ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ వాంఖేడే స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్గో గెలుపొందగా, ఆర్సీబీ ఏడు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే సాధించింది.
శనివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఖాతా తెరిచింది. దాంతో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది కోహ్లి అండ్ గ్యాంగ్. అదే సమయంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. కాగా, సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కావడంతో ముంబై ఇండియన్స్ గెలుపుపై కన్నేసింది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనబడుతోంది. ఇక ముంబై జట్టు ఒక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో గాయపడ్డ అల్జర్రీ జోసెఫ్ స్థానంలో మలింగా తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది.
ఆర్సీబీ బలం కోహ్లి, డివిలియర్సే
రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ బలం ఏదైనా ఉందంటే అది కెప్టెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లే. వీరిద్దరూ కలిసి కట్టుగా బ్యాట్ ఝుళిపించిన గత మ్యాచ్‌లో ఆర‍్సీబీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆర్సీబీ కోహ్లి, డివిలియర్స్‌లపైనే ఆధారపడిదంటే సందేహం లేదు. ఆర్సబీ బ్యాటింగ్ లైనప్‌లో మొయిన్ అలీ, స్టోయినిస్‌లు ఉన్నప్పటికీ వీరు ఎంతవరకూ రాణిస్తారనేది ఆసక్తికరం. ఇక్కడ స్టోయినిస్ అడపా దడపా మెరుపులు మెరిపిస్తున్నా, మొయిన్ అలీ నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాలేదు. దాంతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కలవరపరుస్తోంది. మరొకవైపు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బలంగా ఉండటంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్ జట్టులో ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం.
ముంబై
రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, బెహ్రాన్‌డార్ఫ్, లసిత్ మలింగా, బుమ్రా
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, ఏబీ డివిలియర్స్, స్టోయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగీ, ఉమేశ్ యాదవ్, చహల్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment