Syed Mushtaq Ali
-
SMAT 2024: ముగిసిన లీగ్ స్టేజ్.. నాకౌట్స్‌కు చేరిన జట్లు ఇవే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 గ్రూపు దశ మ్యాచ్‌లు గురువారం(డిసెంబర్ 5)తో ముగిశాయి. ఈ టోర్నీలో మొత్తం మొత్తం 35 జట్లు తలపడగా.. అందులో 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. కాగా మొత్తం 35 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. ఎ,బి,సి గ్రూపుల్లో ఎనిమిదేసి జట్లు ఉండగా.. డి, ఈ గ్రూపులలో ఏడు జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’ నుంచి బెంగాల్ (24 పాయింట్లు), మధ్యప్రదేశ్ (24 పాయింట్లు)... గ్రూప్ ‘బి’ నుంచి బరోడా (24 పాయింట్లు), సౌరాష్ట్ర (24 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి ఢిల్లీ (24 పాయింట్లు), ఉత్తరప్రదేశ్ (20 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి విదర్భ (18 పాయింట్లు), చండీగఢ్ (16 పాయింట్లు)... గ్రూప్ ‘ఇ’ నుంచి ఆంధ్ర (20 పాయింట్లు), ముంబై (20 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత పొందాయి.అందులో బరోడా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, విదర్భ, సౌరాష్ట్ర జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. చండీగఢ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర జట్లు మిగతా రెండు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడతాయి.డిసెంబర్ 9, 2024 - ప్రీ-క్వార్టర్స్PQF 1– బెంగాల్ వర్సెస్ చండీగఢ్ – చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – ఉదయం 11.00 గంటలకుPQF 1 –ఆంధ్ర వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – సాయంత్రం 4:30 గంటలకుడిసెంబర్ 11, 2024 - క్వార్టర్ ఫైనల్స్QF 1 – బరోడా వర్సెస్ ప్రీ క్వార్టర్ 1 విజేత- చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- ఉదయం 11.00 గంటలకుQF 2 – ఢిల్లీ Vs ప్రీ క్వార్టర్ 2 విజేత –చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- సాయంత్రం 4:30 గంటలకుQF 3 - మధ్యప్రదేశ్ వర్సెస్ సౌరాష్ట్ర - ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ - ఉదయం 9:00 గంటలకుQF 4 – ముంబై వర్సెస్ విదర్భ – ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ – మధ్యాహ్నం 1:30 గంటలకుడిసెంబర్ 13, 2024 - సెమీఫైనల్స్సెమీఫైనల్ 1 – విజేత క్వార్టర్ ఫైనల్1 v విజేత క్వార్టర్ ఫైనల్4 –చిన్నస్వామి స్టేడియం, ఉదయం 11:00 గంటలకుసెమీఫైనల్ 1 – విజేత QF2 v విజేత క్వార్టర్ ఫైనల్ 3 – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు–సాయంత్రం 4:30 గంటలకుడిసెంబర్ 15, 2024ఫైనల్ - ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - సాయంత్రం 4:30 గంటలకు -
ఒకే జట్టులో 11 మందితో బౌలింగ్.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్‌లో జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఫీట్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 వేదికైంది.ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్‌తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని జట్టులో ప్రతీ ఒక్కరితో బౌలింగ్ చేయించాడు. ఆఖరికి వికెట్ కీపర్‌గా ఉన్న బదోని సైతం ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 11 మంది బౌలర్లను ఉపయోగించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. టీ20ల్లోఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ జట్లు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజా మ్యాచ్‌తో ఈ అల్‌టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.కాగా ఢిల్లీ జట్టుకు సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. . హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలా మూడు ఓవర్లు బౌలింగ్ చేశారు. వీరితో పాటు ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్, రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. త్యాగీ, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించగా.. బదోని, అయూష్ సింగ్, ప్రియాన్షూ ఆర్య చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
SMT 2024: చెలరేగిన బౌలర్లు.. 32 పరుగులకే ఆలౌట్! టోర్నీ చరిత్రలోనే
సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ కేవలం 32 పరుగులకే కుప్పకూలింది.జమ్మూ బౌలర్ల దాటికి అరుణాచల్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కనీసం ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం పట్టుమని పది నిమిషాలు క్రీజులో నిలవలేకపోయారు. జట్టు మొత్తంలో ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు.అరుణాచల్ సాధించిన 32 పరుగులలో 8 రన్స్ ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. జమ్మూ బౌలర్లలో స్పిన్నర్ అబిడ్ ముస్తాక్ 4 వికెట్లతో అరుణాచల్ పతనాన్ని శాసించగా.. ఫాస్ట్ బౌలర్లు అకీబ్ నబీ మూడు, యుధ్వీర్ సింగ్ రెండు, రసిఖ్ దార్ సలీం ఒక్క వికెట్ పడగొట్టారు. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో జమ్మూ ఫాస్ట్ బౌలర్లు రసిఖ్ దార్ సలీం,యుధ్వీర్లకు జాక్‌పాట్ తగిలింది. రసిఖ్ దార్‌ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు (RCB) రూ. 6 కోట్లకు సొంతం చేసుకోగా.. యుధ్వీర్ను రూ.30 లక్షలకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.అరుణాచల్ చెత్త రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన అరుణాచల్ ప్రదేశ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సయ్యద్ ముస్తాల్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రెండో జట్టుగా ఏపీ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో త్రిపుర తొలి స్ధానంలో ఉంది. 2009లో జార్ఖండ్‌పై త్రిపుర కేవలం 30 పరుగులకే ఆలౌటైంది.చదవండి: ICC Rankings: వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. -
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో పాల్గొననున్న టీమిండియా స్టార్లు వీరే..! (ఫొటోలు)
-
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
ఆంధ్ర పరాజయం
సాక్షి, విజయవాడ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి పరాజయం చవిచూసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కేరళతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ విష్ణు వినోద్ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, ఇస్మాయిల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. నాగాలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 179 పరుగుల తేడాతో గెలిచి టి20 చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆంధ్ర... కేరళపై 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి చివరి ఓవర్లో ఆంధ్ర జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా... కేరళ పేసర్ సందీప్ వారియర్ ‘హ్యాట్రిక్’తో ఆంధ్రను దెబ్బ తీశాడు. తొలి బంతికి పరుగు ఇవ్వని సందీప్ వారియర్ ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో శశికాంత్, కరణ్ శర్మ, ఇస్మాయిల్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకోవడంతోపాటు కేరళను గెలిపించాడు. దాంతో ఆంధ్ర జట్టు 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర జట్టులో ప్రశాంత్ కుమార్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. -
దేశవాళీ ధనాధన్
న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే టోర్నీ, రంజీ ట్రోఫీ తర్వాత 2018–19 సీజన్లో మూడో ఫార్మాట్ దేశవాళీ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి వేర్వేరు వేదికల్లో టి20 టోర్నమెంట్ ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 14న ఫైనల్ నిర్వహిస్తారు. గత కొన్నేళ్లుగా కుర్రాళ్లు సత్తా చాటి ఐపీఎల్లో అవకాశం దక్కేందుకు ఈ టోర్నీ వేదికగా ఉపయోగపడింది. దాని కోసమే ఐపీఎల్ వేలానికి ముందే బీసీసీఐ దీనిని నిర్వహించేది. ఇప్పటికే 2019 ఐపీఎల్ వేలం ముగిసిపోయిన నేపథ్యంలో ఈ సారి టోర్నీకి ప్రాధాన్యత కొంత తగ్గింది. అయితే కొత్త ఆటగాళ్లు, సీనియర్లతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లతో ఉన్నవారు ధనాధన్ ఆటలో తమ సత్తాను పరీక్షించుకునేందుకు కూడా ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. గత ఏడాది 28 జట్లు బరిలోకి దిగగా... ఈశాన్య రాష్ట్రాలు జత చేరడంతో మొత్తం టీమ్‌ల సంఖ్య 37కు చేరింది. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, చతేశ్వర్ పుజారా, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, విజయ్ శంకర్, సురేశ్ రైనా బరిలోకి దిగుతుండటం విశేషం. సీనియర్లు అజింక్య రహానే (ముంబై), రవిచంద్రన్ అశ్విన్ (తమిళనాడు), హర్భజన్ సింగ్ (పంజాబ్), ఇషాంత్ శర్మ (ఢిల్లీ), అంబటి రాయుడు (హైదరాబాద్), హనుమ విహారి (ఆంధ్ర), మనీశ్ పాండే (కర్ణాటక) తమ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికాలో గాయపడి కోలుకున్న అనంతరం వికెట్ కీపర్ సాహా తొలిసారి మైదానంలోకి దిగుతుండగా... గాయంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగిన పృథ్వీ షా కూడా ఆడుతున్నాడు. టోర్నీ విశేషాలు... మొత్తం జట్లు 37 మొత్తం మ్యాచ్‌లు 140 ఫార్మాట్: టీమ్‌లను 5 గ్రూప్‌లుగా విభజించారు. మూడు గ్రూప్‌లలో 7 చొప్పున, మరో రెండు గ్రూప్‌లలో 8 చొప్పున జట్లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన రెండు జట్లు ముందుకు వెళతాయి. ఈ పది జట్లతో జరిగే ‘సూపర్ లీగ్’లో కూడా రెండు గ్రూప్‌లు ఉంటా యి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వివరాలు గ్రూప్ ‘ఎ’: ఆంధ్ర, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, జమ్ము కశ్మీర్, కేరళ, ఢిల్లీ (ఈ గ్రూప్‌లో మ్యాచ్‌లకు విజయవాడ మూలపాడు మైదానం వేదిక). గ్రూప్ ‘బి’: హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, విదర్భ, గుజరాత్, బిహార్, రాజస్థాన్, మేఘాలయ (వేదిక సూరత్). గ్రూప్ ‘సి’: రైల్వేస్, సిక్కిం, సౌరాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్, గోవా, ముంబై (వేదిక ఇండోర్). గ్రూప్ ‘డి’: ఒడిషా, బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, అస్సాం, హర్యానా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక (వేదిక కటక్). గ్రూప్ ‘ఇ’: హైదరాబాద్, త్రిపుర, పుదుచ్చేరి, మహారాష్ట్ర, బరోడా, సర్వీసెస్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ (వేదిక ఢిల్లీ). - ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
హైదరాబాద్‌పై ఆంధ్ర గెలుపు
రాణించిన విహారి, స్వరూప్ చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తమ పోరాటాన్ని విజయంతో ముగించింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టా‹స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒకదశలో 108/3తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర ఆ తర్వాత 32 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (32 బంతుల్లో 49; 6 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఒకదశలో స్కోరు 85/2తో విజయందిశగా సాగుతున్నట్లు కనిపించినా హైదరాబాద్ జట్టు ఆంధ్ర లెగ్ స్పిన్నర్ దాసరి స్వరూప్ కుమార్ (5/19) మాయాజాలానికి చివరి ఎనిమిది వికెట్లను 44 పరుగులకు కోల్పోయి ఓటమి చవిచూసింది. -
నాకౌట్‌కు విదర్భ, గుజరాత్
* జార్ఖండ్, యూపీ, ముంబై కూడా... * ముస్తాక్ అలీ టి20 టోర్నీ నాగ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్-ఎ నుంచి విదర్భ, గుజరాత్‌లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన విదర్భ 20 పాయింట్లతో గ్రూప్‌లో టాప్‌గా నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో హరియాణాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మొహిత్ హుడా (24) టాప్ స్కోరర్. తర్వాత గుజరాత్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (20 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ దహియా (15 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగారు. గ్రూప్-డిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్తరప్రదేశ్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై మాత్రం మూడు విజయాలతో 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుని నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మహారాష్ట్ర కూడా 12 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ముంబై ముందుకు వెళ్లింది. గ్రూప్-బిలో కేరళతో పాటు జార్ఖండ్ నాకౌట్ పోరుకు చేరుకుంది. ఆంధ్రకు తప్పని ఓటమి గ్రూప్-సిలో ఆంధ్ర జట్టు ఓటమితో లీగ్ దశను ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గోవా 9 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 90 పరుగులు చేసింది. సిర్లా శ్రీనివాస్ (28 నాటౌట్), ప్రదీప్ (20), అజయ్ కుమార్ (19) ఓ మోస్తరుగా ఆడారు. తర్వాత గోవా 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు సాధించింది. శాగూన్ కామత్ (61 నాటౌట్), కౌతాంకర్ (34) రాణించారు. మరోవైపు గ్రూప్-ఎలో హైదరాబాద్ జట్టు నిరాశజనక ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ తమిళనాడు చేతిలో 4 వికెట్లతో ఓడింది. దీంతో లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో నెగ్గిన హైదరాబాద్ 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా జాబితాలో ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా
రెండో సారి టైటిల్ కైవసం ఫైనల్లో ఉత్తర ప్రదేశ్‌పై గెలుపు ముంబై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ ఫైనల్ మ్యాచ్... ఉత్తరప్రదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. బరోడా తరఫున లెఫ్టార్మ్ పేసర్ రిషీ అరోథ్ బౌలర్ కాగా...ప్రవీణ్ కుమార్, ఉపేంద్ర యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. రిషీ చక్కటి బంతులతో కట్టడి చేయడంతో ప్రవీణ్ తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతిని ఉపేంద్ర సిక్సర్‌గా మలిచాడు. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేస్తే గెలుస్తుందనగా, ఫుల్ టాస్‌ను ఆడబోయి అతను అవుటయ్యాడు. ఫలితంగా 3 పరుగుల తేడాతో నెగ్గిన బరోడా దేశవాళీ టి20 టోర్నీని కైవసం చేసుకుంది. 2012 తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీని బరోడా మరో సారి గెలుచుకోవడం విశేషం. రాణించిన వాఘ్‌మోడ్... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య వాఘ్‌మోడ్ (31 బంతుల్లో 42; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా, కేదార్ దేవ్‌ధర్ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 22; 1 ఫోర్) అతనికి అండగా నిలిచారు. యూపీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, ముర్తజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ భాగస్వామ్యం... ముకుల్ దాగర్ (3) ఆరంభంలోనే వెనుదిరిగినా...ప్రశాంత్ గుప్తా (53 బంతుల్లో 68; 8 ఫోర్లు, 1 సిక్స్), ఏకలవ్య ద్వివేది (47 బంతుల్లో 56; 6 ఫోర్లు) భారీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌ను గెలుపు దిశగా నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లో 98 పరుగులు జోడించారు. వీరి జోరుతో బరోడా 116/1 స్కోరుతో నిలిచింది. అయితే మేరివాలా బౌలింగ్‌లో గుప్తా అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ దశలో గెలిచేందుకు చేతిలో 8 వికెట్లతో 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన యూపీ 25 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.