Birth certificate
-
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్‌లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్‌కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్‌లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : గత ఏడాది అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పసరి చేసిందని సీఎస్ స్పష్టంచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణాల నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి.. ఇక కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజి్రస్టార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారన్నారు. ఏ అథారిటీకైనా ఈ డేటా కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరముంటుందని ఆయన తెలిపారు. జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్టు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ల డేటాబేస్లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అన్ని జననాలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు నివేదించాల్సి ఉందని, ఇందులో జాప్యంలేకుండా సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎస్ కలెక్టర్లను కోరారు. -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. -
జ్ఞాపకశక్తిలో భళా దేవాన్షి
రామచంద్రాపురం (పటాన్చెరు): అద్భుత మేధస్సు.. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చెబితే చాలు.. గుర్తించి దాని పేర్లను చెబుతుంది. ఏడాది 9 నెలల వయసున్న ఆ బాల మేధావి అసమాన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023లో చోటు సంపాదించింది. వివరాలివి. రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతానికి చెందిన బండారి విజయేంద్ర, మౌనిక దంపతుల కుమార్తె దేవాన్షి.. వస్తువులను గుర్తించడం, అంకెలను ఒకటి నుండి పది వరకు చెప్పడం, ఐదు రకాల జంతువుల్లా అరవడంలో దిట్ట. దీంతో కుటుంబ సభ్యులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. వారి సూచనల ప్రకారం కుమార్తె ప్రతిభపై చిత్రీకరించిన వీడియోలు, జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువులను సమర్పించారు. ఆ వీడియోలో దేవాన్షి 15 బొమ్మలు, ఆరు శిశువు ఉత్పత్తులు, తొమ్మిది కూరగాయలు, ఐదు కార్టూన్ పాత్రలు, శరీరంలోని 11 భాగాల చిత్రాలను గుర్తించినట్టు చూపించారు. అదనంగా 6 రైమ్‌లు, 10 యాక్షన్ పదాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం, ఐదు జంతువుల శబ్ధాలను అనుసరించడం వంటివి రికార్డు చేశారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దేవాన్షికి చోటు కల్పించారు. కాగా చిన్నారి తండ్రి విజయేంద్ర జూరాల ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నారు. -
బర్త్ సర్టిఫికెట్ 21 రోజుల్లోపు పొందకపోతే ఇబ్బందులెన్నో!
సాక్షి, అమరావతి: మీ పిల్లల జనన ధ్రువీకరణ పత్రం ఇంకా తీసుకోలేదా.. తీసుకోవచ్చులే అనుకుంటున్నారా? అయితే మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టే. మీకు కావాల్సినప్పుడు బర్త్ సర్టిఫికెట్ పొందాలనుకుంటే కొంత ప్రయాస పడక తప్పదు. పిల్లలు పుట్టిన 21 రోజుల్లోపు అయితే మీ ఊళ్లలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా జనన ధ్రువీకరణ పత్రం పొందొచ్చు. 21 రోజుల గడువు దాటితే.. చిన్నారి పుట్టిన 30 రోజుల వరకు ఆ గ్రామ పంచాయతీలోనే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. అయితే దానికి పంచాయతీని బట్టి రూ.20 నుంచి రూ.100 పై వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చిన్నారి పుట్టి 30 రోజులు దాటిపోతే.. ఇక పుట్టిన 30 రోజుల తర్వాత గ్రామ పంచాయతీలో బర్త్ సర్టిఫికెట్లు పొందాలంటే స్థానిక తహసీల్దార్ అనుమతి అవసరం. అంతేకాకుండా సర్టిఫికెట్ కోసం అదనపు ఆలస్య ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పుట్టిన ఏడాది తర్వాత బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఎగ్జిక్యూటివ్ లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాత్రమే గ్రామ పంచాయతీ కార్యదర్శులు బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్డీవో ఆపై మేజిస్ట్రేట్ స్థాయి అధికారులకు మాత్రమే ఈ అధికారాలు ఉంటాయి. -
GHMC-Hyderabad: షరా మామూలే.. అక్రమాలు ఆగలే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఈ సంవత్సరం సైతం అక్రమాలు, అవినీతి షరామామూలుగా కొనసాగాయి. బర్త్ సర్టిఫికెట్ల జారీలో అవినీతి గుర్తించి ఏళ్లవుతున్నా నిరోధించలేకపోయారు. గతంలోవి కాక ఇటీవలే మూడువేలకు పైగా బర్త్ సర్టిఫికెట్లు అవినీతి మార్గాల్లో జారీ కావడం పోలీసులు గుర్తించారు. బర్త్ సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలోనూ లోపాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. ఇక ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుమతుల్లేని నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి అదనపు అంతస్తులను ప్రజలు ఫొటోలతో సహ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దిక్కులేదు. ఐదంతస్తుల వరకు నిర్మాణ అనుమతుల అధికారం జోన్లకే కట్టబెట్టినప్పటి నుంచి జోనల్, సర్కిల్ స్థాయిల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట లేకుండాపోయింది. నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న ఎల్బీనగర్ వంటి జోన్లలో ఈపరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పురోగతిలో ఎస్సార్డీపీ.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం పూర్తయిన వాటిల్లో షేక్‌పేట ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లైఓవర్, బహదూర్‌పురా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్ ఫ్లైఓవర్, నాగోల్ ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్యూబీ, ఖైతలాపూర్ ఆర్ఓబీలున్నాయి. కాగితాల్లోనే మూసీ బ్రిడ్జిలు.. మూసీపై నిర్మించనున్న 15 బ్రిడ్జిలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిల్లో నాలుగింటిని జీహెచ్ఎంసీ నిర్మించాల్సి ఉండగా, ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ)కింద దాదాపు రూ.985 కోట్ల పనుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఎఫ్‌ఓబీలు, వైకుంఠధామాలు.. పాదచారులు రోడ్డు దాటేందుకు కొన్ని ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు(ఎఫ్ఓబీ), స్పోర్ట్స్పార్కులు, వైకుంఠధామాలు, మలీ్టపర్పస్ ఫంక్షన్ హాళ్లు తదితరాలు ప్రారంభమయ్యాయి. పాత ఇళ్ల స్థానే వాటిని కూలి్చవేసి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో 210, ఓల్డ్మారేడ్పల్లిలో 468 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆగని అగ్ని ప్రమాదాలు.. న్యూబోయిగూడ స్క్రాప్ దుకాణం, సికింద్రాబాద్ రూబీ హోటల్, జూబ్లీహిల్స్ ర్యాడిసన్ బ్లూప్లాజా హోటళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు ఫైర్‌సేఫ్టీ లోపాల్ని బట్టబయలు చేశాయి. చెత్త తరలించేందుకు కొత్తగా 60 వాహనాలు వినియోగంలోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో హైదరాబాద్ 26వ స్థానానికి దిగజారింది. పెరిగిన సీఆర్ఎంపీ రోడ్లు.. సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్న రహదారులు 709 కి.మీ.ల నుంచి 811 కి.మీ.లకు పెరిగాయి. 32 అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించినా అన్నింట్లో పూర్తికాలేదు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. ఆహారకల్తీ నిరోధానికి మొబైల్ ల్యాబ్ వినియోగంలోకి వచ్చింది. గ్రీనరీ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగి, హైదరాబాద్ ‘ట్రీసిటీ ఆఫ్ వరల్డ్’గా గుర్తింపు పొందింది. (చదవండి: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు) -
సర్టిఫికెట్ల జారీ సమయం తగ్గింపు?
సాక్షి, అమరావతి: రెవెన్యూ సర్వీసుల్లో ప్రధానమైన సర్టిఫికెట్ల జారీ సమయాన్ని తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్లను ఇంకా సులభంగా, తక్కువ సమయంలో జారీచేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఈ అంశంపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా వస్తున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేసి వాటి జారీ సమయంపై ఒక అంచనాకు వచ్చారు. ► కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్‌లను కలిపి ఒకటిగా ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు ప్రస్తుతం 30 రోజుల గడువు ఉంది. దీన్ని ఎనిమిది రోజుల్లో జారీచేయాలని ప్రతిపాదించారు. ► గతంలో వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ఉన్న ఏడురోజుల సమయాన్ని మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్‌కు 10 రోజుల సమయాన్ని రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రెండు దశల వెరిఫికేషన్ల తర్వాత మూడో దశలో చివరిగా తహసీల్దార్ 13 రోజుల్లో సర్టిఫికెట్ జారీచేయాల్సి వుంది. కానీ, చివరి దశను డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి సమయాన్ని మూడ్రోజులకు కుదించాలని భావిస్తున్నారు. గతంలో ఈ సరి్టఫికెట్ జారీచేసి ఉంటే ఏ–కేటగిరీ కింద వెంటనే సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ► ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి సమయాన్ని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్ సమయాన్ని ఐదు నుంచి రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. చివరిగా తహసీల్దార్ వద్దకు వెళ్లాక ఆయన పరిశీలించి జారీచేసే సమయాన్ని మూడు నుంచి ఐదు రోజులకు పెంచారు. మొత్తంగా జారీ సమయం 5 రోజులు తగ్గించాలని చూస్తున్నారు. ► ఇక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్ల జారీని 60 నుంచి 20 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులు, ఆర్ఐ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, తహసీల్దార్ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, చివరిగా ఆర్డీఓ/సబ్ కలెక్టర్ వెరిఫికేషన్ సమయాన్ని 33 నుంచి 11 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ► అలాగే, ఆదాయ ధ్రువీకరణ (ఇన్కమ్) పత్రం జారీకి ప్రస్తుతం ఏడురోజుల గడువు వుండగా దాన్ని మాత్రం 10 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ప్రస్తుతం ఉన్న రెండ్రోజుల్ని మూడ్రోజులకు, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలనకు ప్రస్తుతమున్న మూడ్రోజుల గడువుని ఐదు రోజులుగా ప్రతిపాదించారు. మధ్యలో ఆర్ఐ వెరిఫికేషన్‌కు రెండ్రోజుల సమయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ► భూమి సరిహద్దుల కొలతలు నిర్ధారించే ఎఫ్–లైన్ దరఖాస్తులు గతంలో మాదిరిగానే 30 రోజుల సమయాన్ని నిర్దేశించారు. పట్టా సబ్ డివిజన్‌కు ఉన్న 30 రోజులు, చుక్కల భూముల వినతులకు 180 రోజులు, నిషేధిత భూముల జాబితా 22 (ఎ) నుంచి తొలగించే దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న 30 రోజుల సమయాన్ని అలాగే ఉంచాలని భావిస్తున్నారు. వీలైనంత సులభంగా, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని త్వరగా జారీచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మార్పులు ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వీటిని ఆమల్లోకి తేవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Kerala High Court: ఆమె పేరు చాలదా!
ఇది చరిత్రాత్మక ఆదేశం. కంటికీ, మనసుకూ ఉన్న పొరలు తొలగించుకొని, అందరినీ సమానంగా చూడమని కోర్టు మరోసారి చెబుతున్న ఉపదేశం. కుంతీపుత్రులంటూ చిన్నచూపు చూస్తూ, బురద జల్లడం అమానవీయమన్న సామాజిక సందేశం. అవును. కేరళ హైకోర్ట్ గత వారమిచ్చిన ఉత్తర్వులు ఇలా అనేక విధాల ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయమైనవి. పెళ్ళి కాని తల్లుల, లైంగిక అత్యాచార బాధితుల సంతానానికి సైతం ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సగౌరవంగా, వ్యక్తిగత గోప్యతకు భంగం లేకుండా జీవించే ప్రాథమిక హక్కులు ఉన్నాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జనన ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు, తదితర పత్రాలన్నిటిలో తల్లి పేరు రాస్తే చాలనీ, తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదనీ ఒకరికి అనుమతినిస్తూ, ఇలాంటి వారిని ‘నవ యుగ కర్ణులు’గా పేర్కొంది. పౌరుల హక్కులను మరోసారి గుర్తు చేస్తూ హైకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశం కొత్తది కాకున్నా కీలకమైనది. సమాజపు ఆలోచనలో రావాల్సిన మార్పు పట్ల ఆలోచన రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చేసిన తప్పుతో నిగూఢ పరిస్థితుల్లో మైనర్‌గా ఉన్నప్పుడే తాను గర్భవతినయ్యాననీ, పెళ్ళి కాని తల్లిగా, తనకు పుట్టిన బిడ్డగా తాను, తన కుమారుడు ఇవాళ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామంటూ ఒక అమ్మ వెలిబుచ్చిన ఆవేదనకు ఫలితమిది. తండ్రి ఎవరో తెలియని అనిశ్చితితో కుమారుడి గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు మూడు చోట్ల మూడు రకాలుగా ఉందనీ, దాని బదులు తనను సింగిల్ పేరెంట్‌గా గుర్తించాలనీ, తమకు ఈ మానసిక క్షోభ నుంచి రక్షణ కల్పించాలనీ ఆమె కోర్టు మెట్లెక్కారు. ఈ కుంతీ విలాపం కోర్టు విన్నది. బర్త్ రిజిస్టర్లో తండ్రి పేరు తొలగించి, ఒంటరి తల్లిగా అమ్మ పేరుతోనే తనకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆ కొడుకు వాదన న్యాయమేనంది. ఆ కేసులో జూలై 19న కేరళ హైకోర్ట్ ఆదేశం ఇవాళ దేశవ్యాప్త వార్త అయింది. కుంతీపుత్రులైనంత మాత్రాన పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించ లేరనీ, వారి వ్యక్తిగత జీవితంలోకి జొరబడరాదనీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ కుండ బద్దలు కొట్టారు. అందుకు 2015 నాటి సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పునూ ఆసరాగా చేసుకున్నారు. నిజానికి, పిల్లల కన్నతండ్రి ఎవరో బహిర్గతం చేయాలంటూ ఒంటరి తల్లులను నిర్బంధించరాదు. 2015లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం ఆ మేరకు అపూర్వమైన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఒంటరి తల్లులకూ, పెళ్ళి కాని తల్లులకూ పుట్టిన సంతానానికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నప్పుడు వారి తండ్రి ఎవరో చెప్పమంటూ బలవంతం చేయరాదని కేంద్ర హోమ్ శాఖ చాలాకాలం క్రితమే జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే రిజిస్ట్రార్లు అందరికీ లేఖ కూడా రాసింది. ఒంటరి తల్లుల అఫిడవిట్ చాలు... నిరభ్యంతరంగా బర్త్ సర్టిఫికెట్ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. కేరళ హైకోర్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ సుప్రీమ్ కోర్టు తీర్పునూ, హోమ్ శాఖ లేఖనూ ప్రస్తావిస్తూ తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. అలాగే, తండ్రి పేరు, వివరాలు చెప్పాల్సిన ఆవశ్యకత లేకుండా, అలాంటి గడులేమీ లేని పత్రాన్ని విడిగా తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి గతంలోనే కోర్ట్ ఉత్తర్వులిచ్చింది. వీటన్నిటినీ గుర్తు చేస్తూ, పిల్లల, తల్లుల తీవ్ర మానసిక వేదనను అర్థం చేసుకుంటూ కేరళ హైకోర్ట్ ధర్మాసనం తాజా కేసులో ఆదేశాలివ్వడం విశేషం. ఒంటరి తల్లులకూ, వారి పిల్లలకూ ఇది మరోసారి ఊరట! పౌరులందరినీ సంరక్షించడం, వారందరినీ గౌరవంగా, సమభావంతో చూసేలా చూడడం దేశం భుజస్కంధాలపై ఉంది. కానీ, చాలా సందర్భాల్లో అటు ప్రభుత్వం, ఇటు సమాజంలో చక్రం తిప్పేవారందరూ ఆ వాగ్దానాన్నీ, బాధ్యతనూ విస్మరించడమే విషాదం. అలనాటి మహాభారత ఇతిహాసంలోని కర్ణుడి కథ నుంచి నేటి నవయుగ కుంతీకుమారుల వరకు అందరిదీ ఇదే అనుభవం. పెళ్ళి కాని తల్లులకూ, లైంగిక అత్యాచార బాధితులకూ పుట్టిన పిల్లలంటే దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ సమాజానికే కాదు... ప్రభుత్వానికీ లోకువే. ఆ తల్లులపై, పిల్లలపై కళంకితులనే ముద్ర వేయడం అందరికీ అలవాటే. ఈ సమస్యను గుర్తించింది గనకే, తండ్రి పేరు చెప్పాలంటూ ప్రభుత్వ సంస్థలు బలవంతం చేయరాదని 2015లోనే సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పింది. అయినా, ఇవాళ్టికీ అది పకడ్బందీగా ఆచరణలోకి రాకపోవడం విషాదం. అమ్మను మించిన దైవం లేదనే సంస్కృతికి వారసులమంటాం. తీరా అమ్మ పేరు రాస్తే చాలదని, తండ్రి పేరూ చెప్పాల్సిందే అనడం ఎలా సమర్థనీయం? ఏళ్ళు గడిచినా, తరాలు మారినా పితృస్వామ్య భావజాలంలోనే మునిగితేలే మానసిక రుగ్మతకు ఇది ప్రతీక. మహాభారత కుంతీ కుమారి కాలం నాటి భావాలకే దాస్యం చేయడం ఆధునిక సమాజానికి నప్పని అంశం. అభ్యుదయాన్ని కాంక్షించేవారెవరూ ఒప్పుకోని విషయం. అవతలివారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి, వారిని లోకువగా జమకట్టే హక్కు ఎవరికీ లేదు గాక లేదు. కేరళ హైకోర్ట్ ఆదేశం కొత్తదేమీ కాకపోయినా, తల్లుల, పిల్లల హక్కులను ప్రభుత్వానికీ, సమాజానికీ మళ్ళీ గుర్తు చేసింది. జన్మకు కారణమైన తండ్రి కన్నా, నవమాసాలూ మోసి, జన్మనిచ్చిన అమ్మ ఎప్పుడూ ఒక మెట్టు పైనే అని మాటలు చెప్పే మనం ఇకనైనా మారాలి. కనిపెంచిన అమ్మను కనిపించే దేవతగా గుర్తింపు పత్రాల్లోనూ అంగీకరించాలి. దానికి ఇంకెన్ని కోర్టులు ఆదేశాలివ్వాలంటారు!? -
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగొద్దు!
ఖమ్మం మయూరిసెంటర్: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆస్పత్రులు, పురపాలికలు అంటూ ఎంతో కొంత ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఇక నుంచి అలాంటి అవసరమే లేకుండా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది. ఇప్పటివరకు వాటి కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అనేక కొర్రీలతో అధికారులు జారీ చేసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీలో మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తుంది. పుట్టిన వెంటనే రికార్డు నమోదయ్యేలా కీలక మార్పులు చేసింది. అలాగే మరణించిన వ్యక్తి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంది. జన్మించిన, మరణించిన చోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఆస్పత్రిలోనే.. శిశువు జన్మిస్తే ధ్రువీకరణ పత్రం కోసం ఇంతకుముందు ఆస్పత్రి వారు పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, సమయం నమోదు చేసి మున్సిపల్ కార్యాలయానికి పంపించేవారు. అక్కడ ఆస్పత్రి వారు పంపించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసే వారు. ఫామ్ 1,2 మున్సిపల్ అధికారులే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ విధానాన్ని మార్చిన ప్రభుత్వం ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్‌ను ఆస్పత్రులకే అప్పగించింది. శిశువు జన్మించగానే ఆన్లైన్లో తమ ఆస్పత్రి కోడ్‌తో ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఒకట్రెండు రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రం ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. జనన ధ్రువీకరణ పత్రంలో సవరణలు ఉంటే నేరుగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఆన్లైన్లో సవరణల దరఖాస్తును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. మరణించిన వెంటనే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సులువుగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఎవరైనా ఆస్పత్రిలో మరణిస్తే అక్కడే వ్యక్తి ఆధార్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో వైకుంఠధామంలో మున్సిపల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్ద మరణించినా.. సంబంధిత వ్యక్తి వివరాలను ఇంటి వద్ద లేదా దహన సంస్కారాల ముందు వైకుంఠధామంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ అధికారులు సంతకం చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. వ్యక్తి బంధువులు దానిని ఆన్లైన్లో పొందవచ్చు. ఇక ఇంటి వద్ద మరణించిన వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేషన్ అధికారులు ఇంటి వద్దనే పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. కీలక మార్పులు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆస్పత్రిలో జన్మించినా, మరణించినా అక్కడే సంబంధిత వివరాలను ఆస్పత్రి సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వివరాల ప్రకారం ధ్రువీకరణ పత్రం మంజూరవుతుంది. ఒకవేళ సవరణలు చేసుకునేందుకు మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి సవరణ చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తారు. జనన, మరణ రిజిస్ట్రేషన్ల కోసం మున్సిపాలిటీలకు రావాల్సిన అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కేఎంసీ కమిషనర్ -
‘నీ పని అవ్వాలంటే రూ.2000 ఇవ్వాల్సిందే.. లేదంటే..’
‘జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ తన కూతురు జనన ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ సిబ్బందిని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యాలయం అడ్రస్ అడగగా, సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. తనకు రూ.2000 ఇస్తే వారం రోజుల్లో సర్టిఫికెట్ చేతులో పెడతానని నమ్మబలికాడు. చేసేది లేక చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చి వారం రోజుల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాడు.’ కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో మ్యాన్వల్గా ఇచ్చే సర్టిఫికెట్లను ఏడాది కాలంగా నుంచి ఆన్‌లైన్‌కు మార్చారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్‌కు వందలు, వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమాయకుల వద్ద అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మ్యాన్వల్గా ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని ప్రాంతాలలో చెల్లడం లేదనే ఉద్దేశంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన పిల్లలకు సైతం జనన ధ్రువీకరణ పత్రాలు మీసేవలోకి మార్చారు. మ్యాన్వల్గా ఉన్నప్పుడు దందా నడిపించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌కు మార్చినా వదలడం లేదు. అమాయకులు సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రికి వస్తే వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారు. కొంత మంది సిబ్బంది ఆసుపత్రి ముందు తిష్ట వేసి సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వేలల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో సర్టిఫికెట్ వస్తుంది. అది తెలియని వారిని దళారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు వేలల్లో వసూలు చేస్తుండడంతో సర్టిఫికెట్లు పొందే వారు ఆందోళన చెందుతున్నారు. మరణ ధ్రువీకరణాల పరిస్థితి దారుణం జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లకే ఇంత ఇబ్బంది అవుతుంటే ఇక మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా సిబ్బందితో కుమ్మక్కై దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో రికార్డు లేకపోతే ఆసుపత్రి నుంచి మరణ నివేదికను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని రికార్డులను దాచిపెట్టి దొరకడం లేదంటూ ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరకు బేరం కుదిరితే రికార్డులు దొరికాయంటూ మరణ నివేదిక రాసి ఇస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం.. జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందాలి. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
సర్టిఫికెట్ల జారీ.. జీహెచ్ఎంసీ రూటే సపరేటు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరంతా ఓ దారి.. ఉలిపి కట్టెది మరో దారి’ అన్న చందంగా మారింది బల్దియా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు.. సదరు సర్టిఫికెట్ల జారీ ఒకేవిధంగా ఉండేందుకు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ కార్యాలయం ఓఆర్‌జీఐ అనే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, స్థానిక సంస్థలు బర్త్, డెత్‌లకు సంబంధించిన వివరాల నమోదు, సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలకు ఆ పోర్టల్‌ను వినియోగించాల్సిందిగా సూచించింది. జీహెచ్ఎంసీలో మాత్రం దాన్ని పట్టించుకోకుండా, సొంత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించుకున్నారు. దాని ద్వారా తరచూ ఇబ్బందులు తలెత్తుతుండగా, పరిష్కారం కోసం దాదాపు ఏడాది కాలంగా కసరత్తు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు పూర్తిగా తొలగలేదు. లక్షల రూపాయల వ్యయం మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఓఆర్‌జీఐ సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు వినియోగించుకోలేదన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ► ఇటీవల బోగస్ బర్త్‌సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో, అందుకు సొంత వెబ్‌పోర్టల్ కూడా ఒక కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓఆర్‌జీఐ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం అయినందున దాన్ని వినియోగించుకున్నట్లయితే జీహెచ్ఎంసీకి ఖర్చు తగ్గేది. అసలే ఆర్థిక భారం పెరిగిపోయిన పరిస్థితుల్లో ఖర్చు తగ్గడమే కాక, బోగస్ సర్టిఫికెట్ల జారీ వంటి అవకతవకలకు ఆస్కారం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► అన్ని విధాలా ఆమోదయోగ్యమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. దేశమంతటా ఒకే విధమైన యూనిఫామ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉండాలనే తలంపుతోనే కేంద్ర ప్రభుత్వం ఓఆర్‌జీఐ పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. దాని ద్వారా ఆన్లైన్లో జనన, మరణాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే సదుపాయంతోపాటు ఆయా వివరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా గణాంకాలు వెలువరించే సందర్భాల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్) ► ఆన్లైన్లోని వివరాలను, సమాచారాన్ని వివిధ స్థాయిల్లోని ఉన్నతాధికారులు వీక్షించి, పర్యవేక్షించేందుకు సైతం సదుపాయం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీకి సాఫ్ట్వేర్ నిర్వహణ ఖర్చు కూడా ఉండేది కాదని చెబుతున్నారు. అయినప్పటికీ, దాన్ని వినియోగించుకోకుండా సొంత పోర్టల్‌ను వాడుతుండటమే సందేహాలకు తావిస్తోంది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) -
తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు!
This woman has the world's longest name: మనదేశంలో చాలా మందికి ఇంటి పేరుతో కలిపి చాలా చాలా పెద్ద పేర్లు ఉండటం సహజం. మన పెద్దవాళ్లందరికి పేర్లు చాలా వరకు పొడుగ్గానే ఉండేవి. కానీ ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారులకు మూడు లేదా నాలుగు అక్షరాలకు మించి పేర్లు పెట్టడం లేదు. అయితే యూఎస్‌కి చిందిన ఒక ఆమె పేరు చాలా పెద్దది పైగా అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించాలన్న కూడా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. (చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టుకోవాలనుకుంది. పైగా ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా సెప్టెంబర్ 12, 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ అని పేరు పెట్టేసింది. అయితే మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణను దాఖలు చేశారు. దీంతో ఆ పేరు 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరుగా మారింది. అంతేకాదు ఆ అక్షరాల్లో కేవలం 36-అక్షరాల మధ్య తమ కూతుర్ని కుటుంబ సభ్యులు మద్దుగా పిలుచుకునే జామీ అనే పేరు ఉందని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అందువల్ల ఆ చిన్నారి విభిన్నమైన రెండు అడుగుల జనన ధృవీకరణ పత్రాన్ని పొందింది. దీంతో పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ చిన్నారి తల్లిని సెలబ్రేటి హోస్ట్ ఓప్రా ఇంటర్యూ చేసింది. ఈ మేరకు సాండ్రా తన కూతురి పేరు విభిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనుకోవడంతోనే గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు దక్కిందని ఓప్రాతో చెప్పింది. పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సమయానికి ఆ చిన్నారి వయసు 12 ఏళ్లు. ఈ క్రమంతో టెక్సాస్ రాష్ట్రం తన చట్టాన్ని మార్చడమే కాక పిల్లల జనన ధృవీకరణ సర్టిఫికేట్లో సరిపోయే పేరు మాత్రమే ఇవ్వాలని సూచించింది. (చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!) -
నిరీక్షణకు తెర.. సెల్ఫ్ అసెస్మెంట్తో పాటే ‘పీటీఐఎన్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న/నిర్మించుకున్నవారికి జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ (ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య) కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్ను ఎంతో కాలం క్రితమే జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఆన్లైన్ ద్వారా ప్రజలు సమర్పించిన వివరాలను నిర్ధారించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశాకే పీటీఐఎన్ కేటాయించేవారు. ఇప్పుడిక సెల్ఫ్ అసెస్మెంట్కు సంబంధించి జతపర్చాల్సిన పత్రాలు జత చేశాక, నివాస గృహమా, వాణిజ్య భవనమా, జోన్, సబ్జోన్ తదితర అవసరమైన వివరాలన్నీ నమోదు చేశాక చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. ఆస్తిపన్నును ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించగానే పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. చెల్లించిన ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీటీఐఎన్ జనరేట్ అయ్యాక సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. హెచ్చుతగ్గులుంటే సవరిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరగ్గానే పీటీఐఎన్ జనరేట్ అయ్యే ప్రక్రియ కూడా అందుబాటులోకి తెచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పీటీఐఎన్ జనరేట్ అయితే ఆ వివరాలు జీహెచ్ఎంసీకి చేరతాయి. జీహెచ్ఎంసీలో సంబంధిత సర్కిల్‌స్థాయి అధికారులు సంబంధిత ఆస్తిని తనిఖీ చేసి ఆస్తిపన్ను నిర్ధారిస్తారు. అలాంటి వారు సెల్ఫ్అసెస్మెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంటే ఇప్పటి వరకు ఆస్తిపన్ను నిర్ధారణ అయ్యాక పీటీఐఎన్ జనరేట్ చేసేవారు. కొత్త పద్ధతి వల్ల పీటీఐఎన్ ముందుగానే జనరేట్ అవుతుంది. బర్త్ సర్టిఫికెట్ ఫైల్ ట్రాకింగ్ సిస్టం.. ఆస్పత్రుల్లో శిశువుల జననం జరిగినప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయ్యేంత వరకు ఫైల్ ట్రాకింగ్ సైతం తల్లిదండ్రులకు తెలిసేలా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సైతం దాదాపుగా ఇదే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. -
దరఖాస్తు చేయగానే బర్త్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: ఇకపై మీ–సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకుంటే తక్షణమే (ఇన్‌స్టంట్‌గా) పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. పురపాలక శాఖ పౌర సేవల పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే ఆస్తి పన్నుల మదింపు, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మదింపు, ట్రేడ్ లైసెన్సు జారీ, ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరణ వంటి సేవలు లభించనున్నాయి. ఆస్తి పన్నులపై పునః సమీక్ష దరఖాస్తుతో పాటు ఈ పునః సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై అప్పీళ్లను 15 రోజుల గడువులోగా పరిష్కరించనున్నారు. ఖాళీ భవనాలు/ ఇళ్లకు ఆస్తి పన్నుల నుంచి ఉపశమనం కల్పించడానికి వెకెన్సీ రెమిషన్ దరఖాస్తులను సైతం 15 రోజుల్లోగా పరిష్కరించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని షెడ్యూల్–3లో పొందుపర్చిన ‘పౌర సేవల పట్టిక’లో నిర్దేశించిన గడువుల్లోగా ఆయా సేవలను ఇకపై కచ్చితంగా పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం అన్ని పురపాలికలకుఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో ఆన్లైన్ ద్వారా పౌరులకు సత్వర సేవలను అందించాలని సరళీకృత వాణిజ్యం(ఈఓడీబీ) సంస్కరణలు–2020 పేర్కొం టున్నాయని తెలిపారు. ఆన్లైన్/ మీ–సేవా ద్వారా పౌరులకు నిర్దిష్ట గడువులోగా సేవలు అందించాలని ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం సైతం పేర్కొంటోందని, ఈ క్రమంలో చట్టంలో పేర్కొన్న పౌర సేవల పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పౌర సేవల పట్టికను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు, పౌర సేవల కేంద్రం, పురపాలిక పోర్టల్‌లో ప్రదర్శనకు ఉంచాలని కోరారు. పురపాలక శాఖ పోర్టల్ https://cdma.telangana.gov.in లేదా మీ–సేవా కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కింద పేర్కొన్న సేవలను నిర్దిష్ట గడువులోగా పొందవచ్చు. వాట్సాప్‌లో ఆస్తిపన్నుల వివరాలు ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు ‘తెలంగాణ ఈ–పట్టణ సేవలు’పేరుతో పురపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించింది. 9000253342 నంబర్‌కు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరాలను పంపించనుంది. అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్‌లను కూడా పంపించనుంది. ఈమేరకు పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
సచివాలయ సేవల్లో ఇదో అద్భుతం
కొత్తపేట: అమెరికాలో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా వాసి ఇక్కడకు రాకుండానే కేవలం 15 రోజుల్లో బర్త్ సర్టిఫికెట్ పొందారు. జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల గ్రామం రెండో వార్డుకు చెందిన యర్రాప్రగడ కృష్ణకిషోర్ సుమారు పదేళ్ల కిందట అమెరికాలోని చికాగో వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయనకు గ్రీన్ కార్డు ఇమ్మిగ్రేషన్ నిమిత్తం బర్త్ సర్టిఫికెట్ అవసరమైంది. కోవిడ్ కారణంగా ఇక్కడికి స్వయంగా రాలేని ఆయన ఆ సర్టిఫికెట్ కోసం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని ఆన్లైన్లో సంప్రదించారు. స్పందించిన కలెక్టర్ రాజమహేంద్రవరం డీఎల్డీఓ, కొత్తపేట ఇన్చార్జ్ ఎంపీడీఓ కె.రత్నకుమారికి ఆ సమాచారం పంపించారు. ఆమె కృష్ణకిషోర్ నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు రప్పించుకుని, తహసీల్దార్ జీడీ కిశోర్‌బాబుకు పంపించారు. ఆయన వీఆర్ఓ కె.శ్రీనివాస్ ద్వారా విచారణ జరిపించి, నివేదికను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్‌కు సమర్పించారు. ఆయన సూచనల మేరకు పలివెల గ్రామ సచివాలయం–2 కార్యదర్శి కె.సురేష్, డిజిటల్ అసిస్టెంట్ లాజరస్ సాయంతో డేటా ఎంట్రీ చేసి, ఈ నెల 14న ఈ–మెయిల్ ద్వారా చికాగోలో ఉన్న దరఖాస్తుదారు కృష్ణకిషోర్‌కు బర్త్ సర్టిఫికెట్‌ను మెయిల్ ద్వారా పంపించారు. దీనివల్ల ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు ఇమ్మిగ్రేషన్ పని పూర్తయ్యింది. సాధారణంగా ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు బర్త్ సర్టిఫికెట్ పొందటానికి 60 రోజుల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా కేవలం 15 రోజుల్లోనే సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణకిశోర్ గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును అభినందిస్తూ కలెక్టర్‌కు లేఖ రాశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అసమానమైన సేవలు అందిస్తుండటం గొప్ప విషయమని అందులో పేర్కొన్నారు. కృష్ణకిశోర్ తాను అమెరికా నుంచి పలివెల వచ్చి వెళ్లేందుకు రూ.1.10 లక్షలు ఖర్చయ్యేదని తెలిపారు. ఆ మొత్తాన్ని కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి పంపించి.. కలెక్టర్ సూచించిన మేరకు ఆ నిధులను వినియోగించాలని కోరారు. దీంతో గ్రామ కార్యదర్శి సురేష్‌కు కలెక్టర్ రూ.5 వేలు రివార్డు ప్రకటించి, మిగిలిన రూ.1.05 లక్షలను గ్రామ సచివాలయ అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. సంబంధిత అధికారులను, కార్యదర్శి సురే‹Ùను, సచివాలయ సిబ్బందిని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. -
కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం
చండీగఢ్: ఆడవారి మీద వేధింపులకు ప్రధానమైన కారణం.. బలహీనులు, బయటకు చెప్తే.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు కూడా వారినే శిక్షిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మృగాళ్లు ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు వెలుగులోకి వచ్చే వార్తలు చూస్తే.. ఇది నిజమేననిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారికి అన్యాయం జరిగినప్పుడు సమాజం సంగతి పక్కనే పెడితే.. కుటుంబం తోడుగా నిలబడి మద్దతిస్తే చాలు.. మరిన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. కుమార్తెను వేధించిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం ఓ తండ్రి అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. ఆ వివరాలు.. చండీగఢ్‌కు చెందిన ఓ యువతి టెన్నిస్ శిక్షణ కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఓ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ఓ ఐదుగురు యువకులు బాధితురాలిని లైగింక వేధింపులకు గురి చేశారు. వీరిలో ఒక వ్యక్తి జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్ కూడా కావడం గమనార్హం. దీని గురించి బాధితురాలు తండ్రితో చెప్పింది. ఆయన ఈ విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని ఆలోచించలేదు. తన బిడ్డ పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్షపడాలని భావించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకు చేరింది. ఇక వారికి తప్పక శిక్ష పడుతుంది.. కూతురికి న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురయ్యింది. కేసు విచారణ సమయంలో పోలీసులు టెన్నిస్ అకాడమీ వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లు కోర్టుకు అందజేశారు. దాని ప్రకారం నిందితులంతా మైనర్లుగా భావించింది కోర్టు. వారికి బెయిల్ మంజూరు చేసింది. తప్పు చేసిన వాళ్లే దర్జగా బయటకు వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నిందితులు కోర్టుకు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారని గ్రహించిన ఆ తండ్రి.. వాస్తవాలు వెలుగు తీసేందుకు ప్రయత్నించాడు. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) నిజమైన బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆ తర్వాత కొన్ని నెలల పాటు శ్రమించి ఆ ఐదుగురు నిందితుల స్వగ్రామాలైన హరియాణాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించాడు. నిందితులు ప్రాథమిక స్థాయిలో చదివిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వారి అసలు పుట్టిన తేదీల గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతడి అనుమానం నిజమయ్యింది. పోలీసులు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. స్కూల్ రికార్డ్స్ ప్రకారం వారి మైనర్లు కాదని తేలింది. వీటిని కోర్టులో సమర్పించి.. నిందితుల బెయిల్ రద్దు చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. కోర్టు దీని గురించి పోలీసులను ప్రశ్నిస్తే వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ‘కోర్టు ఆదేశాల మేరకు మేం పత్రాలను పరిశీలించి రికార్డు సబ్మిట్ చేశాం. అయితే నిందితులు ఇచ్చిన పత్రాలు నిజమైనవా.. కావా అనే విషయం తేల్చాల్సింది కోర్టు’ అన్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు బాధితురాలి తండ్రి ఇంతటితో ఊరుకోలేదు. జరిగిన విషయాల గురించి హరియాణా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో ఒక నిందితుడు తప్పుడు పత్రాలు సమర్పించాడని రుజువయ్యింది. దాంతో ఆరోగ్య శాఖ అతడి బర్త్ సర్టిఫికెట్‌ను క్యాన్సల్ చేసింది. నిందితుడితో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరి మీద కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే కారణంతో కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కోర్టు విచారణకు తాత్కలికంగా బ్రేక్ పడింది. కోర్టులు తెరిచిన తర్వాత అయినా వీరందరికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాడు బాధితురాలి తండ్రి. ఏఐటీఏ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేను ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌కు లేఖ రాశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాక చండీగఢ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(సీఎల్‌టీఏ) నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడమే కాక వారి బెయిల్ బాండ్లను కూడా చెల్లించింది’ అని తెలిపాడు. దీని గురించి సీఎల్‌టీఏను ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున తామేమి స్పందించలేమని తెలిపింది. -
ఈపీఎఫ్‌వోలో జనన ధ్రువీకరణకు ఆధార్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులు తమ జనన తేదీ ధ్రువీకరణకు ఆధార్ కార్డును రుజువుగా చూపవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలిచ్చిందని పేర్కొంది. ఖాతాదారులు తమ ఆధార్‌తో ఆన్లైన్లో కేవైసీ సమర్పించవచ్చని వివరించింది. రికార్డుల్లో ఉన్న పుట్టిన రోజుకు, ఆధార్‌లో జనన తేదీకి మధ్య మూడేళ్లలోపు ఉంటే అధికారులు ఆధార్‌నే పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందిపడే ఖాతాదారులు తమ మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఉపసంహరించుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కేవైసీ ద్వారా పూర్తి వివరాలు అందజేసిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది. -
బర్త్ సర్టిఫికెట్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బర్త్ సర్టిఫికెట్ల కోసం బల్దియాకు దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో పెరుగుతున్నాయి. అంటే దీనర్థం నగరంలో జననాల రేటు పెరుగుతోందని కాదు.. తాము నగరంలోనే జన్మించామని నిరూపించుకునేందుకు కొందరికి ఉన్నపణంగా అవసరం ఏర్పడిందని.. ఈ దరఖాస్తుదారుల్లో రోజుల వయసున్న పిల్లలతోపాటు.. కాటికి కాలు చాచిన వృద్ధులున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో గతంతో పోలిస్తే.. జనన ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల నమోదవుతోంది. ప్రతిరోజూ బల్దియాకు వివిధ సర్కిళ్లకు వచ్చే దరఖాస్తులు, జారీ చేసే సర్టిఫికెట్లను పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్, ఈ జనవరి నెలను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జారీ చేసిన సర్టిఫికెట్ల సంఖ్యలో ఈ తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020 జనవరి 1వ తేదీన 88 మంది పురుషులకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. అందులో 38 మంది ఒకే వర్గానికి చెందినవారున్నారు. అదేరోజు 101 మంది మహిళలకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరవ్వగా.. అందులో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనార్హం. ఇదే గతేడాది జనవరి 1వ తేదీన ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. దాదాపు రోజువారీ సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని కూడా అధికారులు చెబుతున్నారు. మరీ నిజాం కాలం నాటి సర్టిఫికెట్లా? ‘1936లో జన్మించిన నాకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వండి.. 1945లో పుట్టిన నాకు జనన ధ్రవీకరణ పత్రం ఇవ్వండి..’అంటూ పాతబస్తీలోని వివిధ సర్కిల్ ఆఫీసుల్లో బల్దియా అధికారులకు మునుపెన్నడూ చూడని దరఖాస్తులు వస్తున్నాయి. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్తో ఏం పని? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం హయాంలో ఉన్న బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది. అందులో 99 శాతం దరఖాస్తుల్లో వీరి డేటా దొరకడం లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తును విచారణ కోసం పంపుతున్నారు. దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. లేని వారికి దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. వక్ఫ్బోర్డుకూ అదే రీతిలో దరఖాస్తులు ఇటు వక్ఫ్ బోర్డుకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు దరఖాస్తులు వచ్చేవి. అయితే జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత తదితర వివరాలు ఉండటం గమనార్హం. అనూహ్యంగా పెరిగిన ఈ దరఖాస్తులను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులే విస్మయం చెందుతున్నారు. ఆ దేశాల వారేనని అనుమానం.. నగరంలోని పాతబస్తీతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందారు. వీరంతా ఇప్పటికే అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్‌పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న నేపథ్యంలో వీరంతా బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్లకు తప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు పలువురు తమకు కొత్తగా జనన ధ్రువీకరణాలు కావాలని అడుగుతుండటంతో, వాటిలో అనుమానాస్పదంగా.. రికార్డుల్లోలేని దరఖాస్తుల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు. -
బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....
సాక్షి, న్యూఢిల్లీ : తన బిడ్డకు తండ్రి ఎవరో తప్పు చెప్పినందుకు తల్లికి, అవును ఆ బిడ్డకు తండ్రిని తానేనంటూ నాటకమాడిన ఆ తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్‌కు వెస్ట్ వేల్స్‌లోని స్వాన్సీ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. వారిద్దరు జైలు శిక్ష పూర్తి చేసుకొని వచ్చేవరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను స్వయంగా చూసుకోవాల్సిందిగా ఆ బిడ్డ అసలు తండ్రి ఆశ్లే సేస్ని కోర్టు ఆదేశించింది. వెస్ట్ వేల్స్‌లోని మాన్సెల్టన్కు చెందిన లూజీ బాయిస్ (30) మూడు నెలల క్రితం ప్రసవించింది. అప్పటికే తన మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లీసేస్తో ఆమె గొడవపడి విడిపోయింది. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వెస్ట్ వెల్స్ నిబంధనల ప్రకారం బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు బర్త్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి బిడ్డ పేరిట సర్టిఫికెట్ తీసుకోవాలి. మొదటి బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడి విడిపోయినందున ఇక అతనితో ఎలాంటి సంబంధాలు ఉండరాదని భావించిన లూజీ బాయిస్, తాను ప్రస్తుతం ప్రేమిస్తున్న 34 ఏళ్ల నాథన్ లెగట్తో కలిసి బిడ్డ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. అక్కడ అధికారుల ముందు బిడ్డకు తల్లిగా సంతకం చేసింది. ఆ తర్వాత అధికారులు బిడ్డకు తండ్రి మీరేనా? అంటూ నాథన్ లెగట్ను అడిగారు. అందుకు ఆయన అవునంటూ సంతకం చేస్తూ భోరుమని ఏడ్చారు. దీంతో అధికారులకు సందేహం వచ్చింది. వారిని విచారించి అసలు తండ్రి ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యతను అధికారులు ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు. ఎన్జీవో సంస్థ డీఎన్ఏ పరీక్షల ద్వారా నాథన్ లెగట్ తండ్రి కాదని, లూజీ బాయిస్ మొదటి బాయ్ ఫ్రెండే ఆశ్లే లేస్ తండ్రని తేల్చింది. అబద్ధమాడిన రెండో బాయ్‌ఫ్రెండ్ నాథన్, లూజీ బాయిస్, మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లే సేస్ ఇందులో తల్లి బాయిస్, తండ్రిగా నాథన్ లెగట్లు అబద్ధామాడినందుకు వారిపై పోలీసులు కేసు పెట్టి కేసు విచారణను స్వాన్సీ కోర్టుకు అప్పగించారు. బిడ్డ విషయంలో అబద్ధమాడినందుకు కోర్టు తల్లికి ఎనిమిది నెలల జైలు శిక్ష, తాజా బాయ్ ఫ్రెండ్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండు రోజుల క్రితం తీర్పు చెప్పింది. తన మాజీ ప్రియురాలు లూజీ బాయిస్ అన్నా, తమ ఇద్దరికి పుట్టిన బిడ్డ అన్నా ఇప్పటికీ తనకు ఇష్టమేనని విచారణ సందర్భంగా అంగీకరించిన బిడ్డ అసలు తండ్రి ఆశ్లే లేస్కే వారు విడుదలై వచ్చే వరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను కోర్టు అప్పగించింది. అయితే శిక్షపడే నాటికి బాయిస్ రెండోసారి గర్భంతో ఉంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరో కోర్టు ప్రశ్నించలేదు, తల్లి కూడా ఎవరికి చెప్పలేదు. -
క్రికెటర్ రసిక్ సలామ్‌పై రెండేళ్ల సస్పెన్షన్
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్–19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగా ల్కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్–12 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఒక మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్‌కు చేటు తెచ్చుకున్నాడు. -
చట్టాన్ని పక్కనపెట్టి చిన్నారికి బర్త్ సర్టిఫికెట్
దుబాయ్: హిందూ, ముస్లిం దంపతులకు జన్మించిన ఓ 9నెలల చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఔదార్యతను చాటుకుంది. నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత్‌కు చెందిన హిందూ తండ్రి, ముస్లిం తల్లికి జన్మించిన పాపకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మీడియా తెలిపింది. యూఏఈలోని వివాహ చట్టం ప్రకారం ఓ ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన మహిళను వివాహమాడొచ్చు. కానీ ఓ ముస్లిం మహిళ మాత్రం ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకోరాదు. హిందువైన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సాబూ సిద్ధికీ 2016లో కేరళలో వివాహం చేసుకున్నారు. షార్జాలో నివాసముంటున్నారు. వీరికి జూలై 2018లో పాప జన్మించింది. కిరణ్ హిందువు కావడంతో అతని కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. దీంతో యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షౖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిబంధనలు మార్చి అధికారులు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దేశంలో ఇదే మొదటిసారి అని కిరణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సహకరించిన ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎమ్.రాజమురుగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఔదార్యతను ప్రదర్శించే దేశంగా ముందుండటానికి యూఏఈ 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా ప్రకటించింది. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా, ఇతర మతంలోని వారిని అనమతించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. -
జనన ధృవీకరణ పత్రం జారీలో ఔదార్యత
దుబాయ్: తమ దేశ చట్టాలను పక్కన పెట్టి ఇద్దరు భారతీయ నిర్వాసితులకు పుట్టిన శిశువుకు జనన ధృవీకరణ పత్రం జారీ చేసి యూఏఈ ప్రభుత్వం తన ఔదార్యతను ప్రదర్శించింది. జనన ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఔదార్యత ప్రదర్శించడం ఏమిటి అని సందేహం తొలుస్తుంది కదూ. కానీ యూఏఈ చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చి యూఏఈలో నివాసముంటున్న వారు పెళ్లి చేసుకోవాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ముస్లిం పురుషుడు, ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ముస్లిం మహిళ... వేరే మతానికి చెందిన పురుషుడిని పెళ్లి చేసుకోరాదు. షార్జాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్ధిఖీలు 2016లో కేరళలో పెళ్లి చేసుకున్నారు. కిరణ్ బాబు హిందువు కాగా.. సనమ్ సాబూ సిద్ధిఖీ ముస్లిం. వీరిద్దరికీ 2018 జూలైలో కూతురు పుట్టింది. అయితే కుమార్తె జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. దీనిపై కిరణ్ బాబు మాట్లాడుతూ...‘నాకు అబుదాబి వీసా ఉంది. అక్కడే ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకున్నాను. అక్కడే ఉన్న మెదియోర్ 24/7 ఆసుపత్రిలో నా భార్యను డెలివరీ నిమిత్తం చేర్పించాను. నేను హిందువును కావడంతో నా కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. విచారణ నాలుగు నెలలు సాగింది. నా కేసును కోర్టు కొట్టేసింద’ని వెల్లడించారు. తన కూతురుకు ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆశలన్నీ యూఏఈ ప్రభుత్వ క్షమాభిక్షపైనే పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ ఎంబసీ కూడా తనకు బాగా సహకరించిందని కిరణ్ బాబు తెలిపారు. జనన ధృవీకరణ పత్రం జారీలో సహాయపడిన ఇండియన్ ఎంబసీ కౌన్సెలర్ ఎం రాజమురుగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలు మార్చి జనన ధృవీకరణ పత్రం జారీ చేయడం దేశంలో ఇదే మొదటిదని ఆయన తెలిపారు. కాగా ఔదార్యత చూపే దేశాల్లో యూఏఈ అందరికంటే ముందుంటుందని చెప్పటానికి యూఏఈ ప్రభుత్వం 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టోలరెన్స్‌గా ప్రకటించింది. రెండు విభిన్న సంస్కృతులను కలిపే విధంగా, ఇతర మతాలను ప్రజలు అనుమతించే వాతావరణం కల్పించటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని యూఏఈ చేపట్టింది. జనన ధృవీకరణ పత్రం జారీచేయడం పట్ల దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
తీరనున్న ఇబ్బందులు
సాక్షి, నార్నూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం పుట్టిన శిశువు పేరుతో తక్షణమే ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందే విధంగా చర్యలు చేపడుతోంది. అదే విధంగా పీహెచ్సీలలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రకాల పరీక్షలు (రక్త, మూత్ర, షుగర్, బీపీ) చేయించుకునేందుకు హెమోటాలజీ ఎనలైజర్ మిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పటివరకు పీహెచ్సీలలో జరిగే ప్రసవ అనంతరం తక్షణమే కేసీఆర్ కిట్టు అందజేస్తున్నారు. దీంతో పాటు మరింత పారదర్శకంగా ఉండేందు కు 2019 జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం జరిగే శిశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణపత్రం జారీ చేస్తున్నారు. పీహెచ్సీ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణపత్రం ఆధారంగా సబంధి త మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ఒరి జినల్ ధ్రువీకరణ పత్రం క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. దీంతో నిరక్షరాస్యులు భవి ష్యత్ అవసరాల నిమిత్తం అధికారుల చుట్టూ జన న ధ్రువీకరణ పత్రం పొందేందుకు కార్యాలయా ల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెట్టారు. ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం జనవరి ఒకటి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీహెచ్సీలో కాన్పు అయిన వారికి వెంటనే ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను చేపడుతున్నాం. దీంతో బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో చూపిస్తే వెంటనే సర్టిఫికెట్ జారీ చేస్తారు. –శ్రీకాంత్, పీహెచ్సీ వైద్యాధికారి, నార్నూర్ డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం -
కాసులిస్తేనే ధ్రువీకరణ!
కరీంనగర్ హెల్త్: పుట్టినా పైసలే.. చచ్చినా పైసలే అన్నట్లు ఉంది వ్యవహారం. ఏ సర్టిఫికెట్ కావాల న్నా చేతులు తడపాల్సిన దుస్థితి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ఉంది. రికార్డులు భద్రపరిచే గది సిబ్బంది కాసుల కక్కుర్తికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందాలంటే డబ్బులు ఇవ్వందే అందడం లేదు. అవసరమే ఆసరా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మంథని శ్రీరా ములు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుమారుడు శంకర్‌దాసు దుబయ్‌లో ఉంటున్నాడు. మరణించిన తర్వాత గడువులోపు ధ్రువీకరణపత్రం తీసుకోవాలనే అవగాహన లేకపోవడంతో అతను దుబయ్ వెళ్లిపోయాడు. తన తల్లికి ప్రభుత్వం నుంచి వితంతువు పింఛన్ దరఖాస్తు కోసం తన తండ్రి మరణ ధ్రువీకరణపత్రం అవసరం ఏర్పడింది. దీని కోసం దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీలో రికార్డు కాలేదని ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో మృతుడి భార్య దరఖాస్తు చేసుకోగా రికార్డులు ఇప్పుడు దొరకవని.. పరిశీలించి రాయాలంటే డబ్బులు ఖర్చు అవుతుందని అనధికార అసిస్టెంట్ ద్వారా డిమాండ్ చేశాడు. ఇలా రెండు వారాల తర్వాత ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి జోక్యంతో మరణ ధ్రువీకరణపత్రం జారీ అయ్యింది. అవగాహన లోపం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి నుంచి జనన, మరణ ద్రువీకరణపత్రం పొందాలంటే కాసులు ఇవ్వాల్సిందే. ఈ ధ్రువీకరణపత్రం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రం సకాలంలో పొందాలనే అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకొని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రభుత్వ ప్రధానాస్పత్రి రికార్డులు భద్రపరిచే గది అధికారి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్ జారీ చేయడానికి రెండు నుంచి రూ.5వేలు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. డిమాండ్ చేసిన డబ్బులు ముట్టచెప్పకపోతే వారాల తరబడి రికార్డులు లేవంటూ తిప్పుకుంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా రికార్డులు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు రెండు నెలల్లోపు సంబంధిత మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల నుంచి పొందాల్సి ఉంటుంది. రెండు నెలల గడువు దాటితే ఆర్డీవో నుంచి పొందాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వాస్పత్రి వైద్యుడి ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రిలోని రికార్డులు ఉండే గది అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికెట్ జారీ చేయడానికి రికార్టుల గది సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డులు లేవని, వెతికిన దొరకడం లేదని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పులు ! ధ్రువీకరణపత్రాల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో రికార్డు గది సిబ్బంది వివరాలు తప్పులతడుకగా నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, లేదా తల్లిపేరు, లేదా మరణించిన వారి పేర్లు, పుట్టిన, మరణించిన తేదీలు ఇలా ఏదో ఒకటి రికార్డుల్లో తప్పులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ఇక్కడి నుంచి రికార్డుల సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. రికార్డులలో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి రికార్డుల గది అసిస్టెంట్‌ను సంప్రదించాల్సి వస్తుంది. వాటిని సరిచేసి సర్టిఫికెట్ జారీ చేయాలంటే మరికొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తే అందినకాడికి దండుకుంటున్నారు. అనధికార సిబ్బందితో పనులు జనన, మరణ ధ్రువీకరణపత్రాలు భద్రపరిచే రికార్డు గదిలో ప్రైవేట్ వ్యక్తుల చెలామణి చేస్తూ.. రికార్డులు రాస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. రికార్డుగదిలో ఒకరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. పని ఒత్తిడి అవుతుందనే సాకుతో అనధికారికంగా మరొకరిని అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసుకొని అతని ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. -
‘గాంధీది కూడా ఈ దేశం కాదంటారేమో’
కోల్‌కతా : ‘ఒక వేళ రేపు మహాత్మ గాంధీ కుటుంబం తమ బర్త్ సర్టిఫికేట్‌ను చూపించలేకపోతే అప్పుడు జాతీపిత మహాత్మ గాంధీని కూడా మనదేశానికి చెందిన వ్యక్తి కాదంటారేమో’ అంటూ మండిపడ్డారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ నివేదిక అంతా ఓ బూటకమంటూ కొట్టిపారేశారు. బెంగాలీ మాట్లాడే ప్రజలను అస్సాం ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురిచేస్తూ, వారందరిని భారతీయులు కాదంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశిస్తూ ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల జన్మ ధ్రువీకరణ పత్రాన్ని చూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఒక వేళ మహాత్మ గాంధీ కుటుంబ సభ్యులు కూడా బర్త్ సర్టిఫికెట్‌ను చూపించలేకపోతే అప్పుడు గాంధీజీని కూడా ఈ దేశం వాడు కాదంటారా అని ప్రశ్నించారు. కొద్ది రోజులైతే పశువులకు కూడా బర్త్ సర్టిఫికెట్లు ఉండాలంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ఆర్సీ నివేదిక అస్సాంలోని దాదాపు 40 లక్షల మందిని అక్రమ వలసదారులంటుంది. వారిలో దాదాపు 38 లక్షల మంది బంగ్లా మాట్లాడే హిందువులు, ముస్లింలు ఉన్నారన్నారు. ఓట్ల కోసమే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని ఆరోపించారు. బీజేపీవన్ని ఓటు బ్యాంకు రాజకీయాలంటూ విమర్శించారు. అంతేకాక జమిలీ ఎన్నికలపై స్పందిస్తూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంత సులభం కాదు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే సరిపోతుందన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే అప్పుడు పరిస్థితి ఎంటి అని ప్రశ్నించారు. అంటే కేంద్రం, రాష్ట్రాలు మళ్లీ ఎన్నికలకు వెళ్తాయా అంటూ ప్రశ్నించారు. అందుకే తాము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామన్నారు. -
తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లోకి...
సాక్షి, చెన్నై: తండ్రి లేకుండా బిడ్డ..? మద్రాస్ హైకోర్టు చొరవతో టెక్నికల్‌గా ఇది సాధ్యమయ్యింది. తమిళనాడులో వీర్య దాత ద్వారా బిడ్డను కన్న ఓ తల్లి.. బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరును తొలగించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దీంతో చిన్నారి తావిషి పెరారా దేశంలో ‘తండ్రి లేని బిడ్డగా’ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... త్రిచీకి చెందిన మధుమిత రమేష్ అనే మహిళ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారం మేర విడిపోయారు. ఆపై కొన్నిరోజుల తర్వాత వీర్యం డోనర్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో మధుమిత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే త్రిచీ కార్పొరేషన్ అధికారులు మాత్రం బిడ్డ తండ్రిగా వీర్యదాత మనిష్ మదన్‌పాల్ మీనా పేరును బర్త్ సర్టిఫికేట్లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధుమిత.. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాల్సిందిగా అధికారులకు అర్జి పెట్టుకుంది. పేర్లలో తప్పులను మాత్రమే సవరించే వీలుందని, అంతేగానీ ఏకంగా పేరునే తొలగించే అవకాశం లేదని అధికారులు ఆమెకు బదులిచ్చారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి తిరస్కరించటంతో మరోసారి ఆమె కోర్టు తలుపు తట్టారు. అదే సమయంలో ఆమె మాజీ భర్త చరణ్ రాజ్, వీర్యపు డోనర్ మనీష్‌లు ఇద్దరూ ఆ బిడ్డకు తాము తండ్రులం కాదంటూ అఫిడవిట్లు దాఖలు విశేషం. చివరకు మధుమిత అభ్యర్థనను అంగీకరించిన బెంచ్.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని త్రిచీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తద్వారా తావిషి తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లో నిలిచిపోనుంది. -
పాస్‌పోర్ట్‌కు బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు
- ఇకపై ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఉన్న వివరాలే ప్రాతిపదిక - విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం సాక్షి, అమరావతి: పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆ సర్టిఫికెట్ ఉంటేనే పాస్ట్‌పోర్ట్ వచ్చే పరిస్థితి. అయితే తాజాగా ఈ నిబంధనలను సవరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ల జారీని సరళతరం చేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విదేశీ మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డుతోనైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆధార్, ఓటరుకార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కార్డులపై పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. కాగా, ఎస్ఎస్సీ సర్టిఫికెట్ జనన ధృవీకరణకు ప్రాతిపదికగా ఉండేది. కొంతమంది నిరక్షరాస్యులు ఈ నిబంధన వల్ల పాస్‌పోర్ట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసే ఏవైనా రెండు గుర్తింపు కార్డులుంటే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే పోలీసు వెరిఫికేషన్ కూడా దరఖాస్తు చేసిన వారంలోగా పూర్తి చేస్తున్నట్టు పేర్కొంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు.. ► ఆధార్ కార్డు ► ఓటరు కార్డు ► డ్రైవింగ్ లైసెన్సు ► ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు ► అద్దెకున్న వారు రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వాలి ► విద్యార్థులకు బోనఫైడ్ సర్టిఫికెట్ -
పాస్‌పోర్ట్ నిబంధనలు ఇక సరళం
పుట్టిన తేదీకి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు ► పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, బీమా పత్రాల్లో ఏదైనా ఒక్కటి చాలు ► అటెస్టేషన్/నోటరీలకు స్వస్తి న్యూఢిల్లీ/విశాఖపట్నం: కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది.వివిధ కేటగిరీలకు చెందిన వారికి మినహాయింపులు ఇచ్చింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఈ వివరాలను శుక్రవారం వెల్లడించారు. సవరించిన నిబంధనల్లో ముఖ్యమైనవి ► పుట్టిన తేదీని నిర్ధారించేందుకు తప్పనిసరి అయిన బర్త్ సర్టిఫికెట్ ఇకమీదట అవసరం లేదు. పదో తరగతి మెమో, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ జారీచేసిన బీమా పాలసీ పత్రం.. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఆధారంగా చూపితే సరిపోతుంది. అయితే వాటిలో పుట్టినతేదీ ఉండాలి. ► గతంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉండగా, ఇకపై ఎవరి సంరక్షణలో ఉన్నారో వారి వివరాలు తెలపాలి. పాస్‌పోర్ట్ పుస్తకంలో అభ్యర్థి కోరిక మేరకు తల్లి లేదా తండ్రి పేరును నమోదు చేస్తారు. దరఖాస్తులో అనుబంధ వివరాలను తెల్ల కాగితం మీద సంతకం చేసి రాసివ్వాలి. నోటరీ, అటెస్టేషన్లకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ► పెళ్లయిన అభ్యర్థులకు అనెక్సర్ ‘కె’ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పనిలేకుండా చేశారు. అభ్యర్థి విడాకులు పొందితే కోర్టు మంజూరు చేసిన పత్రాలు సమర్పించాలి. భర్త లేదా భార్య పేరును దరఖాస్తులో రాయనక్కర్లేదు. ► దత్తత తీసుకున్న పిల్లల విషయంలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అది లేకపోతే దరఖాస్తుదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ళీ ప్రభుత్వోద్యోగులు గుర్తింపు పత్రంగా అనెక్సర్ ‘బి’, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌గా అనెక్సర్ ‘ఎం’ సమర్పించాలి. అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సర్ ‘ఎన్’ ఇవ్వాలి. సాధువులు, సన్యాసులు దరఖాస్తులో తల్లిదండ్రుల పేర్లకు బదులుగా తమ గురువు పేరు, గుర్తింపు పత్రం సమర్పించాలి. కాగా, నూతన నిబంధనలు ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. గతంలో జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారంతా ఆర్డీవో జారీ చేసిన పత్రం అందించాల్సిన నిబంధన ఉండేది. ఆ నిబంధన రద్దయింది. -
నిజామాబాద్ జిల్లాలో తొలి, చివరి రోజు!
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా నేటితో రెండు జిల్లాలుగా మారనుంది. కొత్త జిల్లాగా కామారెడ్డి ఏర్పడనుంది. అయితే, సోమవారం పుట్టిన పిల్లలందరికీ ఆ రోజు చారిత్రాత్మకం కానుంది. సోమవారం జన్మించిన పిల్లలకు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లో నిజామాబాద్ జిల్లాగానే ఉంటుంది. అంటే ఒక్క రోజు నిజామాబాద్‌లో ఉండి, మిగతా జీవిత కాలం మొత్తం కామారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. నిజామాబాద్ జిల్లాలో ఇదే తొలి, చివరి రోజు కావడంతో ఆ రోజు వారికి మరుపురాని రోజుగా మిగులనుంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో సోమవారం సుమారు 200లకు పైగా పిల్లలు పుట్టారని అంచనా. అలాగే మంగళవారం పుట్టే పిల్లలకు కామారెడ్డి జిల్లా బర్త్ సర్టిఫికేట్ లభిస్తుంది. దీంతో సోమ, మంగళవారాల్లో జన్మించిన పిల్లలకు ఈ రెండ్రోజులుగా ప్రత్యేక రోజులుగా మారనున్నాయి. గుర్తుండిపోయే రోజు: అర్షియా, తిర్మలాపూర్ సోమవారం నాడు బాబు పుట్టాడు. నిజామాబాద్ జిల్లాలో పుట్టాడు కనుక నిజామాబాద్ జిల్లా పేరుతో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలోకి అడుగు పెడతాడు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. -
జీజీహెచ్‌లో ‘జనన’ పత్రాలకు తంటా
* జనన ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్య ధోరణి * ప్రచారం ఘనం.. అమలు శూన్యం * జీజీహెచ్ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ బిడ్డ పుట్టిన 24 గంటల్లో ఆధార్ ఎన్రోల్మెంట్, జనన సర్టిఫికెట్ జారీ అంటూ ఒక పక్క ప్రచారాలతో ఊదరగొడుతున్నా.. అమలు విషయంలో మాత్రం లబ్ధిదారులకు వీటి కోసం నెలల తరబడి పడిగాపులు తప్పుడం లేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని అమరావతిరోడ్డుకు చెందిన ముక్కా రాజేశ్వరి సెప్టెంబర్ 21న జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లను ఆసుపత్రి అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం ఆమె సోదరుడు కల్లవరపు రాజేంద్ర సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలోని జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించగా.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ అందజేసి, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్‌ను బయట చేయించుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్‌కు చెందిన కట్టమూరి కృష్ణమూర్తి సెప్టెంబర్ 1న జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని మరణ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే ఇవ్వాల్సి ఉండగా, సంబంధిత సిబ్బంది, అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం కృష్ణమూర్తి కుటుంబసభ్యులు సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చారు. నెలరోజులు అయినప్పటికీ మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయలేదు. పైగా దరఖాస్తు చేసుకుని నెలరోజుల తరువాత వస్తే అందిస్తామని చెప్పడంతో సిబ్బంది తీరును విమర్శిస్తూ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇలా ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్‌లో జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. రోల్ మోడల్ ఆస్పత్రిలోనే... రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మే 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని జీజీహెచ్‌లో లాంచనంగా ప్రారంభించింది. ఆసుపత్రిలో పుట్టిన 24 గంటల వ్యవధిలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరును కూడా లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. కానీ జీజీహెచ్‌లో కాన్పు జరిగి ఇంటికి వెళ్లిన తరువాత వారంరోజులు ఆగి వస్తే సర్టిఫికెట్ ఇస్తామంటూ బాలింతలను, వారి కుటుంబ సభ్యులను సంబంధిత సిబ్బంది అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్ బయటేనంటా..! పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఇవ్వకుండా బయట చేయించుకోవాల్సిందేనంటూ పంపించి వేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రాల మంజూరు కూడా ఆలస్యంగానే జరుగుతోంది. గత నెలలో మరణిస్తే, ధృవీకరణ పత్రం నెలరోజులు గడిచినా ఇవ్వడం లేదని కొందరు ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది 24 గంటల్లో మంజూరు చేయాల్సిన సర్టిఫికెట్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సకాలంలో సర్టిఫికెట్లు మంజూరు అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
ఇక పుట్టుకతోనే ఆధార్..
సాక్షి,సిటీబ్యూరో: బిడ్డ పుట్టగానే ఆధార్, జనన సర్టిఫికెట్ల జారీకి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ద్రువ పత్రాలను ఏకకాలంలో అందించనుంది. ఇందుకు పది ప్రభుత్వ ఆస్పత్రులతో సహా మొత్తం 25 ఆస్పత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. తొలుత ప్రముఖ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. పేట్ల బురుజు ఆధునిక మెటర్నిటీ సెంటర్లో తొలుత ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆస్పత్రిలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. ఆటంకాలు లేకపోవడంతో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ మెటర్నిటీ ఆస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అన్నింటినీ ఒకే రోజు మున్సిపల్ పరిపాలన, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుల ద్వారా లాంఛనంగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. పేట్లబురుజుతో పాటు కోఠి, కింగ్‌కోఠి, గాంధీ, మలక్‌పేట, వనస్థలిపురం తదితర ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, ఈఎస్ఐ మెటర్నిటీ ఆస్పత్రి, తగిన సదుపాయాలున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వచ్చేనెల -
రేపట్నుంచి ‘పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ ’
తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆస్పత్రుల్లో అమలు సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు’ సౌకర్యం ఆగస్ట్ 1 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. తొలుత ఐదు ఆస్పత్రుల్లోనే దీనిని చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో విశాఖలోని విక్టోరియా జనరల్ ఆస్పత్రి, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రులు, తిరుపతిలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్నాయి. ఈ ఐదు ఆస్పత్రుల్లోనూ పుట్టిన వెంటనే బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ నంబర్‌ను కేటాయిస్తారు. దీనిని తల్లి ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తారు. అనంతరం నెలలోగా కార్డు అందజేస్తారు. కాగా, బిడ్డకు పేరు లేకపోయినా బేబీ ఆఫ్ అని తల్లి, తండ్రి పేర్లు రాసి వీటిని ఇస్తారు. పేరు పెట్టాక దీనిని తిరిగి మార్చుకునే వీలుంటుంది. -
పుట్టిన వెంటనే ఆధార్
-
పుట్టిన వెంటనే ఆధార్
హరియాణాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతంతో ఏపీలో త్వరలో.. సాక్షి, హైదరాబాద్ : ఆధార్ కార్డు జారీలో వినూత్న విధానానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకూ పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు ఇవ్వనున్నారు. తొలుత హరియాణాలో పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో దీనిని పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర బృందం మంగళవారం రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. పుట్టిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలోనే జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికెట్) పత్రం ఇచ్చే ఏర్పాటు ఈ మధ్యనే చేశారు. దీంతో పాటే ఆధార్ కార్డును కూడా ఇచ్చేందుకు ప్రత్యేక ‘యాప్’ను తయారు చేస్తున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 1,700 మంది స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. వీళ్లందరికీ ప్రత్యేక యాప్‌తో కూడిన ట్యాబ్‌లను ఇస్తారు. ప్రసవమైన వెంటనే బిడ్డతో పాటు తల్లి పేరునూ ఆ ట్యాబ్‌లో నమోదు చేస్తారు. -
పుట్టగానే ఆధార్, బర్త్ సర్టిఫికెట్స్
శిశువు పుట్టగానే బర్త్, ఆధార్ సర్టిఫికెట్ల జారీ ఇక ప్రత్యేకంగా దరఖాస్తు అవసరం లేదు ఆస్పత్రి నుంచే అన్ని వివరాల సేకరణ డిజిటల్ లాకర్లో నిక్షిప్తం త్వరలో నగరంలో అమలుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు సిటీబ్యూరో : తల్లి గర్భం నుంచి శిశువు భూమ్మీదకొచ్చి కళ్లు తెరవగానే బర్త్ సర్టిఫికెట్..ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లకుండానే ఒక ఆధార్ నెంబర్. పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే.. వాటి నమోదు కూడా... - అవును ఇది నిజమే...తల్లిదండ్రులకు శుభవార్తే. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుల కోసం కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా సులువైన పద్ధతిలో ఆస్పత్రి నుంచే ఈ రెండు పనులు పూర్తయ్యేలా జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. శిశువు జన్మించిన ఆస్పత్రి నుంచే కావాల్సిన వివరాలను సేకరించి ఆయా సర్టిఫికెట్లు జారీ చేసేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాలు, మీ- సేవ కేంద్రాలకు వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ప్రజలు ఆన్లైన్నుంచే డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లలో మునిగిన జీహెచ్ఎంసీ.. ఐటీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ అదనపు సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో శిశువులు పుట్టగానే...వారి జనన వివరాల నమోదుతో బర్త్ సర్టిఫికెట్‌ను డిజిటల్ లాకర్లో ఉంచుతారు. దాంతోపాటే శిశువు ఫొటోను తీసి ఒక ఆధార్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్ నమోదుకు ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ తదితరమైనవి పిల్లలు ఎదిగాక తీయాల్సి ఉన్నందున, తాత్కాలికంగా శిశువు ఫొటో తీసి, శిశువు తల్లి లేదా తండ్రి ఆధార్‌నెంబర్‌కు అనుసంధానం చేసి డిజిటల్ లాకర్లో ఉంచుతారు. శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే వీటిని డిజిటల్ లాకర్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆధార్ నమోదుకు వివరాలు సేకరించే నిపుణులను ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. తొలుత ప్రయోగాత్మకంగా కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. దశల వారీగా వివిధ ఆస్పత్రులకు ఈ పథకాన్ని విస్తరింపచేయాలని యోచిస్తున్నారు. దీని ద్వారా ఇకపై పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీ , మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనీ లేదు. దరఖాస్తు కూడా చేసుకోకుండానే బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌నమోదు, డిఫెక్ట్ సర్టిఫికెట్(పుట్టుకతో లోపాలున్న వారికి)లు సిద్ధం కానున్నాయి. ‘తెలంగాణ ప్రభుత్వ శిశు ఆధార్ ప్రాజెక్ట్’ (టీ శాప్)ను వినియోగించుకొని జీహెచ్ఎంసీ ఈ ఏర్పాట్లు చేయనుంది. ఇది నిజంగా కాబోయే తల్లిదండ్రులకు ఎంతో ఉపయుక్తమైన అంశంగా చెప్పొచ్చు. -
‘జనన ధ్రువీకరణ’ పొందాలంటే!
పాలకోడేరు రూరల్ : పిల్లలను పాఠశాలల్లో చేర్చాలన్నా.. కళాశాలల్లో అడ్మిషన్ కావాలన్నా.. స్కాలర్షిప్, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలన్నా.. పాస్‌పోర్టు తీసుకోవాలన్నా.. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రం అత్యవసరం. ఈ పత్రం ఎలా పొందాలో మనలో చాలామందికి తెలీదు. దీని గురించి పాలకోడేరు ఆర్ఐ ఎం.మహేశ్వరరావు వివరించారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు గానీ, కుటుంబ సభ్యులుగానీ ముందు పంచాయతీలో.. లేదా మున్సిపాలిటీలో ఆ విషయాన్ని తెలియజేయాలి. అక్కడ పుట్టిన తేదీ, సంవత్సరం నమోదు చేయించాలి. * ఆ తర్వాత మనకు జనన ధ్రువీకరణ పత్రం అవసరమైనప్పుడు పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే ఫారం-5పై జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. * అదే మున్సిపాలిటీలో అయితే మీసేవా కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుని నామమాత్రపు ఫీజు చెల్లించాలి. ఆ దరఖాస్తును మీ సేవా కేంద్రం వారు మున్సిపాలిటీకి పంపిస్తారు. అక్కడ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ సేవా కేంద్రం ద్వారా ప్రింటవుట్ జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. * బిడ్డ పుట్టిన వెంటనే పంచాయతీలో నమోదు చేయకపోతే సంవత్సరం లోపు స్థానిక తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయన పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ అధికారికి ఆదేశాలు జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తారు. దీనికోసం దరఖాస్తుకు తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డులతోపాటు బిడ్డ పుట్టిన ఆస్పత్రి జారీ చేసిన సర్టిఫికెట్ జిరాక్సు జతచేయాలి. 1989 జూన్ తర్వాత పుట్టిన వారికి.. జనన సమయంలో పంచాయతీ/మున్సిపాలిటీలో నమోదు చేయించుకోని, 1989 జూన్ తర్వాత పుట్టిన వారికి కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రం అవసరం. వారు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. వారు ఈ కింది పత్రాలు దరఖాస్తుకు జతచేయాలి. రేషన్, ఆధార్ కార్డు జిరాక్సు విద్యార్హత సర్టిఫికెట్ అభ్యర్థి సోదరుల్లో ఒకరిది మార్కుల లిస్టు తండ్రి, తల్లి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్సు, తండ్రి గానీ తల్లి గానీ ఆఫిడవిట్ నోటరీ మంత్రసాని అఫిడవిట్ నోటరీ లేదా ఆస్పత్రిలో రిజిస్టర్‌చేసిన పత్రం నానమ్మ, అమ్మమ్మ గ్రామాల్లోని పంచాయతీలో పుట్టిన తేదీ నమోదు కాని పత్రాలు (నాన్‌లెవ ల్‌బుల్) అమ్మమ్మ నానమ్మ ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు ఆధార్, రేషన్ కార్డులు ఇద్దరు సాక్షుల ఆధార్,రేషన్ కార్డుల జిరాక్సులు జతచేయాలి. అభ్యర్థి అమ్మమ్మ గ్రామం వద్ద ఉన్న ఆర్డీవో కార్యాలయానికి మీసేవా కేంద్ర ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రూ.135 చెల్లించాలి. దరఖాస్తుపై ఆర్ఐ విచారణ ఆర్డీవో ఆ దరఖాస్తును తహసిల్దార్ కార్యాలయానికి పంపిస్తారు. దీనిపై ఆర్ఐ సంబంధిత గ్రామానికి వెళ్లి విచారణ చేపడతారు. సాక్షులను విచారించి నివేదిక తయారు చేస్తారు. అనంతరం వీఆర్వో, ఆర్ఐ, తహసిల్దార్ సంతకాలు చేసి జనన ధ్రువీకరణ ఇవ్వొచ్చని ఆర్డీవో కార్యాలయానికి సిఫార్సు చేస్తారు. ఆర్డీవో దానిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ మీ సేవా కేంద్రం ద్వారా పంచాయతీ కార్యద్శి/మున్సిపల్ అధికారికి ప్రోసిడింగ్ ఆర్డర్‌ను పంపిస్తారు. దానిని తీసుకుని అభ్యర్థి పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే కార్యదర్శి వెంటనే ఫారం 5 పై జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. మున్సిపాలిటీల్లో ప్రింటెండ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవచ్చు. గమనిక : 1989జూన్‌కు ముందు పుట్టిన వారికి టెన్త్‌క్లాస్ సర్టిఫికెట్, రేషన్‌కార్డు వంటివాటిల్లో నమోదైన తేదీలే జనన నిర్ధారణకు ఉపకరిస్తాయి. -
అయ్యో..తల్లీ!
బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం కోసం బాలింత నడక యాతన రెండు రోజుల పసిబిడ్డతో 15 కిలోమీటర్లు నడిచివచ్చిన వైనం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం పాడేరు : బిడ్డకు జనన ధ్రువీకరణ చేయించుకోవాలనే ఆశతో ఓ ఆదివాసీ మహిళ పెద్ద సాహసమే చేసింది. ప్రసవమైన రెండు రోజులకే ఓ తల్లి, తన బిడ్డను ఎత్తుకొని సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన రావడం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. గిరిజనులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. మండలంలోని వనుగుపల్లి పంచాయతీ మారుమూల చింతగున్నల గ్రామానికి చెందిన పాంగి చినతల్లి రెండు రోజుల క్రితం ఈ నెల 12న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన లేకపోవటంతో ఇంట్లోనే నాటుపద్ధతిలో ప్రసవించింది. ప్రసవించిన నెల రోజుల తరువాత కాని బాలింతలు ఏ పనీ చేయలేని పరిస్థితి. బాలింతకు పూర్తి విశ్రాంతితో పాటు పౌష్టికాహారం ఎంతో అవసరం. కాని ఆమెకు ఇవేమీ తెలియదు. బిడ్డ పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందాలని, బిడ్డను చూపెడితేనే ధ్రువీకరణ పత్రం ఇస్తారని ఎవరో చెప్పిన మాటలు విని రెండు రోజుల వయసు ఉన్న బిడ్డ్డను చంకలో వేసుకొని కనీసం ఎవరి తోడు లేకుండానే వచ్చింది. కొండలూ గుట్టలూ దాటుకుంటూ సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన మండలంలోని మినుములూరు పీహెచ్‌సీకి వచ్చింది. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది, ఇతరులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. వాస్తవానికి బిడ్ద పుట్టిన 21 రోజుల లోపు పంచాయతీలోనే పంచాయతీ కార్యదర్శి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. ఈ విషయం అధికారులులెవరూ చెప్పకపోవడంతో ఆ బాలింత ఇంత ప్రయాసపడాల్సి వచ్చింది. కాగా, పీహెచ్సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో బాలింత చినతల్లికి, పసిబిడ్డకు సిబ్బంది కొన్ని మందులు అందజేశారు. జనన ధ్రువీకరణ పత్రం పంచాయతీ ఆఫీసులోనే తీసుకోవాలని చెప్పి పంపించారు. తిరిగి ఆ బాలింత కాలినడకన స్వగ్రామానికి వెళ్లింది. -
ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్..
హైదరాబాద్: త్వరలోనే ఇంటిగ్రేటేడ్ మొబైల్ యాప్ ప్రవేశపెడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ యాప్‌తో ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందవచ్చునని ఆయన తెలిపారు. మంగళవారం కమిషనర్ జనార్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా స్వీకరిస్తామన్నారు. ఈ మొబైల్ యాప్ రెడీగానే ఉందనీ, త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అదేవిధంగా వంద రోజుల ప్రణాళికను దాదాపు అమలు చేశామని తెలిపారు. బిల్డింగ్, లే అవుట్ లకు ఆన్లైన్ అనుమతుల విధానం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. డస్ట్ బిన్ పంపిణీ 100 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. 1116 గార్బేజ్ సెంటర్లను పూర్తిస్థాయిలో తీసేశామన్నారు. 1817 చెత్త ఆటో ట్రాలీలను పంపిణీ చేశామని తెలిపారు. నాలాల పూడికతీత 94 శాతం పూర్తి చేశామని కమిషనర్ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే మోడల్ మార్కెట్లు కేవలం నాలుగు మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతావి 80 శాతం పూర్తి చేసినట్టు చెప్పారు. టాయిలెట్ల నిర్వహణ ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. -
సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి
సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమనేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు. సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు... * ఆధార్ కార్డు * వాహన రిజిస్ట్రేషన్ కార్డు * ఇంటి అసెస్మెంట్, ఇంటి పన్ను రసీదు కరెంట్ బిల్లు * ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం * బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం * కులం, జనన ధ్రువీకరణ పత్రం * విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి) * వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్) * వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు * వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం * ఓటర్ ఐడీకార్డు, పాన్‌కార్డు * ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. -
ముడుపులు చెల్లిస్తేనే బర్త్ సర్టిఫికెట్
పట్టించుకోని అధికారులు..తిప్పలు పడుతున్న ప్రజలు సాక్షి, సిటీబ్యూరో: బర్త్ సర్టిఫికెట్ పొందడానికి నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత వ్యవధుల్లోనే బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని.. ఆన్లైన్ తో అనుసంధానం చేసిన 108 ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుల బర్త్ సర్టిఫికెట్లు మరింత వేగంగా అందిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు గొప్పలుచెప్పుకుంటున్నప్పటికీ.. అది మాటలకే పరిమితమైంది. గ్రేటర్లో ప్రసూతి సదుపాయాలున్న ఆస్పత్రులు దాదాపు వేయివరకు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 25 కంటే ఎక్కువ జననాలు జరుగుతున్న 108 ఆస్పత్రుల్లో ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉంది. మిగతా ఆస్పత్రుల్లో బర్త్ సర్టిఫికెట్ కావాలంటూ దరఖాస్తు అందాకే సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్ సదుపాయం లేని ఆస్పత్రుల్లోని జననాలు జరిగిన బిడ్డల సర్టిఫికెట్ల కోసం త ల్లిదండ్రులు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనులు కావడం లేవు. ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుల బర్త్ సర్టిఫికెట్లయినా సకాలంలో అందుతున్నాయా అంటే అదీలేదు. ఏ ఆస్పత్రిలో జననం జరిగినా.. జీహెచ్ఎంసీ అధికారుల నుంచి బర్త్‌సర్టిఫికెట్ పొందడానికి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. ముడుపులు చెల్లించనిదే పని జరగని పరిస్థితి నెలకొంది. అన్ని ఆస్పత్రుల్లో వెరసి నెలకు సగటున 18వేల శిశువుల జననాలు జరుగుతున్నా, వీటిల్లో కేవలం ఏడువేల జననాలకు సంబంధించి మాత్రమే జీహెచ్ఎంసీ రికార్డుల్లో నమోదవుతోంది. అదీ అవసరార్థం వచ్చి చేయితడిపిన వారికి సంబంధించినవే ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా జననాల వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోయినా అధికారులు శ్రద్ధ చూపడం లేరు. అటకెక్కిన ఉచిత సర్టిఫికెట్.. దేశంలోని మరే కార్పొరేషన్లో లేని విధంగా పుట్టిన శిశువులందరికీ ఉచితంగా వారి ఇళ్ల చిరునామాలకే బర్త్ సర్టిఫికెట్లను పంపిణీ చేసే పథకాన్ని అట్టహాసంగా జీహెచ్ఎంసీ గతేడాది ప్రారంభించింది. శిశువు పుట్టగానే వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షల సందేశంతోపాటు ఉచిత బర్త్ సర్టిఫికెట్, నిర్ణీత సమయాల్లో శిశువులకు వేయించాల్సిన టీకాల వివరాలను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. అలా శిశువుల తల్లిదండ్రులకు కొరియర్ ద్వారా ఉచిత బర్త్ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని గత డిసెంబర్ వరకు అమలు చేసిన యంత్రాంగం.. అనంతరం ఆ విషయాన్ని విస్మరించింది. -
అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం!
మార్కాపురం, బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని తల్లితండ్రులు కోరితే... ఓ పంచాయతీ కార్యదర్శి మాత్రం మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మేకల అరుణ, ఆదామ్ దంపతులకు గత ఏప్రిల్ 6న మార్కాపురం ఏరియా వైద్యశాలలో ఆడపిల్ల పుట్టింది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ గ్రామ కార్యదర్శిని కోరారు. అదిగో..ఇదిగో అంటూ వారం రోజులపాటు కాలం గడిపిన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు అదే నెల 19వ తేదీన వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. నిరక్షరాస్యులైన వారు ఆ పత్రం ఆధారంగా బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. ఐకేపీ అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. తాము తెచ్చింది జనన ధ్రువీకరణ పత్రం కాదని.. మరణ ధ్రువీకరణ పత్రమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. దీనిపై గ్రామ కార్యదర్శిని నిలదీయడంతో పొరపాటు అయిపోయిందంటూ జారుకున్నాడు. జనన ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే.. ఎటువంటి విచారణ చేయకుండానే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఎంపీడీవో రాజేష్‌ను వివరణ కోరగా.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
బర్త్ సర్టిఫికెట్‌కు బదులు డెత్ సర్టిఫికెట్
ఒంగోలు : లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి జనన ధ్రువీకరణ పత్రానికి బదులు మరొకటి జారీ చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.400 ఇవ్వలేదని ఓ చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. బంగారు తల్లి పథకం కోసం అరుణ అనే మహిళ బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకుంది. కాగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనంత మాత్రానా సర్టిఫికెట్ మార్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.