
Arnold Schwarzenegger And Maria Shriver Finalise Divorce: హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్‌కు విడాకులిస్తున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సుమారు పదేళ్ల క్రితమే వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటినుంచి విడివిడిగానే బతుకుతున్నారు. అయితే వీరికున్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది. 1986లో పెళ్లి చేసుకున్న ఆర్నాల్డ్, శ్రివర్‌లకు నలుగురు సంతానం.
కాగా యాక్షన్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ సేవా కార్యక్రమాల్లోనూ ముందువరుసలో ఉంటాడు. ఇతడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆర్నాల్డ్‌ను కాలిఫోర్నియాకు గవర్నర్‌గా నియమించింది. అలా 2003 నుంచి 2011 వరకు గవర్నర్‌గా సేవలందించాడు. ఇటీవలే క్రిస్‌మస్ పండగకు తలదాచుకోవడానికి నిలువ నీడ లేని పేదలకు 25 ఇళ్లు దానం చేసి సూపర్ హీరో అనిపించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment