అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం! | sak birth certificate but .. gave me a death certificate! | Sakshi
Sakshi News home page

అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం!

Published Sun, May 11 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ  పత్రం!

అడిగింది జననపత్రం.. ఇచ్చింది మరణ పత్రం!

మార్కాపురం,   బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని తల్లితండ్రులు కోరితే... ఓ పంచాయతీ కార్యదర్శి మాత్రం మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మేకల అరుణ, ఆదామ్ దంపతులకు గత ఏప్రిల్ 6న మార్కాపురం ఏరియా వైద్యశాలలో ఆడపిల్ల పుట్టింది. బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ గ్రామ కార్యదర్శిని కోరారు. అదిగో..ఇదిగో అంటూ వారం రోజులపాటు కాలం గడిపిన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు అదే నెల 19వ తేదీన వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.


నిరక్షరాస్యులైన వారు ఆ పత్రం ఆధారంగా బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. ఐకేపీ అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. తాము తెచ్చింది జనన ధ్రువీకరణ పత్రం కాదని.. మరణ ధ్రువీకరణ పత్రమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. దీనిపై గ్రామ కార్యదర్శిని నిలదీయడంతో పొరపాటు అయిపోయిందంటూ జారుకున్నాడు. జనన ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే.. ఎటువంటి విచారణ చేయకుండానే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఎంపీడీవో రాజేష్‌ను వివరణ కోరగా.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement