passport office
-
పాస్‌పోర్ట్‌కు అధిక స్లాట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్ట్ దరఖాస్తులకు అధికంగా స్లాట్లు పెంచుతామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జె.స్నేహజ వెల్లడించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పాస్‌పోర్ట్‌ల జారీలో దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7.85 లక్షలకుపైగా పాస్‌పోర్ట్‌లను జారీ చేసి గత రికార్డులను బద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా శనివారం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించామని చెప్పారు. వరంగల్‌లో అధిక డిమాండ్ తెలంగాణలో ఉన్న 5 పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రతి రోజూ సగటున 4 వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను తీసుకున్నామని స్నేహజ వివరించారు. పాస్‌పోర్టులకు వరంగల్‌లో అధిక డిమాండ్ ఉందన్నారు. సాధారణ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సమయం పడుతుందంటూ కొందరు అత్యవసరం లేకపోయినా తత్కాల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారని, దీనివల్ల అవసరమైనవారికి దొరకని పరిస్థితి నెలకొంటోందని చెప్పారు. ప్రస్తుతం సాధారణ స్లాట్లు సరాసరి 22 రోజులకు దొరుకుతుండగా, తత్కాల్‌కు ఐదు రోజులకు దొరుకుతుందన్నారు. బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దు బ్రోకర్లను నమ్ముకొని మోసపోవద్దని స్నేహజ సూచించారు. పాస్‌పోర్ట్‌కు అవసరమైన పుట్టిన రోజు ధ్రువీకరణకు ఆధార్‌కార్డును గుర్తించబోమని ఆమె స్పష్టం చేశారు. పాన్, పదో తరగతి, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలన్నారు. అదనపు డాక్యుమెంటేషన్ అవసరమయ్యే దరఖాస్తుదారులకు మెరుగైన సేవలందించేందుకు విచారణ అపాయింట్మెంట్ సిస్టమ్‌ను సవరించామన్నారు. అది ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ప్రతి సోమ, మంగళ, శుక్రవారాల్లో 250 ఆన్లైన్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ప్రతి గురువారం ఆ మూడుగంటల్లోఅపాయింట్మెంట్ లేకుండా రావొచ్చు దరఖాస్తుదారులు ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య అపాయింట్మెంట్ లేకుండా వాక్–ఇన్ పద్ధతిలో రావొచ్చని స్నేహజ సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో నియామకాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామ ఈ ఏడాది జూన్‌లో సికింద్రాబాద్‌లోని ఆర్పీఓ ప్రాంగణంలో ప్రారంభించిన క్యాంపు మోడ్ సర్వీస్ శుక్రవారంతో ముగిసిందనీ, మళ్లీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో హజ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. గత పది రోజుల్లో 400కుపైగా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టామని స్నేహజ చెప్పారు. -
సామాన్యుడు విసిరిన సవాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్‌లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం. స్లాట్స్ కోసం ఆర్పీఓ వెబ్సైట్... ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్‌రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్ ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ సుభానీతో పరిచయమైంది. లతాధర్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు. తత్కాల్ స్కీమ్ కింద పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్ ఈ పని చేశాడు. రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్‌లోనికి ఎంటర్ అయ్యే లతాధర్ దాని నుంచి నేరుగా సర్వర్‌కు కనెక్ట్ అయ్యే వాడు. ప్రతి రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేసిన తరవాతే స్లాట్స్‌ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్‌లో వెలుగులోకి రావడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు లతాధర్ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్ దొరక్కుండా బ్లాక్ చేస్తున్నట్లు లతాధర్ ఒప్పుకున్నాడు. టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... కేవలం టార్గెట్‌కు తగ్గట్టు సిమ్‌కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు పాత సంతోష్‌కుమార్ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్ శాఖ వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. రబ్బర్‌స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్‌తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్ అనే కెమికల్‌ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. ఇతడిని ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు. ‘ముప్పు’ను ఊహించకపోవడమే... ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్సైట్ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు. ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. -
విజయవాడలోనూ పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్
సాక్షి, అమరావతి : 2024 జనవరి నుంచి విజయవాడలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివహర్ష వెల్లడించారు. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ(ఆర్పీవో) అధికారులతో శనివారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సేవా కేంద్రంగా ఉందని.. గవర్నర్‌పేటలోని ఏజీ ఆఫీస్ కాంప్లెక్స్‌లో వచ్చే జనవరి నుంచి ప్రారంభించే కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం విస్తృత సేవలు అందించనుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయంలోనే పాస్‌పోర్ట్ ప్రింటింగ్ సౌలభ్యం ఉందని, ఇకపై విజయవాడ నూతన కార్యాలయంలోనూ ఈ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్(పరిపాలన), పాల సీ సంబంధిత సేవలనూ విజయవాడ కార్యాలయం అందిస్తుందని తెలిపారు. దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు ఏపీలోని 15 జిల్లాలకు చెందిన పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు విజయవాడ, తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే), 13 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల(పీఓపీఎస్‌కే) ద్వారా సేవలందిస్తున్నామని, మిగతా జిల్లాలకు విశాఖ ప్రాంతీయ కార్యాలయం సేవలందిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో పాస్‌పోర్ట్, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. గతంలో పాస్‌పోర్ట్ స్లాట్ బుకింగ్‌కు నెల పట్టేదని, ప్రస్తుతం ఐదు నుంచి 12 రోజులే పడుతోందన్నారు. విజయవాడ కార్యాలయ పరిధిలో రోజుకు రెండు వేల పాస్‌పోర్ట్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మూడు లక్షల దరఖాస్తులకు(పాస్‌పోర్ట్‌లు, పోలీసు క్లియరెన్స్) సేవలందించామన్నారు. పాస్ట్‌పోర్ట్ సేవల వినియోగానికి అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని, నకిలీ వెబ్సైట్లు, ఏజెంట్లను నమ్మొద్దని శివహర్ష కోరారు. -
ఏపీకి గుడ్ న్యూస్.. మరో రీజనల్ పాస్ పోర్టు కేంద్రం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ శివ హర్ష ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా, శివ హర్ష శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు రెండు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. కోవిడ్ తరువాత పాస్ పోర్ట్ అప్లికేషన్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెల వరకు మూడు లక్షల పాస్ పోర్టులు జారీ చేశాం. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నాం. విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుంది. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయి. మరో రెండు మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తాం. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశాం. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నాం. దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మకండి’ అని సూచించారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం -
Passport: పాస్‌పోర్టు కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు స్లాట్ల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్ విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు 5,500 స్లాట్లు అదనంగా విడుదల చేశామని, అలాగే ఏప్రిల్ 29వ తేదీన శనివారం పాస్‌పోర్టు డ్రైవ్‌లో మరో 3,056 స్లాట్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా దరఖాస్తుదారులు స్లాట్ల లభ్యతకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తుండటంతో అదనంగా 7,150 స్లాట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట్, టోలిచౌకితో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో తత్కాల్, సాధారణ, పీసీసీల కోసం స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అదనపు స్లాట్లను ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4.30కు విడుదల చేస్తామని వివరించారు. తమ అధికారిక పోర్టల్, ఎంపాస్పోర్ట్సేవా యాప్ ద్వారా షెడ్యులింగ్, రీ షెడ్యూలింగ్ చేసుకుని కొత్త తేదీల్లో స్లాట్లు పొందవచ్చని తెలిపారు. చదవండి: అక్రమ సిమ్‌కార్డుల దందాపై ఉక్కుపాదం.. మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండిలా..! -
యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె
లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్ట్‌లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు. మళ్లీ టీచర్ల సమ్మెబాట యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్‌టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది. -
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
Telangana: పాస్‌పోర్టు కావాలా.. ఇప్పుడంత ఈజీగా రాదండోయ్!
కొత్తగా పాస్‌పోర్టు కావాలా.. అలాగైతే కనీసం నెల పదిహేను రోజులు ఓపిక పట్టాల్సిందే. గతంలో వారం పది రోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందితే, ఇప్పుడు 45 రోజుల సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నిస్తే.. కరోనా ప్రభావం అంటున్నారు ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు. ప్రస్తుతం కరోనా నుంచి అంతా తేరుకున్నా, గతంలో లాక్డౌన్లతో పాస్‌పోర్టుల జారీకి బ్రేక్ పడింది. అప్పుడు ఏర్పడిన ప్రతిష్టంభన ప్రస్తుతం పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని టోలిచౌకి, బేగంపేట్, అమీర్‌పేట్‌లతో పాటు నిజామాబాద్, కరీంనగర్‌లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు రోజుకు ఐదు వేలకు మించి పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలించడం లేదు. కొంతకాలం కిందట రోజుకు రెండున్నర వేల దరఖాస్తులనే పరిశీలించారు. ఇప్పుడు పరిశీలించే దరఖాస్తుల సంఖ్యను రెట్టింపు చేసినా అత్యవసరంగా పాస్‌పోర్టు అవసరం ఉన్నవారికి స్లాట్ బుకింగ్ చేసుకున్న నాటి నుంచి నెల వరకు దరఖాస్తుల పరిశీలనకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో పదిరోజుల్లోనే.. గతంలో ఒక రోజు స్లాట్ బుక్ చేసుకుంటే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి మరుసటిరోజు వెళ్లి సర్టిఫికెట్లను చూపించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్పెషల్ బ్రాంచి అధికారులు విచారణ పూర్తి చేసి వారం, పది రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టును పోస్టు ద్వారా ఇంటికి చేరవేసేవారు. ప్రస్తుత పరిస్థితిలో మాత్రం స్లాట్ బుకింగ్‌కు నెల రోజుల వరకు వేచిచూడాల్సి వస్తోంది. నిర్ణీత తేదీన అభ్యర్థి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్లను చూపితే పక్షం రోజుల్లో పాస్‌పోర్టును చేతికి అందిస్తున్నారు. కరోనా తర్వాత విదేశాల్లో ఉపాధి, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజుకు పదివేల మంది వరకు స్లాట్ బుకింగ్ కోసం విదేశాంగ శాఖ వెబ్సైట్లో ప్రయత్నిస్తున్నారు. కాగా, పాస్‌పోర్టుల జారీ లక్ష్యం ఐదు వేలే ఉండటంతో స్లాట్ బుకింగ్‌కు ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న రద్దీ ప్రకారం మరో నాలుగైదు నెలల పాటు పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ అధికారులు స్పందించి అత్యవసరం ఉన్నవారికి పాస్‌పోర్టుల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను పెంచాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
పాస్‌పోర్టు కార్యాలయానికి గవర్నర్ తమిళిసై
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. దౌత్యపరమైన పాస్‌పోర్టు కోసం గవర్నర్ దరఖాస్తు చేశారు. అధికారులు ఆమె బయోమెట్రిక్ వివరాలు సేకరించారు. అనంతరం గవర్నర్ పాస్‌పోర్టు అధికారులు, సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగి వెళ్లిపోయారు. త్వరలో ఆమె యూరోప్ దేశాల పర్యటనకు వెళుతుండటంతో దౌత్యపరమైన పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోస్టల్ శాఖతో కలిసి పోస్టాపీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లోనే ప్రకటించినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో ప్రస్తుతం మొత్తం 521 పాస్‌పోర్ట్ కేంద్రాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 93 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 పార్లమెంటరీ నియోజకవర్గాలకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు లేదా పోస్ట్ ఆఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తిరుపతి, విజయవాడలోను, విశాఖపట్నం రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో విశాఖపట్నం, భీమవరంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. లేబర్ కోడ్స్‌పై పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ న్యూఢిల్లీ: పార్లమెంట్లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోడ్ ఆన్ వేజెస్ 2019కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు నియమ నిబంధనలను నోటిఫై చేశాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌కు సంబంధించి 23 రాష్ట్రాలు, సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు సంబంధించి 22 రాష్ట్రాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోడ్‌కు సంబంధించి 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు నియమ నిబంధనలను నోటిఫై చేసినట్లు మంత్రి చెప్పారు. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) లేబర్ కోడ్స్‌పై ఆయా రాష్ట్రాలు రూల్స్‌ను నోటిఫై చేసేందుకు గడువు విధించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీనలో ఉందా అన్న మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ కార్మిక శాఖ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశం. కార్మికులకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందువలన కేంద్రం లేబర్ కోడ్స్‌పై చట్టం చేసిన తర్వాత వాటికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించేందుకు ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. -
నేపాలీలా ఉన్నామంటూ పాస్‌పోర్ట్‌కు నో..
అంబాలా : నేపాలీలలాగా ఉన్నామంటూ తనకు, తన సోదరికి పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారని తమకెదురైన అనుభవాలను ఓ యువతి వెల్లడించింది. చండీగఢ్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి తాము వెళ్లిన క్రమంలో అక్కడి అధికారులు తమ ముఖాలను తీక్షణంగా చూస్తూ తాము నేపాలీలమని పత్రాలపై రాశారని, తమ జాతీయత నిరూపించుకునే ఆధారాలు సమర్పించాలని వారు తమను అడిగారని ఆమె తెలిపారు. హరియాణా మంత్రి అనిల్ విజ్ దృష్టికి తాము ఈ విషయాలను తీసుకువెళ్లిన తర్వాతే తమకు పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు. తమ కుమార్తెలు సంతోష్, హెన్నాలను వెంటబెట్టుకుని భగత్ బహదూర్ పాస్‌పోర్ట్ కోసం చండీగఢ్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా దరఖాస్తుదారులు నేపాలీలుగా కనిపిస్తున్నారని వారి డాక్యుమెంట్లపై రాసిన అధికారులు వారికి పాస్‌పోర్టును నిరాకరించారని అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్ శర్మ తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే అధికారులతో మాట్లాడానని, అప్పుడు అక్కాచెల్లెళ్లను పాస్‌పోర్ట్ కార్యాలయానికి పిలిపించి వారికి పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. త్వరలోనే వారికి పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. -
నిమిషాల్లో ఈ-పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ సేవలకు ఈ–టోకెన్ విధానం సత్ఫలితాన్నిస్తోంది. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ–టోకెన్ నంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు అందుతుంది. దీంతో పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అక్కడి సిబ్బందికి మీ సెల్‌ఫోన్‌కు అందిన మీ దరఖాస్తు రిఫరెన్స్ నంబర్ (ఏఆర్ఎన్) చూపితే చాలు. ఈ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను అక్కడి సిబ్బంది నిమిషాల్లో పూర్తి చేస్తారు. అమీర్‌పేట్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అమలు చేసిన ఈ ప్రయోగాత్మక విధానం సఫలీకృతం కావడంతో ఇటీవల మరో 4 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 23 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ అమలు చేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. దేశంలో ఢిల్లీ తర్వాత ఈ విధానాన్ని మన నగరంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఏఆర్ఎన్ ద్వారా తమ పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఏస్థాయిలో ఉందన్న అంశాన్ని ఈ–ట్రాకింగ్‌తో తెలుసుకునే సౌలభ్యాన్ని విదేశాంగ శాఖ కల్పించడం విశేషం. 6 నెలల ముందే అలర్ట్.. పాస్‌పోర్టు గడువు తీరిన వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ అందించే సేవలను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభించింది. వినియోగదారులకు 6 నెలల ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేయడం ద్వారా వారు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులందరి పాస్‌పోర్ట్ డేటాను డిజిటల్ మాధ్యమంలో భద్రపరిచామని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్ సైతం కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్‌గా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేయడం విశేషం. దరఖాస్తు సమయంలో జాగ్రత్త.. పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వినియోగదారులు విధిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ https://www.passportindia.gov.in/ నుంచే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర లింక్‌లను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. రోజూ 3 వేల దరఖాస్తులు.. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం, మెడికల్ టూరిజం ఇలా విదేశాలకు వెళుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్ దరఖాస్తులు సైతం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పాస్‌పోర్ట్ కార్యాలయాలకు సుమారు 3 వేల దరఖాస్తులు అందుతున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీస్ క్లియెరెన్స్ అందిన 3–4 రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తున్నామని, పోలీసులు సైతం వెరిఫికేషన్‌ను సత్వరం పూర్తి చేస్తున్నారన్నారు. -
వచ్చిందోచ్..
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: కోనసీమవాసులు ఉపాధి కోసం కువైట్ దేశాలకు వెళ్లి మోసపోతున్న క్రమంలో దుబాయ్‌లోని భారత రాయబారి కార్యాలయానికి అనుసంధానంగా విశాఖపట్నం, అమలాపురంలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ యోచనలో ఉందని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు తెలిపారు. అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అమలాపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాస్‌పోర్ట్‌లు, వీసాలతో అవగాహన లోపంతో మోసపోతున్న కోనసీమ ప్రజల కోసం అమలాపురం పోస్టల్ కార్యాలయంలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని ఎంపీ వెల్లడించారు. మరో అతిథి విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం అధికారి ఎన్‌ఎన్‌పీ చౌదరి మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం మొదటి స్థానంలో ఉందని వివరించారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌లు మూడు రోజుల్లో, సాధారణ పాస్‌పోర్ట్‌లు పది నుంచి పదిహేను రోజుల్లో జారీ చేస్తున్నామన్నారు. పాస్‌పోర్ట్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా సక్రమంగా అందించాలన్ని ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి వంతున పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలో ఈ కేంద్రాలు ఉన్నాయని, మూడో కేంద్రంగా అమలాపురంలో ప్రారంభించామని తెలిపారు. విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం.ఎలీషా మాట్లాడుతూ పోస్టల్ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. రోజుకు ఈ కేంద్రం ద్వారా 50 మందికి మాత్రమే పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేస్తామన్నారు. సభలో కొత్తగా మంజూరైన పాస్‌పోర్ట్‌లను ఎంపీ రవీంద్రబాబు దరఖాస్తుదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, ఉప్పలగుప్తం జడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్ రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్ యక్కల సాయిలక్ష్మి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కౌన్సిల్ విప్ నల్లా స్వామి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డులు
సాక్షి, హైదరాబాద్: 2017-18 సంవత్సరానికిగాను తెలంగాణకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, పాస్‌పోర్ట్ జారీలో అవార్డులు లభించాయని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ పోలీసు వెరిఫికేషన్‌గా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. ఏ కేటగిరిలో పాస్‌పోర్ట్ జారీలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసుకు మొదటి స్థానం లభించిందని తెలిపారు. చాలా సంవత్సరాల తరువాత కేటగిరి పాస్‌పోర్ట్ జారీలో మొదటి అవార్డు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పాస్‌పోర్ట్‌ను తొందరలో జారీ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సగటున 21 రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ చేస్తే.. తెలంగాణలో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తిచేసి పాస్‌పోర్ట్ జారీ చేస్తున్నామని తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయన్నారు. ఈ నెల 26న పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
ఈ వారంలోనే జిల్లాలో పాస్‌పోర్ట్ కార్యాలయం
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా వాసుల కల ‘పాస్‌పోర్ట్ కార్యాలయం’ ఈ నెల మొదటి వారంలో నగరంలోని హెడ్ పోస్టాఫీస్ ప్రాంగణంలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం హెడ్ పోస్టాఫీస్ ప్రాంగణంలో పాస్‌పోర్ట్ కార్యాలయంనకు సిద్ధం చేసిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా వాసుల చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాస్‌పోర్ట్ కార్యాలయం విషయమై గత నాలుగేళ్లుగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి తో మాట్లాడామన్నారు. జిల్లా పరిస్థితులు పలుమార్లు వివరించామన్నారు. విదేశాలకు వెళ్లే వారు పాస్ పోర్ట్ పొందాలంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ పలుమార్లు తిరగడం, సకాలంలో పని జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, మంత్రికి వివరించి అనుమతులు పొందినట్లు ఎంపీ తెలిపారు. రెండేళ్ల క్రితమే అన్ని విధాలా అనుమతులు పొందినప్పటికీ కార్యాలయం ప్రారంభానికి అనువైన భవనంకు సమయం పట్టిందన్నారు. అనుకున్న విధంగా జిల్లా పోస్టల్ అధికారులు పాస్ పోర్ట్ కార్యాలయంను సిద్ధం చేసినందుకు ప్రతి ఒక్క అధికారికి, సిబ్బందికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎంపీ తెలిపారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లోనే పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభిస్తామని ఎంపీ వివరించారు. ఇకపై జిల్లా వాసులు ఒంగోలు లోనే పాస్ పోర్ట్ పొందవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపీ వైవీ వెంట హెడ్ పోస్టాఫీస్ పీఎం పి.వెంకటేశ్వరరావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ షేక్ మీరజ్ ఫాతి మా, పెన్షనర్ అసోసియేన్ అధ్యక్షుడు పి.పేరయ్య, పోస్టల్ యూనియన్ నేతలు యం.రాజశేఖర్, కె.వీరాస్వామి రెడ్డి,పోస్టల్ సిబ్బంది, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వేమూరి బుజ్జి, రాయపాటి అంకయ్య, బడుగు కోటేశ్వరరావు, తోటకూర వెంకటరావు, చింతపల్లి గోపి ఉన్నారు. రైల్వే గేట్ అండర్ పాస్‌వే పనులు ప్రారంభం ఒంగోలు వన్‌టౌన్: అగ్రహారం రైల్వేగేట్ వద్ద అండర్ పాస్ వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొంది, కేంద్రం వంతుగా రూ.13 కోట్లు మంజూరయినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన కారణంగా అనుమతులు వచ్చి రెండున్నర ఏళ్లు అయినా పని మొదలు కాలేదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన రూ.20కోట్లు మంజూరుకు పదే పదే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి వచ్చిందని ఎంపీ తెలిపారు. రైల్వే అధికారులు పలుమార్లు మున్సిపల్ అధికారులతోను, రాష్ట్ర ప్రభుత్వంతోను మాట్లాడినా ఎటువంటి స్పందన లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.13 కోట్లతో ఆర్ఓబీకి బదులు ఆర్యూబీ నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించిందని ఎంపీ తెలిపారు. అధికారులు అన్ని ప్రయత్నాలు పూర్తయ్యే ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. నెలలోపల రైల్వే అండర్ పాస్ వే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ నెలలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్మాణంలో సహకారం అందించమని స్థానికులును కోరామని, రాఘవేంద్ర స్వామి దేవస్థానం యాజమాన్యం వారు కూడా సహకరిస్తామని తెలిపారని ఎంపీ అన్నారు. ఎంపీ వెంట రైల్వే ఏఈ రాజేంద్ర, ఆర్అండ్బీ ఎస్ఈ దేవదాస్‌లు ఉన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఆర్అండ్బీ అధికారులతో పాటు స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు వేమూరి బుజ్జి, ఆర్.అంకయ్య, బి.కోటేశ్వరరావు, టి.వెంకటరావు, సీహెచ్ గోపి ఉన్నారు. -
20 రోజుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాకు పాస్‌పోర్ట్ కార్యాలయం అనుమతి వచ్చి ఏడాది కావస్తున్నా ఆచరణలో పోస్టల్ అధికారులు కార్యాలయ ప్రారంభానికి శ్రద్ధ చూపక పోవడంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లా వాసులు పాస్‌పోర్ట్‌కు చెన్నె లేదా విజయవాడ పదేపదే వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీత్యా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకు ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం అనుమతి తీసుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఒంగోలు హెడ్ పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభించడానికి భవన పరిశీలనకు వచ్చిన ఎంపీ అధికారులను మార్చి నెల ఆఖరు లోపు జిల్లాలో పాస్‌పోర్ట్ కార్యాలయ సేవలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పోస్టల్ అధికారులను కోరారు. ఈ విషయమై పీఎంజీ రాధికా చక్రవర్తి జిల్లాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20 రోజుల్లోగా జిల్లాలో పాస్‌పోర్టు సేవలు ప్రారంభిసా ్తమన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంట సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, జిల్లా పోస్టల్ అధికారులు సీనియర్ సూపరింటెండెంట్ టీఏవీ శర్మ, పి.వెంకటేశ్వరరావు, పోస్టల్ పెన్షనర్స్ యూనియన్ నాయకులు పి.పేరయ్య, కె.వీరాస్వామిరెడ్డి, కె.వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎంపీ వెంట పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్ ఉన్నారు. -
కడపలో పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభం
జిల్లా ప్రజల కల నెరవేరిందన్న ఎంపీ అవినాష్‌రెడ్డి సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా కడపలో సోమవారం పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరిందన్నారు. కడపలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రం కడపతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
ఫోర్జరీతో మోసం
కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు రాంగోపాల్‌పేట్: హోటల్ నిర్వహణకు భవనాన్ని అద్దెకు తీసుకున్న నిర్వాహకుడి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన ఓ వ్యక్తిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన మేరకు.. యాకుత్‌పురకు చెందిన రహీముద్దీన్ (50) నగరంలోని వనస్థలిపురం, నాగోల్, లక్డీకపూల్, ఎల్బీనగర్ ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో గ్రీన్ బావర్చీ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం వద్ద 2014లో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన భవనాన్ని నెలకు రూ.1.95 లక్షల చొప్పున అద్దెకు తీసుకుని హోటల్ ప్రారంభించారు. 2015 ఫిబ్రవరి నెల వరకు అద్దెను సక్రమంగా చెల్లించిన రహీముద్దీన్ మే నెలలో మెట్రో పనుల్లో భాగంగా కొంత భవనం రోడ్డు విస్తరణలో పోవడంతో మరమ్మతులు ప్రారంభించారు. అటు తర్వాత అద్దెను చెల్లించకుండా నిలిపివేయడంతో పాటు నెలకు కేవలం రూ.4వేల మాత్రమే అద్దె చెల్లిస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశాడు. ఈ డాక్యుమెంట్లను కమర్షియల్ టాక్స్ అధికారులకు అందించారు. ఇలా ఒకవైపు కమర్షియల్ ట్యాక్సు అధికారులను మోసం చేయడంతో పాటు భవన యజమానికి అద్దెను చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తెలుసుకున్న భవన యజమాని ప్రదీప్ సింగ్ ఫిబ్రవరి 11న మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి
– పాస్‌పోర్టు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈ నెలాఖరు లోపు అని్న సదుపాయాలతో కర్నూలులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సూచించారు. ఎంపీ సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పాస్‌పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవా కేంద్రం మూడు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి ఎ.కె.మిశ్రా, వైజాగ్ పాస్‌పోర్టు కార్యాలయ సూపరింటెండెంట్ కల్యాణ్, కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ భవన్!
హైదరాబాద్: అత్యంత వేగంగా పాస్‌పోర్టుల జారీ, పోలీసు వెరిఫికేషన్‌లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శితో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న తెలంగాణ వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, ధ్యానేశ్వర్ ములేను కోరారు. విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మిస్తామని ములే హామీ ఇచ్చారు. త్వరలో వరంగల్‌లో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌తో భేటీ సందర్భంగా ములే చెప్పారు. -
మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. -
చేతిరాత పాస్‌పోర్ట్ చెల్లదిక!
నవంబర్ 24 తర్వాత వీటిని అనుమతించరు సాక్షి, హైదరాబాద్: చేతిరాతతో జారీ చేసిన పాస్‌పోర్ట్‌లు ఇకపై చెల్లుబాటు కావు. వాటిని తీసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే విదేశాలకు వెళ్లేందుకు చేతిరాత పాస్‌పోర్ట్‌లు అనుమతించరు. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) విదేశాంగ శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జారీ అయ్యే మెషిన్ రీడబుల్ (యంత్రాల ఆధారంగా రూపొందించిన) పాస్‌పోర్ట్‌లు పదేళ్ల కాలపరిమితికి ఇస్తున్నారు. 2001 ఏడాదికి ముందు హ్యాండ్ రిటన్ (చేతిరాత)తో పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. అప్పట్లో కొంతమంది 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారు. ఆ తరహా చేతిరాత పాస్‌పోర్ట్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్‌పోర్ట్‌లు 2015 నవంబర్ 24 వరకే చెల్లుబాటవుతాయి. ఆ తర్వాత వీటికి వీసా ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవచ్చు.. చాలా దేశాలు పాస్‌పోర్ట్ గడువు 6 మాసాల కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రయాణానికి అనుమతించవు. అందుకే పదేళ్ల పాస్‌పోర్ట్ కాలపరిమితిలో తొమ్మిదేళ్లు పూర్తవగానే రెన్యువల్ చేసుకోవాలి. పాస్‌పోర్టు బుక్‌లెట్‌లో 2పేజీలకి మించి లేకపోతే చాలా దేశాలు అనుమతించ వు. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారు జంబోబుక్లెట్కు దరఖాస్తు చేసుకోవాలి. - అశ్విని సత్తారు, హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిణి -
పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పాలెపోగు విజయలక్ష్మి విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారు. 2014-15 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఇచ్చే అవార్డుకు ఈమెను ఎంపిక చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే ‘పాస్‌పోర్ట్ దివస్’ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటారు. గత ఏడాది విజయలక్ష్మి 78,781 పాస్‌పోర్టులు పరిశీలించి, 76,857 మంజూరు చేశారు. అంతేగాకుండా 1,924 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను పరిశీలించి, మంజూరు చేశారని పాస్‌పోర్ట్ ప్రాంతీయ అధికారి అశ్వినీ సత్తారు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ
శ్రీనగర్: వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ ఎట్టకేలకు తాను భారతీయుడినని ఒప్పుకున్నారు. పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయన శుక్రవారం పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పాస్‌పోర్టు దరఖాస్తుపత్రంలో తాను భారతీయుడినని రాశారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అందజేశారు. ఈ హురియత్ నేత అస్వస్థతతో ఉన్న తన కుమార్తెను చూసేందుకు సౌదీఅరేబియా వెళ్లదలుచుకున్నారు. గిలానీ పాస్‌పోర్టు కార్యాలయం వెలుపల విలేకరులడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తాను పుట్టుకతో భారతీయుడ్ని కాదని, కానీ తప్పడం లేదని, బలవంతంగా అయ్యానని అన్నారు. గిలానీ జాతీయత కాలమ్‌లో భారతీయుడినని రాయడాన్ని ఓ హురియత్ ప్రతినిధి సమర్థించారు. -
ఏపీలో కొత్త పాస్‌పోర్టు ఆఫీస్‌కు నో
జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: ఏపీలో కొత్తగా పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు ఇప్పట్లో లేదని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేశ్ కుమార్ పర్దేశీ చెప్పారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ కార్యాలయ అధికారి అశ్వనీ సత్తార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే) ఉన్నాయని, దీనివల్ల కొత్త కార్యాలయాల అవసరం ఉండదని చెప్పారు. అయినా కొత్త కార్యాలయం ఏర్పాటు నిర్ణయం విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందన్నారు. భవిష్యత్‌లో పాస్‌పోర్ట్ క్యాంప్‌లు, మేళాలు నిర్వహిస్తామన్నారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కేరళలో 13 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 4 ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు ఉన్నాయని, కానీ ఇక్కడ లేవని ‘సాక్షి’ ప్రశ్నించగా.. పర్దేశీ సమాధానం దాటవేశారు. అమెరికా, చైనా సరసన ఇండియా పాస్‌పోర్ట్‌ల జారీలో అమెరికా, చైనా దేశాల సరసన మనదేశం చేరినట్టు పర్దేశీ చెప్పారు. 2014లో దేశవ్యాప్తంగా 1.01 కోట్ల పాస్‌పోర్ట్‌లు జారీచేశామని, దీంతో ప్రపంచంలో ఎక్కువ పాస్‌పోర్ట్‌లు జారీచేసిన 3వ దేశంగా రికార్డులకెక్కామన్నారు. 2016 నుంచి ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తామన్నారు. రెండేళ్ల క్రితం సరోగసీ బిడ్డలకు పాస్‌పోర్ట్‌లు వివాదాస్పదమైన నేపథ్యంలో త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నం.1 ఎక్కువ పాస్‌పోర్ట్‌లు జారీచేసిన కార్యాలయాల్లో హైదరాబాద్ ఆఫీస్ తొలిస్థానంలో ఉందని పర్దేశీ తెలిపారు. పాస్‌పోర్ట్‌ల జారీలో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో నిలిచిందని కేరళ 10 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయని, ఏపీ 7 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి 5వ స్థానంలో ఉందన్నారు. భీమవరంలో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పర్దేశీ చెప్పారు.