పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు | Passport employee to get achievement award | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు

Published Sun, Jun 21 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు

పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పాలెపోగు విజయలక్ష్మి విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారు. 2014-15 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఇచ్చే అవార్డుకు ఈమెను ఎంపిక చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే ‘పాస్‌పోర్ట్ దివస్’ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటారు. గత ఏడాది విజయలక్ష్మి 78,781 పాస్‌పోర్టులు పరిశీలించి, 76,857 మంజూరు చేశారు. అంతేగాకుండా 1,924 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను పరిశీలించి, మంజూరు చేశారని పాస్‌పోర్ట్ ప్రాంతీయ అధికారి అశ్వినీ సత్తారు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement