సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 గ్రూపు దశ మ్యాచ్‌లు గురువారం(డిసెంబర్ 5)తో ముగిశాయి. ఈ టోర్నీలో మొత్తం మొత్తం 35 జట్లు తలపడగా.. అందులో 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. కాగా మొత్తం 35 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. ఎ,బి,సి గ్రూపుల్లో ఎనిమిదేసి జట్లు ఉండగా.. డి, ఈ గ్రూపులలో ఏడు జట్లు ఉన్నాయి.
ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’ నుంచి బెంగాల్ (24 పాయింట్లు), మధ్యప్రదేశ్ (24 పాయింట్లు)... గ్రూప్ ‘బి’ నుంచి బరోడా (24 పాయింట్లు), సౌరాష్ట్ర (24 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి ఢిల్లీ (24 పాయింట్లు), ఉత్తరప్రదేశ్ (20 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి విదర్భ (18 పాయింట్లు), చండీగఢ్ (16 పాయింట్లు)... గ్రూప్ ‘ఇ’ నుంచి ఆంధ్ర (20 పాయింట్లు), ముంబై (20 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత పొందాయి.
అందులో బరోడా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, విదర్భ, సౌరాష్ట్ర జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. చండీగఢ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర జట్లు మిగతా రెండు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడతాయి.
డిసెంబర్ 9, 2024 - ప్రీ-క్వార్టర్స్
PQF 1– బెంగాల్ వర్సెస్ చండీగఢ్ – చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – ఉదయం 11.00 గంటలకు
PQF 1 –ఆంధ్ర వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – సాయంత్రం 4:30 గంటలకు
డిసెంబర్ 11, 2024 - క్వార్టర్ ఫైనల్స్
QF 1 – బరోడా వర్సెస్ ప్రీ క్వార్టర్ 1 విజేత- చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- ఉదయం 11.00 గంటలకు
QF 2 – ఢిల్లీ Vs ప్రీ క్వార్టర్ 2 విజేత –చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- సాయంత్రం 4:30 గంటలకు
QF 3 - మధ్యప్రదేశ్ వర్సెస్ సౌరాష్ట్ర - ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ - ఉదయం 9:00 గంటలకు
QF 4 – ముంబై వర్సెస్ విదర్భ – ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు
డిసెంబర్ 13, 2024 - సెమీఫైనల్స్
సెమీఫైనల్ 1 – విజేత క్వార్టర్ ఫైనల్1 v విజేత క్వార్టర్ ఫైనల్4 –చిన్నస్వామి స్టేడియం, ఉదయం 11:00 గంటలకు
సెమీఫైనల్ 1 – విజేత QF2 v విజేత క్వార్టర్ ఫైనల్ 3 – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు–సాయంత్రం 4:30 గంటలకు
డిసెంబర్ 15, 2024
ఫైనల్ - ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - సాయంత్రం 4:30 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment