
రసిక్ సలామ్
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్–19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగా ల్‌కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్–12 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒక మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్‌కు చేటు తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment