
సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. పేద పిల్లల పాలిట దైవంగా మారారు.
(చదవండి: మనసు మార్చుకున్న మహేశ్.. ఇకపై తన టార్గెట్ అదేనట!)
తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేశ్. ఈ విషయాన్ని మహేశ్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment