సాహసాల మనోహరుడు | Shankar, Vikram's Manoharudu to release in April | Sakshi
Sakshi News home page

సాహసాల మనోహరుడు

Published Mon, Feb 17 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

విక్రమ్‌

విక్రమ్‌

 విక్రమ్-శంకర్... ఈ కాంబినేషన్ చెప్పగానే ‘అపరిచితుడు’ సినిమా గుర్తొస్తుంది. దక్షిణాదిన ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. నటుడిగా విక్రమ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిందా సినిమా. ‘అపరిచితుడు’ తర్వాత మళ్లీ వారి కాంబినేషన్‌లో ‘ఐ’ చిత్రం రూపొందుతుండటం దక్షిణాది ప్రేక్షకులందర్నీ ఆనందింపజేస్తున్న విషయం.  ఈ చిత్రం ‘మనోహరుడు’ పేరుతో తెలుగునాట విడుదల కానుంది. అయితే తెలుగు వెర్షన్ హక్కులు ఇప్పటివరకూ ఎవ్వరికీ ఇవ్వలేదట. ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మినహా పూర్తయింది. మార్చి తొలివారంలో మిగిలివున్న ఒక్క పాటను చిత్రీకరిస్తారు. ప్రస్తుతం కొడెకైనాల్‌లో ప్యాచ్‌వర్క్ షూటింగ్ జరుగుతోంది. 
 
 ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడమే లక్ష్యంగా శంకర్ అడుగులేస్తున్నట్లు సమాచారం. ‘అపరిచితుడు’ చిత్రంలా ఇది ప్రయోగాత్మకం కాదని, వాణిజ్య అంశాలతో తెరకెక్కుతోన్న చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అమీజాక్సన్ ఇందులో కథానాయిక. బ్రిటిష్ మోడల్ అయిన ఆమెను బ్రాహ్మణ స్త్రీగా చూపిస్తూ ఈ సినిమా ద్వారా గొప్ప సాహసమే చేస్తున్నారు శంకర్. ఆయన గత చిత్రాలకు దీటుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం విక్రమ్ తన శరీరాన్ని రకరకాలుగా మలుచుకున్నారు. కథాంశం కూడా చాలా సాహసభరితంగా ఉంటుందట. ఈ చిత్రానికి కెమెరా పీసీ శ్రీరామ్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కూర్పు: ఆంటోని, నిర్మాతలు: వేణు రవిచంద్రన్, డి.రమేష్‌బాబు, నిర్మాణం: ఆస్కార్ ఫిలిమ్ ప్రై. లిమిటెడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement