ఈ పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో శనివారం స్పెషల్‌ డ్రైవ్‌.. ఎందుకంటే? | Passport Seva Kendras At Nalgonda And Khammam Open On Saturday | Sakshi
Sakshi News home page

నల్లగొండ, ఖమ్మం పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో ఈ శనివారం సేవల కొనసాగింపు

Published Thu, Nov 24 2022 10:51 PM | Last Updated on Thu, Nov 24 2022 11:22 PM

Passport Seva Kendras At Nalgonda And Khammam Open On Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్‌మెట్‌ రీషెడ్యూల్‌ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్‌ చేసిన వారికి మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. 

‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్‌), 14 పోస్ట్‌ ఆఫీస్‌ పాస్ట్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు(పీఓపీఎస్‌కేఎస్‌) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్‌, 2 పీఓపీఎస్‌కేఎస్‌లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ చేసి ఎస్‌ఎంఎస్‌ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్‌ఎంఎస్‌లు అందిన దరఖాస్తుదారులు  వారికి కేటాయించిన పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలకు షెడ్యూల్‌ టైమ్‌ ప్రకారం హాజరుకావాలని కోరారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement