సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫౌండేషన్.. ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీతో కలిసి గుండెజబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. "Heartathon: A Run to Support Children Batling with congenital Heart Disease" అనే కార్యక్రమం పేరిట పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన, నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో జరిగింది. ఇందులో సుమారు 300 మంది 3 కి.మీ నుంచి 5 కి.మీ మార్గంలో పరుగెత్తారు. మహేశ్ బాబు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నమ్రతా శిరోద్కర్ ఈ వేడుకను పురస్కరించుకుని విజేతలకు అవార్డులను అందించి సత్కరించారు. ఈ హార్ట్‌థాన్ రన్‌లో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడానికి వారి నిబద్ధతను ప్రదర్శిస్తూ, మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్‌ల మధ్య సహకార స్ఫూర్తిని ఈ హార్ట్‌థాన్ వెల్లడించింది.
చదవండి: నువ్వు లేకపోతే నేను లేనంటూ రౌడీ హీరోను ముద్దాడిన బాలీవుడ్ స్టార్, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment