Rasikh Salam
-
SMT 2024: చెలరేగిన బౌలర్లు.. 32 పరుగులకే ఆలౌట్! టోర్నీ చరిత్రలోనే
సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 32 పరుగులకే కుప్పకూలింది.జమ్మూ బౌలర్ల దాటికి అరుణాచల్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేకపోయారు. జట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు.అరుణాచల్ సాధించిన 32 పరుగులలో 8 రన్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. జమ్మూ బౌలర్లలో స్పిన్నర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో అరుణాచల్ పతనాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌలర్లు అకీబ్ నబీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ పడగొట్టారు. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జమ్మూ ఫాస్ట్ బౌలర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్లకు జాక్‌పాట్ తగిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్ను రూ.30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.అరుణాచల్ చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన అరుణాచల్ ప్రదేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవలం 30 పరుగులకే ఆలౌటైంది.చదవండి: ICC Rankings: వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. -
రసిఖ్ సలాం.. టీమిండియా రైజింగ్ స్టార్
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024తో టీమిండియాకు మరో ఆణిముత్యం లభించింది. రసిఖ్ సలాం అనే కుర్రాడి రూపంలో టీమిండియాకు మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడు. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టినప్పటికీ రసిఖ్ ప్రదర్శనలను మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. రసిఖ్ ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో మిగతా టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటే రసిఖ్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మూడు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థికి పగ్గాలు వేశాడు.24 ఏళ్ల రసిఖ్ తొలిసారి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. రసిఖ్ 2019 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో రసిఖ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. రసిఖ్ జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన వాడు. ఈ ప్రాంతం నుంచి ఐపీఎల్ ఆడిన మూడో క్రికెటర్ రసిఖ్. రసిఖ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు అడపాదడపా బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎమర్జింగ్ ఆసియా కప్ ప్రదర్శనల అనంతరం భారత అభిమానులు రసిఖ్‌ను ఫ్యూచర్ స్టార్‌గా పిలుస్తున్నారు.కాగా, ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 సెమీఫైనల్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. జుబైద్ అక్బరీ (64), సెదికుల్లా అటల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రసిఖ్ 3, ఆకిబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో రమణ్‌దీప్ సింగ్ (64) అర్ద సెంచరీతో చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో రసిఖ్ ప్రదర్శనలు..4-0-30-2 vs పాక్2-0-15-3 vs యూఏఈ3-0-23-1 vs ఒమన్4-0-25-3 vs ఆఫ్ఘనిస్తాన్చదవండి: IND VS SA T20 Series: శివమ్ దూబే, రియాన్ పరాగ్‌కు ఏమైంది..? -
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్‌కు బీసీసీఐ మందలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ రసీఖ్ సలాం దర్‌ను బీసీసీఐ మందలించింది. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతి చేసినందుకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం చేయకూడదని హెచ్చరించింది.కాగా ఢిల్లీ వేదికగా టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రసీఖ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ 44 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సాయి సుదర్శన్(39 బంతుల్లో 65), షారుఖ్ ఖాన్(8), రవిశ్రీనివాసన్ సాయి కిషోర్(13)లను అవుట్ చేశాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ప్రమాదకారిగా మారుతున్న సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా రసీఖ్ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. అలా ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు 24 ఏళ్ల ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్.అయితే, వికెట్ తీసిన ప్రతిసారీ రసీఖ్ కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మందలించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈమేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గుజరాత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి 220 పరుగుల వద్ద నిలిచి ఓటమి పాలైంది. -
క్రికెటర్ రసిక్ సలామ్‌పై రెండేళ్ల సస్పెన్షన్
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్–19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగా ల్కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్–12 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఒక మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్‌కు చేటు తెచ్చుకున్నాడు. -
అతనొక ‘స్పెషల్’ బౌలర్ అవుతాడు: యువీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు రసిఖ్ దార్‌పై సహచర ఆటగాడు యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ 17 ఏళ్ల యువ పేసర్ బౌలింగ్ శైలి విభిన్నంగా ఉందంటూ యువీ కొనియాడాడు. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లోనే రసిఖ్ దార్‌కు అవకాశం ఇవ్వడానికి కారణం నెట్స్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకోవడమేనన్నాడు. ‘ అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో అతని బౌలింగ్ తీరు మా జట్టు సభ్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రధానంగా బంతిని స్వింగ్ చేసే విధానం అమోఘం. అందుచేత అతనికి తొలి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకు తగ్గట్టే మ్యాచ్‌లో కూడా రసిఖ్ ఆకట్టుకున్నాడు. రసిఖ్ కోటా పూర్తి చేసే క్రమంలో వేసిన చివరి రెండు బంతులు మినహా మిగతా అంతా అతని బౌలింగ్ చాలా బాగుంది. ఒత్తిడిలో కూడా నిలకడైన బౌలింగ్ చేశాడు. అతను రాబోవు రెండు, మూడు సంవత్సరాల్లో ఒక ప్రత్యేక బౌలర్‌గా రూపాంతరం చెందుతాడు’ అని యువీ పేర్కొన్నాడు.ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రసిఖ్ దార్ నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చాడు.