త్వరలో టర్మినేటర్ 6 | Arnold Schwarzenegger Will be Back in Terminator 6 | Sakshi
Sakshi News home page

త్వరలో టర్మినేటర్ 6

Published Wed, Mar 23 2016 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

త్వరలో టర్మినేటర్ 6

త్వరలో టర్మినేటర్ 6

హాలీవుడ్లోనే కాదు, ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని సినిమా సీరీస్ టర్మినేటర్. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్ స్క్వాజ్నెగ్గర్ హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్లో ఇప్పటికే 5 భాగాలు విడుదలయ్యాయి. అయితే చివరగా రిలీజ్ అయిన టర్నినేటర్ జెనిసిస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ సీరీస్లో మరో సినిమా వస్తుందో, లేదో అన్న అనుమానం కలిగింది.

అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టర్నినేటర్ సీరీస్లో మరో సినిమా ఉంటుందంటూ ప్రకంటించాడు హీరో ఆర్నాల్డ్. 2015లో రిలీజ్ అయిన టర్మినేటర్ జెనిసిస్కు రిలీజ్ అయిన తొలి రోజు నుంచే నెగెటివ్ రివ్యూస్ రావటంతో కలెక్షన్ల విషయంలోనూ వెనకబడింది. నార్త్ అమెరికాలో 100 మిలియన్ డాలర్లు కూడా వసూళు చేయలేకపోయిన టర్మినేటర్ 5, చైనాలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మరోసారి టర్మినేటర్గా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement