Knockout
-
SMAT 2024: ముగిసిన లీగ్ స్టేజ్.. నాకౌట్స్‌కు చేరిన జట్లు ఇవే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 గ్రూపు దశ మ్యాచ్‌లు గురువారం(డిసెంబర్ 5)తో ముగిశాయి. ఈ టోర్నీలో మొత్తం మొత్తం 35 జట్లు తలపడగా.. అందులో 10 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. కాగా మొత్తం 35 జట్లను ఐదు గ్రూపులుగా విభజించారు. ఎ,బి,సి గ్రూపుల్లో ఎనిమిదేసి జట్లు ఉండగా.. డి, ఈ గ్రూపులలో ఏడు జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’ నుంచి బెంగాల్ (24 పాయింట్లు), మధ్యప్రదేశ్ (24 పాయింట్లు)... గ్రూప్ ‘బి’ నుంచి బరోడా (24 పాయింట్లు), సౌరాష్ట్ర (24 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి ఢిల్లీ (24 పాయింట్లు), ఉత్తరప్రదేశ్ (20 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి విదర్భ (18 పాయింట్లు), చండీగఢ్ (16 పాయింట్లు)... గ్రూప్ ‘ఇ’ నుంచి ఆంధ్ర (20 పాయింట్లు), ముంబై (20 పాయింట్లు) నాకౌట్ దశకు అర్హత పొందాయి.అందులో బరోడా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, విదర్భ, సౌరాష్ట్ర జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. చండీగఢ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర జట్లు మిగతా రెండు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడతాయి.డిసెంబర్ 9, 2024 - ప్రీ-క్వార్టర్స్PQF 1– బెంగాల్ వర్సెస్ చండీగఢ్ – చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – ఉదయం 11.00 గంటలకుPQF 1 –ఆంధ్ర వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – సాయంత్రం 4:30 గంటలకుడిసెంబర్ 11, 2024 - క్వార్టర్ ఫైనల్స్QF 1 – బరోడా వర్సెస్ ప్రీ క్వార్టర్ 1 విజేత- చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- ఉదయం 11.00 గంటలకుQF 2 – ఢిల్లీ Vs ప్రీ క్వార్టర్ 2 విజేత –చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- సాయంత్రం 4:30 గంటలకుQF 3 - మధ్యప్రదేశ్ వర్సెస్ సౌరాష్ట్ర - ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ - ఉదయం 9:00 గంటలకుQF 4 – ముంబై వర్సెస్ విదర్భ – ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ – మధ్యాహ్నం 1:30 గంటలకుడిసెంబర్ 13, 2024 - సెమీఫైనల్స్సెమీఫైనల్ 1 – విజేత క్వార్టర్ ఫైనల్1 v విజేత క్వార్టర్ ఫైనల్4 –చిన్నస్వామి స్టేడియం, ఉదయం 11:00 గంటలకుసెమీఫైనల్ 1 – విజేత QF2 v విజేత క్వార్టర్ ఫైనల్ 3 – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు–సాయంత్రం 4:30 గంటలకుడిసెంబర్ 15, 2024ఫైనల్ - ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - సాయంత్రం 4:30 గంటలకు -
టైసన్... అదే దూకుడు
టెక్సాస్: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చాటుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్... సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జాక్ పాల్‌తో బౌట్లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్... జాక్ పాల్ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు.అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు. ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టైసన్... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్ ప్రకారం టైసన్, జాక్ పాల్ మధ్య బౌట్ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు. దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన 27 ఏళ్ల జాక్ పాల్ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్ అన్నాడు. -
నాకౌట్ దశకు భారత టీటీ జట్లు
బుసాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షి ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్–1లోని చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్‌పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్–3లోని చివరి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో న్యూజిలాండ్‌ను ఓడించి 6 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. నేడు జరిగే నాకౌట్ దశ రెండో రౌండ్ పోటీల్లో ఇటలీతో భారత మహిళల జట్టు... కజకిస్తాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. క్వార్టర్ ఫైనల్ చేరితే భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. స్పెయిన్‌తో జరిగిన పోటీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత బృందం ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 9–11, 11–9, 11–13, 4–11తో మరియా జియావో చేతిలో... రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 11–6, 11–8, 9–11, 7–11తో సోఫియా జువాన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 11–8, 11–13, 11–8, 9–11, 11–4తో ఎల్విరా రాడ్‌పై గెలిచి భారత ఆశలను సజీవంగా నిలిపింది. నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–9, 11–2, 11–4తో మరియా జియావోపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11–6, 11–13, 11–6, 11–3తో సోఫియా జువాన్ జాంగ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేసింది. -
వాలీబాల్‌లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో జోరు... రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
దర్జాగా సెమీస్‌కు...
కెబేహ (దక్షిణాఫ్రికా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా, ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడకుండా భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచింది. టి20 కెరీర్లో స్మతికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. స్మృతి మూడుసార్లు ఇచ్చిన క్యాచ్‌లను ఐర్లాండ్ ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. షఫాలీ వర్మ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన స్మృతి... హర్మన్‌ప్రీత్ (20 బంతుల్లో 13)తో రెండో వికెట్‌కు 52 పరుగులు జత చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. ఈ టోర్నీలో ఐర్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ఈ గెలుపుతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్–2లో రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, గ్రూప్–1 టాపర్ ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. పాకిస్తాన్‌తో నేడు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో ఇప్పటికే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రన్‌రేట్ పరంగా భారత్ (0.253) కంటే ఇంగ్లండ్ (1.776) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయినా గ్రూప్–2లో ఆ జట్టే ‘టాప్’లో నిలుస్తుంది. గ్రూప్–2 టాపర్ హోదాలో ఇంగ్లండ్ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్–1లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. గ్రూప్–1లో న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్ ఆడనున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాయి. ఈ దశలో న్యూజిలాండ్, శ్రీలంకకంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంటుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అమీ హంటర్ (బి) లౌరా డెలానీ 24; స్మృతి మంధాన (సి) గ్యాబీ లూయిస్ (బి) ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 87; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) లౌరా డెలానీ 13; రిచా ఘోష్ (సి) గ్యాబీ లూయిస్ (బి) లౌరా డెలానీ 0; జెమీమా రోడ్రిగ్స్ (స్టంప్డ్) వాల్డ్రోన్ (బి) కెల్లీ 19; దీప్తి శర్మ (సి) డెంప్సీ (బి) ప్రెండర్‌గాస్ట్ 0; పూజా వస్త్రకర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–62, 2–114, 3–115, 4–143, 5–143, 6–155. బౌలింగ్: ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 4–0–22–2, డెంప్సీ 3–0–27–0, కెల్లీ 4–0–28–1, లెహ్ పాల్ 3–0–27–0, కారా ముర్రే 2–0–16–0, లౌరా డెలానీ 4–0–33–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: అమీ హంటర్ (రనౌట్) 1; గ్యాబీ లూయిస్ (నాటౌట్) 32; ప్రెండర్‌గాస్ట్ (బి) రేణుక సింగ్ 0; లౌరా డెలానీ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 54. వికెట్ల పతనం: 1–1, 2–1. బౌలింగ్: రేణుక 2–0–10–1, శిఖా పాండే 2.2–0 –14–0, దీప్తి 1–0–11–0, రాజేశ్వరి 1–0–5–0. -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
World Snooker Championship 2022: నాకౌట్ దశకు పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్‌లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఒక జట్టు ఎలా ఆడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక మెగాటోర్నీలో అసలు మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే క్వాలిఫయింగ్ పోరులోనే వెనుదిరిగితే అభిమానుల ఆగ్రహం తట్టుకోవడం కష్టం. తాజాగా వెస్టిండీస్‌కు ఇలాంటి సంకట పరిస్థితే ఎదురైంది. ఎవరు ఊహించని విధంగా టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ క్వాలిఫయింగ్ దశలోనే టోర్నీ నుంచి నాకౌట్ అయి ఆశ్చర్యపరిచింది. ఐర్లాండ్‌కు విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయని విండీస్ బౌలర్లు జట్టుకు 9 వికెట్లతో దారుణ పరాజయాన్ని కట్టబెట్టారు. విండీస్ ఆటతీరు ఆ దేశ అభిమానులకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోవడం ఖాయం. ఇక విండీస్ ఓటమిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. హెట్‌మైర్ శాపం తగిలింది.. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ స్టార్ షిమ్రోన్ హెట్‌మైర్ ఆస్ట్రేలియాకు వెళ్లే ఫ్లైట్ మిస్ అయ్యాడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో హెట్‌మైర్ చివరి నిమిషంలో విమానం ఎక్కలేకపోయాడు. అయినప్పటికి విండీస్ బోర్డు మరోసారి అవకాశం ఇచ్చింది. కానీ హెట్‌మైర్ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన తప్పిదంతో టి20 ప్రపంచకప్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఇది జరిగిన విషయం అయితే అభిమానులు మాత్రం.. ''వెస్టిండీస్ జట్టుకు హెట్‌మైర్ శాపం తగిలిందని.. అందుకే కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేకపోయిందంటూ'' కామెంట్స్ చేశారు. ''రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికి కొన్ని కారణాల వల్ల అతను ఫ్లైట్ ఎక్కలేదు.. నిజమే కానీ మరొక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికి సమయం ఉంది.. హెట్‌మైర్‌కు ఆ చాన్స్ ఇవ్వకుండా జట్టులో నుంచి తొలగించారు.. ఒకవేళ హెట్‌మైర్ ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో'' అంటూ పేర్కొన్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం.. ''అంతలేదు.. ఎవరి శాపం తగల్లేదు. జట్టు మొత్తంగా ఏం చేయలేనిది హెట్‌మైర్ ఒక్కడు ఏం చేయగలడు.. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి.. గెలవాలంటే కసిగా ఆడాలి.. అంతే తప్ప ఇలాంటి శాపాలు వల్లే ఓడిపోయిందంటే ఎవరు నమ్మరు'' అంటూ ఘాటుగా స్పందించారు. ఏది ఏమైనా విండీస్ జట్టు మాత్రం టి20 ప్రపంచకప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించి అభిమానులను బాధపెట్టింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌కు ఇలాంటి దుస్థితి రావడంపట్ల క్రికెట్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ఇక విండీస్ జట్టుపై వస్తున్న ట్రోల్స్‌పై ఒక లుక్కేయండి. Acha hai flight miss hogai !#IREvsWI #T20worldcup22 pic.twitter.com/VbzoyB2E2B — ABBAS (@Abbas196_) October 21, 2022 2 Times World Champions West Indies out of the tournament, congratulations Ireland to making it to the Super12👏 #T20WorldCup #T20worldcup22#PakVsInd #Super12s pic.twitter.com/w8qqEYG5GT — Muhammad zeeshan (@zeshanmohmnd) October 21, 2022 2 time champions West Indies are out in the 1st round. Sad decline of West Indies cricket.#WIvsIRE #T20worldcup22 pic.twitter.com/Nw3VUv8n9O — John James (@jamesnotabond) October 21, 2022 #WIvsIRE #T20WorldCup West Indies got punished for punishing Shimron Hetmyer. 💀 pic.twitter.com/ZaciRSdxdP — 👌⭐👑 (@superking1815) October 21, 2022 చదవండి: నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి? ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యాన్స్ కేరింతలు! సీరియస్ అయిన కోహ్లి! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాకౌట్ దశకు భారత్ అర్హత
బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు అర్హత పొందింది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్‌తోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్‌ను 52 నిమిషాల్లో ఓడించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్ ఆంథోనీ–కెవిన్ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–15, 21–12తో సంకీర్త్‌ను ఓడించి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో గారగ కృష్ణప్రసాద్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–15, 21–11తో డాంగ్ ఆడమ్–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 21–13, 20–22, 21–14తో విక్టర్ లాయ్‌పై గెలవడంతో భారత్ 5–0తో కెనడాను క్లీన్‌స్వీప్ చేసింది. ఉబెర్ కప్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
UEFA Euro 2020: ఆస్ట్రియా తొలిసారి...
బుకారెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆస్ట్రియా జట్టు తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రియా 1–0తో గెలిచింది. 21వ నిమిషంలో బౌమ్గార్ట్నర్ ఆస్ట్రియాకు ఏకైక గోల్ అందించాడు. రెండో విజయంతో గ్రూప్ ‘సి’లో ఆస్ట్రియా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2008, 2016 యూరో టోర్నీలలో ఆస్ట్రియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో నార్త్ మెసడోనియాను ఓడించి తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున డెపే (24వ ని.లో) ఒక గోల్ చేయగా... వినాల్డమ్ (51వ, 58వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
ఐదేళ్ల తర్వాత...
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన చివరిదైన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ... రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆంధ్ర క్రికెట్ జట్టు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించింది. నడియాడ్‌లో శనివారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. ఆట చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 216/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 113.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బౌలర్ అక్షర్ పటేల్ 92 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. అనంతరం 30 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ 18 జట్లున్న ఎలైట్ గ్రూప్ ‘ఎ అండ్ బి’లో 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్ నుంచి బెంగాల్ (32 పాయింట్లు), కర్ణాటక (31 పాయింట్లు), సౌరాష్ట్ర (31 పాయింట్లు), ఆంధ్ర (27 పాయింట్లు) జట్లు కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరడం ఇది నాలుగోసారి. గతంలో ఆంధ్ర జట్టు కె.ఎస్. భాస్కర మూర్తి సారథ్యంలో 1985–86 సీజన్లో... ఎమ్మెస్కే ప్రసాద్ కెప్టెన్సీలో 2001–02 సీజన్లో... మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో 2014–15 సీజన్లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. అయితే ఈ మూడు పర్యాయాలూ ఆంధ్ర పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఈనెల 20 నుంచి 24 వరకు ఒంగోలు వేదికగా జరిగే క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. రెండింటిని ‘డ్రా’ చేసుకొని మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్లో హనుమ విహారి, రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు హైదరాబాద్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో చివరి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. కేవలం ఏడు పాయింట్లతో అట్టడుగున నిలిచి వచ్చే ఏడాది గ్రూప్ ‘సి’కి పడిపోయింది. గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జమ్మూ కశ్మీర్, ఒడిశా జట్లు వచ్చే ఏడాది ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌కు ప్రమోట్ అయ్యాయి. ‘సి’లో చివరి స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. ప్లేట్ డివిజన్లో అగ్రస్థానంలో నిలిచిన గోవా జట్టు గ్రూప్ ‘సి’కి ప్రమోట్ అయ్యింది. ‘ఈ సీజన్లో జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా కష్టపడ్డాడు. వారికి సహాయక సిబ్బంది కూడా తమ వంతుగా ప్రోత్సాహం అందించింది. నాకౌట్ మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు మంచి ప్రదర్శన చేసి ముందంజ వేయాలి. ఆంధ్ర క్రికెట్ సంఘానికి మరింత పేరు తేవాలి. సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ కోసం అందరికీ బెస్టాఫ్ లక్’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సెక్రటరీ వి.దుర్గా ప్రసాద్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు ఆంధ్ర గీ సౌరాష్ట్ర (ఒంగోలు) కర్ణాటక గీ జమ్మూ కశ్మీర్ (జమ్మూ) బెంగాల్ గీ ఒడిశా (కటక్) గుజరాత్ గీ గోవా (వల్సాద్) -
ఎం‘బాప్రే’..!
కొదమ సింహాలు కదంతొక్కిన వేళ... ఆటగాళ్ల దూకుడుతో పోటీ రక్తికట్టింది... ఆధిపత్యం అటుఇటు చేతులు మారింది... గోల్స్‌పై గోల్స్‌తో నాకౌట్ కిక్కెక్కించింది... ఆఖరి క్షణాల వరకు ఉత్కంఠ రేకెత్తింది... ఫ్రాన్స్ టీనేజ్ మెరిక కైలిన్ ఎంబాపె మెరుపులకు అర్జెంటీనా వెలుగు మసకబారింది! ఫలితంగా సూపర్ స్టార్ మెస్సీ నాయకత్వంలోని జట్టు పయనం 2018 ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. కజన్: ప్రపంచ కప్ నుంచి అర్జెంటీనా నిష్క్రమించింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ అసహాయుడిగా మిగిలిపోగా... గత మ్యాచ్ హీరో మార్కస్ రొజొ ‘మొదటే’ ముప్పు తెచ్చిపెట్టగా... కీలక సమయంలో దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక... ప్రత్యర్థిని మరెవరూ నిలువరించలేని పరిస్థితుల్లో ఆ జట్టు పరాజయం మూటగట్టుకుంది. 19 ఏళ్ల యువ కెరటం కైలిన్ ఎంబాపె మెరుపులు... బెంజమిన్ పవార్డ్ చురుకైన ఆటతో తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయింది. మాజీ చాంపియన్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను మట్టికరిపించింది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనాపై ఫ్రాన్స్ జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. ఫ్రాన్స్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంబాపె (64వ, 68వ నిమిషాలు) రెండు గోల్స్ కొట్టగా, ఆంటోన్ గ్రీజ్మన్ (13వ ని.), పవార్డ్ (57వ ని.) చెరో గోల్ చేశారు. అర్జెంటీనాకు డి మారియా (41వ ని.), మెర్కాడో (48వ ని.), కున్ అగ్యురో (90+3వ ని.) స్కోరు అందించారు. ఆ హీరోనే దెబ్బకొట్టాడు... ఫ్రాన్స్ ఏకంగా ఆరు మార్పులతో మ్యాచ్‌లో దిగింది. దిగ్గజ జట్ల మధ్య పోటీ అందుకు తగ్గట్లే ప్రారంభమైంది. మాస్కెరనో షాట్‌తో అర్జెంటీనాకు మొదటి అవకాశం దక్కింది. మరోవైపు గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ గోల్బార్ అంచుల్లోంచి పక్కకుపోయింది. 4–3–3 వ్యూహంతో దిగిన అర్జెంటీనా కంటే ఫ్రాన్సే (4–2–3–1) సౌకర్యంగా కనిపించింది. గత మ్యాచ్‌లో నైజీరియాపై కీలక గోల్‌తో హీరోగా నిలిచిన రొజొ ఈసారి పెద్ద పొరపాటు చేశాడు. 11వ నిమిషంలో పాస్‌ను అందుకుని పరిగెడుతున్న ఎంబాపెను కిందపడేశాడు. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గ్రీజ్మన్... సునాయాసంగా నెట్లోకి కొట్టి జట్టుకు ఆధిక్యం అందించాడు. తర్వాత సైతం వేగం, బంతిని అట్టిపెట్టుకుంటూ పాస్‌లతో ప్రత్యర్థిని ఎంబాపె హడలెత్తించాడు. మరోవైపు 19వ నిమిషంలోనూ ఫ్రాన్స్‌కు ఫ్రీ కిక్ లభించినా పోగ్బా సద్వినియోగం చేయలేకపోయాడు. అటు సహచరుల నుంచి పాస్‌లు అందకపోవడంతో మెస్సీ వద్దకు బంతి రావడమే గగనమైంది. పైగా ఫ్రాన్స్ దాడులు చేసేలా అర్జెంటీనా దారిచ్చింది. ప్రతిఘటించే ప్రయత్నంలో వరుసగా ఇద్దరు ఆటగాళ్లు ఎల్లోకార్డులు అందుకున్నారు. అగ్యురో, హిగుయెన్లను దింపకపోవడం కూడా దెబ్బకొట్టింది. సెంటర్ ఫార్వర్డ్ లేకపోవడంతో ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఐనా అర్జెంటీనా బంతిని నియంత్రణలో ఉంచుకుంది. తొలి భాగం ముగియవస్తుందనగా... బనేగా పాస్‌ను డి బాక్స్ ముందు అందుకున్న డి మారియా 25 గజాల నుంచి గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆధిక్యంలో నిలిచినా... రెండో భాగం ప్రారంభంలోనే అర్జెంటీనాకు ఊహించని రీతిలో గోల్ దక్కింది. బాక్స్ ఏరియా లోపల పాస్‌ను అందుకున్న మెస్సీ గోల్‌పోస్ట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. నేరుగా వస్తే ఫ్రాన్స్ కీపర్ దానిని నిరోధించేవాడే. కానీ మధ్యలో ఉన్న మెర్కాడొ కాలికి బంతి నెట్లోకి చేరింది. అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆనందాన్ని పవార్డ్ పది నిమిషాల్లోనే ఆవిరి చేశాడు. హెర్నాండెజ్ అందించిన క్రాస్ పాస్‌ను సరిగ్గా డి బాక్స్ దగ్గర దొరకబుచ్చుకున్న పవార్డ్... ఓవైపు ఒరుగుతూ ముచ్చటైన రీతిలో గోల్‌గా మలిచాడు. గణాంకాలు 2–2తో సమమై... అరగంట ఆట మాత్రమే మిగిలి ఉన్న దశలో ఎంబాపె విజృంభించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను పైమెట్టున నిలబెట్టాడు. 64వ నిమిషంలో మరోసారి హెర్నాండెజ్ క్రాస్ ఇవ్వగా... గోల్‌పోస్ట్ ఎదుట జరిగిన డ్రామాలో ఎంబాపె చురుగ్గా స్పందించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. తర్వాతి గోల్‌ను అయితే మళ్లీమళ్లీ చెప్పుకొనేలా కేవలం మూడంటే మూడే పాస్‌ల్లో నెట్లోకి కొట్టాడు. అర్జెంటీనా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినా... దాదాపు అందుకోలేనంత ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ మ్యాచ్‌ను మరింత ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మెస్సీ బృందం చేసేదేమీలేకపోయింది. ఇంజ్యూరీ సమయంలో మెస్సీ క్రాస్ పాస్‌ను అగ్యురో హెడర్ గోల్‌తో ఒకింత ఆశ రేపాడు. చివరి క్షణం (90+6)లోనూ అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. అయితే బంతి గోల్‌పోస్ట్ పైకి వెళ్లడంతో అర్జెంటీనా ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్ హర్షాతిరేకాల్లో మునిగిపోయింది. మెస్సీని మించినోడు... అర్జెంటీనాను ముంచినోడు అర్జెంటీనా దిగ్గజం, 31 ఏళ్ల లియోనల్ మెస్సీకి ప్రపంచ కప్‌ను తీరని కలగానే మిగిల్చిన ఈ మ్యాచ్... 19 ఏళ్ల ఫార్వర్డ్ ఎంబాపెను అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. వాస్తవానికి రెండు జట్ల మధ్య తేడా ఎంబాపెనే. చిరుత పరుగుతో మ్యాచ్ గతినే మార్చేశాడతడు. పాస్‌లతో పాటు ఆట ఆసాంతం ఒకే వేగం కనబర్చిన ఎంబాపె నాలుగు నిమిషాల తేడాతో రెండు గోల్స్ కొట్టి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. అతడిని అందుకునే ప్రయత్నంలోనే అర్జెంటీనా గత మ్యాచ్ హీరోలు బనేగా, రొజొ ఎల్లో కార్డులకు గురయ్యారు. ఫ్రాన్స్ జట్టులో అందరి దృష్టి గ్రీజ్మన్, పోగ్బాపై ఉండగా... వారిని తోసిరాజంటూ ఎంబాపె సరికొత్త హీరోగా అవతరించాడు. మళ్లీ వస్తావా మెస్సీ...? అన్నీ తానే అయి రెండు ప్రపంచ కప్‌లలో అర్జెంటీనాను నడిపించిన మెస్సీ మరో కప్‌లో ఆడతాడనేది అనుమానమే. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, అందరి ఒత్తిడితో విరమించుకున్న అతడు... రష్యాలో ఏమంత ప్రభావం చూపలేకపోయాడు. ఐస్లాండ్ వంటి ప్రత్యర్థి కూడా అతడే లక్ష్యంగా వ్యూహం రచించి విజయవంతమైంది. నైజీరియాతో మ్యాచ్‌లో మాత్రమే గోల్ కొట్టగలిగిన మెస్సీ ... ఫ్రాన్స్‌పై మెరుపు పాస్‌లు అందించి స్కోరుకు దోహదపడగలిగాడు. కానీ తన స్థాయి ఆటగాడు గోల్ కొడితేనే ప్రత్యర్థికి పంచ్ తగులుతుంది. ప్రపంచకప్‌లో తమ జట్టు పయనంపై తన రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని మెస్సీ నెల క్రితం ప్రకటించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో...? కొసమెరుపు: క్రీడల్లో 10వ నంబర్ జెర్సీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. క్రికెట్లో సచిన్ ఇదే జెర్సీ ధరించేవాడు. మెస్సీది కూడా 10వ జెర్సీనే. ఈ మ్యాచ్‌లో మెరిసిన ఎంబాపె 10వ నంబరు జెర్సీతోనే ఆడాడు. మెస్సీ తన మార్కు చూపలేకపోయాడు. విశేషాలు ► తాను ఆడిన ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్ చేయకపోవడం గమనార్హం. ► ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ సమర్పించుకుంది. ► 1986లో బెల్జియం (యూఎస్ఎస్ఆర్ చేతిలో 3–4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్ చేసి ప్రపంచకప్ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. ► గ్రీజ్మన్ గోల్ చేసిన మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఫ్రాన్స్ ఓడిపోలేదు. -
మెస్సీకి సహకారం అందించాలి
ప్రపంచ కప్‌లో తొలి దశ డ్రామా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమించగా, 16 అత్యుత్తమ జట్లు నాకౌట్ బరిలో నిలిచాయి. ఇప్పుడు అసలైన ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది. అత్యుత్తమంగా ఆడినవారే ఇక్కడ నిలుస్తారు. ఈ దశలో కేవలం మంచి ఆట, వ్యూహాలు మాత్రమే సరిపోవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని తట్టుకోలేనివారు అందరికంటే ముందే బయటకు వెళ్లిపోతారు. సాధారణంగా నాకౌట్ దశలో చూపు తిప్పుకోలేని విధంగా ఆట సాగుతుంది. ఈసారి కూడా అందులో లోటేమీ లేదు. టోర్నీ చివరి దశలో కాకుండా ముందే పెద్ద జట్ల మధ్య పోరు జరగనుంది. ఫ్రాన్స్‌తో అర్జెంటీనా, ఉరుగ్వేతో పోర్చుగల్ తలపడటం అంటే భారీ వినోదానికి అవకాశం ఉంది. ఈ టోర్నీ ఆరంభంలో అర్జెంటీనా చాలా ఇబ్బంది పడింది. డిఫెన్స్ బలహీనత, మెస్సీపై అతిగా ఆధారపడటం, తుది జట్లు ఎంపికపై వివాదంలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో సాహసోపేత ఆటతో పాటు అదృష్టం కూడా వారికి కలిసొచ్చింది. ఇప్పటికే నాకౌట్ మ్యాచ్ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం ఒక రకంగా వారికి మంచిదే. అర్జెంటీనా ఒక జట్టుగా ఆడటం ఎంతో ముఖ్యం. మెస్సీ తన పరిధిలో ఎంత చేయగలడో అంతా చేస్తాడు కానీ ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యత నెరవేరిస్తేనే అర్జెంటీనాకు మంచి ఫలితం లభిస్తుంది. -
గ్రూప్‘హెచ్’ టాపర్ కొలంబియా
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి -
స్విస్ ముందుకెళ్లింది..
నిజ్నీ నోవ్గొరడ్: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్‌కు చేరింది. గ్రూప్ ‘ఇ’లో గురువారం స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రా అయింది. దీంతో ఈ గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న స్విస్, బ్రెజిల్ (7)తో పాటు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోస్టారికా అట్టడుగుకు పడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. స్విస్ తరఫున బ్లెరిమ్ జెమయిలి (31వ ని.), జోసిప్ డ్రిమిక్ (88వ ని.) గోల్ చేయగా, కోస్టారికా జట్టులో కెండల్ వాస్టన్ (56వ ని.) గోల్ సాధించాడు. మరో గోల్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సొమర్ ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో సెల్ఫ్‌గోల్ చేశాడు. -
బ్రెజిల్ దూసుకెళ్లింది
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీలా బ్రెజిల్ కూలిపోలేదు. మరో షాక్‌కు తావివ్వలేదు. మరో పరాభవానికి చోటివ్వ లేదు. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ అంచనాలకు తగ్గట్టే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ దూసుకుపోయింది. మెరుగైన ప్రదర్శనతో సెర్బియాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాస్కో: జోరుమీదున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరింది. ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2–0 గోల్స్‌తో సెర్బియాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో బ్రెజిల్కిది వరుసగా రెండో విజయం. స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కోస్టారికాపై గెలిచింది. దీంతో గ్రూప్ ‘ఇ’లో ఓటమి ఎరుగని బ్రెజిల్ టాపర్‌గా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెర్బియాతో బుధవారం జరిగిన పోరులో పాలిన్హో, తియాగో సిల్వా ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే బ్రెజిల్ దాడులు మొదలయ్యాయి. కానీ సమన్వయం కుదరక నాలుగో నిమిషంలోనే గోల్ చేసే చక్కని అవకాశాన్ని కోల్పోయింది బ్రెజిల్. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌కు అత్యంత సమీపంగా బంతిని తీసుకొచ్చిన జీసస్ షాట్... నెమార్, కౌటిన్హో సమన్వయలేమితో నిష్ఫలమైంది. ఆ తర్వాత కూడా బ్రెజిల్ పదేపదే లక్ష్యం దిశగా గురిపెట్టింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ఆట 36వ నిమిషంలో కౌటిన్హో ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ పాలిన్హో మెరుపువేగంతో గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో బ్రెజిల్ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. 1–0 ఆధిక్యంతో ఫస్టాఫ్‌ను ముగించింది. డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంతిని బ్రెజిల్ గోల్‌పోస్ట్‌వైపు తీసుకెళ్లేందుకే సెర్బియా ఆపసోపాలు పడింది. ఇక ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్ ఆధిపత్యమే కొనసాగింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచేందుకు ఆటగాళ్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో బ్రెజిల్ రెండో గోల్ నమోదైంది. ఆట 68వ నిమిషంలో స్ట్రయికర్ నెమార్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను డిఫెండర్ తియాగో సిల్వా హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0 ఆధిక్యంతో దూసుకెళ్లిన బ్రెజిల్‌ను సెర్బియా ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఆటగాళ్లు ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టగా రెండు సార్లు విజయవంతమయ్యారు. ప్రత్యర్థి సెర్బియా జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే టార్గెట్‌కు చేరినప్పటికీ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. జూలై 2న జరిగే ప్రిక్వా ర్టర్ ఫైనల్లో మెక్సికోతో బ్రెజిల్ ఆడుతుంది. అభిమానుల ఘర్షణ సాకర్ క్రేజ్ ఆకాశమంత అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్‌కప్ కోసం ప్రాణాలిస్తారు. చేదు ఫలితాలొస్తే జీర్ణించుకోలేక ప్రాణాలొదిలేస్తారు. మైదానంలో తమ జట్లు పోరాడితే... ప్రేక్షకుల గ్యాలరీల్లో అభిమానులు బాహాబాహీకి దిగుతుండటం కూడా ఇక్కడ సహజం. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్ ముగిశాక ఇరు దేశాల అభిమానులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రేక్షకురాలు ఇదంతా చూసి భయాందోళనకు గురైంది. పోలీసులు ఈ సంఘటనలో బాధ్యులైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
మరో నాకౌట్ సాధిస్తాడా?
నేడు సామెట్తో విజేందర్ బౌట్ మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తనకన్నా అనుభవజ్ఞుడితో భారత స్టార్ బాక్సర్ విజేందర్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. బౌట్‌కు ముందే మాటల యుద్ధం ప్రారంభించిన సామెట్ హ్యూసినోవ్ను తక్కువ అంచనా వేయకున్నా కచ్చితంగా ఓడించి హ్యాట్రిక్ సాధిస్తానని విజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ ఎరీనాలో ఈ పోరు జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా ఆడిన రెండు బౌట్స్ నాలుగు రౌండ్ల పాటు జరగ్గా నాకౌట్ విజయాలతో విజేందర్ అదరగొట్టాడు. అయితే నేటి బౌట్ ఆరు రౌండ్ల పాటు సాగుతుంది. సామెట్ ఇప్పటిదాకా తలపడిన 14 ఫైట్స్‌లో ఏడు విజయాలున్నాయి. విజేందర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచి భారత్‌కు పంపిస్తానని సామెట్ ఇప్పటికే మాటల జోరు కొనసాగిస్తున్నాడు. అయితే విజేందర్ మాత్రం ఇలాంటి వాటికి బెదిరేది లేదని అన్నాడు. -
నాకౌట్ దశకు పంకజ్
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-2 (44-74, 60-32, 12-60, 98-0, 80-3, 72-21) ఫ్రేమ్‌ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన లక్కీ వత్నానిపై గెలిచాడు. ఇదే గ్రూప్‌లో పంకజ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భారత్‌కే చెందిన కమల్ చావ్లా వరుసగా నాలుగో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాడు. మహిళల విభాగం నుంచి చిత్రా మగిమైరాజన్, అమీ కమాని కూడా నాకౌట్ దశకు అర్హత పొందారు. -
అన్నీ అంతంతే !
ప్రపంచకప్‌లో తలపడుతున్న ఎనిమిది గ్రూప్‌లలో అంతగా అంచనాలు లేనిది గ్రూప్ ‘హెచ్’. ఇందులోని నాలుగు దేశాలు బెల్జియం, రష్యా, కొరియా రిపబ్లిక్, అల్జీరియాలకు ఇప్పటిదాకా ప్రపంచకప్ సాధించిన చరిత్ర లేదు. అయితే బెల్జియం, కొరియాలు ఇంతకుముందు చెరోసారి సెమీఫైనల్ దాకా వెళ్లగలిగాయి. మహా అయితే ఈ రెండు జట్లు మరోసారి నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. ఈ గ్రూప్ నుంచి ఏ జట్టయినా సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి. కొరియా రిపబ్లిక్ ఆసియా నుంచి ఎక్కువ సార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లలో కొరియా రిపబ్లిక్ ఒకటి. వరుసగా ఎనిమిదో సారి, మొత్తంగా తొమ్మిదోసారి ప్రపంచకప్ ఆడుతున్న ఈ దక్షిణ కొరియా జట్టు 2002 ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1954లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాక మళ్లీ 1986 దాకా అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ తరువాత నుంచి వరుసగా ప్రపంచకప్‌లో ఆడుతూ వస్తోంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: తొలుత 1954లో, ఆ తరువాత 1986 నుంచి 1998 దాకా వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైంది. 2002లో నాలుగో స్థానంలో నిలి చింది. 2006లో మరోసారి గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే 2010లో దక్షిణాప్రికాలో ప్రిక్వార్టర్స్‌కు చేరి 15వ స్థానం పొందింది. కీలక ఆటగాళ్లు: సీనియర్ ఆటగాడు పార్క్ చు-యంగ్, సన్ హ్యుంగ్‌మిన్, కిమ్ షిన్వూక్లు గోల్స్ అందించగల ఆటగాళ్లు. వీరికితోడు మిడ్‌ఫీల్డర్లు కూ జాచియోల్, లీ చుంగ్యాంగ్లు కీలకం కానున్నారు. కోచ్: హాంగ్ మ్యుంగ్బో; అంచనా: బెల్జియంపై గెలిస్తే ప్రిక్వార్టర్స్‌కు చేరవచ్చు. రష్యా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యా జట్టు తొలిసారిగా 1994లో ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. మళ్లీ 2002లో క్వాలిఫై అయినా.. నాకౌట్‌కు చేరలేకపోయింది. గత రెండు ప్రపంచకప్‌లకు అర్హతనూ పొందలేకపోయింది. దీంతో ఈసారి పెద్దగా అంచనాలు లేకుండానే క్వాలిఫయర్స్‌లో బరిలోకి దిగింది. కానీ, యూరోప్ నుంచి గ్రూప్ ‘ఎఫ్’ విజేతగా నిలిచి బ్రెజిల్‌కు దూసుకొచ్చింది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: సోవియట్ యూనియన్ జట్టుగా 1958లో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 1962, 1970లలోనూ క్వార్టర్స్‌కు చేరింది. 1966లో సెమీస్‌కు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా జట్టుగా 1994, 2002 ప్రపంచకప్‌లకు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశను దాటలేకపోయింది. ఇక 2006, 2010 ప్రపంచకప్‌లకు క్వాలిఫై కూడా కాలేకపోయింది. కీలక ఆటగాళ్లు: ఈ జట్టులో ఫార్వర్డ్ ఆటగాడు అలెగ్టాండర్ కెర్జకోవ్, డిఫెండర్ సెర్గీ ఇగ్నషెవిచ్ కీలక ఆటగాళ్లు. మిడ్‌ఫీల్డర్ రోమన్ షిరోకోవ్ గాయపడటం ప్రతికూలం. కోచ్: ఫాబియో కాపెలో; అంచనా: నాకౌట్ దశకు చేరుకోవచ్చు. బెల్జియం ఫిఫా వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బెల్జియం.. ప్రపంచకప్ వేటలో మాత్రం వెనకబడే ఉంది. 1982 నుంచి 2002 దాకా వరుసగా ఆరుసార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన రికార్డు ఈ జట్టుది. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ పోరుకు చేరుకోలేకపోగా.. మళ్లీ క్వాలిఫై అయ్యేందుకే ఇన్నేళ్లు పట్టింది. అయితే క్వాలిఫయింగ్స్‌లో ఈ యూరోప్ జట్టు తమ గ్రూప్‌లో నంబర్‌వన్‌గా నిలిచి ప్రపంచకప్‌కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: ఇప్పటికి 11 సార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ, 1986లో సెమీఫైనల్స్‌కు చేరడమే ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 1990, 1994, 2002 ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్స్‌కు చేరగలిగింది. కీలక ఆటగాళ్లు: క్వాలిఫయింగ్స్‌లో అదరగొట్టిన నాసర్ చడ్లీ, ఈడెన్ హజార్డ్లు మరోసారి కీలకం కానున్నారు. వీరికి కెప్టెన్ విన్సెంట్ కంపనీ, థామస్ వెర్మాలెన్, రొమేలు లుకాకు, కెవిన్ డి బ్రూనే వంటి సీనియర్ల అనుభవం తోడు కానుంది. కోచ్: మార్క్ విల్మట్స్ అంచనా: కొరియాను ఓడించగలిగితే నాకౌట్‌కు చేరొచ్చు. అల్జీరియా గ్రూప్‌లో ఏమాత్రం అంచనాలు లేని జట్టు అల్జీరియా. 1964లోనే ఫిఫా సభ్యదేశంగా మారినా.. ప్రపంచకప్ బరిలో అడుగు పెట్టేందుకు మాత్రం 1982 దాకా పోరాడాల్సివచ్చింది. మొత్తంగా మూడుసార్లు అర్హత సాధించినా ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేకపోయింది. అయితే ఈసారి క్వాలిఫయింగ్స్‌లో ఆఫ్రికా నుంచి అర్హత పొందిన ఐదు జట్లలో టాప్‌గా నిలిచింది. తమ కన్నా మెరుగైన బెల్జియం, రష్యా, కొరియా జట్లను దాటుకొని ఏ మేరకు ముందుకు వెళ్తుందన్నది సందేహమే. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1982లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలిసారిగా పాల్గొంది. తరువాత 1986లో బ్రెజిల్, స్పెయిన్ వంటి జట్లున్న గ్రూప్‌లో ఆడి అట్టడుగు స్థానంతో వెనుదిరిగింది. 2010లో దక్షిణాఫ్రికాలోనూ అల్జీరియాకు నిరాశే ఎదురైంది. గ్రూప్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్ర్కమించింది. కీలక ఆటగాళ్లు: డిఫెండర్ మాడ్జిడ్ బౌగెర్రా కెప్టెన్‌గా ప్రధాన బాధ్యతలు మోయనున్నాడు. సోఫియేన్ ఫెగౌలి, మేధి లాసెన్, ఇస్లాం స్లిమానీలు ఈ జట్టులో ఇతర ప్రధాన ఆటగాళ్లు. కోచ్: వాహిద్ హాలిహోడ్జిక్ అంచనా: గ్రూప్ దశ దాటడం కష్టమే