హైదరాబాద్‌లో విదేశీ భవన్!
హైదరాబాద్: అత్యంత వేగంగా పాస్‌పోర్టుల జారీ, పోలీసు వెరిఫికేషన్‌లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శితో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న తెలంగాణ వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, ధ్యానేశ్వర్ ములేను కోరారు. విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మిస్తామని ములే హామీ ఇచ్చారు. త్వరలో వరంగల్‌లో పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌తో భేటీ సందర్భంగా ములే చెప్పారు.