
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్‌కు మహేష్ ఆపరేషన్ చేయించాడు. ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆస్పత్రిలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఫొటోను నమ్రతా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
‘హార్ట్ వామింగ్ స్టోరి. వీఎస్‌డీ, పీడీఏతో బాధపుడుతున్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఆపరేషన్ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఆయ్యాడన్న విషయం ఆనందాన్ని ఇస్తుంది. అతడు పూర్తి ఆరోగ్యవంతుడిగా జీవించాలని ఆశిస్తున్న. చిన్నారి ఆపరేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ హస్పీటల్ హెల్త్‌కేర్ వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ నమ్రతా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి భార్గవ్ డిశ్చార్జ్ అవుతుండగా తల్లి చేతులో ఉన్న అతడు నవ్వుతూ కనిపించాడు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించిన మహేష్ బాబుకు, నమ్రతలకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు హార్ట్ ఎమోజీలతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు పరశురాం డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివల దుబాయ్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యూనిట్ ఇటీవల తిరిగి ఇండియాకు వచ్చింది. ఇందులో మహేశ్ సరసన మహనటి కీర్తి సూరేశ్ నటిస్తున్నారు.
చదవండి:
అల్లు అర్జున్ కలిసిన ‘కేజీఎఫ్’ డైరెక్టర్
మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య
Comments
Please login to add a commentAdd a comment