Manoharudu
-
గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కొందరు ఇంటిదొంగలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జూలై 28న దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్ మనోహరుడు ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లతో రూ.1.30 కోట్లు రుణం తీసుకుని, మింగేశారు. కాగా శనివారం అర్ధరాత్రి వరదయ్యపాళెం బ్రాంచ్‌లో 750 గ్రాముల బంగారం, 13 కిలోల వెండిని దొంగలు లూటీ చేశారు. ఈ ఘటన వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సంఘటనలు బ్యాంకు ప్రతిష్ఠకు మాయనిమచ్చగా మారుతాయని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంత వాసులకు సేవలు అందిస్తోన్న అతి పెద్ద బ్యాంకుల్లో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఒకటి. ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారి బ్యాంకు కార్యకలాపాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే విమర్శలు సిబ్బంది నుంచే వినిపిస్తుండడం గమనార్హం. బ్యాంకులో తనకు సన్నిహితులైన అధికారులుఎంత పెద్ద తప్పు చేసినా ఆ అధికారి వెనకేసుకొస్తున్నారని ఆ బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు దాసకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలను ఉదహరిస్తున్నారు. రూ.1.30 కోట్లు స్వాహా చేసిన మేనేజర్ సత్యవేడు మండలం దాసకుప్పం బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తోన్న మనోహరుడు ఆ బ్యాంకు యాజమాన్యంలో కీలక అధికారికి అత్యంత సన్నిహితుడు. మేనేజర్ మనోహరుడు దాసకుప్పం బ్రాంచ్‌లో ఖాతాదారులతో నిమిత్తం లేకుండా వారి పేర్లపై రూ.1.30 కోట్లను రుణంగా తీసుకుని మింగేశాడు. ఒక్క స్వయం సహాయక మహిళా సంఘాల పేర్లతోనే రూ.54 లక్షలు మింగేశారు. ఎస్సీ, ఎస్టీ రుణాలు, పంట రుణాల విభాగంలో రూ.70 లక్షలు కాజేశారు. తీసుకోని రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న స్వయం సహాయక సంఘాల మహిళలు దాసకుప్పం బ్రాంచ్ ఎదుట భారీ ఎత్తన ఆందోళన చేయడంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మేనేజర్ మనోహరుడు రూ.1.30 కోట్లను కాజేసినట్లు తేల్చిన అధికారులు సత్యవేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోహరుడిపై సస్పెన్షన్ వేటుతో యాజమాన్యం చేతులు దులుపుకుంది. కానీ కేసు దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారాన్ని సత్యవేడు పోలీసులకు అందించడంలో యాజమాన్యం సహాయ నిరాకరణ చేస్తోందనే విమర్శలు బ్యాంకు వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న ఇంటిదొంగలు వరదయ్యపాళెం బ్యాంకుకు కన్నం వేసేందుకు దారి తీసిఉంటుందనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి 12.05 గంటలకు వరదయ్యపాళెం బ్రాంచ్‌ను దొంగలు లూటీ చేశారు. కిటికీ ఊచలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు లాకర్లను పగులగొట్టి 750 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి దోచుకున్నట్లు పోలీసులు తేల్చారు. శ్రీకాళహస్తి-తడ రహదారి పక్కనే ఉండడం, ఏదో అలికిడి రావడంతో బ్యాంకును లూటీ చేసే యత్నాన్ని విరమించుకుని, దోచుకున్న సొమ్ముతో దొంగలు ఉడాయించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులో పని చేసే సిబ్బంది హస్తం లేకుండా ఈ దోపిడీ జరిగే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసును అదే కోణంలో దర్యాప్తు చేస్తోండడం గమనార్హం. -
శంకర్ ”ఐ” సినిమా టీజర్
-
చెన్నై వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరో
చెన్నై: హాలీవుడ్ యాక్షన్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనిక్కడకు విచ్చేశారు. సంచలన తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'ఐ' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుసుకుంటారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరిగే 'ఐ' ఆడియో ఫంక్షన్ లో కండల వీరుడు ష్వాజ్నెగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
డైరెక్టర్ శంకర్ రికార్డ్!
దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది. దక్షిణాదిన అన్ని అంశాలలో ఈ సినిమా సంచలనం సృష్టించనుంది. దాదాపు 180 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించినట్లు సమాచారం. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా, విక్రమ్ హీరోగా, సూపర్ డైరెక్టర్ శంకర్ మూడేళ్లపాటు శ్రమించి దీనిని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. శంకర్ అంటే చెప్పేదేముంది. ఆయనే ఓ సంచలనం. ఆయన చిత్రాలు మరో సంచలనం ఈ విషయం అనేకసార్లు రుజువైంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందర్భంగా 15 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాణ వ్యయంలోనే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అత్యధికంగా 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని రికార్డు సృష్టించినట్లు కోలీవుడ్ టాక్.ఇంత పారితోషికం దేశంలో ఏ దర్శకుడికి అందలేదు. ఆ రకంగా శంకర్ భారత సినిమా చరిత్రలో రికార్డు సృష్టించినట్లుగా భావిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్మాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాదులో నిర్వహించే తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న 'ఐ' ఆ తరువాత ఎన్ని సంచలనాలు చేస్తోందో!. - శిసూర్య -
180 కోట్ల శంకర్ మనోహరుడు స్టిల్స్
-
దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’
దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు. 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్లో విక్రమ్ ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు. మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు... ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు. భారతీయ ‘జేమ్స్ కామెరూన్’ ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్! ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు. భారీ ఎత్తున విడుదల తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం. -
పాటకు అయిదు కోట్లా!
సినిమాకు అయిదు కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం కావడం సహజం. కానీ... ఒక పాటకు అయిదు కోట్లు ఖర్చయిందంటే ఆ సినిమాను ఏమనాలి? శంకర్ సినిమా అనాలి. ఎందుకంటే... ఒక పాటకు అంత ఖర్చు పెట్టించే సామర్థ్యం ఒక్క శంకర్‌కే ఉంది. ఆయన సినిమాలకు వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తాయి. అందుకే... నిర్మాతలు కూడా భయం లేకుండా డబ్బుని ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ హీరోగా ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం శంకర్ ఓ పాటను చిత్రీకరించారు. అమీజాక్సన్, ఉపెన్ పటేల్‌పై తీసిన ఈ పాటను ముందు చెన్నయ్‌లో మొదలు పెట్టారు. అక్కడ్నుంచీ ప్రపంచమంతా తిరుగుతూ మనసుకు నచ్చిన పలు ప్రదేశాల్లో ఈ పాటను శంకర్ రూపొందించారట. మళ్లీ చెన్నయ్ చేరుకొని ఓ భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ ముగించారు. దీనికి శంకర్ తీసుకున్న సమయం పది రోజులు. ఇంతకీ ఖర్చు ఎంతయ్యిందని లెక్క చూసుకుంటే అయిదు కోట్లు అని తేలింది. దీంతో యూనిట్ అంతా షాక్. ‘ధూమ్3’లో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్‌పై తీసిన పాటకు రెండు కోట్లు ఖర్చయిందని గతంలో వార్తలొచ్చాయి. అంటే ఆమిర్ లాంటి సూపర్‌స్టార్ నటించిన బాలీవుడ్ సినిమాకే పాటకు రెండు కోట్లంటే పెద్ద మొత్తం అన్నమాట. మరి దక్షిణాదికి చెందిన ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి సంబంధించిన పాటకు అయిదు కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా సాహసమే. పైగా అది హీరో విక్రమ్‌పై తీసిన పాట కాకపోవడం గమనార్హం. పదహారేళ్ల క్రితం వచ్చిన ‘జీన్స్’ చిత్రంలో కూడా ప్రపంచంలోని ఏడు వింతల నేపథ్యంలో ‘పూవుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం’ పాటను అతి మనోహరంగా తీశారు శంకర్. మరీ ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. -
హీరో విక్రమ్‌ను ఆకాశానికెత్తిన శంకర్
ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ - హీరో విక్రమ్ అనగానే మనకు అపరచితుడు చిత్రం గుర్తుకు వస్తుంది. అపరిచితుడు సినిమా 2005లో విడుదలై తెలుగు,తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రయోగాలు చేయడంలో శంకర్ దిట్ట. విక్రమ్ కూడా ఆయనకు ఏమీ తీసిపోడు. కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. అటువంటి వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేశారు. శంకర్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం సహజం. అందులో వీరిద్దరికి తోడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'ఐ' షూటింగ్ పూర్తి అయింది. శంకర్ ఒక సినిమాకి, ఒక సినిమాకు పోలికే ఉండదు. అది అతని ప్రత్యేకత. ఈ చిత్రం కూడా కథ, కధనంలో పూర్తిగా కొత్తదనం చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన అందాల భామ ఎమిజాక్సన్ హీరో హీరోయిన్గా నటించింది. దీనిని తెలుగులో 'మనోహరుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్‌ను శంకర్ ఆరు గెటప్‌లలో చూపించనున్నారు. విక్రమ్ ఎంతో అంకితభావంతో ఈ పాత్రలను పోషించినట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చెప్పారు. అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రఖ్యాత సాంకేతిక నిపుణులతో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల శంకర్ తన మనసులో మాటలు బయటపెట్టాడు. హీరో విక్రమ్‌ను ఆకాశానికెత్తేశాడు. విక్రమ్ లాంటి రియల్ హీరో లేనేలేడని తెగపొగిడేశాడు. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా కష్టపడి సన్నబడ్డాడని చెప్పాడు. విక్రమ్ చేస్తున్న పాత్ర చాలా క్లిష్టమైనదని, ఆ పాత్ర కోసం విక్రమ్ గుండు చేయించుకోటానికి కూడా వెనుకాడలేదని శంకర్ చెప్పారు. మేకప్, కాస్టూమ్స్ల్, టెక్నికల్ అంశాలలో చాలా కొత్తదనం చూపినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడుని మించి ఇది ప్రేక్షకాదరణ పొందుతుందని అంచనా. -
సాహసాల మనోహరుడు
విక్రమ్-శంకర్... ఈ కాంబినేషన్ చెప్పగానే ‘అపరిచితుడు’ సినిమా గుర్తొస్తుంది. దక్షిణాదిన ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. నటుడిగా విక్రమ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిందా సినిమా. ‘అపరిచితుడు’ తర్వాత మళ్లీ వారి కాంబినేషన్లో ‘ఐ’ చిత్రం రూపొందుతుండటం దక్షిణాది ప్రేక్షకులందర్నీ ఆనందింపజేస్తున్న విషయం. ఈ చిత్రం ‘మనోహరుడు’ పేరుతో తెలుగునాట విడుదల కానుంది. అయితే తెలుగు వెర్షన్ హక్కులు ఇప్పటివరకూ ఎవ్వరికీ ఇవ్వలేదట. ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మినహా పూర్తయింది. మార్చి తొలివారంలో మిగిలివున్న ఒక్క పాటను చిత్రీకరిస్తారు. ప్రస్తుతం కొడెకైనాల్లో ప్యాచ్‌వర్క్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడమే లక్ష్యంగా శంకర్ అడుగులేస్తున్నట్లు సమాచారం. ‘అపరిచితుడు’ చిత్రంలా ఇది ప్రయోగాత్మకం కాదని, వాణిజ్య అంశాలతో తెరకెక్కుతోన్న చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అమీజాక్సన్ ఇందులో కథానాయిక. బ్రిటిష్ మోడల్ అయిన ఆమెను బ్రాహ్మణ స్త్రీగా చూపిస్తూ ఈ సినిమా ద్వారా గొప్ప సాహసమే చేస్తున్నారు శంకర్. ఆయన గత చిత్రాలకు దీటుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం విక్రమ్ తన శరీరాన్ని రకరకాలుగా మలుచుకున్నారు. కథాంశం కూడా చాలా సాహసభరితంగా ఉంటుందట. ఈ చిత్రానికి కెమెరా పీసీ శ్రీరామ్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కూర్పు: ఆంటోని, నిర్మాతలు: వేణు రవిచంద్రన్, డి.రమేష్‌బాబు, నిర్మాణం: ఆస్కార్ ఫిలిమ్ ప్రై. లిమిటెడ్. -
శంకర్ ఊహకు నేను ప్రతిరూపం కావడం నా అదృష్టం
నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు లభిస్తే ఎవరైనా తేలిగ్గా నటించేస్తారు. అయితే.. సంబంధం లేని సంప్రదాయాన్ని, తెలీని నడవడికను తనదిగా చేసుకొని నటించమంటే మాత్రం అందరూ చేయలేరు. అలా యాక్ట్ చేయడం నిజంగా కత్తి మీద సామే. ప్రస్తుతం లండన్ బ్యూటీ అమీ జాక్సన్ అలాంటి పాత్రనే చేస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధంలేని సంప్రదాయంలోకి ఆమె ఒదిగిపోతున్నారు. అమీ చేస్తోంది నిజంగా సాహసమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ తెల్లజాతి పిల్ల ‘ఐ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగులో ‘మనోహరుడు’గా విడుదల కానుంది. ఈ సినిమాలో అమీ... బ్రాహ్మణ యువతి ‘మణియమ్మాళ్’గా నటిస్తున్నారు. జన్మతః అమీ క్రిస్టియన్. పైగా పుట్టింది లండన్‌లో. బ్రాహ్మణ సంప్రదాయం గురించి కాని, మడి, ఆచార వ్యవహారాల గురించి కాని, పూజా పురస్కారాల గురించి కానీ తనకు అస్సలు తెలీదు. అలాంటి అమీ.. తను ఎన్నడూ చూడని, తనకు తెలీని జీవితాన్ని కెమెరా ముందు ఆస్వాదిస్తుండటం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ పాత్ర గురించి ఇటీవల ఆమె చెబుతూ -‘‘ఈ పాత్ర చేస్తుంటే... నేను ఇండియాలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది. ఈ లైఫ్ చాలా బాగుంది. నా నడకను, నా కదలికల్ని, నా చూపుల్ని ఓ విధంగా చెప్పాలంటే నన్నే మార్చేశారు శంకర్. రాయిని శిల్పంగా ఎలా మలచవచ్చో... నన్ను శంకర్ తీర్చిదిద్దుతున్న విధానాన్ని చూస్తే తెలిసింది. ఆయన ఊహలో కనిపించిన ‘మణియమ్మాళ్’కు నేను ప్రతిరూపాన్ని నేను కావడం నిజంగా నా లక్. ఏడాది పాటు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఈ సినిమా చేస్తున్నాను. నా జీవితంలో మరిచిపోలేని పాత్ర ఇది’’ అని చెప్పుకొచ్చారు అమీ.