ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు రసిఖ్ దార్‌పై సహచర ఆటగాడు యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ 17 ఏళ్ల యువ పేసర్ బౌలింగ్ శైలి విభిన్నంగా ఉందంటూ యువీ కొనియాడాడు. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లోనే రసిఖ్ దార్‌కు అవకాశం ఇవ్వడానికి కారణం నెట్స్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకోవడమేనన్నాడు.
‘ అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో అతని బౌలింగ్ తీరు మా జట్టు సభ్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రధానంగా బంతిని స్వింగ్ చేసే విధానం అమోఘం. అందుచేత అతనికి తొలి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకు తగ్గట్టే మ్యాచ్‌లో కూడా రసిఖ్ ఆకట్టుకున్నాడు. రసిఖ్ కోటా పూర్తి చేసే క్రమంలో వేసిన చివరి రెండు బంతులు మినహా మిగతా అంతా అతని బౌలింగ్ చాలా బాగుంది. ఒత్తిడిలో కూడా నిలకడైన బౌలింగ్ చేశాడు. అతను రాబోవు రెండు, మూడు సంవత్సరాల్లో ఒక ప్రత్యేక బౌలర్‌గా రూపాంతరం చెందుతాడు’ అని యువీ పేర్కొన్నాడు.ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రసిఖ్ దార్ నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment