Hetmyer Curse Twitter Floods Memes WI Knocked-out T20 World Cup 2022 - Sakshi
Sakshi News home page

West Indies: 'హెట్‌మైర్‌ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'

Published Fri, Oct 21 2022 4:06 PM | Last Updated on Tue, Oct 25 2022 5:23 PM

Hetmyer Curse Twitter Floods Memes WI Knocked-out T20 World Cup 2022 - Sakshi

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఒక జట్టు ఎలా ఆడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక మెగాటోర్నీలో అసలు మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే క్వాలిఫయింగ్‌ పోరులోనే వెనుదిరిగితే అభిమానుల ఆగ్రహం తట్టుకోవడం కష్టం. తాజాగా వెస్టిండీస్‌కు ఇలాంటి సంకట పరిస్థితే ఎదురైంది. ఎవరు ఊహించని విధంగా టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ క్వాలిఫయింగ్‌ దశలోనే టోర్నీ నుంచి నాకౌట్‌ అయి ఆశ్చర్యపరిచింది.

ఐర్లాండ్‌కు విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయని విండీస్‌ బౌలర్లు జట్టుకు 9 వికెట్లతో దారుణ పరాజయాన్ని కట్టబెట్టారు. విండీస్‌ ఆటతీరు ఆ దేశ అభిమానులకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోవడం ఖాయం. ఇక విండీస్‌ ఓటమిపై సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌, మీమ్స్‌ వస్తున్నాయి.

హెట్‌మైర్‌ శాపం తగిలింది..
టి20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు వెస్టిండీస్‌ స్టార్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ ఆస్ట్రేలియాకు వెళ్లే ఫ్లైట్‌ మిస్‌ అయ్యాడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో హెట్‌మైర్‌ చివరి నిమిషంలో విమానం ఎక్కలేకపోయాడు. అయినప్పటికి విండీస్‌ బోర్డు మరోసారి అవకాశం ఇచ్చింది. కానీ హెట్‌మైర్‌ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన తప్పిదంతో టి20 ప్రపంచకప్‌కు దూరం కావాల్సి వచ్చింది. ఇది జరిగిన విషయం

అయితే అభిమానులు మాత్రం.. ''వెస్టిండీస్‌ జట్టుకు హెట్‌మైర్‌ శాపం తగిలిందని.. అందుకే కనీసం క్వాలిఫయర్‌ దశ కూడా దాటలేకపోయిందంటూ'' కామెంట్స్‌ చేశారు. ''రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికి కొన్ని కారణాల వల్ల అతను ఫ్లైట్‌ ఎక్కలేదు.. నిజమే కానీ మరొక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పటికి సమయం ఉంది.. హెట్‌మైర్‌కు ఆ చాన్స్‌ ఇవ్వకుండా జట్టులో నుంచి తొలగించారు.. ఒకవేళ హెట్‌మైర్‌ ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో'' అంటూ పేర్కొన్నారు.

అయితే కొందరు అభిమానులు మాత్రం.. ''అంతలేదు.. ఎవరి శాపం తగల్లేదు. జట్టు మొత్తంగా ఏం చేయలేనిది హెట్‌మైర్‌ ఒక్కడు ఏం చేయగలడు.. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి.. గెలవాలంటే కసిగా ఆడాలి.. అంతే తప్ప ఇలాంటి శాపాలు వల్లే ఓడిపోయిందంటే ఎవరు నమ్మరు'' అంటూ ఘాటుగా స్పందించారు.

ఏది ఏమైనా విండీస్‌ జట్టు మాత్రం టి20 ప్రపంచకప్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించి అభిమానులను బాధపెట్టింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన విండీస్‌కు ఇలాంటి దుస్థితి రావడంపట్ల క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ​ బాధపడిపోతున్నారు. ఇక విండీస్‌ జట్టుపై వస్తున్న ట్రోల్స్‌పై ఒక లుక్కేయండి.

చదవండి: నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?

ప్రాక్టీస్‌ చేస్తుండగా ఫ్యాన్స్‌ కేరింతలు! సీరియస్‌ అయిన కోహ్లి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement