చెన్నై వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరో | Arnold Schwarzenegger in Chennai for 'I' Audio Launch | Sakshi
Sakshi News home page

చెన్నై వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరో

Published Mon, Sep 15 2014 12:18 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

చెన్నై వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరో

చెన్నై వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరో

చెన్నై: హాలీవుడ్ యాక్షన్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనిక్కడకు విచ్చేశారు. సంచలన తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'ఐ' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుసుకుంటారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

జవహర్లాల్  నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరిగే 'ఐ' ఆడియో ఫంక్షన్ లో కండల వీరుడు ష్వాజ్నెగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement