మరో నాకౌట్ సాధిస్తాడా? | Professional boxing bout: Vijender Singh eyes another knockout show against Samet Hyuseinov | Sakshi
Sakshi News home page

మరో నాకౌట్ సాధిస్తాడా?

Published Sat, Dec 19 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

మరో నాకౌట్ సాధిస్తాడా?

మరో నాకౌట్ సాధిస్తాడా?

నేడు సామెట్‌తో విజేందర్ బౌట్
మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తనకన్నా అనుభవజ్ఞుడితో భారత స్టార్ బాక్సర్ విజేందర్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. బౌట్‌కు ముందే మాటల యుద్ధం ప్రారంభించిన సామెట్ హ్యూసినోవ్‌ను తక్కువ అంచనా వేయకున్నా కచ్చితంగా ఓడించి హ్యాట్రిక్ సాధిస్తానని విజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ ఎరీనాలో ఈ పోరు జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా ఆడిన రెండు బౌట్స్ నాలుగు రౌండ్ల పాటు జరగ్గా నాకౌట్ విజయాలతో విజేందర్ అదరగొట్టాడు.

అయితే నేటి బౌట్ ఆరు రౌండ్ల పాటు సాగుతుంది. సామెట్ ఇప్పటిదాకా తలపడిన 14 ఫైట్స్‌లో ఏడు విజయాలున్నాయి. విజేందర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచి భారత్‌కు పంపిస్తానని సామెట్ ఇప్పటికే మాటల జోరు కొనసాగిస్తున్నాడు. అయితే విజేందర్ మాత్రం ఇలాంటి వాటికి బెదిరేది లేదని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement