీ భవనాల్లోకి ప్రవేశించి బాధితులను, గాయపడిన సైనికులను రక్షించగలిగేలా రూపొందించిన ఈ రోబోను మంగళవారం అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్ పరిశీలించారు. -
ఈ టెర్మినేటర్.. మంచి ఇన్వెస్టర్
ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది టెర్మినేటర్ సినిమా. బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్స్, సినిమాలతో కోట్లు సంపాదించాడు. ఆ వచ్చిన సంపాదనను జల్సాలకంటూ ఖర్చు పెట్టేయకుండా ఇన్వెస్ట్ చేయడంలోనూ తెలివిగానే వ్యవహరించాడు. 400 మిలియన్ డాలర్ల పైగా ఆస్తిని ఆర్జించాడు. బాడీబిల్డర్గాను, యాక్టర్‌గాను, గవర్నర్‌గానూ, ఇన్వెస్టర్గాను వివిధ పాత్రల్లో రాణించిన ఆర్నాల్డ్ ఇన్వెస్ట్మెంట్ విశేషాలే ఈ వారం సెలబ్రిటీ స్టోరీ.. ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇన్వెస్ట్ చేశాడు. రెస్టారెంట్లలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కమర్షియల్ జంబో జెట్లను కొనుక్కుని, లీజుకు ఇచ్చేవాడు. ఇవే కాకుండా షేర్లు, బాండ్లు మొదలైన వాటిల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టాడు. పద్ధతిగా పెట్టుబడి.. ఆర్నాల్డ్ 1968లో తోటి బాడీబిల్డర్తో కలిసి నిర్మాణ సామగ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు. తమ మార్కెటింగ్ వ్యూహాలను జోడించి వ్యాపారాన్ని సక్సెస్ చేశాడు. అందులో వచ్చిన లాభాలతో కొరియర్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారాలతో వచ్చిన డబ్బును రియల్టీలోకి మళ్లించాడు. 10,000 డాలర్లు పెట్టి అపార్ట్మెంట్ బిల్డింగ్ కొన్నాడు. ఆ తర్వాత అనేక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. తోటి నటులు బ్రూస్ విల్లీస్, సిల్వెస్టర్ స్టాలోన్ తదితరులతో కలిసి ప్లానెట్ హాలీవుడ్ పేరిట రెస్టారెంట్ చెయిన్‌ని కూడా ప్రారంభించాడు. కానీ దాన్నుంచి తర్వాత వైదొలిగాడు. ఇవే కాకుండా, ఓక్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థ, ఫిట్నెస్ పబ్లికేషన్స్ పేరిట ప్రచురణ సంస్థ కూడా ఏర్పాటు చేశాడు. పాఠాలు పెట్టుబడులు, లక్ష్యసాధనకు సంబంధించి ఆర్నాల్డ్ నుంచి చాలానే నేర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను రాసి పెట్టుకునేవాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా టోటల్ రికాల్ పేరుతో రాసిన తన బయోగ్రఫీలో పొందుపర్చాడు. లక్ష్యాలపై స్పష్టత, ఇన్వెస్ట్ చేసే ముందు అధ్యయనం, ఎప్పుడూ నెగటివ్‌గా ఉండే వ్యక్తులు.. పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం తదితర విషయాలు ఆయన పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియడంతో పాటు ఎప్పుడు వైదొలగాలన్నది కూడా తెలిసి ఉండటం కీలకం అంటాడు ఆర్నాల్డ్. డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు.. మన ం ఎంత దాచుకోగలిగామన్నదే ముఖ్యమని చెబుతాడు. తాను స్టార్‌గా కంటే బిజినెస్ మ్యాన్‌గా అనేక రెట్లు ఎక్కువగా సంపాదించాననే ఆర్నాల్డ్.. డబ్బు అనేది గొప్ప సంతోషాన్నివ్వదంటాడు. ఒకానొక సందర్భంలో..‘నా దగ్గర ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు ఉన్నాయి. కానీ ఇంతకంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను. పెద్దగా తేడా ఏమీ లేదు.’ అని చెప్పుకొచ్చాడు.