బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు యువరాజ్ మెరుపులు మెరిపించాడు. క్రీజ్‌లో ఉన్నది కాసేపు అయినా బెంగళూరుకు దడపుట్టించాడు. ప్రధానంగా ఆర్సీబీ స్పిన్నర్ చహల్ వేసిన 14వ ఓవర్‌లో యువీ దుమ్మురేపాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్‌వద్ద సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యువరాజ్ ఇన్నింగ్స్ ముగిసింది.
రోహిత్ శర్మ(48) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత వచ్చిన యువీ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఆపై రెచ్చిపోయిన యువరాజ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గతంలో ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల కొట్టిన నాటి జ్ఞాపకాన్ని యువీ గుర్తుకు తెచ్చాడు. అయితే చహల్ కాస్త ఆఫ్ స్టంప్ బయటకు వేసిన బంతి బ్యాట్‌కు మిడిల్ కాకపోవడంతో బౌండరీ లైన్ ముందు సిరాజ్‌కు దొరికిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment