diplomatic passport
-
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
రాహుల్ పాస్‌పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్‌పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్‌పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్‌పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
ప్రత్యేక విమానంలో వారికి నో ఎంట్రీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం భారత్ నుంచి చైనా వెళ్లేందుకు దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు సహా పలువురు భారతీయులను విమానంలోకి చైనా అనుమతించలేదు. జూన్ 21న భారత్ నుంచి షాంఘై వెళ్లిన ప్రత్యేక విమానంలో ఇద్దరు భారతీయులకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు భారతీయులకు కరోనా సోకడంతో వారిని స్వదేశానికి తరలించేందుకు భారత్ నుంచి ఖాళీ ప్రత్యేక విమానాన్ని పంపేందుకు చైనా అధికారులు అనుమతించారు. ఇక గ్వాంజు నగరం నుంచి 86 మంది భారతీయులతో వందే భారత్ మిషన్ మూడో దశలో భాగంగా భారత్‌కు బయలుదేరింది. జూన్ 21న షాంఘైకు చేరుకున్న విమానం కూడా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకే వెళ్లింది. ప్రత్యేక విమానాల్లో దౌత్య పాస్‌పోర్టులు కలిగిన భారతీయులను సైతం చైనా అనుమతించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విమానాల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. కాగా భారత్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూన్ 29న గ్వాంజు నగరానికి వచ్చే విమానంలో ప్రయాణీకులను అనుమతించరాదని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : వందే భారత్ మిషన్ : ఆ విమానాలకు బ్రేక్? -
మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. -
చంద్రబాబుకు డిప్లొమాటిక్ పాస్‌పోర్టు
హైదరాబాద్: డిప్లొమాటిక్ పాస్‌పోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సికింద్రాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. పాస్‌పోర్టు అధికారిణి అశ్విని సత్తారు, డీపీవో మదన్‌కుమార్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఫొటోను, ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకున్న అధికారులు 10 నిమిషాల్లో పాస్‌పోర్టును అందించారు. అంతకుముందు ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ కూడా పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చి డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.