
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్‌లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్‌లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment