I warned you guys in 1984 and you didn't listen: కెనడియన్ చలనచిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేగవంతమైన విస్తరణ ప్రమాదాల గురించి 1984లోను తాను హెచ్చరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'ది టెర్మినేటర్' మూవీలో దీనికి సంబంధించి ఒక హెచ్చరికగా పనిచేసి ఉండవలసిందన్నారు.న్యూస్ హౌస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో విపరీతమైన ఏఐ వాడకం విపత్తు పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు)
కొంతమంది పరిశ్రమ నాయకులు భయపడుతున్నట్టుగా మానవాళి అంతరించిపోవడానికి కారణమయ్యే కృత్రిమ మేధస్సు గురించి అడిగినప్పుడు, కచ్చితంగా తనకు కూడా ఆందోళన ఉందన్నారు. వాస్తవానికి దీనిపై 1984లోనే హెచ్చరించాను కానీ మీరే వినలేదని పేర్కొన్నారు. తన సెన్సేషనల్ మూవీ 'ది టెర్మినేటర్' గురించి ప్రస్తావించిన కామెరూన్ ఇది స్కైనెట్ అని పిలువబడే తెలివైన సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్‌నెటిక్ హంతకుడు చుట్టూ తిరుగుతుంది కదా అని గుర్తు చేశారు.
దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. అణు ఆయుధ పోటీకి సమానమైన పోటీ ఇదని భావించారు. మనం మిన్నకుంటే ఇతరులు దూసుకొస్తారనే పోటీ మధ్య ఇది మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధభూమిలో ఏఐ గురించి ప్రస్తావించిన కామెరూన్ కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి, మానవులు జోక్యం చేసుకోలేరు, శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ అనే చాన్స్ ఉండదు. ఈనేపథ్యంలో డీ-ఎస్కలేషన్‌పై దృష్టి పెట్టడం అవసరం, కానీ ఏఐ సిస్టమ్‌లు అటువంటి సూత్రాలకు కట్టుబడి ఉంటాయనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏఐకి సంబంధించి కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని , ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లు ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాయి.మనకు తెలియ కుండానే, అన్ని మీడియా , సమాచారంపై పూర్తిగా పట్టు దక్కించుకోనుందని పేర్కొన్నారు.
అలాగే ఓపెన్‌ఏఐ, గూగుల్, డీప్‌మైండ్, టెక్ దిగ్గజాలతోపాటు, ఈ రంగంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు , వ్యవస్థాపకులతో పాటు, AIతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి, అణు యుద్ధ ప్రమాదాలను పరిష్కరించడంతో సమానంగా ఈ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని కామెరూన్ నొక్కి వక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment