సాక్షి, తిరుపతి: ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుండె ఆపరేషన్ కోసం విశాఖ నుంచి తిరుపతికి గుండెను విమానంలో తరలించారు. దీని కోసం గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేశారు.
వివరాల ప్రకారం.. ఏపీలో గుండె ఆపరేషన్ కోసం గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్‌లో అక్కడి నుంచి తిరుపతికి విమానంలో గుండె తరలింపు జరుగుతోంది. రాగోలు జెమ్స్ మెడికల్ కాలేజీలో అవయవదానంలో భాగంగా గుండెను తిరుపతికి తరలిస్తున్నారు. అయితే, సీఎం జగన్ చొరవతో 20 నిమిషాల్లోనే వైజాగ్‌కు గుండెను అధికారులు తరలించారు. మరికాసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి గుండెను తరలించనున్నారు. ఇక తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి గుండెను గ్రీన్‌చానల్ ద్వారా పద్మావతి ఆసుపత్రికి తరలించనున్నారు.
ఇక, విశాఖ నుంచి తరలించిన గుండెను పేషంట్ లహరికి(11)కి అమర్చనున్నారు వైద్యులు. కాగా, లహరి తెలంగాణలోని వనస్థలిపురంలోకి ఎన్‌జీవో కాలనీకి చెందిన చిన్నారి. అయితే, జూన్ నెలలో లహరికి గుండె సమస్యను గుర్తించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స అందించారు. ఈ సందర్భంగా లహరి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. నిమ్స్‌లో చికిత్స కోసం మూడు లక్షలు ఖర్చు చేశాము. తెలంగాణలో కంటే ఏపీలోనే రెస్పాన్స్ బాగుంది అని ఇక్కడికి వచ్చాము. నవంబర్ ఆరో తేదీన పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ జాయిన్ చేశాము అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment