మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు.