![Gukesh to knockout in freestyle chess](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/chess.jpg.webp?itok=GE56lhhE)
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్‌లో నాకౌట్‌కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని భారత గ్రాండ్‌మాస్టర్... ఏడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు.
ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్‌లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్‌కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్‌కు చెందిన నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment