బెంగళూరు: ఐపీఎల్-12వ సీజన్‌లో భాగంగా గురువారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో బుమ్రాకు గాయం కావడంతో అతని ఆడటంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో బుమ్రా ఆడుతుండటంతో ముంబై ఊపిరిపీల్చుకుంది.
తాజా సీజన్‌లో ఇరు జట్లు ఇంకా బోణి కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ పరాజయం చవిచూసింది. దాంతో ఇరు జట్లు గెలుపుపై దృష్టి సారించాయి. ప్రధానంగా కోహ్లి అండ్ గ్యాంగ్‌ను బ్యాటింగ్ అంశం కలవరపెడుతోంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆ జట్టు 70 పరుగులకే చాపచుట్టేసింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.
తుది జట్లు..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మెక్లీన్‌గాన్, లసిత్ మలింగా, మయాంక మార్కండే, బుమ్రా
ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, డివిలియర్స్, హెట్‌మెయిర్, శివం దుబే, గ్రాండ్ హోమ్, నవదీప్ షైనీ, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment