heart operation
-
Palak Muchhal: సింగర్‌గానే కాదు.. సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి..
పాలక్ ముచ్చల్ అనే పేరు వినిపించగానే తీయటి పాట ఒకటి గుర్తొస్తుంది సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పాలక్ సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి చేస్తోంది. ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. బాలీవుడ్ సినిమా ‘ఎంఎస్ దోని–ది ఆన్‌టోల్డ్ స్టోరీ’లోని ‘కౌన్ తుఝే’ పాటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పాలక్. ఇండోర్‌కు చెందిన పాలక్‌కు కాలేజీ రోజుల నుంచి పాటతో పాటు సేవా బాటలో పయనించడం అంటే కూడా ఇష్టం.పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ్రపాజెక్ట్ కార్గిల్ వీర సైనికుల కోసం చేసింది. ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడి ‘కార్గిల్ వీర సైనికులకు మీ వంతుగా సహాయం చేయండి’ అని అడిగేది. కళ, సామాజిక సేవను పాలక్ వేరు చేసి చూడదు. మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడానికి తనలోని కళ బలమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెబుతుంది పాలక్.సినిమాల్లో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి పేద పిల్లల కోసం విరాళాలు సేకరించేది. పాలక్ ఒక మ్యూజిక్ప్రోగ్రామ్ చేసిందంటే పది మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరించినట్లే. బాలీవుడ్లో సింగర్‌గా పాలక్‌కు మంచి పేరు రావడమే కాదు ఆ పేరు విరాళల సేకరణకు బాగా ఉపయోగపడింది.‘మీ పాట అద్భుతం’ అనే ప్రశంస కంటే, పేదింటి తల్లిదండ్రుల గొంతు నుంచి వినిపించే... ‘మీ వల్ల మా బిడ్డ బతికింది’ అనే మాట పాలక్‌కు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు పాలక్ వెయిటింగ్ లిస్ట్‌లో 413 మంది పిల్లలు ఉన్నారు. వారికి హార్ట్ సర్జరీలు చేయించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకుంది. ‘మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా మంచే జరుగుతుంది. పేదపిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను’ అంటుంది పాలక్ ముచ్చల్. -
గుండెజబ్బుతో పోరాడుతున్న పిల్లల కోసం..
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫౌండేషన్.. ఔట్రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీతో కలిసి గుండెజబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. "Heartathon: A Run to Support Children Batling with congenital Heart Disease" అనే కార్యక్రమం పేరిట పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన, నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగింది. ఇందులో సుమారు 300 మంది 3 కి.మీ నుంచి 5 కి.మీ మార్గంలో పరుగెత్తారు. మహేశ్ బాబు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకను పురస్కరించుకుని విజేతలకు అవార్డులను అందించి సత్కరించారు. ఈ హార్ట్‌థాన్ రన్లో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి వారి నిబద్ధతను ప్రదర్శిస్తూ, మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్రీచ్ క్లబ్‌ల మధ్య సహకార స్ఫూర్తిని ఈ హార్ట్‌థాన్ వెల్లడించింది. చదవండి: నువ్వు లేకపోతే నేను లేనంటూ రౌడీ హీరోను ముద్దాడిన బాలీవుడ్ స్టార్, వీడియో వైరల్ -
సీఎం జగన్ చొరవ.. హెలికాప్టర్లో గుండె తరలింపు..
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుండె ఆపరేషన్ కోసం విశాఖ నుంచి తిరుపతికి గుండెను విమానంలో తరలించారు. దీని కోసం గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలో గుండె ఆపరేషన్ కోసం గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో అక్కడి నుంచి తిరుపతికి విమానంలో గుండె తరలింపు జరుగుతోంది. రాగోలు జెమ్స్ మెడికల్ కాలేజీలో అవయవదానంలో భాగంగా గుండెను తిరుపతికి తరలిస్తున్నారు. అయితే, సీఎం జగన్ చొరవతో 20 నిమిషాల్లోనే వైజాగ్‌కు గుండెను అధికారులు తరలించారు. మరికాసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి గుండెను తరలించనున్నారు. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి గుండెను గ్రీన్‌చానల్ ద్వారా పద్మావతి ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక, విశాఖ నుంచి తరలించిన గుండెను పేషంట్ లహరికి(11)కి అమర్చనున్నారు వైద్యులు. కాగా, లహరి తెలంగాణలోని వనస్థలిపురంలోకి ఎన్జీవో కాలనీకి చెందిన చిన్నారి. అయితే, జూన్ నెలలో లహరికి గుండె సమస్యను గుర్తించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స అందించారు. ఈ సందర్భంగా లహరి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. నిమ్స్‌లో చికిత్స కోసం మూడు లక్షలు ఖర్చు చేశాము. తెలంగాణలో కంటే ఏపీలోనే రెస్పాన్స్ బాగుంది అని ఇక్కడికి వచ్చాము. నవంబర్ ఆరో తేదీన పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ జాయిన్ చేశాము అని చెప్పుకొచ్చారు. -
ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీల అవసరం లేదు
సాక్షి, విశాఖపట్నం: గుండెకు నిబ్బరాన్నిచ్చే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ హృద్రోగులకు వారి పరిస్థితిని బట్టి స్టెంట్లు వేస్తున్నారు. అందుకు వీలుకాని పరిస్థితి ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీకి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. పైగా వారం, 10 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. ఓపెన్ హార్ట్ సర్జరీలు రోగికి నొప్పితోపాటు వైద్యులకు ప్రయాసతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తాజాగా పర్క్యూటనస్ వ్యాడ్స్ (వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్) వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చిందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు ప్రసాద్ చలసాని తెలిపారు. విశాఖపట్నంలో ఏఏఐపీ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. గుండెపోటుకు గురైన వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్నపాటి సర్జరీ ద్వారా ఈ వాల్వులను రీప్లేస్ చేస్తారన్నారు. హృద్రోగికి ఈ వాల్వుల అమరిక కేవలం అర గంట నుంచి గంటలోపే వైద్యులు పూర్తి చేస్తారని చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చన్నారు. దీని సక్సెస్ రేటు 99.9 శాతం ఉందని తెలిపారు. అమెరికాలో పర్క్యూటనస్ వ్యాడ్ వాల్వుల వినియోగం జరుగుతోందని, భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ విధానం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి కొద్దిమందికి మాత్రమే వీటిని అమర్చారన్నారు. ఇందుకయ్యే ఖర్చు రూ.20 లక్షల వరకు ఉందని, అందువల్ల ప్రస్తుతానికి సామాన్యులకు భారమేనన్నారు. మున్ముందు ఖర్చు తగ్గే అవకాశముందని తెలిపారు. 35 ఏళ్లు దాటిన వారెవరైనా హైకొలె్రస్టాల్, మధుమేహం, రక్తపోటు, కాల్షియం, పరీక్షలను విధిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ‘సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’ -
పేదింట ‘హృదయ’వేదన.. చిన్ని గుండెకు పెద్ద కష్టం
నెన్నెల(ఆదిలాబాద్ జిల్లా): భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. అలాంటి కుటుంబంలో అబ్బాయి పుట్టాడని కష్టాలను మరిచి సంతోషపడ్డారు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తుంటే కంగారుపడి డాక్టర్‌కు చూపించారు. బాలుడికి గుండె సమస్య ఉందని వైద్యులు తెలుపడంతో అప్పటి వరకు మురిసిపోయిన తల్లిదండ్రులు ఒక్కసారి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చిన్నారికి గుండె జబ్బు ఉందని తెలిసి ఆ పేద దంపతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చదవండి: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం నెన్నెల మండలం నందులపల్లికి చెందిన కామెర సతీష్ – పుష్పలత దంపతులకు మూడు రోజుల క్రితం బాబు పుట్టాడు. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్య ఉండడంతో హైదరాబాద్ రేయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఇందుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల్లో ఆపరేషన్ చేయకుంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు తెలిపారని ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక స్థోమత లేక సతమతమవుతున్నారు. దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయం చేసి బిడ్డ ప్రాణం కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. స్పందించాల్సిన దాతలు... ఫోన్‌పే, గూగుల్ పే 8008484410 -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్‌బాబు
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. పేద పిల్లల పాలిట దైవంగా మారారు. (చదవండి: మనసు మార్చుకున్న మహేశ్.. ఇకపై తన టార్గెట్ అదేనట!) తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేశ్. ఈ విషయాన్ని మహేశ్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్‌కు మహేష్ ఆపరేషన్ చేయించాడు. ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆస్పత్రిలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఫొటోను నమ్రతా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘హార్ట్ వామింగ్ స్టోరి. వీఎస్డీ, పీడీఏతో బాధపుడుతున్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఆపరేషన్ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఆయ్యాడన్న విషయం ఆనందాన్ని ఇస్తుంది. అతడు పూర్తి ఆరోగ్యవంతుడిగా జీవించాలని ఆశిస్తున్న. చిన్నారి ఆపరేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ హస్పీటల్ హెల్త్‌కేర్ వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ నమ్రతా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి భార్గవ్ డిశ్చార్జ్ అవుతుండగా తల్లి చేతులో ఉన్న అతడు నవ్వుతూ కనిపించాడు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించిన మహేష్ బాబుకు, నమ్రతలకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు హార్ట్ ఎమోజీలతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు పరశురాం డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివల దుబాయ్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యూనిట్ ఇటీవల తిరిగి ఇండియాకు వచ్చింది. ఇందులో మహేశ్ సరసన మహనటి కీర్తి సూరేశ్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: అల్లు అర్జున్ కలిసిన ‘కేజీఎఫ్’ డైరెక్టర్ మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య -
గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్) అన్నారు. నేను కూడా డాక్టర్లు చెప్పినట్టే మందులు వాడాలని నిర్ణయించుకున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? – డి. పూర్ణచంద్రరావు, జమ్మలమడుగు మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుం దని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్ అంత ఎక్కువగా లేవనీ అర్థం. లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్ అవసరం పడాల్సిరావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేయించుకుని పూర్తిగా నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి గుండెజబ్బుల నివారణ ఎలా? నా వయసు 46 ఏళ్లు. భవిష్యత్తులో గుండెజబ్బులు వస్తాయేమో అని ఆందోళనగా ఉంది. గుండెజబ్బు లను నివారించడానికి ఎలాంటి వ్యాయామాలు మంచివో సూచించండి. – ఎస్.వి. రమణప్రసాద్, కాకినాడ ఆరోగ్యాన్ని కాపాడుకుందుకు, గుండెపోటును నివారించడానికి ఏ వ్యాయామాలైనా మంచివే. అయితే బరువులు ఎత్తుతూ చేసేవి, బాడీబిల్డింగ్ కోసం చేసేవాటి కంటే వాకింగ్, యోగా లాంటివి మీ వయసువారికి మరింత మంచిది. క్రమం తప్పకుండా రోజూ 3 నుంచి 4 కి.మీ వాకింగ్ చేయడం, అలా వారంలో ఐదు రోజులు చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలుం టాయి. దాంతో పాటు గుండె పోటు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా ఈ వ్యాయామాలు తగ్గిస్తాయి. డాక్టర్ అనూజ్ కపాడియా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
మా పాపకు ఆయనే ప్రాణం పోశారు..
కంబదూరు : మాది (నాగార్జున, జయలక్ష్మి దంపతులు) కంబదూరు. మండల కేంద్రంలో నివాసం ఉంటూ ప్రతి రోజు బేల్దారి పనులు చేస్తు జీవిస్తున్నాం. మాకు ముగ్గురు కుమారైలు. చిన్న కుమారై మౌనిసాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే గుండెకు రంధ్రాలు పడ్డాయి. వైద్యుల దగ్గరికు వెళ్లి పరీక్షలు చేస్తే గుండెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. మేం ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో జీవించేవాళ్లం. ఆపరేషన్ చేయించడానికి చేతిలో నయాపైసా కూడా లేదు. ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆరోగ్యమిత్రను కలిస్తే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్‌ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించడానికి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ 2007లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా రూ.3లక్షల వరకు ఖర్చుపెట్టి మా బిడ్డకు ఆపరేషన్ చేశారు. దీంతో మా బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అలాగే రానూపోనూ చార్జీలు కూడా ఇచ్చి నయాపైసా కూడా భారం పడకుండా చేశారు. ఆ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే మా బిడ్డకు పునర్జన్మ లభించింది. వైఎస్ చేసిన సాయాన్ని మేం ఎన్నటికీ మరవలేం. -
క్షేమంగా ఇంటికి చేరిన కండలవీరుడు
కాలిఫోర్నియా : ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది నెలలుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అత్యవసర చికిత్స నిమిత్తం ఈ మార్చి 29న లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినై మెడికల్ సెంటర్లో చేరారు. చికిత్స విజయవంతం కావడంతో ఆయన కోలుకుంటున్నారు. ‘‘ నేను క్షేమంగా తిరిగొచ్చాను..ఇది నిజం. చిన్న గాట్లతో నన్ను బతికించిన డాక్టర్లకు, నర్సులకు నా ధన్యవాదాలంటూ’ ష్వార్జ్ నెగ్గర్ ట్వీట్ చేశారు. ఆర్నాల్డ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని, ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ కూడా వెల్లడించారు. ఏడు పదుల వయసులో ఉన్న ఆయన ప్రమాదంతో కూడిన ట్రాన్స్‌కాథెటర్ పల్మనరీ వాల్యూ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు మిస్టర్ ఒలంపియా విజేతగా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందటున్నారు నెటిజన్లు. ఆస్సత్రి నుంచి విడుదలైన తర్వాత తన కుమారుడితో కలిసి ఓ హోటల్లో భోజనం చేసిన ఆయన నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. కారులో కూర్చున్న ఆయన నోట్లో సిగర్ ఉండటం చూసిన కొందరు నెటిజన్లు చచ్చి బతికినా బుద్ది రాలేదంటూ ష్వార్జ్ నెగ్గర్ను తిట్టిపోస్తున్నారు. -
క్షణ క్షణం..క్షోభ
గుండె మార్పిడికి వచ్చిన దరఖాస్తులు 25 ఒక్కోఆపరేషన్కు ఖర్చు రూ.25 లక్షలు సీఎం ఒక్కో ఆపరేషన్‌కు ఇస్తానన్న నిధులు రూ.15 లక్షలు సృహృదయ ట్రస్ట్ ద్వారా జరిగిన ఆపరేషన్లు 450 ‘గుండె జబ్బు.. ప్రాణాంతకమైన రుగ్మత.. గుండె మార్పిడి తప్పనిసరి.. దిన దిన గండం.. ఇప్పుడా? అప్పుడా? అన్నట్లు ఆపరేషన్.. కనికరించని ప్రభుత్వం..’ ఇదీ బాధితుల క్షోభ..! చెప్పలేనంత బాధ ‘గుండె’ల్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు దీనులు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్‌కు సాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ నీటి మూటగా మిగలడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులిస్తే ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చిన ‘సహృదయ’ ట్రస్ట్‌కు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఏడాది నుంచి 25 మంది బాధితులు గుండెను గుప్పెట్లో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న గుండె వైద్య విభాగంలో గతంలో గుండె రోగులకు కేవలం యాంజియోగ్రామ్, స్టంట్లు మాత్రం వేసేవారు. ఒక్క బైపాస్ సర్జరీ కూడా చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చదువుకున్న ఊరుకు సేవ చేయాలనే లక్ష్యంతో సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం 2015 మార్చిలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2015 మార్చి 18న మొట్టమొదటి బైపాస్ సర్జరీ చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు సుమారు 450 ఓపెన్ హార్ట్ సర్జరీలు నిరుపేదలకు ఉచితంగా నిర్వహించారు. అంతటితో ఆగకుండా 2016 మే 20న గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు గుండె మార్పిడి ఆపరేషన్ చేసి జాతీయ స్థాయిలో జీజీహెచ్ ప్రతిష్ట పెంచారు. జాతీయ స్థాయిలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసిన ఐదో ప్రభుత్వ ఆసుపత్రిగా జీజీహెచ్ రికార్డు సృష్టించేలా చేశారు. 2017 జనవరి 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్‌ను నిలిపారు. నీటి మూటగా హామీ.. ఏడాది నుంచి జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తే ఆపరేషన్లు నిర్వహించేందుకు సహృదయ ట్రస్టు ముందుకు వచ్చింది. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రెండేళ్ల క్రితం ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కానీ.. హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. జీజీహెచ్‌లో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి మంజూరు కాలేదు.. జీజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్స విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండె మార్పిడి ఆపరేషన్, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే బృందాన్ని అభినందించిన సందర్భంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు మరిన్ని జరుగుతాయని అంతా ఆశించారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం సుమారు 25 మంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకుని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఆపరేషన్లు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క రూపాయి మంజూరు కాలేదు. మార్చి 18వ తేదీతో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ముగుస్తున్న నేపథ్యంలో సహృదయ ట్రస్టు తిరిగి తన సేవలను కొనసాగిస్తుందా? లేక ప్రభుత్వ, వైద్య విద్యాధికారుల సహకారం కొరవడిందని విరమించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ఇదీ..! ఆపరేషన్ చేయించుకున్న ఏడుకొండలు(ఫైల్ ఫోటో) సీఎం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయనప్పటికీ మొట్టమొదట గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఉప్పు ఏడుకొండలు కేస్ స్టడీని ఎన్టీఆర్ వైద్య సేవ అధికారిక వెబ్సైట్లో పెట్టి కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తనకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసిందని, కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏడుకొండలు మాట్లాడిన విషయాలను ఇందులో పేర్కొనడం విశేషం. డబ్బులు మంజూరు చేయకుండా, ప్రచార ఆర్భాటాలకు మాత్రం వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అధికారిక వెబ్సైట్లో ఏడుకొండలుకు జరిగిన ఆపరేషన్ వివరాలు నమోదు చేసిన దృశ్యం -
అతి చిన్న పేస్‌మేకర్‌తో గుండె ఆపరేషన్
జూబ్లీహిల్స్: ప్రపంచంలోనే అతిచిన్న పేస్‌మేకర్‌తో 81 సంవత్సరాల వృద్ధుడికి గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు, ప్రస్తుతం వృద్ధుడు ఉల్లాసంగా తిరుగుతున్నాడని కాంటినెంటల్ ఆసుపత్రి డైరెక్టర్ భరత్ పురోహిత్ పేర్కొన్నారు. మంగళవారం తాజ్‌డెక్కన్ హోటల్లో ఏర్పాటు చే6సిన మీడియా సమాÔవేశంలో ఆయన మాట్లాడుతూ...కేవలం ఏడాది క్రితమే అమెరికన్ ఎఫ్‌డీఏ అనుమతించిన ఈ ‘లీడ్ లెస్ పేస్‌మేకర్’ సంప్రదాయ పేస్‌మేకర్లతో పోలిస్లే కేవలం పదవ వంతు సైజు మాత్రమే ఉంటుందని తెలిపారు. స్లో హార్ట్ బీట్తో బాధపడుతున్న వృద్ధుడు తమను సంప్రదించడంతో ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి శస్త్ర చికిత్స చేశామని, సాధారణ పేస్ మేకర్లతో పోల్చుకుంటే కనీసం 50 శాతం తక్కువ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుందన్నారు.చికిత్స ఖర్చు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ పేస్‌మేకర్ జీవితం కాలం దాదాపు 12 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. -
మూడ్రోజుల బిడ్డకు అరుదైన శస్త్రచికిత్స
-
పెద్దాసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అరుదైన గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఓ మహిళకు ప్రాణం పోశారు. నందికొట్కూరుకు చెందిన కైరున్‌బీ (55) కొంత కాలంగా ఆయాసం, ఛాతిలో నొప్పితో బాధపడేది. ఇటీవల ఆమె ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకుంది. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి ఆమెను పరీక్షించి గుండె కవాటాల మధ్య జెల్లీ ట్యూమర్ ఏర్పడిందని గుర్తించి, కార్డియోథొరాసిక్ విభాగానికి రెఫర్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఆమెకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా తక్కువ మందిలో అరుదుగా మహిళలకు ఇలాంటి సమస్య ఏర్పడుతుందన్నారు. ట్యూమర్‌ను ముట్టుకోకుండా ఎంతో చాకచక్యంగా దాని మొదలును మాత్రం కట్ చేసి తొలగించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా అరుదన్నారు. ఓబులమ్మ అనే మహిళకు క్లిష్టమైన పద్ధతిలో ఆధునిక పేస్‌మేకర్‌ను సీనియర్ రెసిడెంట్, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్‌రెడ్డి అమర్చినట్లు తెలిపారు. -
కాలు విరిగి వెళ్తే.. గుండె ఆపరేషన్ చేశారు..
-
వెనక నుంచి చేసే గుండె ఆపరేషన్!
సాధారణంగా గుండె ఆపరేషన్ ఛాతీ మీద చేస్తారు. ఇందులో బలమైన ఎముక అయిన రొమ్ము ఎముకను కోయాల్సి ఉంటుంది. దీని వెనక ‘పెరికార్డియమ్’ అనే పొరలో గుండె సురక్షితంగా ఉంటుంది. రొమ్ము ఎముక (బ్రెస్ట్ బోన్)ను, పెరికార్డియమ్ పొరను తొలగించాకే గుండెను సులభంగా చేరడం, సురక్షితంగా ఆపరేషన్ పూర్తిచేయడం సాధ్యమవుతుంది. మరో ప్రత్యామ్నాయం... ⇒ అయితే గుండెను చేరడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలూ ఉన్నాయి. అవి... ఒక పక్క నుంచి చేసే ఆపరేషన్ (యాంటెరో లాటెరల్ థొరకాటమీ) వెనకవైపు అంటే వీపు నుంచి చేసే ఆపరేషన్ (పోస్టెరో టాటెరల్ థోరకాటమీ). ⇒ వీటిలో కీహోల్ ప్రక్రియ ద్వారా వెనక వైపు నుంచి అంటే వీపు వైపు నుంచి కూడా సర్జరీ చేయవచ్చు. వెనక వైపు నుంచి చేసే ఆపరేషన్ ప్రత్యేకత... ⇒ ఈ ఆపరేషన్‌లో ఏ ఎముకనూ కోయాల్సిన అవసరం ఉండదు. కేవలం వీపువైపున ఉండే కండరాలపై మాత్రమే గాటు పెట్టడం జరుగుతుంది. ఈ తరహా సర్జరీతో ప్రయోజనాలివి... ⇒ వీపు వైపు నుంచి గుండె ఆపరేషన్ చేయడం వల్ల రొమ్ముపై పెద్ద గాటుకు ఆస్కారమే ఉండదు. ⇒ ఇక రెండో పెద్ద ప్రయోజనం ఏమిటంటే... ఎముకను కోయాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఎముక అతుక్కునే వరకూ గాయం మానదనే భయమూ ఉండదు. ⇒ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం కూడా చాలా తక్కువ. ⇒ ఇక మహిళల విషయానికి వస్తే రొమ్ముపై గాటు ఉండేందుకు ఆస్కారమే ఉండదు కాబట్టి వారి అందం (కాస్మటిక్‌గా) విషయంలో బెంగ పడాల్సిన అవసరం ఉండదు. అందరి గుండెజబ్బులకూ వెనకవైపు నుంచే ఆపరేషన్ సాధ్యమవుతుందా? ఇది సురక్షితమేనా? ఈ తరహా ఆపరేషన్ వెనకవైపు నుంచి చేస్తారు కాబట్టి గుండెకు సంబంధించిన అన్ని భాగాలను చేరడానికి అవకాశం ఉండదు. కాబట్టి గుండెజబ్బుల్లో కొన్నింటి విషయంలో మాత్రమే ఇలా వెనక వైపు నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గుండెలోని రంధ్రాలను మూసేందుకు చేయాల్సిన సర్జరీలు, కవాటాలను (వాల్వ్స్)ను సరిదిద్దేందుకు చేసే ఆపరేషన్స్‌లోనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఆయా సర్జరీల విషయంలో ఇది పూర్తిగా సురక్షితం. కాకపోతే సాధారణ ఆపరేషన్స్‌తో పోలిస్తే ఈ తరహా ఆపరేషన్స్‌కు కాస్త ఎక్కువ నైపుణ్యం అవసరం. -
‘గుండె’ను పిండిన దగా!
- కొడుకు గుండె పరీక్షకు దాచుకున్న డబ్బు - ఏటీఎం కార్డు రెన్యువల్ పేరుతో మాయం గట్టు : ఏటీఎం కార్డు రెన్యువల్ అంటూ ఓ ఫోన్ కాల్‌కు స్పందించిన పాపానికి కొడుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. గట్టు మండలం చింతలకుంటకు చెందిన వీరన్నకు మాచర్ల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. వీరన్న పెద్ద కుమారుడు సంతోష్(9) గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను డబ్బు పోగు చేసి రూ.15,200 ఖాతాలో వేశాడు. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుందని భావించి ముందు జాగ్రత్తగా ఖాతాలో వేసి ఏటీఏం కార్డును తీసుకున్నాడు. ఇదే క్రమం లో శుక్రవారం ఉదయం 99340 41804 నంబర్ నుంచి వీరన్న సెల్‌కు కాల్ వచ్చింది. ఆంధ్రాబ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాలని కోరడంతో వాటిని సదరు వ్యక్తికి తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత అతని సెల్‌కు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బిక్కమొహం వేయాల్సి వచ్చింది. వెంటనే మాచర్లలోని ఆంధ్రాబ్యాంక్ అధికారులకు విషయం చెప్పినా ఏమి చేయలేమని చేతులేత్తేసినట్లు బాధితుడు తెలిపాడు. జరిగిన మోసంపై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
ఆశయం ఐసీయూలో..!
గుంటూరు పెద్దాసుపత్రిలో బ్రెయిన్‌డెడ్‌ను నిర్ధారించలేని దుస్థితి అవయవాల సేకరణకు అక్టోబరులోనే జీజీహెచ్‌కు అనుమతులు గుండె మార్పిడి ఆపరేషన్లకు ‘గోఖలే’ ముందుకొచ్చినా స్పందించని వైద్యులు రోగులకు శాపంగా మారిన అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు...సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో ఏడాదిలో 150కు పైగా గుండె ఆపరేషన్లు జరిగాయి...ఈ నెల 18లోపు గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. అయితే జీజీహెచ్ అధికారులు, వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాశయానికి తూట్లు పడుతున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించాలంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించాలి. అయితే జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ నిర్ధారించలేని దుస్థితి నెలకొంది. ఆశయం ఐసీయూలో..! సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో గుండె ఆపరేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 18న సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు మొదలు పెట్టారు. ఏడాదిలోపు ఎవరూ ఊహించని విధంగా 150 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి నిరుపేద రోగులకు పునర్జన్మ ప్రసాదించారు. తాను చదువుకున్న కళాశాలకు ఏదో చేయాలనే తపనతో ముందుకు వచ్చిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే దాతల సహాయంతోపాటు, సొంత ఖర్చులతో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఇటీవల పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భావించిన డాక్టర్ గోఖలే జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించాలని తలంచారు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనే దానిపై స్పష్టత రాకపోయినప్పటికీ దాతల సహాయంతో ఈనెల 18వ తేదీలోపు పూర్తి చేయాలనే తపనతో పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఇప్పటికే గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎనిమిది మందిని పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ముగ్గురు రోగులను సిద్ధం చేశారు. బ్రెయిన్ డెడ్ కేసులు రాగానే వారి గుండెను సేకరించి వీరిలో ఒకరికి మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్‌ను నిర్ధారించలేని దుస్థితి ... గుంటూరు జీజీహెచ్ అత్యవసర వైద్య విభాగానికి నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. వీటిలో బ్రెయిన్ డెత్ అయిన కేసులు అనేకం ఉంటాయి. జీవన్‌దాన్ పథకం ద్వారా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించేందుకు గత ఏడాది అక్టోబరులో జీజీహెచ్‌కు అనుమతులు వచ్చాయి. బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించేందుకు ఇటీవల కమిటీని సైతం నియమించారు. అయితే జీజీహెచ్ వైద్యుల సమన్వయ లోపం వల్ల బ్రెయిన్ డెత్ కేసులను నిర్ధారించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల మధ్య సమన్వయ లోపం రోగులకు శాపంగా మారింది. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించి చరిత్ర సృష్టించడంతోపాటు, పేద రోగులకు అండగా నిలవాలనే డాక్టర్ గోఖలే చేపట్టిన ఉన్నత ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన జీజీహెచ్ అధికారులు, వైద్యులే తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
చెన్నై గుండె ఆపరేషన్ వైద్య బృందంలో
బళ్లారి టౌన్ : భారత వైద్య చరిత్రలోనే చెన్నై బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అరుదైన గుండె ఆపరేషన్ వైద్య బృందంలో బళ్లారి మెడికల్ కళాశాలలో చదివిన డాక్టర్ సురేష్ రావు పాల్గొనడం బళ్లారి జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం. 1993లో బళ్లారి మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన సురేష్‌రావు గుండె ఆపరేషన్‌లో పాలు పంచుకోవడం తమకు ఎంతో గర్వకారణమని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యాధర్ కిన్నాళ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీ.యోగానందరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వారు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గురైన ఓ మహిళ గుండెను తీసి బెంగళూరు నుంచి విమానంలో చెన్నైకి తీసుకెళ్లి అతి తక్కువ వ్యవధిలోనే మరొకరికి ఆపరేషన్ చేసి పెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన సురేష్‌రావు బళ్లారి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు తాము ఎంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
వైద్య చరిత్రలో ఓ అద్భుతం : చెన్నైలో గుండె మార్పిడి
చెన్నై: భారతీయ వైద్య చరిత్రలో ఈరోజు ఓ అద్భుతం జరిగింది. బెంగళూరు నుంచి గుండెను చెన్నైకు ఆగమేఘాల మీద తరలించి, గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరు గంటల వరకే గుండెలో జీవం ఉంటుంది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వైద్యులు, పోలీసు, ట్రాఫిక్ పోలీసు అధికారుల మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో సకాలంలో గుండెను బెంగళూరు నుంచి చెన్నై చేర్చారు. చెన్నై వైద్యులు ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 42 కిలో మీటర్ల దూరం 40 నిమిషాలలో అంబులెన్స్‌లో , 12 కిలో మీటర్లు పది నిమిషాలలో గుండెను తరలించారు. చెన్నైలో రెండు గంటల ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు రెండు గంటలపాటు తమ వాహనాలను పక్కన పెట్టి సహకరించారు. గుండె మార్పిడిలో చెన్నై వైద్యులు అరుదైన రికార్డు సాధించారు. ముంబైకి చెందిన 42 ఏళ్ల ఓ రోగికి బెంగళూరులో బ్రెయిన్‌డెడ్ మహిళ నుంచి గుండెను తీసి అమర్చారు. అది కూడా అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేశారు. ఇందుకోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులు సహకరించారు. వారం రోజులుగా దాతలకోసం ఎదురుచూసిన చెన్నైలోని మలర్ ఆస్పత్రి వైద్యులకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్ అయిన మహిళ గుండెను బాధితునికి ఇచ్చేందుకు ఆమె బంధువులు అంగీకరించారని సమాచారం అందింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రెండు రాష్ట్రాల పోలీసులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీగా ఉండే చెన్నై విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకూ త్వరగా చేరుకునేందుకు తమిళనాడు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అంతకుముందు బెంగళూరులో మహిళ నుంచి గుండెను స్వీకరించిన వైద్యులు 42 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్‌లో 40 నిమిషాల్లో దాటారు. కర్నాటక పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో ఇది సాధ్యమైంది. రసాయనాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గుండెను అంబులెన్స్‌లో తరలించారు. ఆ తర్వాత అక్కడే సిద్దంగా ఉన్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం గుండెతో బయలుదేరి సరిగ్గా 4 గంటల 25 నిమిషాలకు చెన్నై చేరుకుంది. చెన్నైలో అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్స్ లో బయలు దేరి 12 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో దాటి ఆసుపత్రికి చేరుకున్నారు. దారిలో 13 సిగ్నళ్లు దాటిమరీ సరిగ్గా 4 గంటల 35 నిమిషాలకు మలర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు గుండెను బాధితుడికి అమర్చటంలో విజయం సాధించారు. చెన్నై వైద్యులు రికార్డు సృష్టించారు. సినీ ఫక్కీలో సాగిన ఈ గుండె ప్రయాణం.. ఓ ప్రాణాన్ని కాపాడింది. రెండు రాష్ట్రాల పోలీసులు, వైద్యుల సమన్వయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. **