డైరెక్టర్ శంకర్ రికార్డ్! | Director Shankar Record! | Sakshi
Sakshi News home page

డైరెక్టర్ శంకర్ రికార్డ్!

Published Sun, Aug 31 2014 4:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

డైరెక్టర్ శంకర్ రికార్డ్!

డైరెక్టర్ శంకర్ రికార్డ్!

దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది.

 దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది. దక్షిణాదిన అన్ని అంశాలలో ఈ సినిమా సంచలనం సృష్టించనుంది. దాదాపు 180 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించినట్లు సమాచారం. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా, విక్రమ్ హీరోగా,  సూపర్ డైరెక్టర్ శంకర్ మూడేళ్లపాటు శ్రమించి దీనిని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. శంకర్ అంటే చెప్పేదేముంది. ఆయనే ఓ సంచలనం. ఆయన చిత్రాలు మరో సంచలనం ఈ విషయం అనేకసార్లు రుజువైంది.

 తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందర్భంగా 15 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు  నిర్మాతలు ప్రకటించారు. నిర్మాణ వ్యయంలోనే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అత్యధికంగా 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని రికార్డు సృష్టించినట్లు కోలీవుడ్ టాక్.ఇంత పారితోషికం దేశంలో ఏ దర్శకుడికి అందలేదు. ఆ రకంగా శంకర్ భారత సినిమా చరిత్రలో రికార్డు సృష్టించినట్లుగా భావిస్తున్నారు.

ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించిన  ఈ మూవీ  ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా రిలీజ్‌ చేయడానికి  నిర్మాతలు సన్మాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాదులో నిర్వహించే  తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు.  విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న 'ఐ' ఆ తరువాత ఎన్ని సంచలనాలు చేస్తోందో!.

- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement