న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు.
విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్‌పోర్టు కోసం ఎన్‌ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment