పాస్‌పోర్టు మరింత ఈజీ
- చిరునామా ధ్రువపత్రంగా ఇకపై రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వొచ్చు
- గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ అక్కర్లేదు
- పాస్‌పోర్టుల జారీలో విదేశాంగ శాఖ కొత్త నిర్ణయాలు
- హైదరాబాద్, విశాఖపట్నం కార్యాలయాలకు ఆదేశాలు
- గెజిటెడ్ అటెస్టేషన్లకు చెల్లుచీటీ
- ఇకపై ధ్రువపత్రాల నకలు(జిరాక్స్) కాపీలపై గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ(అటెస్టేషన్) అవసరం లేదని విదేశాంగ శాఖ నిర్ణయించింది. వీటిలో కొన్ని ముఖ్యమైనవి పరిశీలిస్తే...
- - బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లు తదితర జిరాక్స్‌లపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. సెల్ఫ్ అటెస్టేషన్(అభ్యర్థి సంతకం) చేస్తే సరిపోతుంది.
- వివాహ ధ్రువపత్రంపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్(పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి) సంతకం చాలు
- పాస్‌పోర్ట్ దరఖాస్తుకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్ అధికారుల పరిశీలనకు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. కానీ పాస్‌పోర్ట్ కార్యాలయానికి కేవలం సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ పదవీ విరమణ పొందినా, లేదా పదవికి రాజీనామా చేసినా దీనికి సంబంధించి పెన్షన్ చెల్లింపుల ధ్రువపత్రాలుగానీ, పదవీ విరమణ చేసినట్టు ప్రభుత్వాధికారి ధ్రువీకరించిన పత్రాలుగానీ సమర్పిస్తే సరిపోతుంది.
- గతంలో ఉన్నట్టుగానే ఏ, సీ, డీ, ఈ, జీ, ఐ, కే, ఎల్ అఫిడవిట్‌లు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇస్తున్నారు. ఇకపై కూడా ఏ నుంచి ఎం వరకూ అన్ని అఫిడవిట్(అనెక్సెర్)లూ స్వీకరించాలని ఎంఈఏ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్ట్‌టర్నల్ ఎఫైర్స్) ఆదేశాలు ఇచ్చింది.