I
-
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
భారత్‌లో ఐసీసీసీ సదస్సు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ద కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ఐసీసీసీ) సదస్సుకు భారత్ వేదిక కానుంది. 2027లో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఐసీసీసీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ, స్విట్జర్లాండ్ సైతం పోటీపడ్డాయి. దిగ్గజాలు, విద్యావేత్తలు, నిపుణులు ఈ రంగంలో పరిశోధన పురోగతిపై సదస్సులో చర్చిస్తారు. 1918 నుండి సాధారణంగా 4–6 ఏళ్ల వ్యవధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 16వ ఐసీసీసీ సెపె్టంబర్ 18–22 మధ్య బ్యాంకాక్‌లో జరుగుతోంది. -
దశాబ్దంలోనే భారత్‌లో ఎంతో మార్పు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద భారత్ పదేళ్లలోనే ఎంతో మార్పు చెందినట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని, ఆసియా, ప్రపంచ వృద్ధిని నడిపించే కీలక దేశంగా అవతరించినట్టు తన తాజా నివేదికలో ప్రస్తావించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) భారత్ తన సామర్థ్యాల మేరకు ఫలితాలను చూపించలేదని, ఈక్విటీ వ్యాల్యూషన్లు గరిష్టాల్లో ఉన్నాయన్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ తరహా దృక్పథం గత తొమ్మిదేళ్లలో చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణలను విస్మరించడమేన పేర్కొంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థకు తోడు, గత 25 ఏళ్లలో గొప్ప పనితీరు చూపిన స్టాక్ మార్కెట్‌ను నిదర్శనాలుగా ప్రస్తావించింది. 2013తో పోలిస్తే ఇప్పుడున్న భారత్ భిన్నమైనదిగా పేర్కొంది. (సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు) ఇవీ మార్పులు..: 2014లో ప్రధానిగా మోదీ కొలువుదీరిన తర్వాత చోటు చేసుకున్న పది పెద్ద మార్పులను మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. పోటీ దేశాల స్థాయిలో కార్పొరేటు పన్నును తగ్గింపు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం అతిపెద్ద సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ కింద పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. అలాగే, జీడీపీలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండం ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధీకరణ చెందుతుందనడానికి నిదర్శంగా పేర్కొంది. ఎగుమతుల్లో భారత్ వాటా రెట్టింపై 2031 నాటికి 4.5%కి చేరుకుంటుందని అంచనా వేసింది. తలసరి ఆదాయంలో వృద్ధి ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 2,200 డాలర్లుగా (రూ.1,80,400) ఉంటే, 2032 నాటికి 5,200 డాలర్లకు (రూ.4,26,400) పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఇది బారత్‌లో వినియోగ పరంగా పెద్ద మార్పునకు కారణమవుతుందని అంచనా వేసింది. మరిన్ని బిజినెస్వార్తలు,ఎకానమీ గురించిన వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్‌పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
ఖర్గే ఇంట గెలిచేనా?: అగ్నిపరీక్షగా అసెంబ్లీ ఎన్నికలు!
ఎస్.రాజమహేంద్రారెడ్డి : మల్లికార్జున ఖర్గే.. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కొత్త బాస్. గాంధీల ఇంటి పార్టీలాంటి కాంగ్రెస్‌కు గాంధీయేతరులు అధ్యక్షుడు కావడం విశేషం. ఆ పదవికి ఎంపిక కావడమే ఆయన సమర్థతకు నిదర్శనం. అంతగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే తన ప్రభావాన్ని అంతగా చూపెట్టలేకపోయినప్పటికీ పార్టీని ఏకతాటిపై నడపడంలో తన సమర్థతను చాటాడనే చెప్పుకోవాలి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో నిరసన గళాన్ని వినిపించడంలోనూ ఖర్గే తన నాయకత్వ గరిమను రుజువు చేసుకున్నారు. అనర్హత వేటుకు నిరసనగా విపక్షాలన్నింటినీ ఒకే వేదికపై మోహరించడంలోనూ విజయం సాధించారు. పార్లమెంట్లో అదానీ వ్యవహారంపైనా, పార్లమెంట్ బయట అనర్హత వేటు పైనా సామూహిక నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే సారథ్యంలోనే నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ పోరుకు నగారా మోగింది. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్గేకు ఇది అసలు సిసలైన పరీక్ష. ఒకరకంగా అగ్నిపరీక్ష. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన, ఏకైక లక్ష్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటి పోరులో గెలుస్తారో లేదో మే 13న(కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) తేలనుంది. ఖర్గే హీరోనో లేక జీరోనో అదే రోజు కర్ణాటకతోపాటు దేశానికీ తెలుస్తుంది. ఇప్పటికే తొలి విజయం నిజానికి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనదే అవుతుంది. జేడీ(ఎస్)తో పొత్తుకు విముఖత ఒకే గొడుగు కింద వైరి వర్గాల ఘర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఖర్గేకు అనుభవపూర్వకంగా తెలుసు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖర్గే ఒక్కసారి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అవకాశాలు రాక కాదు, అవకాశాలు తలుపుతట్టినా అంతర్గత పోరును తట్టుకొని నిలబడలేకపోయారు. ఒక్కసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారిపోయింది. 1999లో ఎస్.ఎం.కృష్ణ, 2004లో ఎన్.ధరమ్ సింగ్, 2013లో సిద్ధరామయ్య నుంచి ఎదురైన గట్టి పోటీని ఎదుర్కోలేకపోయారు. 2004లో మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. దాదాపు ఖాయమైపోయిందనుకున్న తరుణంలో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ అభ్యంతరం చెప్పడంతో తన సహచరుడైన మరో సీనియర్ నాయకుడు ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. ఈ అనుభవం వల్లే జేడీ(ఎస్)తో ఎన్నికల పొత్తుకు ఖర్గే విముఖంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత సంకీర్ణం తప్పని పరిస్థితి ఎదురైనా జేడీ(ఎస్)తో దోస్తీ కలలోని మాట అని ఖర్గే ఈపాటికే సుస్పష్టంగా చెప్పేశారు. ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం ఒప్పించినట్లు వినికిడి. మది దోచిన సర్వేలు కింగ్ అయ్యే అవకాశం మూడుసార్లు చేజారిన ఖర్గే ఈసారి కింగ్‌మేకర్ కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంటి గెలిచి చూపించి, రచ్చ గెలుపు మీద ఇనుమడించిన ఉత్సాహంతో దృష్టి సారించాలని ఆశిస్తున్నారు. ఇటీవలి కొన్ని సర్వేల ఫలితాలు ఖర్గే మనసు దోచాయి. ఇండియాటుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో కర్ణాటకలో జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగి ఉంటే 28 సీట్లకు కాంగ్రెస్ 17 సీట్లను దక్కించుకొనేది అని ఆ సర్వే సారాంశం. కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే∙ఏబీపీ–సీ ఓటర్ సర్వే కాంగ్రెస్‌కే విజయాన్ని కట్టబెట్టింది. ఆ పార్టీకి 115–127 సీట్లు వస్తాయంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 117 స్థానాలంటే సంకీర్ణం జోలికెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ సర్వే ఖర్గే మనసు దోచి ఉంటుంది. ఇక కర్ణాటక ప్రజల మనసులు దోచడానికి ఖర్గే వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. -
కోవిడ్ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
AKA: గీతాచిత్రలహరి
బాలీవుడ్ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్ గీతికా నారంగ్ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది... నార్త్ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ! తండ్రి నారంగ్ అబ్బాసి బిమల్‌రాయ్, గురుదత్, రాజ్కపూర్ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్‌కపూర్. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్‌కపూర్ తన హావభావాలతో గ్రేట్ చార్లి చాప్లిన్‌ను తనకు పరిచయం చేశాడు. చార్లి చాప్లిన్ సినిమాలు చూసి... ‘ఈయన రాజ్‌కపూర్‌ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి! దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్టైజింగ్లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ... ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి. దిల్లీలోని ఒక ఫిల్మ్‌ప్రొడక్షన్ కంపెనీలో చేరడంతో ఫిల్మ్ మేకింగ్‌పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. ‘హాలీవుడ్‌తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్‌నైట్’ పేరుతో మొదటి సారిగా షార్ట్ డాక్యుమెంటరీ తీసింది. నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే... ‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’ విడుదలకు నోచుకోని ‘అమీర్ సల్మాన్ షారుఖ్’ ఫీచర్ ఫిల్మ్ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్ ఖాన్‌ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట. ‘ఆర్టిస్ట్‌లో హీరోయే కాదు జోకర్ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక. నాటి ‘గుడ్‌నైట్’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గీతిక నారంగ్ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్’ను గెలుచుకుంది. బాలీవుడ్ కథానాయకులు దేవానంద్, అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్డమ్ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్‌గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్‌గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత! -
సేవకుల తయారీ విధానమది
వారణాసి: బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది. స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు. మీ ప్రతిభ అమోఘం జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్ ఆలపించగా మరొకరు డ్రమ్ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు. -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం ఎంతో తెలుసా?
Google Facebook Income In India: సంప్రదాయ మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను హోస్ట్ చేయడం ద్వారా ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా సమాధానం దొరికింది. ‘భారత్‌లో డిజిటల్ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్బుక్ హస్తగతం చేసుకున్నాయి. ఏడాదికి గూగుల్ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్బుక్ రూ.9,326 కోట్లు పొందుతున్నాయి. అంటే మొత్తంగా రూ.23,313 కోట్లు. ఇది దేశంలోని టాప్–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం(కేవలం రూ.8,396 కోట్లు) కంటే చాలా ఎక్కువ’ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వివరించారు. ఈ మేరకు పలు కీలక అంశాలను మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సుశీల్ మోదీ ప్రస్తావించారు. ఇక్కడ మూటకట్టిన ఆదాయంలో 90శాతం మొత్తాలను తన అంతర్జాతీయ అనుబంధ సంస్థకు ఫేస్బుక్ పంపుతోందని, గూగుల్ ఇండియా తన 87 శాతం రాబడిని మాతృసంస్థకు బదలాయిస్తోందని సుశీల్ వెల్లడించారు. కొంత భాగం.. సంప్రదాయక మీడియాకూ దక్కాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మీడియా కంటెంట్ మూలంగా ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం పొందుతున్న టెక్ సంస్థలపై, ఈ వ్యవస్థపై పర్యవేక్షణకు కొత్తగా స్వతంత్య్ర నియంత్రణ మండలిని నెలకొల్పాలని ఆయన సూచించారు. చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం -
సంపన్నులు... రయ్ రయ్!
న్యూఢిల్లీ: కనీసం 3 కోట్ల డాలర్ల(సుమారు రూ. 220 కోట్లు) సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో భారీగా పెరగనున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. అత్యధిక వ్యక్తిగత సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 63 శాతం జంప్‌చేయనున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అభిప్రాయపడింది. వెరసి అత్యంత సంపన్నుల(యూహెచ్ఎన్డబ్ల్యూఐలు) సంఖ్య 11,198కు చేరనున్నట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచంలోనే సంపన్నుల వృద్ధిలో రెండో వేగవంత దేశంగా భారత్ నిలిచే వీలున్నట్లు విశ్లేషించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 5,21,653గా నమోదైనట్లు 2021 వెల్త్ నివేదికలో తెలియజేసింది. వీరిలో 6,884 మంది భారతీయులేనని పేర్కొంది. 2020–25 మధ్య కాలంలో అంతర్జాతీయంగా సంపన్నుల సంఖ్య 27 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. దీంతో వీరి సంఖ్య 6,63,483ను తాకవచ్చని అభిప్రాయపడింది. బిలియనీర్లు... 162కు! 2025కల్లా దేశీయంగా బిలియనీర్ల సంఖ్య 43 శాతం ఎగసి 162కు చేరే వీలున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంఖ్య 113గా నమోదైంది. కాగా.. బిలియనీర్ల వృద్ధిలో ప్రపంచ సగటు 24%కాగా, ఆసియాలో 38%. ఇక ఆసియాలో చూస్తే అత్యంత సంపన్నుల వృద్ధిలో ఇండోనేసియా 67%తో తొలి స్థానంలో నిలుస్తున్నట్లు నివేదిక తెలియజేసింది. కోవిడ్–19 కల్లోలం తదుపరి భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రివకర్ అవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. తద్వారా రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించే దిశలో సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కొత్తగా వెలుగులోకి వస్తున్న రంగాలలో అవకాశాలు కల్పించడం ద్వారా భారత్ ఆర్థికంగా మరింత పరిపుష్టిని సాధించే వీలున్నదని పేర్కొన్నారు. వెరసి ఆసియాలో సూపర్‌పవర్‌గా ఆవిర్భవించవచ్చని అంచనా వేశారు. సరికొత్త ఆర్థిక అవకాశాలు సంపద సృష్టి కి సహకరించనున్నాయని, ఇది అత్యంత సంపన్నుల వృద్ధికి దారిచూపనుందని వివరించారు. వ్యక్తిగత సంపన్నుల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు రేసులో ముందున్నట్లు నివేదిక పేర్కొంది. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
తప్పు తేలితే బోర్డు సభ్యులను బ్లాక్ చేయాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు సభ్యులు, అధికారులను సెబీ బ్లాక్ లిస్ట్ (నిషేధిత జాబితా)లో పెట్టాలని, అప్పటి వరకు వారికి చెల్లించిన పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలకు మేలు చేసే విధంగా లేకపోతే తప్ప.. ప్రజావేగులు చేసే ఫిర్యాదులపై దర్యాప్తు సమాచారాన్ని కూడా వాటాదారులకు అందించాలన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘కార్పొరేట్ గవర్నెన్స్’పై నిర్వహించిన కార్యక్రమంలో మూర్తి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజా వేగు ఫిర్యాదుపై విచారణలో భాగంగా కంపెనీ బోర్డు సభ్యులు, అధికారులు తమ విశ్వసనీయ విధులను సరిగ్గా న్విహించలేదని, పాలనా లోపం ఉన్నట్టు తేలితే రాజీనామా చేయాలని కోరాలి. ప్రజా వేగు ఫిర్యాదు అన్నది అసంతృప్త ఉద్యోగి నుంచి ప్రతీకార చర్య రూపంలో ఉండరాదు. తన ఫిర్యాదుకు ఆధారంగా అవసరమైన డేటా, వాస్తవాలను ఫిర్యాదిదారు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిర్యాదిదారుకు వేధింపుల్లేకుండా కంపెనీ సరైన రక్షణ కల్పించాలి’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాలను వినిపించారు. పారదర్శకత అవసరం..‘‘ప్రజా వేగు ఫిర్యాదును పరిష్కరించే విధానం పారద్శకంగా, విశ్వసనీయతను పెంచే విధంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఫిర్యాదు మధ్య స్థాయి లేదా దిగువ స్థాయి ఉద్యోగికి వ్యతిరేకంగా వచ్చినట్టయితే.. ఆ ఉద్యోగితో సంబంధం లేని సీనియర్ ఉద్యోగులతో ఓ కమిటీని నియమించి విచారణ నిర్వహించాలి. ఒకవేళ బోర్డు సభ్యులు లేదా చైర్మన్ లేదా సీఈవోకు వ్యతిరేకంగా పిర్యాదు దాఖలైతే.. చాలా వరకు భారతీయ కంపెనీల బోర్డులు బయటి నుంచి ఓ న్యాయ సేవల సంస్థ సహకారంతో విచారణ చేసి అస్పష్టంగా ముగించేస్తున్నారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇటువంటి ప్రజావేగు ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో టాప్ టెన్ వాటాదారులు, సమాజంలో ఎంతో గౌరవనీయులైన వ్యక్తులను విచారణలో భాగం చేస్తున్నాయి’’ అంటూ నారాయణ మూర్తి కంపెనీల బోర్డులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల విచారణలో నిజాయితీ అవసరమని గుర్తు చేశారు. -
సీఏఏపై వెనక్కి వెళ్లం
వారణాసి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలపై ఒత్తిళ్లకు తలొగ్గి పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించి తీసుకున్న నిర్ణయాలపై ఎన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా కట్టుబడే ఉంటామని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆదివారం రోజంతా మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కోల్పోయే ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ నిర్ణయాల కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఈ నిర్ణయాలపై మేము చాలా కచ్చితంగా నిలబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటాం’’అని ప్రధాని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ తమ నిర్ణయానికి కట్టుబడే ఉంటామని గట్టిగా చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఇక వేగవంతం అవుతాయని మోదీ చెప్పారు. మందిర నిర్మాణంపై ఏర్పాటైన ట్రస్ట్‌కి 67 ఎకరాల భూమి అప్పగిస్తున్నామని, పనులు ఇక వాయువేగంతో సాగుతాయన్నారు. రోజంతా బిజీ బిజీ.. అంతకు ముందు ప్రధాని తన సొంత నియోజకవర్గంలో రూ.1,254 కోట్లు విలువ చేసే 50 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎల్తైన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ పథకం తెచ్చారని, ఆయన బాటలో నడుస్తూ చివరి లబ్ధిదారుడికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని మోదీ చెప్పారు. వారణాసిలో అయిదేళ్లలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగు తున్నాయని తెలిపారు. ప్రధాని వారణాసిలో శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 430 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, కాశీ ఏక్ రూప్ అనేక్ పేరుతో ఏర్పాటైన హస్తకళల ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి వీలు కల్పించే ఐఆర్సీటీసీకి చెందిన ప్రైవేటు రైలు మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో శివుడికి ప్రత్యేకంగా ఓ సీటు రిజర్వ్ చేశారు. ఎవరూ కూర్చోకుండా అది శివుడిదని తెలిసేలా బీ5 కోచ్‌లోని 64వ సీటును శివుడికి కేటాయించినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఈ సీటు కేవలం ఒక్కసారికేనా లేక శాశ్వతంగా ఉంటుందా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
సాగు బడ్జెట్ రెట్టింపు చేశాం
న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా 2014–19 మధ్యకాలంలో వ్యవసాయ రంగానికి రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వం కేటాయించినదానికి రెట్టింపు మొత్తమన్నారు. దేశానికి ఆహార భద్రతను కల్పించిన ఘనత పూర్తిగా రైతులదేనని ప్రధాని ప్రశంసించారు. అయితే గతంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారయిందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన కీలక పథకాలపై ఆయా లబ్ధిదారులతో మోదీ సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం దాదాపు 600 జిల్లాల్లోని పలువురు రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పగానే చాలామంది మమ్మల్ని వేళాకోళం చేశారు. అది సాధ్యమయ్యే పనికాదని పెదవి విరిచారు. వాళ్లు వినాశకరమైన వాతావరణాన్ని దేశంలో సృష్టించారు. కానీ రైతన్నలపై నాకున్న విశ్వాసమే ఈ విషయంలో ముందుకు వెళ్లేలా చేసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఓ విస్తృతమైన, సమతౌల్య విధానం ఆధారంగా రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నీరు, విద్యుత్‌ను అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నాం. వాటిలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధర అందించడం, కోత తర్వాత పంట నష్టపోకుండా చర్యలు తీసుకోవడం, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల్ని కల్పించడం ఉన్నాయి’ అని ప్రధాని చెప్పారు. నాడు రూ.1.21 లక్షల కోట్లే... యూపీఏ–2 హయాంలో ఐదేళ్లలో వ్యవసాయానికి రూ.1.21 లక్షల కోట్లు కేటాయిస్తే.. 2014–19 కాలంలో వ్యవసాయ రంగానికి రెట్టింపు మొత్తాన్ని అంటే రూ.2.12 లక్షల కోట్లను కేటాయించామని మోదీ వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో భాగంగా చేపలు, తేనెటీగల పెంపకం, పశుపోషణ వంటి ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించామని మోదీ అన్నారు. తొలుత ఏ పొలంలో ఏ ఎరువులు వాడాలో తెలుసుకునేందుకు వీలుగా 12.5 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల్ని జారీచేశామని చెప్పారు. ఆ తర్వాత నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. యూరియాకు వేపపూత వేయడం ద్వారా ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిరోధించామన్నారు. దళారుల బెడద లేకుండా పంట ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్లో లాభసాటి ధరలకు అమ్ముకునేందుకు వీలుగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘ఈ–నామ్’ను ఆవిష్కరించామని మోదీ పేర్కొన్నారు. అలాగే దాదాపు 22,000 గ్రామీణ మార్కెట్లను హోల్‌సేల్ మార్కెట్లతో అనుసంధానం చేశామని చెప్పారు. -
ఆధార్ నమోదుకు... 18,000 కేంద్రాలు ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ ఐడీ అప్డేషన్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది. ‘‘బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,000 చోట్ల ఈ సదుపాయం కల్పించారు. మిగిలిన చోట్ల కూడా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి’’ అని పాండే తెలిపారు. మొత్తం మీద 26,000 కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఖాతాలకు ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ కోరడం గమనార్హం. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 13,800 శాఖల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,000 శాఖల్లో ఇవి ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇక 13,000 పోస్టాఫీసులకు గాను 8,000 శాఖల్లో వీటిని ఏర్పాటు చేశారు’’ అని పాండే వివరించారు. లక్ష్యం మేరకు మిగిలినవి ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ విషయంలో కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు. -
భగీరథ విలక్షణమైన రచయిత
‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు. ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు. -
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
అది ముంబైలోని బాంద్రా ప్రాంతం... నిర్మాణంలో ఉన్న మెట్రో వద్ద రాత్రివేళ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో అక్కడో కారు ఆగింది... అందులోంచి తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ వేసుకున్న వ్యక్తి దిగాడు... నేరుగా యువకుల వద్దకు వచ్చి కరచాలనం చేశాడు... ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యంలో ఉండగానే వారి నుంచి బ్యాట్ తీసుకుని తనదైన శైలిలో ఐదు బంతులు ఆడాడు... సెల్ఫీలు దిగాడు. ఇంతలో జనం పోగవసాగారు. దీంతో ఆ ‘క్రికెట్ దేవుడు’ మాయమైపోయాడు. ఇప్పటికే అర్థమైందిగా వచ్చింది ఎవరనేది? అవును...! ఆ వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఈ మేరకు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
శ్రీదేవి: ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై వారం రోజులుగా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. తన స్నేహితుని వద్ద శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనే విషయంపై పెదవి విప్పారు. తాను సడెన్‌గా దుబాయ్ వెళ్లడం.. అక్కడ శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడం.. ఇద్దరం కలసి గడపడం.. చివరిగా బాత్రూమ్లో శ్రీదేవిని విగతజీవిగా చూడటం.. ఇలా ఫిబ్రవరి 24న సాయంత్రం జరిగిన ప్రతి విషయాన్ని బోనీ తన స్నేహితుడు, ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాకు పూసగుచ్చినట్టు వివరించారు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణలను యథాతథంగా కోమల్ తన బ్లాగ్‌లో రాసి ఆ తర్వాత దానిని అధికారిక ట్వీటర్ పేజీలో షేర్ చేశారు. ఒంటరితనమంటే ఆమెకు భయం.. కోమల్ బ్లాగ్‌లో షేర్ చేసిన ప్రకారం(బోనీ కోణం నుంచి).. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనేది ఆమె భయం. గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది. ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని రూమ్ నంబర్ 2201లో శ్రీదేవి రిలాక్స్ అవుతూ.. జాన్వీ కోసం షాపింగ్ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విమాన టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ వద్ద శ్రీదేవిని సర్ప్రైజ్ చేశాను. ఇద్దరం 15 నిమిషాలు గడిపాం. అనంతరం నేను ఫ్రెషప్ అయి.. రొమాంటిక్ డిన్నర్‌కు వెళదామని ప్రతిపాదించాను. దీనికి ఓకే అన్న శ్రీదేవి.. స్నానానికి వెళ్లింది.శ్రీదేవి మాస్టర్ బాత్రూమ్కు వెళ్లింది. లివింగ్ రూమ్‌కు వచ్చిన నేను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్లో రష్ పెరిగిపోతు0దనే ఉద్దేశంతో లివింగ్ రూమ్ నుంచే రెండుసార్లు బిగ్గరగా శ్రీదేవిని పిలిచినా పలక లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచినా స్పందన లేదు. దీంతో బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్ తీయకపో వడం.. లోపలి నుంచి ట్యాప్ అన్ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపల బోల్ట్ పెట్టకపోవడంతో డోర్ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్ట బ్లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. షాక్‌కు గురై ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపో యింది. శ్రీదేవిని బోనీ సర్ప్రైజ్ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్ అంచనా వేశారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవని, ఎందుకంటే బాత్‌టబ్ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం సాక్షి, చెన్నై: ప్రముఖ నటి శ్రీదేవి అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రామేశ్వరం వద్ద సముద్రంలో కలిపారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోయి శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి ముంబైలో ఫిబ్రవరి 28న అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని దహనం చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అనంతరం ఈసీఆర్‌లోని శ్రీదేవి ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం ఉదయాన్నే పూజలు నిర్వహించిన తర్వాత రామేశ్వరానికి వెళ్లి అక్కడి సముద్రతీరంలోని అగ్నితీర్థంలో శ్రీదేవి అస్థికలను బోనీకపూర్ కలిపారు. -
నేను చెప్పిన వారికి ఇవ్వాల్సిందే!
– జెన్కో థర్మల్ ప్లాంటు సబ్ కాంట్రాక్టులపై మంత్రి ఒత్తిళ్లు – లేనిపక్షంలో పనులు ప్రారంభం కానివ్వనని హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నేను చెప్పిన వారికే పనులు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా మీ ఇష్టానుసారం చేస్తామంటే ఇక్కడ కుదరదు. నేను చెప్పిన వారికి సబ్ కాంట్రాక్టులు ఇవ్వకపోతే మీరు పనులెలా చేస్తారో అదీ చూస్తాను.. ఇదేదో ఒక ప్రైవేటు వ్యక్తి చేస్తున్న బెదిరింపులు కాదు. స్వయంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న అధికార పార్టీకి చెందిన మంత్రి ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధులను పిలిచి మరీ చేస్తున్న హెచ్చరికలు. విజయవాడకు సమీపంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(ఏపీజెన్కో) కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్) పనులను చేపడుతోంది. ఇందుకు సంబంధించి బాయిలర్, టర్బైన్, జనరేటర్(బీటీజీ) పనులను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ దక్కించుకుంది. ఇక మిగిలిన బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంటు(బీవోటీ) పనులను ప్రైవేటు సంస్థ బీజీఆర్ ఎనర్జీ దక్కించుకుంది. వాస్తవానికి ఈ పనుల అప్పగింతపై అనేక ఆరోపణలు వినిపించాయి. వాస్తవ ధర కంటే అధిక ధరకు పనులు కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ పనులను దక్కించుకున్న సదరు ప్రైవేటు సంస్థకు అధికారపార్టీకి చెందిన మంత్రి నుంచి ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా సబ్ కాంట్రాక్టులు మీరే అప్పగిస్తామంటే కుదరదని హెచ్చరిస్తున్నారు. అంతా మీ ఇష్టమేనా? వాస్తవానికి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటు పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనేక రకాల ఆరోపణలు.. ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదాలతో పనుల అప్పగింత ఆలస్యమయ్యింది. తీరా పనులు అప్పగించిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ మంత్రి పనుల ప్రారంభానికి మోకాలడ్డుతున్నారు. పనులకు సంబంధించి సాయిల్ టెస్టుతో పాటు డ్రాయింగ్ పనులను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో బీవోటీలో భాగమైన చుట్టూ ప్రహరీగోడ, యాష్ పాండ్ తదితర కొన్ని పనులను సదరు ప్రైవేటు సంస్థ ఇప్పటికే ఇతర కంపెనీలకు అప్పగించింది. అయితే, తనకు తెలియకుండా మీకు మీరుగానే పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఎలా అని మంత్రి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. తాను చెప్పిన వారికే సబ్‌కాంట్రాక్టు పనులు అప్పగించాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇందుకు భిన్నంగా జరిగితే పనులు చేయలేరని హెచ్చరికలు కూడా జారీచేశారు. సీఎంకు ఫిర్యాదు చేద్దామా? వాస్తవానికి సదరు మంత్రి ఒత్తిళ్ల గురించి ఇప్పటికే జెన్కో ఉన్నతాధికారులకు ప్రైవేటు సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టికి మొత్తం వ్యవహారం తీసుకెళదామా? వద్దా అని సదరు సంస్థ ఆలోచిస్తోంది. తీరా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోతే అనవసరంగా మంత్రి దృష్టిలో నిష్టూరం కావాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు భయాందోళన చెందుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రిని సీఎం కట్టడి చేసే అవకాశం లేదని కూడా సమాచారం. మొత్తం మీద అసలు కాంట్రాక్టులో ధరలు పెంచి ముఖ్యనేతలు వాటాలు పంచుకుంటుంటే... సబ్ కాంట్రాక్టులో మంత్రులు వాటాలు దండుకునేందుకు సిద్ధమయ్యారన్నమాట. -
బాల డైరెక్షన్లో విక్రమ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు విక్రమ్. ప్రస్తుతం కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్రమ్, త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనకు నటుడిగా ప్రూవ్ చేసుకునే చిత్రాలను అందించిన క్రియేటివ్ డైరెక్టర్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న విక్రమ్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. శంకర్ దర్శకత్వలో భారీగా తెరకెక్కిన 'ఐ' నిరాశపరచటంతో పాటు ఇటీవల విడుదలైన ట్రావెల్ డ్రామా 'టెన్ ఎన్నాదుకుల్లా' కూడా ఆశించిన స్ధాయి ఫలితం ఇవ్వలేదు. దీంతో మరోసారి తన కెరీర్‌ను మలుపు తిప్పిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు విక్రమ్. కెరీర్ స్టార్టింగ్‌లో విక్రమ్‌కి 'సేతు', 'పితామగన్' లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలను అందించిన బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విక్రమ్. ప్రస్తుతం అరిమనంభి ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విక్రమ్ ఆ సినిమా పూర్తవ్వగానే బాల సినిమాలో నటించనున్నాడు. బాల కూడా ప్రస్తుతం 'తారై తప్పటై' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే విక్రమ్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది. -
ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్
సౌత్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ మీద ఒక అపవాదు ఉంది. శంకర్ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన తారలకు తరువాత కెరీర్ కష్టాల్లో పడినట్టే అని ఫీల్ అవుతారు సినీ అభిమానులు. ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. 'అపరిచితుడు' సినిమా తరువాత సదా, 'శివాజీ' తరువాత శ్రియ, 'స్నేహితుడు' అనంతరం ఇలియానా అవకాశాలు లేక ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ఈ ఇమేజ్ ను బ్రేక్ చేస్తోంది ఓ లండన్ బ్యూటి. శంకర్ రీసెంట్ సినిమా 'ఐ' లో హీరోయిన్ గా నటించిన అమీజాక్సన్, ఆ సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అమీ కోలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టడానికి రెడీ అవుతోంది. అజిత్, ధనుష్, సూర్య, విశాల్ ఇలా ఫాంలో ఉన్న కోలీవుడ్ హీరోలందరూ అమీతో నటించడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంత మంది క్యూలో ఉండగానే తాజాగా శివకార్తికేయతో ఓ సినిమాకు డేట్స్ ఇచ్చేసింది ఈ భామ. ఈ జోరు చూస్తుంటే హీరోయిన్ల విషయంలో శంకర్ సినిమాల సెంటిమెంట్ బ్రేక్ అయినట్టే అంటున్నారు అభిమానులు. -
కష్టే ఫలి అంటున్న విక్రమ్..!
-
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్?
నటుడు విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. విక్రమ్ ఐ చిత్రంతోను, గౌతమ్‌మీనన్ ఎన్నై అరిందాల్ చిత్రంతోను విజయాలను సాధించి మంచి జోష్‌లో ఉన్నారు. అలాంటివీరిద్దరి కలయికలో చిత్రం అంటే ఆ చిత్రం క్రేజ్ ఏ లెవల్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గౌతమ్‌మీనన్ ఇటీవల విక్రమ్‌ను కలిసి కథ చెప్పినట్లు ఆ కథ ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వీరి కాంబినేషన్లో చిత్రం రావడం ఖాయం అనేది కోలీవుడ్ టాక్. ప్రస్తుతం విక్రమ్, విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సమంత నాయకిగా నటించిన ఈ చిత్రం మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఎన్నై అరిందాల్ తరువాత గౌతమ్ మీనన్, ఆగిన శింబు చిత్రం బూజు దులపడానికి సిద్ధం అయ్యారని సమాచారం. ఎన్నై అరిందాల్ చిత్రానికి ముందు శింబు హీరోగా సట్టైండ్రు మరుదు వానిలై అనే చిత్రాన్ని ప్రారంభించారు. సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నిలిపేసి అజిత్ హీరోగా ఎన్నై అరిందాల్ చిత్రం చేశారు. ఇప్పుడు శింబు చిత్రానికి అచ్చం ఎన్భదు ముడయమరాగా పేరు మార్చి పూర్తి చే యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో పల్లవిసుభాష్ కథా నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి విక్రమ్ చిత్రాన్ని హ్యాండిల్ చేయాలని గౌతమ్ మీనన్ భావిస్తున్నట్లు సమాచారం. -
అంతకు మించి...ఐ లవ్ యు
సినోయెమ్ సౌందర్యంతో కాలుస్తావో మోహపు మంట ఎగదోస్తావో విరహపు చింత రగిలిస్తావో అంతకు మించి ప్రేమించి బూడిదే చేస్తావో ప్రియురాలా! ఐ లవ్ యు రంగుల కళల్ని కళ్లలో జల్లుతావో రసాత్మకమైన వాక్యపు దండకే గుచ్చుతావో పారవశ్యపు నాట్యభంగిమ కిందే నలిపేస్తావో రాగసాగర దీవిలో ఒంటరిగా వదిలిపెడతావో అంతకు మించి జీవించడమే అసలైన కళ అని కణకణానికీ ఇంజెక్ట్ చేస్తావో సృజనశీలా! ఐ అడ్మైర్ యు మరింత మాయ చేస్తావో మరో లోయలోకి మళ్లీ తోస్తావో అంతకు మించి కుట్రతో హృదయాన్ని పదవీచ్యుతుణ్ని చేసి లోపలి ప్రపంచానికి నువ్వే రాజువవుతావో మనసా! ఐ అబ్జర్వ్ యు జీవితపు కషాయాన్ని తాగిస్తావో నిర్జీవ క్షణాలముందు దోషిగా నిలబెడతావో నన్ను చూసి నేనే నవ్వుకోలేకపోయిన రోజుల్ని వెక్కిరిస్తావో అంతకు మించి అకారణ ఆనందాన్ని యావజ్జీవం విధిస్తావో తాత్వికుడా! ఐ ఇన్వైట్ యు అనంతరం ఆకాశానికే అప్పగిస్తావో దాని అవతలికే విసిరేస్తావో అంతకు మించి విశాల విశ్వంలో మానవుడి నూరేళ్ల అల్పాయుష్షుని గుర్తుచేసి హఠాత్తుగా కలవరపెడతావో మృత్యువా! ఐ రిమెంబర్ యు (‘అంతకు మించి’... శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’లోని అతి ముఖ్యమైన డైలాగ్. ఆ డైలాగ్ సృష్టికర్తకు ఈ యాంటీవైరస్ కవిత అంకితం.) -
అందుకే...56తో ఆపేశా : విక్రమ్
‘‘సినిమా అంటే నాకు ఇష్టం అనేకన్నా, పిచ్చి అంటే సబబు. అందుకే, సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా నేను రెడీ అయిపోతా’’ అని చెప్పారు విక్రమ్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా విక్రమ్, అమీ జాక్సన్ హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటించారు. తొలుత విక్రమ్ మాట్లాడుతూ -‘‘చూసినవాళ్లందరూ బాగుందంటున్నారు. కొంతమంది క్రిటిక్స్, సినిమా పరిశ్రమకు చెందినవాళ్ల స్పందన వేరే విధంగా ఉంది. అయినా ప్రేక్షకులు బాగా చూస్తున్నారు కాబట్టి, రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఒకవేళ చెత్త సినిమా అయితే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు? సినిమాలో సందేశం లేదంటున్నారు. కానీ, ప్రేమకు అందంతో పని లేదన్నది సందేశమే కదా. అయినా శంకర్ సినిమా అంటే సందేశం ఉండి తీరాల్సిందే అనుకోవడం సబబు కాదు’’ అన్నారు. ఈ చిత్రంలో బాడీ బిల్డర్‌గా, మోడల్‌గా, గూనివాడిగా కనిపించడానికి మీరు చేసిన కసరత్తులు గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు -‘‘బాడీ బిల్డింగ్ కోసం మామూలుగా ఏడాది పడుతుంది. కానీ, నేను ఐదు నెలల్లోనే చేశాను. అలాగే, స్లిమ్ లుక్ కోసం చాలా కసరత్తులు చేశాను. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టేద్దాం అని శంకర్ అన్నప్పటికీ, నేను వినకుండా 56 కిలోల బరువుకు చేరుకున్నాను. ఇంకో ఆరు కిలోలు తగ్గుతానంటే, ‘శరీరం అనేది ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని పదిలంగా కాపాడుకోవాలి. ఇంతకన్నా బరువు తగ్గితే అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది’ అని డాక్టర్ హెచ్చరించారు. అందుకే 56తో ఆపాను. దాదాపు ఎనిమిది నెలల పాటు సరైన తిండి తినలేదు. ఇంట్లో అయితే మా ఆవిడ బిర్యానీ చేసినప్పుడల్లా తెగ బాధపడేది. జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకునేవాణ్ణి. ఒకానొక దశలో కొంచెం బాధగానే అనిపించింది. కానీ, సినిమా మీద ఉన్న ప్రేమ ఆ బాధను అధిగమించేసింది’’ అన్నారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించడంవల్ల చాలా సినిమాలు వదులుకుని ఉంటారు కదా? అనడిగితే ‘‘అవును. ఈ మూడేళ్లల్లో ఓ ఆరు సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ‘ఐ’లాంటి అద్భుతమైన సినిమా కోసం ఆరు చెత్త సినిమాలు వదులుకున్నానని సరిపెట్టుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రం నటిగా తన అభివృద్ధికి ఉపయోగపడిందని అమీ చెబుతూ -‘‘ఇప్పటి వరకు ఏ సినిమాకీ అందుకోనన్ని అభినందనలు ఈ చిత్రానికి అందుకున్నాను. నా పాత్రకు కూడా నటనకు అవకాశం ఉండటంతో సంతృప్తిగా ఉంది’’ అన్నారు. ‘ఎవడు’ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయనీ, అయితే అవి పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో అంగీకరించలేదనీ, ఒకవేళ మంచి అవకాశాలు వస్తే తెలుగులో తప్పకుండా చేస్తాననీ అమీ చెప్పారు. -
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లో 'ఐ' వివాదం
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్ కాంబినేషన్లో వచ్చే 'ఐ' సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మాతగా 180 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సినీ దిగ్గజాలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ రిలీజ్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం సంక్రాతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నిరాశపరిచే విధంగా ఉండనుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం పండగ సమయాల్లో కేవలం డైరెక్ట్ తెలుగు చిత్రాలనే విడుదల చేయాలి. 'ఐ' డబ్బింగ్ మూవీ కావడంతో దానీ విడుదలను వాయిదా వెయ్యాలని ఛాంబర్లో పెద్ద వివాదమే చెలరేగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే గోపాల గోపాల, టెంపర్, రుద్రమదేవి వంటి భారీ చిత్రాలు సంక్రాతి బరిలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో 'ఐ' కూడా విడుదలైతే థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి 'ఐ' సినిమా చూసే అవకాశం ఉండదు. -
9న తెరపైకి ఐ
భారతీయ సినిమానే కాకుండా, ప్రపంచ సినిమా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఐ. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్, భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ల కాంబినేషన్లో వైవిధ్యం కోసం తపించే విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడమే ఈ చిత్రానికి అంత క్రేజ్. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీత బానీలను అందించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన తర్వాత చిత్రంపై మరింత ఉత్సుకత రేకెత్తిస్తున్నది. విషయం ఏమిటంటే చిత్ర నిర్మాణం పూర్తి అయినా, ఇంకా తెరపైకి రాక పోవడంతో చిత్రంపై మరింత చర్చ జరుగుతోంది. ఐ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల అవుతుందని ప్రచారం సాగింది. అయితే, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికాక పోవడంతో చిత్రం విడుదలను రెండు మూడు సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ వెల్లడించింది. సంక్రాంతి బరిలో ఇప్పటికే అజిత్ నటించిన ఎన్నై అరిందాల్, విశాల్ నటించి ఆంబళ చిత్రాలతోపాటుగా తాజాగా కార్తీ నటించి కొంభన్ చిత్రం కూడా రెడీ అవుతుండడంతో ఐ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఐ చిత్రం జనవరి 9న కచ్చితంగా వచ్చి తీరుతుందని ఆ చిత్ర ఛాయా గ్రహకుడు పీసీ శ్రీరాం తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. -
శంకర్ ‘ఐ’ విడుదల తేదీ ఖరారు
శంకర్ ల భారీ చిత్రం 'ఐ' . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి రాదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని ప్రకటించారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది. 'ఐ'లో విక్రమ్ సరసన అమీ జాక్సన్ నటించింది. శంకర్ దర్శకత్వం వహించారు. ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్.బి.చౌదరి సమర్పకుడు. ప్రచార చిత్రంలో విక్రమ్ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. -
'ఐ' సినిమా.. భయపెడ్తోంది..!
-
మేకింగ్ ఆఫ్ మూవీ - ఐ
-
నువ్వు-నేను
విజయ్, స్వాతి "great marriage is not when the "perfect couple" comes together. It is when an imperfect couple learns to enjoy their differences' అని డేవ్ మ్యూరర్ చెప్పిన మాటకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ జంట! అమ్మాయి స్వాతి.. చిత్రకారిణి, అబ్బాయి.. విజయ్.. అప్లయ్డ్ ఆర్ట్‌లో దిట్ట! పెళ్లికి ముందు అనుకున్న సామ్యాలు పెళ్లి తర్వాత భేదాలుగా కనిపించినా.. వాటినే తమను కలిపి ఉంచే వారధిగా మలచుకున్న అనుబంధం వీళ్లది. ఆ ఆలుమగల ముచ్చట్లివి.. ‘మసాబ్‌ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో మేమిద్దరం బ్యాచ్మేట్స్మి. ఏడాది పరిచయం ప్లస్ స్నేహం తర్వాత ఇద్దరికీ చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉందని తెలిసింది’ అని తమ లవ్‌స్టోరీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది స్వాతి. ‘పెళ్లి ప్రపోజల్ పెట్టింది తనే’ అన్నాడు విజయ్‌కుమార్. ‘అలా చేసింది ఆయనే’ అందుకుంది స్వాతి వెంటనే. ఇలా మూడుముళ్లతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఏకాభిప్రాయం కొనసాగుతుందా? ‘లేదు. పెళ్లికి ముందు ఎంత సిమిలారిటీస్ ఉన్నాయనుకున్నామో పెళ్లి తర్వాత అంత రివర్స్ అని తేలింది’ అన్నది విజయ్ వైపు చూస్తూ స్వాతి. ‘ఈ ఆరేళ్లుగా భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం’ నవ్వుతూ విజయ్. ‘నిజమే.. ఇలా డిఫరెంట్‌గా ఉండడం వల్లే మా మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది’ ఒప్పుకుంటుంది స్వాతి. ఏ విషయాల్లో డిఫర్ అవుతారు? ‘మా ఇద్దరికీ ప్రొషెషనల్ లైఫే.. అసలు పెళ్లికి ముందు నుంచే కలసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. ఇల్లు, డబ్బు, నగలు, షాపింగ్ ఇందులో ఏకాభిప్రాయమే. మేం కలిసుండేది, గొడవపడేది ప్రొఫెషనల్ లైఫ్‌లోనే’ అన్న స్వాతి మాటలను కంటిన్యూ చేస్తూ ‘తను చాలా కూల్ పర్సన్. నేనేమో అగ్రెసివ్‌గా.. డైనమిక్‌గా ఉంటాను. ఇదే గొడవకు మూలం అవుతుంద’ని విజయ్ చెప్పాడు. ‘ఆర్ట్‌కి సంబంధించి సామాజిక అంశాలనే ఎంచుకుంటాం. ఇద్దరి ఇంట్రెస్ట్ ఒక్కటే ఎటొచ్చి ప్రెజెంటేషన్‌లో తేడా. తనేమో కాన్సెప్ట్ మీద ఆలోచిస్తే నేను ప్రాసెస్ మీద వర్క్ చేస్తాను. ఏం చూశామో ఉన్నది ఉన్నట్టు అలాగే ప్రెజెంట్ చేయాలంటాడు. కాస్త సాఫ్ట్‌గా ప్రెజెంట్ చేయాలంటాను నేను. ఇదే గొడవలకు మూలం అవుతుంది’ అని స్వాతి చెప్తుంటే.. ‘లేదులే.. తనకి భయం ఎక్కువ. దేన్నయినా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు అనుకునే నైజం’అని విజయ్ ముక్తాయింపు ఇస్తుంటే ‘అవును మరి.. ఏమైనా తర్వాత చూసుకుందాం.. ముందు అనుకున్నది చేసేద్దామనే దూకుడు, ధైర్యం నాకు లేదు. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం సఫర్ కావాల్సిందే కదా...’అని స్వాతి సమర్థించుకుంటుంటే ‘అందుకే వెనక్కి లాగుతూ ఉంటుంది’ అన్నాడు విజయ్. సముదాయింపు ఎలా.. ‘చర్చించుకునే’ అన్నారిద్దరూ ఒకేసారి. ‘వర్క్ అవ్వాలి కాబట్టి త్వరగానే కన్విన్స్ అవుతాం’ చెప్పాడు విజయ్. ‘వర్క్ విషయంలో నాదే పైచేయి. తనే కన్విన్స్ అవుతాడు’ అంది స్వాతి విజయగర్వంతో. ‘ఇద్దరి శ్రేయస్సు ఆలోచిస్తుంది. కాబట్టి తను చెప్పిందాట్లో మంచే ఉంటుంది’ ఒప్పుకున్నాడు విజయ్. ‘ఒక్కోసారి తన ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నానేమో అనిపిస్తుంటుంది. పెయింటింగ్ ఫీల్డ్‌లో విజయ్ ఉండి ఉంటే ఇప్పటికి ఎక్కడో ఉండేవాడు’ నిజాయితీగా చెప్తుంది స్వాతి. ‘మేమిద్దరం విడివిడిగా ఎటూ వెళ్లిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి.. అలా ఓ రెండు గంటలు ఒంటరిగా ఉండాల్సి వస్తే విజయ్ ఉంటే బాగుండు అనుకుంటాను’ అని స్వాతి అంటుంటే ‘అసలు స్వాతి లేనిదే నేను ఎటూ వెళ్లను’ చెప్తాడు విజయ్. నచ్చినవి.. ‘స్వాతి చాలా హానెస్ట్. క్లిస్టర్ క్లియర్ క్లారిటీ ఉంటుంది. నేనలా ఉండను’ విజయ్. ‘నేను పిరికిదాన్ని’స్వాతి. ‘ప్రతి విషయంలో నన్ను కరెక్ట్ చేస్తుందనే భరోసా.. డిపెండెన్సీ నాది’ అని విజయ్ అంటుంటే ‘ఏమైనా చూసుకుంటాడనే ధైర్యం నాకుంటుంది’ అని స్వాతి.. ఇద్దరూ తమ అనుబంధం విలువ చెప్పకనే చెప్పారు. భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని చాటారు. ..:: సరస్వతి రమ -
విక్రమ్ 'ఐ' మూవీ స్టిల్స్
-
శంకర్ 'ఐ' చిత్రం స్టిల్స్
-
'ఐ'య్యారే.. అనిపించేలా..!!
-
శంకర్ 'ఐ' చిత్రానికి యూట్యూబ్‌లో 25లక్షల హిట్లు
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'ఐ' చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. అది విడుదలై 24 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే 25 లక్షల హిట్లు దాటిపోయాయి. ఇప్పటివరకు తాము విడుదల చేసిన ఏ ట్రైలర్కూ ఇంత భారీ ఆదరణ చూడలేదని, సినిమా పరిశ్రమలోనే ఇది సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సోనీ మ్యూజిక్ ఇండియా దక్షిణ భారత విభాగం అధిపతి అశోక్ పర్వానీ చెప్పారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దాదాపు రూ. 150 కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. ఇందులో అమీ జాక్సన్, ఉపేన్ పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే చెన్నైలో ఆవిష్కరించడం, దానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ హాజరు కావడం తెలిసిందే. -
ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్‌లో ఆరు గంటలు
హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ దక్షిణాది వంటకాలపై మనసు పారేసుకున్నాడు. ఇడ్లీ, దోశ, పొంగల్ వరుసగా లాగించేసి...వాటిని అరిగించుకోవటానికి సుమారు ఆరుగంటలు జిమ్‌లో కసరత్తు చేశాడు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఫంక్షన్‌కు చెన్నై వచ్చిన ష్వార్జ్ నెగర్...కాంటినెంటల్ వంటకాల్ని కాదని, అడిగి మరీ ఇడ్లీ, దోశ, పొంగల్‌ను ఇష్టంగా ఆరగించాడు. ఆ తర్వాత చెమటలు కక్కేలా ఆరు గంటలు వర్క్ అవుట్ చేశాడట. అంతేకాకుండా ష్వార్జ్ నెగర్ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుపై కూడా మనసు పడ్డాడట. ఈవిషయాన్ని 'ఐ' చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిందుకు ష్వార్జ్ నెగర్ పంచెకట్టులో వెళదామనుకున్నా... సమయం సరిపోనందున 'అమ్మ'ను సూట్‌లోనే కలిసినట్లు రవిచంద్రన్ తెలిపాడు. 'ష్వార్జ్ నెగర్ 3.30కి లాండ్ అయ్యాడు. 5.30కి బ్రేక్ ఫాస్ట్ చేశాడు...ఆ తర్వాత జిమ్‌లో ఆరు గంటలు గడిపాడు' . ఫిట్‌నెస్‌పై ష్వార్జ్ నెగర్కి ఉన్న అంకిత భావం చూసి చిత్ర యూనిట్ స్టన్ అయ్యారట. ఆరు పదులు వయసు దాటినా ష్వార్జ్ నెగర్ ఇప్పటికీ కుర్రాడిలా షూటింగ్లో ఫైట్స్ చేస్తూ కాళ్లు చేతులకు గాయాలు తగలించుకోవటం అలవాటే. -
నా కెరీర్లోనే భారీ చిత్రం ‘ఐ’
నా కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం ‘ఐ’ అని అంటోంది లండన్ బ్యూటీ ఎమి జాక్సన్. కోలీవుడ్‌లో తొలి చిత్రం మదరాసు పట్టణం చిత్రం మినహా ఈ అమ్మడు నటించిన ఏ చిత్రమూ ఆశించిన విజయం సాధించలేదు. బాలీవుడ్ రంగ ప్రవేశం నిరాశ పరిచింది. అయినా ఎమి జాక్సన్‌కు అవకాశాలు క్యూ కట్టడం విశేషం. అంతేకాకుండా శంకర్ లాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ ముద్దు గుమ్మకు అదృష్టమనే చెప్పాలి. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భారీ చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఆస్కార్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ‘ఐ’చిత్ర హీరోయిన్ ఎమిజాక్సన్ మనోగతం,ఆమె మాటల్లోనే.. ఐ చిత్రం నా కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా నిచిపోతుంది. దీనికి నేను రెండేళ్లు పని చేశాను. పనిచేసిన రోజులను చాలా విలువైనవిగా భావిస్తాను. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. ఐ చిత్రం వెనుక పి.సి శ్రీరామ్ వంటి ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు ఉండటం చాలా లక్కీ. ఆయన సృజనాత్మకత ప్రతి సన్నివేశంలోనూ వెల్లడవుతుంది. ఇక ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం వండర్ఫుల్, దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా వివరించేవారు. ఐ చిత్రం షూటింగ్ 25 శాతం చైనాలో నిర్వహించారు. చిత్ర హీరో విక్రమ్ అత్యుద్భుతంగా నటించారు. ఆయన మల్టిఫుల్ గెటప్ ఆశ్చర్యపరుస్తాయి. నేనిందులో మోడల్‌గా నటించాను. చిత్రకథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. రొమాంటిక్ కామెడీతో పాటు సస్పెన్స్‌తో కూడిన పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం ఐ అని సెలవిచ్చింది. ఐ చిత్రం తర్వాత ఈ అమ్మడి క్రేజ్ ఎంతగా పెరుగుతుందో! -
శంకర్ ”ఐ” సినిమా టీజర్
-
సంచలనం రేపుతున్న 'ఐ' టీజర్!
సంచలన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు ఓ సంచనల విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఆదే కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన 'ఐ' చిత్రం సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. షూటింగ్ సమయంలోనే ఎన్నో విశేషాలకు తెరతీసిన 'ఐ' చిత్రం మరో ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ఇంటర్నెట్ లో హల్ చల్ రేపుతోంది. 'ఐ' టీజర్ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం మరిన్ని సంచలనాలకు వేదిక కావడంలో ఇలాంటి సందేహం అక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఐ చిత్ర యూనిట్‌కు షాక్
ఐ చిత్ర యూనిట్‌కు షాక్తగిలింది. ఈ సంఘటన ఇటీవల జరిగింది. సియాన్ విక్రమ్ నోరు కుట్టుకుని, కడుపు మాడ్చుకుని ఒళ్లు తగ్గి మళ్లీ కడుపు నింపుకుని అందరూ అచ్చెరుచెందేలా దేహం పెంచుకుని ఇలా అహర్నిశలు శ్రమించి నటించిన చిత్రం ఐ. లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా సుమారు 180 కోట్ల వ్యయంతో నిర్మించిన చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ ఒక తపస్సులా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా శంకర్ తన చిత్రానికి సంబంధించిన విషయాలను నిర్మాణ దశలో అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికి ఈ చిత్ర కథేమిటో చిత్రానికి పనిచేసిన అతి కొద్దిమందికి మినహా ఎవరికీ తెలియదన్నది అతిశయోక్తి కాదు. ఐ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన ఒకటి, లేదా రెండు స్టిల్స్ మాత్రమే బయటకొచ్చాయంటే దర్శకుడు ఎంత కట్టడి చేస్తున్నారో అర్థమవుతుంది. అలాంటిది ఐ చిత్రం టీజర్ సోషల్ నెట్వర్స్ సైట్స్‌లో హల్చల్ చేయడం విశేషం. ఇది నిజంగా ఆ చిత్ర యూనిట్‌కు షాక్‌నిచ్చే సంఘటనే. చిత్ర యూనిట్ ఇటీవల చిత్ర ప్రచార చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు చూపించారు. మరి వాళ్లల్లో ఎవరు ఐ చిత్ర టీజర్‌ను ఎలా లీక్ చేసుంటారు? ఏమో? అయితే ఈ టీజర్ క్లియర్‌గా కాకుండా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
డైరెక్టర్ శంకర్ రికార్డ్!
దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీబడ్జెట్తో రూపొందించిన తమిళ చిత్రం 'ఐ' తెలుగులో 'మనోహరుడు'గా వస్తోంది. దక్షిణాదిన అన్ని అంశాలలో ఈ సినిమా సంచలనం సృష్టించనుంది. దాదాపు 180 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించినట్లు సమాచారం. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా, విక్రమ్ హీరోగా, సూపర్ డైరెక్టర్ శంకర్ మూడేళ్లపాటు శ్రమించి దీనిని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. శంకర్ అంటే చెప్పేదేముంది. ఆయనే ఓ సంచలనం. ఆయన చిత్రాలు మరో సంచలనం ఈ విషయం అనేకసార్లు రుజువైంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందర్భంగా 15 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాణ వ్యయంలోనే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అత్యధికంగా 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని రికార్డు సృష్టించినట్లు కోలీవుడ్ టాక్.ఇంత పారితోషికం దేశంలో ఏ దర్శకుడికి అందలేదు. ఆ రకంగా శంకర్ భారత సినిమా చరిత్రలో రికార్డు సృష్టించినట్లుగా భావిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్మాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాదులో నిర్వహించే తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న 'ఐ' ఆ తరువాత ఎన్ని సంచలనాలు చేస్తోందో!. - శిసూర్య -
ఐ ఆడియో ఆవిష్కరణకు అతిరథులు'
ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణకు సినీ అతిరథ మహారథులు హాజరుకానున్నారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొననుండటం విశేషం. బ్రహ్మాండ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్, స్టార్ దర్శకుడు శంకర్, సియాన్ విక్రమ్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం ఐ. 180 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, చైనీస్, తైవాన్ తదితర భాషల్లో దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ స్వర పరచిన ఈ చిత్ర ఆడియో (తమిళం)ఆవిష్కరణ కార్యకమాన్ని వచ్చే నెల చెన్నైలో నిర్వహించను న్నారు. దీనికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ హాజరు కానున్నారు. హైదరాబాదులో నిర్వహించనున్న తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. తమిళ చిత్ర ఆడియోను ఆర్నాల్డ్ ఆవిష్కరించగా తొలి ప్రతిని తమిళ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్ అందుకోనున్నారన్నది తాజా సమాచారం. -
ఆర్నాల్డ్ వస్తున్నారు!
హాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ తొలిసారిగా ఓ దక్షిణాది సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఆస్కార్ వి. రవిచంద్రన్ నిర్మిస్తోన్న ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఆడియో వేడుక సెప్టెంబర్ 15న భారీ ఎత్తున జరగనుంది. నిర్మాత రవిచంద్రన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రమేశ్‌బాబు ఇటీవలే ఆర్నాల్డ్‌ని కలిసి ‘ఐ’ ప్రచార చిత్రాన్ని చూపిస్తే, ఆయన విజువల్ వండర్ అని ప్రశంసించారట. -
180 కోట్ల శంకర్ మనోహరుడు స్టిల్స్
-
దీపావళికి 180 కోట్ల శంకర్ ‘మనోహరుడు’
దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనానికి ఈ దీపావళి తెర తీయనుంది. తొలిసారిగా ఓ దక్షిణ భారతీయ భాషా సినిమా చైనాలో విడుదల కానుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) ఈ దీపావళికి చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలవుతున్న తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కనుంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ విషయం ఆదివారం నాడు వెల్లడించారు. తెలుగు పత్రికా విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ చిత్రం గురించి తొలిసారిగా అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ విధంగా వెల్లడించారు. 12 గంటలు మేకప్... రిఫ్రిజిరేటర్లో విక్రమ్ ఇప్పటికి రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు సగానికి పైగా ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషిస్తున్నారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందిస్తున్నారు. ‘‘ఈ సినిమా కోసం హీరో విక్రమ్ పడిన శ్రమ, చూపిన అంకితభావం మాటల్లో చెప్పలేనిది. ఒక స్పెషల్ గెటప్ కోసం ఆయనకు మేకప్ చేయడానికే దాదాపు 12 గంటలు పట్టేది. అయినా, ఆయన ఓపిగ్గా ఉండేవారు. మేకప్ వేసిన తరువాత పూర్తి ఏ.సి.లోనే ఆయన ఉండాల్సి వచ్చేది. అందు కోసం దాదాపు పది అడుగుల ఎత్తున్న ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది నిర్మించాం. ఈ గెటప్ కోసం ప్రత్యేకంగా ఆయన 125 కిలోల స్థాయికి బరువు పెరిగారు. తెరపై ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌కు గురి అవుతారు’’ అని రవిచంద్రన్ తెలిపారు. మూడెకరాల సెట్... పాటకు 40 రోజులు... ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక ట్రైలర్‌నూ, ఒక పాటనూ ఆయన విలేకరుల కోసం ప్రత్యేకంగా ముందుగా చూపించారు. హీరో నీళ్ళపై నడిచే ఆశ్చర్యకరమైన దృశ్యాలున్న ఈ సినిమా పాటలు, ఫైట్ల కోసం శంకర్ డబ్బునూ, కాలాన్నీ లెక్కచేయలేదట. ఒక విచిత్రమైన ఘట్టంలో, అపూర్వమైన గెటప్‌తో హీరో వచ్చే ఒక సిట్యుయేషనల్ సాంగ్ కోసం ఏకంగా మూడెకరాల్లో ఒక సెట్ వేసి, 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. అలాగే, చైనాలో తీసిన ఒక సైకిల్ ఫైట్‌కు కూడా దాదాపు 40 రోజులు కష్టపడ్డారు. ‘‘ఈ సినిమా మీద నాకున్న నమ్మకం అపారం. ప్రతి ఘట్టం తెరపై చూడగానే ‘అయ్’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా ఉంటుంది. అందుకే సినిమాకు ‘ఐ’ అని పేరు పెట్టాం’’ అని ఆయన చెప్పారు. చైనా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయికగా అమీ జాక్సన్ నటిస్తున్నారు. భారతీయ ‘జేమ్స్ కామెరూన్’ ‘‘దీన్ని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్ సినిమా అనో, ప్రేమ కథా చిత్రమనో, థ్రిల్లర్ అనో - ఒక గాటన కట్టి చెప్పలేం. రేపు ఈ చిత్రం చూసినప్పుడు నా మాటల్లో నిజం అందరికీ తెలుస్తుంది’’ అని రవిచంద్రన్ పేర్కొన్నారు. ‘‘దాదాపు 285 రోజుల పైగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా మునుపటి ‘అపరిచితుడు’ కన్నా వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో విశేషాలతో, ప్రాణం పెట్టి తీసిన ఈ సాంకేతిక అద్భుతం చూశాక శంకర్‌ను ‘భారతీయ జేమ్స్ కామెరూన్ (ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు)’ అనాలని అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా రావడం ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృప. నన్నడిగితే ఈ భారీ చిత్రానికి నేను కాదు... ఆయనే నిర్మాత’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు జాకీ చాన్... చెన్నైకి ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్! ‘‘సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుతున్నారు. సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేస్తున్నాం’’ అని రవిచంద్రన్ తెలిపారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం తెలుగు ఆడియో రిలీజ్‌కు తన చిరకాల పరిచయస్థుడైన యాక్షన్ హీరో జాకీచాన్‌ను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో జరిపే తమిళ ఆడియో రిలీజ్‌కు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్‌ను ఆహ్వానిస్తున్నారు. ‘‘చెన్నైలో భారీ వేదికపై ఆడియో రిలీజ్ జరపాలని ప్రయత్నిస్తున్నాం. అన్ని వివరాలూ మరో రెండు, మూడు రోజుల్లో ఖరారు కానున్నాయి’’ అని రవిచంద్రన్ ‘సాక్షి’కి చెప్పారు. భారీ ఎత్తున విడుదల తమిళంలో తయారైన ఈ టెక్నికల్ వండర్‌ను ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘తెలుగులో ‘మనోహరుడు’గా వస్తున్న ఈ చిత్ర డబ్బింగ్ దాదాపు పూర్తయింది. శ్రీరామకృష్ణ సంభాషణలు, రామజోగయ్యశాస్త్రి, తదితరులు పాటలు అందిస్తున్నారు’’ అని రవిచంద్రన్ చెప్పారు. మీడియా ముందుకెన్నడూ రాని రవిచంద్రన్ తొలిసారి ఈ చిత్రం గురించి పలు విషయాలు పంచుకోవడం గమనార్హం. -
రజనీ చిత్రంలో విలన్‌గా అమీర్‌ఖాన్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరాది సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను ఢీకొనబోతున్నారా? అవుననే సమాధానమే వస్తోం ది కోలీవుడ్ నుంచి. ఇక్కడ పైచేయి ఎవరిదన్న విషయాన్ని పక్కన పెడితే హీరో మాత్రం మన సూపర్‌స్టారే. విలన్‌గా అమీర్‌ఖాన్ అవతారమెత్తనున్నారన్నది ఆసక్తికరమైన అంశం. అసలు విషయానికొస్తే 2010లో రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ఎందిరన్ ఎంత సంచలన విజ యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. దర్శకుడు శంకర్ ఎందిరన్ రెండవ భాగం రూపొందించాలని చాలా కాలంగా భావిస్తున్నా రు. అందుకు కథ కూడా రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ హీరోగా, ఐ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్ ఎందిరన్-2కు సిద్ధం అవుతున్నారు. ఎందిరన్లో రజనీ కాంత్ హీరో (సైంటిస్ట్)గా, విలన్ (రోబో)గా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఎందిరన్-2 లో హీరో పాత్రను రజనీకాంత్తోను విలన్ పాత్రను వేరే నటుడితో చేయించాలని భావించారట. ఆ పాత్రను పోషించడానకి పలువుర్ని పరిశీలించినా చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ బాగుంటారన్న ఆలోచన వచ్చిం దట. వెంటనే ఆ ఆలోచన అమల్లో పెట్టారట. ఎందిరన్-2లో విలన్‌గా నటించడానికి అమీర్‌ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శంకర్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఈ చిత్రం బడ్జెట్, వ్యాపారం ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్త త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం రజనీకాంత్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తున్న లింగా చిత్రం శరవేగంగా జరుగుతోంది. మైకంతో తూలిపడ్డ రజనీ లింగా చిత్రం షూటింగ్లో నటిస్తున్న సూపర్‌స్టార్ రెండురోజుల క్రితం అనూహ్యంగా మైకంతో తూలి పడిపోయారు. ఈ ఊహించని పరిణామానికి చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందింది. వెంటనే రజనీని ఆస్పత్రిలో చేర్చారు. లింగా చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ఇంతకు ముందు అనారోగ్యానికి గురై చికిత్స పొందినప్పుడే వైద్యులు ఉద్వేగభరిత సన్నివేశాల్లో నటించరాదని సూచించారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న లింగా చిత్ర ఫైటింగ్ సన్నివేశాల్లో రజనీ నటిస్తున్నారు. పోరాట దృశ్యాల్ని డ్యూప్తో చిత్రీకరిద్దామని దర్శకుడు చెప్పినా చిన్న మూమెంటే కదా అంటూ రజనీ వేగంగా పక్కకు తిరిగి స్టంట్ కళాకారుల్ని కాలితో తన్నే సన్నివేశాల్లో నటించారు. ఆ సమయంలోనే ఆయన మైకంలో తూలి కింద పడిపోయారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా అలసట కారణంగానే రజనీకాంత్ మైకంతో తూలిపడ్డారని వైద్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. -
కష్టపెడుతున్నారా ? కష్టపడుతున్నాడా ?
-
హీరో విక్రమ్‌ను ఆకాశానికెత్తిన శంకర్
ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ - హీరో విక్రమ్ అనగానే మనకు అపరచితుడు చిత్రం గుర్తుకు వస్తుంది. అపరిచితుడు సినిమా 2005లో విడుదలై తెలుగు,తమిళ భాషలలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రయోగాలు చేయడంలో శంకర్ దిట్ట. విక్రమ్ కూడా ఆయనకు ఏమీ తీసిపోడు. కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. అటువంటి వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేశారు. శంకర్ సినిమా అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం సహజం. అందులో వీరిద్దరికి తోడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'ఐ' షూటింగ్ పూర్తి అయింది. శంకర్ ఒక సినిమాకి, ఒక సినిమాకు పోలికే ఉండదు. అది అతని ప్రత్యేకత. ఈ చిత్రం కూడా కథ, కధనంలో పూర్తిగా కొత్తదనం చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన అందాల భామ ఎమిజాక్సన్ హీరో హీరోయిన్గా నటించింది. దీనిని తెలుగులో 'మనోహరుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్‌ను శంకర్ ఆరు గెటప్‌లలో చూపించనున్నారు. విక్రమ్ ఎంతో అంకితభావంతో ఈ పాత్రలను పోషించినట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చెప్పారు. అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రఖ్యాత సాంకేతిక నిపుణులతో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘ఐ’ చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల శంకర్ తన మనసులో మాటలు బయటపెట్టాడు. హీరో విక్రమ్‌ను ఆకాశానికెత్తేశాడు. విక్రమ్ లాంటి రియల్ హీరో లేనేలేడని తెగపొగిడేశాడు. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా కష్టపడి సన్నబడ్డాడని చెప్పాడు. విక్రమ్ చేస్తున్న పాత్ర చాలా క్లిష్టమైనదని, ఆ పాత్ర కోసం విక్రమ్ గుండు చేయించుకోటానికి కూడా వెనుకాడలేదని శంకర్ చెప్పారు. మేకప్, కాస్టూమ్స్ల్, టెక్నికల్ అంశాలలో చాలా కొత్తదనం చూపినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడుని మించి ఇది ప్రేక్షకాదరణ పొందుతుందని అంచనా. -
దక్షిణాది ఫోకస్... ఈ ఫోర్ మూవీస్ పైనే!
కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ దశ నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక మేకింగ్ మొదలైన దగ్గర్నుంచీ ఆ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సంచలనమే. అలాంటి క్రేజీయెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్టులు అరుదుగానే తయారవుతుంటాయి. ప్రస్తుతం దక్షిణాదిలో అలాంటి నాలుగు ఆసక్తికరమైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. కంటెంట్... కాన్సెప్ట్... కాంబినేషన్స్... మేకింగ్... టేకింగ్... బడ్జెట్... స్టార్ ఇమేజ్... జానర్... వర్కింగ్ స్టయిల్... టెక్నాలజీ... వీటన్నిటి పరంగా ఈ నాలుగు చిత్రాలు ‘టాక్ ఆఫ్ ది సౌత్’ అనిపించుకుంటున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా, అనురక్తిగా వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న ఆ నాలుగు సినిమాల విశేషాల సమాహారమిది. బాహుబలి తారాగణం : ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితరులు దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2013 జూలై 6న కర్నూలులో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 100 కోట్లు విడుదల : 2015 ప్రత్యేకత : రెండు భాగాలుగా విడుదల ప్రభాస్ ‘మిర్చి’ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళితో సినిమా చేయాలని వేరే కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. ఇందులో పాత్రకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. అనుష్క కూడా అంతే. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి సాములో శిక్షణ పొందారు. ఇందులో ప్రభాస్ది ద్విపాత్రాభినయం. ఒక పాత్ర పేరు బాహుబలి కాగా, మరో పాత్ర పేరు శివుడు. బాహుబలి సరసన అనుష్క, శివునికి జోడీగా తమన్నా చేస్తున్నారు. రానా, రమ్యకృష్ణ లాంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మేకప్మేన్లు, కాస్ట్యూమర్లు దాదాపుగా ఈ సినిమాకు పని చేస్తున్నారు. కర్నూలు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటి వరకూ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో భారీ షెడ్యూల్ చేస్తున్నారు. డిసెంబర్ 23న మొదలైన ఈ షెడ్యూల్ మార్చి 5 వరకూ జరుగనుంది. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ విషయమూ బయటకు పొక్కకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా బర్త్‌డేలకు మాత్రం ఫస్ట్‌లుక్, కొంత సమాచారం రిలీజ్ చేశారు. ఈ ఏడాది అంతా ఈ సినిమా వర్క్ నడుస్తుందని సమాచారం. 2015లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నారట రాజమౌళి. తెలుగు, తమిళ భాషల్లో రూపొదుతోన్న ఈ చిత్రాన్ని మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువదిస్తారు. రుద్రమదేవి తారాగణం : అనుష్క, రానా, నిత్యామీనన్, కృష్ణం రాజు తదితరులు నిర్మాత, దర్శకుడు : గుణశేఖర్ ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్ సంగీతం : ఇళయరాజా జానర్ : చారిత్రకం షూటింగ్ ప్రారంభం : 2013 ఏప్రిల్ వరంగల్‌లో నిర్మాణ వ్యయం : సుమారు రూ. 40-50 కోట్లు విడుదల : 2014 వేసవిలో ప్రత్యేకత : తొలి భారతీయ చారిత్రక త్రీడీ చిత్రం భారతదేశ చరిత్రలో 40 ఏళ్ల పాటు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ... రాణీ రుద్రమదేవి. ఆమె చరిత్రని చాలా ఇన్‌స్పయిరింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. 13వ శతాబ్దం తాలూకు కథ కాబట్టి, అప్పటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని యధాతథంగా ప్రెజెంట్ చేయడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా ఈ టీమ్‌కి మెయిన్ ఎస్సెట్. కళాదర్శకుడు తోట తరణి ఈ సినిమాకు మూలస్తంభం. అద్భుతమైన సెట్లు వేస్తున్నారాయన. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేయిస్తంభాల గుడిని అచ్చు గుద్దినట్టుగా దింపేశారు. అలాగే మొగిలిచెర్ల ఏకవీరాదేవి గుడి, ఏడు కోట గోడలు, అప్పటి పల్లెటూళ్లు, రాజమందిరాలు, దర్బార్లు... వీటన్నిటినీ ఎంతో శ్రద్ధతో సెట్లు వేస్తున్నారు. ఈ సినిమా కోసం సుమారు 60 అడుగుల ఎత్తున్న సెట్ వేశారు. ఆ సెట్లోకి వెళ్లడం కోసం ఏకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అలాగే చిన్న సెటప్‌కి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం దగ్గర ఇటీవలే అనుష్క, రానాపై ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. ఈ లొకేషన్లో సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారట. ఝ గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. అసలే త్రీడీ మూవీ కాబట్టి మైన్యూట్ డీటైల్స్ని కూడా వర్కవుట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ 400, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండడం విశేషం. ఇప్పటికి 65 శాతం సినిమా పూర్తయింది. కోచ్చడయ్యాన్ తారాగణం : రజనీకాంత్, దీపికా పదుకొనే, శరత్‌కుమార్, శోభన తదితరులు దర్శకత్వం : సౌందర్య, ఆర్.అశ్విన్ నిర్మాతలు : సునందమురళీమనోహర్, సునీల్ లుల్లా ఛాయాగ్రహణం : రాజీవ్ మీనన్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : జానపదం షూటింగ్ ప్రారంభం: 2012 మార్చి నిర్మాణ వ్యయం : సుమారు రూ. 125 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 10న ప్రత్యేకత : తొలి భారతీయ త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రం ‘రోబో’ తర్వాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రాణా’ సినిమా చేయాలనుకున్నారు రజనీకాంత్. ప్రారంభ వేడుక కూడా జరిగింది. అయితే రజనీ ఆ తర్వాత అనారోగ్యం పాలవ్వడంతో ‘రాణా’ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రజనీ పెద్ద కూతురు సౌందర్య ‘కోచ్చడయాన్’ సినిమా అనౌన్స్ చేశారు. ‘రాణా’ కథకి ప్రీక్వెల్ ఇదని ఆమె ప్రకటించారు కూడా. జేమ్స్ కేమరూన్ సృష్టించిన ‘అవతార్’ హాలీవుడ్ చిత్రం తరహాలో త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేషన్ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలో ఈ పరిజ్ఞానంతో తీసిన తొలి సినిమా ఇదే. రజనీకాంత్ ఫేస్‌ని స్కాన్ చేయగా వచ్చిన రూపంతో త్రీడీలో ఓ మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ స్కిన్‌ని టైట్ చేస్తే ‘ముత్తు’లో రజనీలాంటి రూపం వచ్చింది. రజనీ ఇందులో మూడు యానిమేటెడ్ పాత్రల్లో కనిపిస్తారు. మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నీతాలుల్లా కాస్టూమ్స్ డిజైన్ చేశారు. ఇందుకోసం 8 నెలలు కసరత్తులు చేశారు. రజనీ యుద్ధ వీరుడి గెటప్ కోసమైతే దాదాపు 30 స్కెచ్‌లు వేశారామె. ఝ తమిళనాడుకి చెందిన పాండ్యవంశ రాజు ‘కోచ్చడయ్యాన్ రణబీరన్’ జీవిత చరిత్రకు కొంత కాల్పనికతను జోడించి ఈ కథ తయారు చేశారు. మలయాళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం అనువాదం కానుంది. ఝ 2013 ఫిబ్రవరికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌కే ఇంత సమయం పట్టింది. లండన్, హాంకాంగ్, లాస్ఏంజిల్స్, చైనాల్లో ఫైనల్ వర్క్ జరుగుతోంది. ఝ తెలుగులో ‘విక్రమ సింహ’ పేరుతో శ్రీ లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఐ తారాగణం : విక్రమ్, అమీ జాక్సన్ తదితరులు దర్శకత్వం : శంకర్ నిర్మాత : ఆస్కార్ వి.రవిచంద్రన్ ఛాయాగ్రహణం : పి.సి.శ్రీరామ్ సంగీతం : ఎ.ఆర్. రెహమాన్ జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం : 2012 జూలై 15న నిర్మాణ వ్యయం : సుమారు రూ. 145 కోట్లు విడుదల : 2014 ఏప్రిల్ 11న ప్రత్యేకత : 17 భాషల్లో అనువాదం ‘అపరిచితుడు’ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. హిందీ ‘త్రీ ఇడియట్స్’ని తమిళంలో ‘నన్బన్’గా రీమేక్ చేసి పరాజయం పొందిన శంకర్ ఓ కసితో ఈ సినిమా చేస్తున్నారు. ఝ వరుస పరాజయాలు, ప్రయోగాలతో వెనుకబడిపోయిన విక్రమ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వేరే అవకాశాలు కూడా వదిలేసుకుని అహరహం శ్రమిస్తున్నారు. పలురకాల శరీరాకృతుల్లో కనిపించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. తొలుత సమంతను నాయికగా అనుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ అవకాశం వదులుకోవడంతో, అమీజాక్సన్‌ని ఎంచుకున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్‌లాంటి హాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ మేకప్ చేసిన వీటా వర్క్ షాప్ సంస్థ వాళ్లు విక్రమ్‌కి మేకప్ చేశారు. వరల్డ్‌లోనే ఎక్స్లెంట్ మేకప్ టీమ్ ఇదని శంకర్ స్వయంగా పేర్కొన్నారు. హాలీవుడ్ ‘మెన్ ఇన్ బ్లాక్’ చిత్రాల సిరీస్‌కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన మేరీ ఓగ్ దీనికి పనిచేశారు. మన ఇండియన్ అనల్ అరసుతో పాటు చైనాకు చెందిన పీటర్ మింగ్ కొరియోగ్రఫీ చేశారు. ‘హ్యారీపోటర్’ సిరీస్‌కి పనిచేసిన ఆస్ట్రేలియన్ రైజింగ్‌సన్ పిక్చర్స్ వాళ్లు గ్రాఫిక్స్ సమకూరుస్తున్నారు. ‘ఐ’ అంటే తమిళంలో అందం, రాజు, గురువు, సున్నితం అని అర్థాలున్నాయి. తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది.