నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ (ఫైల్ ఫొటో)
కాలిఫోర్నియా : ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అత్యవసర చికిత్స నిమిత్తం ఈ మార్చి 29న లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినై మెడికల్ సెంటర్‌లో చేరారు. చికిత్స విజయవంతం కావడంతో ఆయన కోలుకుంటున్నారు. ‘‘ నేను క్షేమంగా తిరిగొచ్చాను..ఇది నిజం. చిన్న గాట్లతో నన్ను బతికించిన డాక్టర్లకు, నర్సులకు నా ధన్యవాదాలంటూ’ ష్వార్జ్ నెగ్గర్ ట్వీట్ చేశారు. ఆర్నాల్డ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని, ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ కూడా వెల్లడించారు.
ఏడు పదుల వయసులో ఉన్న ఆయన ప్రమాదంతో కూడిన ట్రాన్స్‌కాథెటర్ పల్మనరీ వాల్యూ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు మిస్టర్ ఒలంపియా విజేతగా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందటున్నారు నెటిజన్లు. ఆస్సత్రి నుంచి విడుదలైన తర్వాత తన కుమారుడితో కలిసి ఓ హోటల్‌లో భోజనం చేసిన ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. కారులో కూర్చున్న ఆయన నోట్లో సిగర్ ఉండటం చూసిన కొందరు నెటిజన్లు చచ్చి బతికినా బుద్ది రాలేదంటూ ష్వార్జ్ నెగ్గర్‌ను తిట్టిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment