పాస్‌పోర్ట్‌కు బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు
- ఇకపై ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఉన్న వివరాలే ప్రాతిపదిక
- విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం
సాక్షి, అమరావతి: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆ సర్టిఫికెట్ ఉంటేనే పాస్ట్‌పోర్ట్ వచ్చే పరిస్థితి. అయితే తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ల జారీని సరళతరం చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఆధార్, ఓటరుకార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కార్డులపై పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. కాగా, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ జనన ధృవీకరణకు ప్రాతిపదికగా ఉండేది. కొంతమంది నిరక్షరాస్యులు ఈ నిబంధన వల్ల పాస్‌పోర్ట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసే ఏవైనా రెండు గుర్తింపు కార్డులుంటే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే పోలీసు వెరిఫికేషన్ కూడా దరఖాస్తు చేసిన వారంలోగా పూర్తి చేస్తున్నట్టు పేర్కొంది.
పాస్‌పోర్ట్ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
► ఆధార్ కార్డు
► ఓటరు కార్డు
► డ్రైవింగ్ లైసెన్సు
► ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు
► అద్దెకున్న వారు రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వాలి
► విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికెట్