arnold schwarzenegger
-
‘‘మానాన్నలాగా మీరూ కావద్దు’’ : హాలీవుడ్ హీరో భావోద్వేగ వీడియో
టెర్మినేటర్ స్టార్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై స్పందించారు. దయచేసి ఈ యుద్ధాన్ని ముగించండి. మీరే యుద్ధాన్ని మొదలు పెట్టారు.. మీరే కొనసాగిస్తున్నారు.. మీరే దీన్ని ముగించాలి అంటూ డైరెక్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే రష్యా ప్రజలకు, సైనికులకు ఉద్వేగభరితమైన సందేశంతో ఒక వీడియోను షేర్ చేశారు కాలిఫోర్నియా మాజీ గవర్నర్. రష్యా ప్రజలంటే తనకు చాలా అభిమానమని అందుకే ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నా అన్నారు. రష్యన్ ప్రజల బలం, వారి మనసు తనకు ఎపుడూ స్ఫూర్తినిస్తుందని అందుకే ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి తెలుసుకోవలసిన భయంకరమైన విషయాలున్నాయంటూ తన తొమ్మిది నిమిషాల వీడియోలో కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. అలాగే రష్యన్ వెయిట్‌లిఫ్టర్ యూరి వ్లాసోవ్ 14 సంవత్సరాల వయస్సులో తనకు స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఉక్రెయిన్ను 'డి-నాజిఫై' చేసే యుద్ధం అని రష్యా ప్రభుత్వం చెప్పిందని తెలుసు, "ఇది నిజం కాదు. క్రెమ్లిన్‌లో అధికారంలో ఉన్నవారు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది రష్యా ప్రజల యుద్ధం కాదు చట్టవిరుద్ధమైన యుద్ధం. ప్రపంచం మొత్తం ఖండించిన తెలివిలేని యుద్ధం కోసం మీ జీవితాలు, మీ అవయవాలు, మీ భవిష్యత్తులు త్యాగం చేయబడుతున్నాయి. ఇప్పటికే వేలాది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం వారంతా యుద్దం చేస్తోంటే నాయకులు మాత్రం విజయంకాంక్షతో ఉన్నారు. I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV — Arnold (@Schwarzenegger) March 17, 2022 స్క్వార్జెనెగర్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో దాని చర్యలు, క్రూరత్వం కారణంగా ప్రపంచం రష్యాకు వ్యతిరేకంగా మారింది, పిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రితో సహా రష్యన్ ఫిరంగిదళాలు బాంబులతో నేలమట్టం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్క్వార్జె నెగర్ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాలో నాజీల కోసం పోరాడుతున్నప్పుడు తన తండ్రికి కలిగిన గాయాలను గుర్తుచేసుకున్నారు. శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోయి జీవితాంతం బాధతోనే గడిపారు, మీరు ఆయనలా బాధపడటం తనకు ఇష్టం లేదంటూ రష్యా దళాలకు సందేశమిచ్చాడు. అలాగే రష్యాల్లో ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను మీరు నా హీరోలు అంటూ ప్రశంసించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి నేటికి (మార్చి, 18) 23వ రోజు. అమెరికా అధ్యక్షులు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈరోజు చర్చించనున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ ప్సాకి తెలిపారు. -
కారు ప్రమాదం నుంచి బయటపడ్డ ష్వార్జ్‌నెగ్గర్
లాస్ఏంజెలిస్: హాలీవుడ్ ‘టెర్మినేటర్’ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ త్రుటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం ఆర్నాల్డ్ డ్రైవింగ్ చేస్తున్న కారు రోడ్డుపై మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ స్వల్పగాయాలపాలయ్యారు. ప్రమాద ఫలితంగా మరో రెండు కార్లు కూడా ఇరుక్కుపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆర్నాల్డ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, యువతి ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని, ప్ర మాద స్థలిలో పోలీసులతో ఆయన మాట్లాడారని ఆర్నాల్డ్ ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
35 ఏళ్ల బంధానికి ముగింపు.. స్టార్ హీరో విడాకులు
Arnold Schwarzenegger And Maria Shriver Finalise Divorce: హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్కు విడాకులిస్తున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. సుమారు పదేళ్ల క్రితమే వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటినుంచి విడివిడిగానే బతుకుతున్నారు. అయితే వీరికున్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది. 1986లో పెళ్లి చేసుకున్న ఆర్నాల్డ్, శ్రివర్లకు నలుగురు సంతానం. కాగా యాక్షన్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్ సేవా కార్యక్రమాల్లోనూ ముందువరుసలో ఉంటాడు. ఇతడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆర్నాల్డ్‌ను కాలిఫోర్నియాకు గవర్నర్‌గా నియమించింది. అలా 2003 నుంచి 2011 వరకు గవర్నర్‌గా సేవలందించాడు. ఇటీవలే క్రిస్మస్ పండగకు తలదాచుకోవడానికి నిలువ నీడ లేని పేదలకు 25 ఇళ్లు దానం చేసి సూపర్ హీరో అనిపించుకున్నాడు. -
25 ఇళ్లు దానం చేసిన స్టార్ హీరో!
సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేసే హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నాడు. క్రిస్మస్ పండగను కలకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఆయన నిలువ నీడ లేని పేదల కోసం ఇళ్లు సిద్ధం చేయించాడు. అలా ఏకంగా 25 ఏళ్లను దానం చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ.. 'క్రిస్మస్ పండగను నేను ముందుగానే జరుపుకుంటున్నా. తలదాచుకోవడానికి ఇల్లు లేని వారి కోసం 25 ఇళ్లను రెడీ చేయించాను. వీటిలో నివసించబోతున్న హీరోలకు ఇదే నా స్వాగతం.. వారితో కొంత సమయాన్ని గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ వాటిని ఇళ్లుగా పరిగణించవద్దని కోరుతున్నారు. వాటిని చూస్తుంటే కేవలం తాత్కాలిక షెల్టర్స్లాగే కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆర్నార్డ్ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా యాక్షన్ చిత్రాలతో అలరించిన ఆర్నాల్డ్ 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గానూ పని చేశాడు. Today, I celebrated Christmas early. The 25 homes I donated for homeless veterans were installed here in LA. It was fantastic to spend some time with our heroes and welcome them into their new homes. pic.twitter.com/2mHKfoZ65V — Arnold (@Schwarzenegger) December 24, 2021 -
నా రాజకీయాల్ని నా బిడ్డలే అసహ్యించుకున్నారు: సీనియర్ నటుడు
సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అభిమానులకు ఎక్కడా లేని సంబురం. బ్యానర్లు కట్టడం దగ్గరి నుంచి సోషల్ మీడియా ప్రచారం దాకా మామూలు హడావిడి ఉండదు.అయితే ఆ అభిమానం అన్నివేళలా ఆదుకుంటుందనే గ్యారెంటీ ఉండదు!. ఫ్యాన్స్ సంగతేమోగానీ తన కుటుంబం తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని అనుకున్నాడట హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్. కానీ, దానికి విరుద్ధంగా సొంత బిడ్డలే తనను అస్యహించుకున్నారని చెబుతున్నాడు. డెబ్భై మూడేళ్ల వయసున్న ఆర్నాల్డ్.. ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. నటుడిగా ఉన్న నేను గవర్నర్‌గా ఎన్నికయ్యాక నా పిల్లలు ఎంతో సంతోషిస్తారని అనుకున్నా. కానీ, వాళ్లు ఆ టైంలో నన్ను, నా పదవిని ఎంతో అసహ్యించుకున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నాతో పాటు సెట్స్‌లోకి వచ్చి సందడి చేశారు. అది వాళ్లకు వినోదం. కానీ, రాజకీయాల సాకుతో వాళ్లను హాలీవుడ్ నుంచి షిప్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదు. పైగా అక్కడ(కాలిఫోర్నియా) నేనేం అభివృద్ధి చేయలేదని వాళ్ల అభిప్రాయం. నా పరిమితులు నాకుంటాయి కదా. అది వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే నా రాజకీయాలు వాళ్లకు అసహ్యంగా అనిపించాయి. నన్నూ ద్వేషించారు’ అని చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్. ‘రాజకీయాలు.. సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం లాంటివి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మునిగిపోక తప్పదని రొనాల్డ్ రీగన్ లాంటి స్వఅనుభవం ఉన్నవాళ్లు ఏనాడో చెప్పారు. అది నాకు తర్వాతే అర్థమైంది’ అని ఆర్నాల్డ్ తెలిపాడు. కాగా, 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేశాడు ఆర్నాల్డ్. ప్రస్తుతం కొత్త సినిమాలేమీ ఓకే చేయని ఆర్నాల్డ్.. 2019లో టెర్మినేటర్ డార్క్ ఫేట్ ద్వారా తెరపై కనిపించారు. View this post on Instagram A post shared by Arnold Schwarzenegger (@schwarzenegger) చదవండి: లులు అంటే ఏంటో తెలుసా? -
అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా ట్రంప్
వాషింగ్టన్: ‘డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోయారు’ అని ప్రముఖ హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఓ విఫలుడని వ్యాఖ్యానించారు. అంతేగాక దాడికి కారణమైన ట్రంప్ మద్దతుదారులను నాజీలతో పోలుస్తూ ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి అమెరికన్లకు, నా మిత్రులకు ఇటీవల మన దేశంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టి, పెరిగింది ఆస్ట్రియాలో. అక్కడ 1938లో జరిగిన క్రిస్టల్లానాచ్ గురించి (దీన్నే నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్) నాకు తెలుసు. జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రియాలోని యూదుల ఇళ్లపై దాడికి చేసి పెను విధ్వంసానికి కారణమయ్యారు. (చదవండి: యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం) ఇప్పుడు అమెరికాలోని ప్రౌడ్ బాయ్స్ (ట్రంప్ మద్దతుదారుల గ్రూప్) కూడా అదే చేశారు. ఇటీవల క్యాపిటల్ భవనంపై వారు జరిపిన దాడిలో భవనం అద్దం పగిలింది. అయితే అది కేవలం అద్దం మాత్రమే కాదు.. అమెరికా కాంగ్రెస్ చట్ట సభ్యుల ఆలోచన కూడా. ఈ దాడితో వారంతా దేశ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారు’ అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూసేవారెవరూ అధ్యక్షుడిగా ఉండలేరని, ఎన్నికల్లో విజయం సాధించలేరన్నారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా రానున్న కొత్త నేత జో బైడెన్‌కు మద్దతు పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, 'టర్మినేటర్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఆస్ట్రియా నుంచి అమెరికాకు వలస వచ్చింది. ఆపై ఆయన 2003లో కాలిఫోర్నియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినప్పటికీ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆయన విమర్శల పాలైన సంగతి తెలిసిందే. (చదవండి: నా కొడుకు వస్తే సర్వనాశనమే: ట్రంప్ తల్లి) My message to my fellow Americans and friends around the world following this week's attack on the Capitol. pic.twitter.com/blOy35LWJ5 — Arnold (@Schwarzenegger) January 10, 2021 -
పెంపుడు గాడిదతో ఆర్నాల్డ్ కసరత్తులు
-
పెంపుడు గాడిదతో ఆర్నాల్డ్ కసరత్తులు
72 ఏళ్ల వయసులోనూ హాలీవుడ్ యాక్షన్ హీరోగా అదరగొడుతున్నారు కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్. బహుశా ఆయన తన శరీరంపై తగిన శ్రద్ధ చూపించటమే ఇందుకు కారణమై ఉండొచ్చు. లాక్‌డౌన్‌లోనూ ఆయన జిమ్‌కు వెళ్లటం మాత్రం మానలేదు. తాజాగా ఆయన తన పెంపుడు గాడిద లులుతో జిమ్‌లో కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘లులు కసరత్తులు చేస్తోంది’ అనే శీర్షికను ఉంచారు. ఆ వీడియోలో.. ఆర్నాల్డ్‌తో పాటు ఎంతో ఉత్సహంతో హోమ్ జిమ్‌లోని అడుగు పెట్టిన లులు ఆయన చేస్తున్న పనిని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉండిపోయింది. జిమ్ మొత్తం కలియతిరిగి సందడి చేసింది. ( కాలిపోనివ్వండి, కానీ న్యాయం జరగాలి) కాగా, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆర్నాల్డ్ తమ కుంటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ క్యాథెరీన్(కూతురు) తల్లి కోబోతున్న విషయం నాకెంతో ఎగ్జైటింగా ఉంది. మనవడో, మనవరాలో ఎవరో తెలియదు కానీ, పుట్టబోయే చిన్నారితో ఆడుకోవటానికి ఎదురుచూస్తున్నాను. నాక్కొంచెం సరదాగా ఉంటుంది’’ అని అన్నారు. చదవండి : ష్వార్జ్‌నెగ్గర్ స్ఫూర్తిదాత మృతి -
ష్వార్జ్‌నెగ్గర్ స్ఫూర్తిదాత మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పటి హాలివుడ్ హీరో, కండల వీరుడైన ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ స్ఫూర్తిదాత, ఆప్త మిత్రుడు ఫ్రాంకో కొలంబో శుక్రవారం నాడు ప్రమాదవశాత్తు మరణించారు. ‘నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా నిన్నెప్పుడు మరచిపోను. ఫ్రాంక్, నీవంటే నాకు ఎంతో ప్రేమ. నా జీవితం ఇంత ఆనందంగా గడవడానికి, దానికో సార్థకత చేకూరడానికి ప్రత్యక్షంగా నీవే కారణం. నిన్నెప్పటికీ మరచిపోలేను. ఇదే నా ప్రగాఢ నివాళి’ అంటూ ఆర్నాల్డ్ శనివారం నాడు తన బ్లాగ్‌లో రాసుకున్నారు. తమ 54 ఏళ్ల మిత్ర బంధంలో చెరిగిపోని మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని ఆర్నాల్డ్ చెప్పారు. ఇటలీలోని సర్డానియాలోని ఓ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో ఫ్రాంకో కొలంబో మరణించారు. ఆర్నాల్డ్ కన్నా ముందుగా అమెరికా వెళ్లిన కొలంబో 54 ఏళ్ల క్రితం అనుకోకుండా ఆర్నాల్డ్‌ను కలుసుకున్నారు. ఇద్దరు కలిసి వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందారు. ‘పంపింగ్ ఐరన్’ పేరిట 1977లో వచ్చిన డాక్యుమెంటరీలో వీరిద్దరు ఉన్నారు. 70, 80 దశకాల్లో జరిగిన ఒలింపిక్ పోటీల్లో వీరిరువురు పాల్గొన్నారు. కొలంబోకు 78 ఏళ్లు. -
సూపర్ స్టార్‌ను ఎగిరి తన్నాడు!
-
సూపర్ స్టార్‌ను ఎగిరి తన్నాడు!
హాలీవుడ్ సూపర్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌత్ ఆఫ్రికా, జోహెన్స్ బర్గ్‌లో జరుగుతున్న ఓ స్పోర్ట్స్ ఫెస్టివల్‌కు హాజరైన ఆర్నాల్డ్ ను ఓ వ్యక్తి వెనకు నుంచి బలంగా తన్నాడు. క్రీడాకారులు స్కిప్పింగ్ ఆడుతుండగా ఆర్నాల్డ్ అక్కడ ఉన్న అభిమానులతో సెల్పీలు దిగేందుకు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆర్నాల్డ్ ను బలంగా తన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అతడికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన ఆర్నాల్డ్ వీడియోలో చూసే వరకు తనను వెనుక నుంచి ఓ వ్యక్తి తన్నిన విషయం తెలియదని.. కేవలం అక్కడున్న వారు తోపులాటలో తన మీద పడ్డారని భావించానని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి Thanks for your concerns, but there is nothing to worry about. I thought I was just jostled by the crowd, which happens a lot. I only realized I was kicked when I saw the video like all of you. I’m just glad the idiot didn’t interrupt my Snapchat. — Arnold (@Schwarzenegger) 18 May 2019 -
‘ట్రంప్.. ఓ ఫ్యాన్‌బాయ్‌లా ప్రవర్తించారు’
వాషింగ్టన్ : రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు ఫిన్లాండ్లోని హెల్సింకిలో సమావేశమైన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి ఆరంభమనుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని వ్యాఖ్యానించగా.. పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. అయితే పుతిన్‌తో ట్రంప్ భేటీ గురించి ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ సెనేటర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోగ్రాఫ్ కోసం వెళ్లారా...? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందు.. ట్రంప్ ఓ ఫ్యాన్ బాయ్‌లా ప్రవర్తించారని ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ విమర్శించారు. ‘ట్రంప్.. పుతిన్‌తో మీరు జరిపిన మంతనాలను చూశాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. మీరక్కడ ఓ తడి నూడుల్లా నిల్చుని ఉన్నారు. మీ వాలకం చూస్తుంటే పుతిన్ ఆటోగ్రాఫ్ కోసమో, లేదా సెల్ఫీ దిగడానికో వెళ్లినట్లు ఉంది. సమావేశంలో భాగంగా అమెరికా కమ్యూనిటీని అమ్మేశారు. దేశం పరువు తీసేశారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో పాటు శ్వేత సౌధ ప్రతినిధుల తీరును కూడా ఆయన తప్పు పట్టారు. -
ఐ యామ్ బ్యాక్
...కామన్ ఆడియన్స్‌కు ఇది మామూలు ఫ్రేస్ కావొచ్చు. కానీ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అభిమానులకు, ‘టెర్మినేటర్’ మూవీ సిరీస్ ఫ్యాన్స్‌కు ‘ఐ యామ్ బ్యాక్’ అనే లైన్ ఒక ఎమోషన్. ‘ఐ యామ్ బ్యాక్’ అనే పంచ్‌లైన్ ఆర్నాల్డ్ ఫస్ట్ ‘టెర్మినేటర్’ సినిమాలోనే వాడారు. సినిమా రిలీజై పెద్ద హిట్ అయిన తర్వాత నుంచి ఈ లైన్ ఆర్నాల్డ్ స్టైల్ స్టైట్మెంట్లో ఒక భాగమైపోయింది. ఈ మధ్య ఆర్నాల్డ్ ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. దాంతో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆర్నాల్డ్ ఎలా ఉన్నారు? అని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దాంతో ఆర్నాల్డ్ తన ఫ్యాన్స్ కోసం తన హెల్త్ గురించిన అప్డేట్ ఇవ్వాలని ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, కార్డ్స్, ఈ మెయిల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను పంచిన అభిమానులందరికీ థ్యాంక్స్. నేను బావున్నాను అని మీ అందరికీ తెలియజేయడానికే ఈ వీడియో మెసేజ్. ఎంత పాజిటీవ్‌గా చెప్పాలనుకున్నా ఐ యామ్ నాట్ గ్రేట్. బట్ గుడ్. గ్రేట్ అంటే అది వేరే లెవల్. ప్రస్తుతానికైతే ఐ యామ్ గుడ్. నాకు మంచి డాక్టర్స్, నర్సస్ ఉన్నారు. వాళ్ల బాగా కేర్ తీసుకున్నారు. థ్యాంక్యూ ఆల్’’ అని పేర్కొన్నారు ఆర్నాల్డ్. విశేషం ఏంటంటే సర్జరీ జరిగిన తర్వాత మేలుకొన్న వెంటనే ఆర్నాల్డ్ ‘ఐ యామ్ బ్యాక్’ అని అన్నారట. -
క్షేమంగా ఇంటికి చేరిన కండలవీరుడు
కాలిఫోర్నియా : ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అత్యవసర చికిత్స నిమిత్తం ఈ మార్చి 29న లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినై మెడికల్ సెంటర్లో చేరారు. చికిత్స విజయవంతం కావడంతో ఆయన కోలుకుంటున్నారు. ‘‘ నేను క్షేమంగా తిరిగొచ్చాను..ఇది నిజం. చిన్న గాట్లతో నన్ను బతికించిన డాక్టర్లకు, నర్సులకు నా ధన్యవాదాలంటూ’ ష్వార్జ్ నెగ్గర్ ట్వీట్ చేశారు. ఆర్నాల్డ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని, ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ కూడా వెల్లడించారు. ఏడు పదుల వయసులో ఉన్న ఆయన ప్రమాదంతో కూడిన ట్రాన్స్‌కాథెటర్ పల్మనరీ వాల్యూ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు మిస్టర్ ఒలంపియా విజేతగా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందటున్నారు నెటిజన్లు. ఆస్సత్రి నుంచి విడుదలైన తర్వాత తన కుమారుడితో కలిసి ఓ హోటల్లో భోజనం చేసిన ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. కారులో కూర్చున్న ఆయన నోట్లో సిగర్ ఉండటం చూసిన కొందరు నెటిజన్లు చచ్చి బతికినా బుద్ది రాలేదంటూ ష్వార్జ్ నెగ్గర్ను తిట్టిపోస్తున్నారు. -
సూపర్ స్టార్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వాజ్నెగ్గర్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు.. ఆయన స్పృహలోకి వచ్చినట్లు వ్యక్తిగత సిబ్బంది మీడియాకు వెల్లడించారు. కాగా, 70 ఏళ్ల ఆర్నాల్డ్‌కు గతంలో కూడా ఓసారి గుండెకు శస్త్ర చికిత్స అయ్యింది. 1997లో గుండెకు సంబంధించిన ఓ కృత్రిమ నాళాన్ని డాక్టర్లు అమర్చారు. అయితే అది సరిగ్గా పని చేయకపోవటంతో ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. గురువారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఐయామ్ బ్యాక్.. ఆపరేషన్ తర్వాత స్పృహలోకి వచ్చిన దిగ్గజ నటుడు ‘ఐ యామ్ బ్యాక్’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రతినిధి మీడియాకు విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కెనన్ ది బార్బేరియన్, ప్రేడేటర్, టెర్మినేటర్ తదితర చిత్రాలతో ఆర్నాల్డ్ సుపరిచితుడే. కాగా, గతంలో రెండు సార్లు ఆయన కాల్నిఫోరియాకు గవర్నర్‌గా కూడా పని చేశారు. -
రోడ్డు మీద పడుకున్న సూపర్ స్టార్
హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్కార్జ్ నెగ్గర్.. ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా తన విగ్రహం ముందు తానే రోడ్డు మీద పడుకున్నాడు. అంతటి సూపర్ స్టార్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? ఆ విషయంలోకే వస్తున్నా. కాలిఫోర్నియాకు ఆర్నాల్డ్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో ఓహియోలోని కొలంబస్ ఏరియాలో ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ నిర్వాహకులు కూడా అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం ఏర్పాటు చేయటంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటలకు వచ్చినా.. ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని మాట ఇచ్చారు. అయితే ఇటీవల ఆ హోటల్ కు వెళ్లిన ఆర్నాల్డ్ వింత అనుభవం ఎదురైంది. ఓపెనింగ్ సమయంలో తనకు ప్రత్యేకంగా రూం కేటాయిస్తామని చెప్పిన వ్యక్తులే రూమ్స్ ఖాళీ లేవని చెప్పటంతో ఈ సూపర్ స్టార్ షాక్ తిన్నాడు. దీంతో నిరసన ఇలా రోడ్డు మీద పడుకొని తన నిరసన వ్యక్తం చేశాడు. తన ఫేవరెట్ స్టార్ ఇలా వీదుల్లో పడుకొని కనిపించటంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ఇదంతా కేవలం హాస్యం కోసమే చేశానని ఆర్నాల్డ్ ఓ పోస్ట్‌లో తెలిపారు. -
‘టెర్మినేటర్’ ఇక రాడు!
హాలీవుడ్: చిన్నపిల్లల దగ్గర నుంచి యాక్షన్ చిత్రాలను ఇష్టపడే కుర్రకారు వరకు అందరినీ అలరించిన ‘టెర్మినేటర్’ చిత్రాలు ఇక రావు. వరుస సీక్వెల్స్‌తో అలరించిన టెర్మినేటర్ సీరిస్ చిత్రాలను ఇకపై నిర్మించబోమని నిర్మాణ సంస్థ పారామౌంట్ స్టూడియోస్ ప్రకటిం చింది. ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ కథానాయకుడి గా వచ్చిన ఈ చిత్రాలకు ఇక ముగింపు పలకనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘టెర్మినేటర్ అండ్ ఆర్నాల్డ్.. శకం ముగిసింది. మా నిర్మాణ సంస్థ ఈ స్వీక్వెల్స్కు ముగింపు పలకాలని నిర్ణయించింది. దీంతో ఇకపై టెర్మినేటర్‌కు సంబంధించి ఎటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇకపై జరగవు. దీని అర్థం.. టెర్మినేటర్ ఇక ప్రేక్షకుల ముందుకు రాబోడు. నిజానికి టెర్మినేటర్ సీరిస్‌ను దీర్ఘకాలంపాటు కొనసాగిద్దామని అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా అన్నీ జరగవు కదా..! ఇది కూడా అలాగే మధ్యలోనే నిలిపివేయాల్సివస్తోంద’ని పారామౌంట్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. -
'ట్రంప్ నన్ను ప్రేమిస్తున్నారేమో!'
లాస్ఏంజిల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను ప్రేమిస్తున్నారని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ అన్నారు. ఆర్నాల్డ్‌కు తక్కువ రేటింగ్స్ రావడంపై ట్రంప్ ట్వీట్ చేశారు. 'ది సెలబ్రిటీ అప్రెంటీస్' నుంచి తక్కువ రేటింగ్స్ కారణంగా ఆర్నాల్డ్‌ను తీసేశారని ట్వీట్లో పేర్కొన్నారు. అది తనను బాధకు గురిచేసినట్లు తెలిపారు. ట్రంప్ ట్వీట్‌పై ఓ ప్రోగ్రామ్‌లో ఆర్నాల్డ్‌ను ప్రశ్నించగా.. ఒకవేళ ఆయన తనను ప్రేమిస్తున్నారమోనని అన్నారు. -
ఆర్నాల్డ్‌కు ప్యాంటు తడిసింది!
సఫారీ: ఇనుప మనిషిలాగా టర్మినేటర్ వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ హీరో, ఇనుప కండల వీరుడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ కు ఓ ఏనుగు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జీపులో వెళుతున్న వారికి అనూహ్యంగా ఎదురుపడి భయంతో వణికిపోయేలా చేసింది. అంతేకాదు వారి వాహనాన్ని వెంబడించి ఇక చచ్చాం రా దేవుడా అనుకునేలా చేసింది. అంతేకాదు.. ఈ సంఘటన తర్వాత ఆ బృందంలో కొంతమంది తమ ప్యాంట్లు కూడా మార్చుకున్నారంట. పూర్తి వివరాల్లోకి వెళితే ఆర్నాల్డ్ తన మిత్రులతో సౌత్ ఆఫ్రికాలోని సఫారీ పార్క్‌కి వెళ్లాడు. అలా రహదారిపై వెళుతున్న వారికి అనూహ్యంగా ఓ ఏనుగు తారసపడటంతో తమ వాహనాన్ని ఆపేశారు. అయితే, రోడ్డు దాటి వెళ్లకుండా భారీ పొడవైన దంతాలతో ఉన్న ఆ ఏనుగు వారిని సమీపించింది. దాంతో అందులోని వారంతా కుక్కిన పేనులాగా కదలకుండా కూర్చున్నారు. అది కాసేపు తొండంతో ఆ వాహనాన్ని తడిమి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లింది. అప్పటికీ వారు అలాగే తమ శ్వాసను కాసేపు ఆపేసి సింహంలా మీదకు దూకుతుందా అని భయంతో చూస్తున్నారు. అయితే, ఆ ఏనుగు పక్కకు వెళ్లింది. అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆర్నాల్డ్ మాత్రం దాని ఆలోచనను ముందే పసిగట్టాడు. అది తమపై దాడి చేసేందుకు వస్తుందని చెప్పాడు. నిజంగానే ఆ ఏనుగు అన్నంత పనిచేసింది. వేగంగా వారి కారువైపు వెనుక నుంచి దూసుకొచ్చింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సచ్చాం బాబోయ్ అన్నట్లు కారు ఎంత వేగంతో ఎక్స్ లేటర్ తొక్కి పోనిచ్చాడు. అప్పటికీ ఏనుగు కూడా గుర్రం మాదిరిగా తన పరుగును పెంచింది. అదృష్టవశాత్తు వారు అలా ఏనుగు నుంచి తప్పించుకున్నారు. ఈ అనుభవాన్ని చూసిన ఆర్నాల్డ్ తన అభిప్రాయం పంచుకుంటూ 'ఈ సంఘటన గురించి చెప్పలేకపోతున్నాను. బహుషా సినిమా అయితేనే బాగుండేదేమో. నేను నిజంగా ఇలాంటి ఓ జంతువును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. అది ఎంత బలమైన ఏనుగంటే.. మాలో కొంతమంది ప్యాంట్లు కూడా మార్చుకున్నారు' అని చెప్పారు. 'మనం ఏనుగులను చంపేయడం మానాలి. ఒక ఫోటో తీసుకోవాలి తప్ప కాల్చడం కాదు' అని ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు. -
కామెడీ చేస్తోన్న కండల వీరుడు
టెర్మినేటర్, కేనన్, ఎక్స్‌పాండబుల్స్ చిత్రాలతో యాక్షన్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్. ఇప్పటి వరకు తన బాడీకి తగ్గట్టుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ సీనియర్ హీరో ఇప్పుడు రూట్ మారుస్తున్నాడు. త్వరలో ఓ కామెడీ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్. వై వియార్ కిల్లింగ్ గంథర్ పేరుతో తెరకెక్కుతున్న కామెడీ డ్రామాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు ఆర్నాల్డ్. ఈ సినిమాలో కిరాయి హంతుకుల ముఠా సభ్యుడిగా నటిస్తున్నాడు. తమకు ప్రత్యర్థి అయిన కరుడుగట్టిన హంతుకుడి గంథర్ను ఎలాగైన దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది ఆర్నాల్డ్ టీం. అయితే గంథర్ గ్యాంగ్ వీళ్ల ఎత్తులను ముందే పసిగట్టి ఆ ఎటాక్‌లను తిప్పికొడుతుంది. ఇలా టామ్ అండ్ జెర్రీల గేమ్‌లా జరిగే కథ కడుపుబ్బ నవ్వించనుంది. శాటర్ డే నైట్ సినిమాలో కీలక పాత్రలో నటించిన టారన్ కిల్లమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించటంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
మరో వారసుడొస్తున్నాడు
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, హాలీవుడ్‌లోనూ వారసుల హవా కనిపిస్తోంది. ఇప్పటికే జాకీచాన్, విల్ స్మిత్ లాంటి టాప్ స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, మరో హాలీవుడ్ టాప్ స్టార్ తన వారసుడిని సినిమాల కోసం సిద్దం చేస్తున్నాడు. ప్రిడేటర్, టెర్మినేటర్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తన తనయుడు జోసెఫ్ బేనాను సినిమాల కోసం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే జోసేఫ్ ఫిజిక్ మీద దృష్టి పెట్టిన ఆర్నాల్డ్ స్వయంగా తానే దగ్గరుండి జోసెఫ్‌తో జిమ్ చేయిస్తున్నాడు. తాజాగా వెనిస్ లోని గోల్డ్స్ జిమ్‌లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. 18 ఏళ్ల జోసెఫ్ ప్రస్తుతం మిస్టర్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు. -
త్వరలో టర్మినేటర్ 6
హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని సినిమా సీరీస్ టర్మినేటర్. హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్ స్క్వాజ్‌నెగ్గర్ హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్‌లో ఇప్పటికే 5 భాగాలు విడుదలయ్యాయి. అయితే చివరగా రిలీజ్ అయిన టర్నినేటర్ జెనిసిస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఈ సీరీస్‌లో మరో సినిమా వస్తుందో, లేదో అన్న అనుమానం కలిగింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టర్నినేటర్ సీరీస్‌లో మరో సినిమా ఉంటుందంటూ ప్రకంటించాడు హీరో ఆర్నాల్డ్. 2015లో రిలీజ్ అయిన టర్మినేటర్ జెనిసిస్‌కు రిలీజ్ అయిన తొలి రోజు నుంచే నెగెటివ్ రివ్యూస్ రావటంతో కలెక్షన్ల విషయంలోనూ వెనకబడింది. నార్త్ అమెరికాలో 100 మిలియన్ డాలర్లు కూడా వసూళు చేయలేకపోయిన టర్మినేటర్ 5, చైనాలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో మరోసారి టర్మినేటర్గా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఆర్నాల్డ్. -
'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది'
లండన్: హాలీవుడ్లో భారీ మాస్ ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్. 'రాంబో' సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ కండల వీరుడు తన మిత్రుడు ఆర్నాల్డ్ షార్గ్నెజ్జర్ దారిలో నడుస్తూ రాజకీయాల్లోకి రావాలని భావించాడు. ఆయనలాగే తాను కూడా అమెరికా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. అయితే చివరిన నిమిషంలో భార్య అడ్డుచెప్పడంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నాడు. రాజకీయాల్లో చేరడం ఏమంతా మంచి నిర్ణయం కాదని, దానికన్నా ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ ఉండటమే మేలని భార్య తనను ఒప్పించిందని స్టాలోన్ వెల్లడించాడు. 'నేను రాజకీయాల్లో చేరే విషయమై నువ్వేమనుకుంటున్నావని నా భార్యను అడిగాను. 'నీకు ఏమైనా వెర్రా? ఇప్పటివరకు చాలా బావున్నావు. నిన్ను ప్రజలు ఎన్నుకోబోరు. ప్రజలతో జయజయధ్వానాలు చేయించుకోవాలన్న నెరవేరని కోరిక ఏది నీకు లేదు' అని ఆమె కాస్ల్ పీకింది' అని స్టాలోన్ చెప్పినట్టు 'డిజిటల్ స్పై' తెలిపింది. -
ఈసారి త్రీడీలో?
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నారని సమాచారం. తొలి భాగానికన్నా మలిభాగం మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్రీడీ మూవీగా ‘రోబో 2’ని తీయాలన్నది శంకర్ లక్ష్యం అని చెన్నయ్ టాక్. రజనీ సరసన దీపికా పదుకొనేని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అయితే, శంకర్ మనసు మారిందట. ఫస్ట్ పార్ట్‌లో నటించిన ఐశ్వర్యా రాయ్‌నే తీసుకోవాలనుకుంటున్నారట. పారితోషికం ఫిక్స్ అయితే యస్! ఈ సీక్వెల్‌కి సంబంధించి ప్రచారం అవుతున్న వార్తల్లో ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్కి సంబంధించిన వార్త ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ ఆడియో వేడుకలో ఈ హాలీవుడ్ స్టార్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఆయన ‘రోబో 2’లో నటించానున్నారని టాక్. మొదట్లో ఈయన విలన్‌గా నటిస్తారనే వార్త వచ్చింది. అయితే, మరో హీరోగా నటిస్తారట. ప్రస్తుతం ఆర్నాల్డ్ పారితోషికం గురించి చర్చలు జరుగుతున్నాయని బోగట్టా. పారితోషికం ఫిక్స్ అయితే ఆర్నాల్డ్ యస్ చెబుతారని సమాచారం. మరి.. ఆర్నాల్డ్ ‘రోబో 2’లో నటిస్తారా? ఇది త్రీడీ మూవీయా? అసలు నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ మృతి అంటూ వదంతులు!
లాస్ ఏంజెల్స్ : హాలీవుడ్ సూపర్ స్టార్, ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మృతి చెందినట్లు వదంతులు వెలువడ్డాయి. లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించినట్లు వార్త హల్చల్ చేసింది. ఆర్నాల్డ్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా MSMBC అనే అంతర్జాతీయ వెబ్సైట్ రెండు రోజుల క్రితం వార్త పోస్ట్ చేసింది. అయితే ఆయన మరణవార్తపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ వార్తను ఇప్పటివరకూ ఖండించలేదు. కాగా ఆర్నాల్డ్...ట్విట్టర్ అకౌంట్ కూడా 13 గంటల క్రితం వరకూ యాక్టివ్ గానే ఉంది. కాగా టెర్మినేటర్ చిత్రం ద్వారా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నఆర్నాల్డ్ ... ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించారు. కాలిఫోర్నియా గవర్నర్‌గా సేవలందించిన ఆర్నాల్డ్ బుధవారం రాత్రి 9.30 సమయంలో లాజ్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టుగా ఓ వార్తను MSMBC వెబ్సైట్ పోస్ట్ చేయటమే కాకుండా, ఆర్నాల్డ్ మరణాన్ని ఆయన కుటుంబం కూడా ధృవీకరించినట్టుగా తెలిపారు వెబ్ సైట్ నిర్వాహకులు. గతంలోను పలువురు సెలబ్రిటీల విషయంలో కొన్ని వెబ్ సైట్స్ అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్బాలు చాలా ఉన్నాయి.. మరి ఆర్నాల్డ్ విషయంలో నిజా నిజాలు తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.