సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 32 పరుగులకే కుప్పకూలింది.
జమ్మూ బౌలర్ల దాటికి అరుణాచల్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేకపోయారు. జట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు.
అరుణాచల్ సాధించిన 32 పరుగులలో 8 రన్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. జమ్మూ బౌలర్లలో స్పిన్నర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో అరుణాచల్ పతనాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌలర్లు అకీబ్ నబీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ పడగొట్టారు.
కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జమ్మూ ఫాస్ట్ బౌలర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్‌లకు జాక్‌పాట్ తగిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్‌ను రూ.30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
అరుణాచల్ చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన అరుణాచల్ ప్రదేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవలం 30 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: ICC Rankings: వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా..
Comments
Please login to add a commentAdd a comment