![Mahesh Babu Pens A Loving Note For Namratha On 20th Anniversary](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/mahesh.jpg.webp?itok=hlyaqzfb)
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్ కపుల్ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్ తెలియజేశాడు మహేశ్.
‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా కలిపింది
మహేశ్ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి. ఓసారి ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది.
న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment