T20 WC 2022: Twitter Trend Bye-Bye Pakistan After India Loss Match Against South Africa - Sakshi
Sakshi News home page

T20 WC 2022: టీమిండియా ఓటమి.. 'Bye-Bye Pakistan'; పేలుతున్న మీమ్స్‌

Published Sun, Oct 30 2022 9:49 PM | Last Updated on Mon, Oct 31 2022 8:28 AM

Twitter Trend BYE-BYE Pakistan After India Loss Match To-SA T20 WC 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌లో ఆదివారం సూపర్‌-12 గ్రూఫ్‌-2లో టీమిండియాపై సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రొటిస్‌ విజయంతో పాకిస్తాన్‌ అనధికారికంగా టి20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించినట్లే. టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్‌ను ఆ సంతోషం ఒక్కరోజు కూడా మిగల్లేదు.  సౌతాఫ్రికాపై టీమిండియా గెలవాలని పాక్‌ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదని చెప్పొచ్చు.

అయినా నెదర్లాండ్స్‌పై పాక్‌ ఆడిన తీరు చూశాకా వాళ్లు సెమీస్‌కు వచ్చినా పెద్దగా ఉపయోగం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నెదర్లాండ్స్‌ విధించిన 91 పరగులు లక్ష్యాన్ని అందుకోవడానికి పాక్‌ నానాకష్టపడింది. మహ్మద్‌ రిజ్వాన్‌ మినహా మిగతావాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. టార్గెట్‌ చిన్నది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నెదర్లాండ్స్‌ కూడా పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చేదే. 

ఇక కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం అందుకోవడంతో పాక్‌కు సెమీస్‌కు వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. దీంతో పాకిస్తాన్‌ జట్టును టార్గెట్‌ చేస్తూ ట్విటర్‌లో ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు క్రికెట్‌ అభిమానులు. ప్రస్తుతం ''బైబై పాకిస్తాన్‌''(Bye Bye Pakistan) అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ లిస్టులో చేరింది.

ఇక మీమ్స్‌ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లి మార్క్రమ్‌ క్యాచ్‌ వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయిందని చెప్పొచ్చు. దీనిని కొందరు అభిమానులు ఫన్నీవేలో పేర్కొన్నారు. కోహ్లి వదిలేసిన బంతిని పాక్‌ జట్టులాగా అభివర్ణిస్తూ.. ''కోహ్లి పాక్‌ జట్టును కరాచీ ఎయిర్‌ పోర్ట్‌లో సక్సెస్‌ఫుల్‌గా డ్రాప్‌ చేశాడు'' అంటూ మీమ్‌  పెట్టడం వైరల్‌గా మారింది. దీంతో పాటు చాలా మీమ్స్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇక ''బైబై పాకిస్తాన్‌'' అని మీమ్‌ పెట్టడం వెనుక ఒక చిన్న కథ దాగుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఓడిన టీమిండియా.. కివీస్‌ చేతిలోనూ పరాజయం ఎదురైంది. అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కివీస్‌ ఓడిపోతే టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు ఉండేవి. కానీ న్యూజిలాండ్‌ ఆఫ్గన్‌ను ఓడగొట్టడంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పుడు కొంతమంది పాక్‌ అభిమానులు ''బైబై ఇండియా'' అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టారు. ఈసారి పాకిస్తాన్‌కు ఆ పరిస్థితి రావడంతో లెక్క సరిపోయింది అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు.

ఇక టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా రెండు విజయాలు, ఒక రద్దుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌ కూడా రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది. అయితే టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్కటి గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుంది. అయితే రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఏ చిన్న పొరపాటు చేసినా మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ఇవాళ గెలుపు కోసం జింబాబ్వే, బంగ్లాదేశ్‌లు పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది.

చదవండి: అశ్విన్‌.. మిల్లర్‌ను వదిలేసి తప్పుచేశావ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement