World Snooker Championship
-
World Snooker Championship 2022: నాకౌట్ దశకు పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. టర్కీలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ ‘కె’లో ఉన్న పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పంకజ్ 3–0తో రెహమాన్ (టర్కీ)పై, రెండో మ్యాచ్‌లో 3–0తో సమీర్ (ఈజిప్ట్) పై, మూడో మ్యాచ్‌లో 3–0తో మార్కో రీజెర్స్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. 37 ఏళ్ల పంకజ్ ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో కలిపి 25సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
రెండో రౌండ్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్ తొలి రౌండ్లో పంకజ్ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్ సలూమీ (యెమెన్)పై విజయం సాధించాడు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో పోటీపడిన పంకజ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కే చెందిన అలోక్ కుమార్, లక్ష్మణ్ రావత్ కూడా నాకౌట్ తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. -
రన్నరప్ అమీ కమాని
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ మాస్టర్స్ విభాగంలో విజేత ధర్మేందర్ దోహా: ఫైనల్‌కు చేరిన తొలిసారే ప్రపంచ స్నూకర్ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన భారత క్రీడాకారిణి అమీ కమానికి నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో 24 ఏళ్ల అమీ కమాని రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెండీ జాన్స (బెల్జియం) 5-0తో ఫ్రేమ్‌ల తేడాతో అమీ కమానిపై గెలిచి వరుసగా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అమీ కమాని ఫైనల్లో నిలకడగా పారుుంట్లు సాధించినా... తుదకు అనుభవజ్ఞురాలైన వెండీ జాన్సదే పైచేరుుగా నిలిచింది. మరోవైపు మాస్టర్స్ విభాగంలో భారత్‌కు చెందిన ధర్మేందర్ లిల్లీ 6-2 ఫ్రేమ్‌ల తేడాతో ఇవాన్‌స (వేల్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో భారత స్టార్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7 ఫ్రేమ్‌ల తేడాతో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో సోహైల్ వహీది (ఇరాన్) 8-1తో పాజెట్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. -
ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని
దోహా: భారత క్రీడాకారిణి అమీ కమాని ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో అమీ కమాని 4-2 (60-50, 68-15, 50-30, 9-69, 20-57, 61-56) ఫ్రేమ్‌ల తేడాతో వరతనున్ సుక్రుతిహెన్స (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అమీ కమాని 4-1తో భారత్‌కే చెందిన చిత్రా మగిమైరాజన్పై గెలిచింది. మరోవైపు పురుషుల విభాగంలో భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వా నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 6-5 (65-35, 64-75, 5-113, 75-0, 120-15, 76-20, 61-64, 98-0, 49-74, 0-120, 56-45) ఫ్రేమ్‌ల తేడాతో థనావత్ తిరపోంగ్పైబూన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-3 (13-63, 100-28, 133-7, 34- 72, 44-76, 83-20, 49-45, 70-43) ఫ్రేమ్‌ల తేడాతో కీన్ హూ మో (మలేసియా)పై నెగ్గగా... రెండో రౌండ్లో 5-3 (68-22, 51-72, 67-74, 95-19, 7-113, 83-1, 75-17, 84-19) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మాసి (పాకిస్తాన్) ను ఓడించాడు. భారత్‌కే చెందిన మానన్ చంద్ర, లక్కీ వత్నాని ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. మానన్ చంద్ర 0-5తో మైకేల్ జడ్జ (ఐర్లాండ్) చేతిలో, లక్కీ వత్నాని 2-5తో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలు, వ్యాపారులకే కాదు... క్రీడలకూ తగిలింది. దీని వల్ల ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా పడింది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 15 నుంచి ఈ ఫ్రాంచైజీ లీగ్ రెండో సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత కారణంగా కొన్నాళ్లు వారుుదా వేయాలని ఫ్రాంచైజీ యజమానులు, స్టేక్ హోల్డర్లు కోరడంతో లీగ్ ప్రమోటర్, ప్రొ స్పోర్టిఫై డెరైక్టర్ విశాల్ గుర్నాని టోర్నీని వారుుదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త షెడ్యూలును బుధవారం (ఈనెల 30న) వెల్లడిస్తామని చెప్పారు. గతేడాదిలాగే ఫ్రాంచైజీ జట్లు ఆరే ఉంటాయని, జట్ల సంఖ్యను పెంచబోమని చెప్పారు. -
నాకౌట్ దశకు పంకజ్
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకున్న భారత స్టార్ పంకజ్ అద్వానీ నాకౌట్ దశకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన గ్రూప్ ‘హెచ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-2 (44-74, 60-32, 12-60, 98-0, 80-3, 72-21) ఫ్రేమ్‌ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన లక్కీ వత్నానిపై గెలిచాడు. ఇదే గ్రూప్‌లో పంకజ్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘ఎఫ్’లో భారత్‌కే చెందిన కమల్ చావ్లా వరుసగా నాలుగో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు చేరుకున్నాడు. మహిళల విభాగం నుంచి చిత్రా మగిమైరాజన్, అమీ కమాని కూడా నాకౌట్ దశకు అర్హత పొందారు. -
పంకజ్‌కు రెండో విజయం
బెంగళూరు: భారత స్టార్ పంకజ్ అద్వానీ... ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన గ్రూప్-హెచ్ రెండో లీగ్ మ్యాచ్‌లో అతను 4-0 (99 (47)-24, 67 (45)-39, 65 (53)-0, 84 (63)-45)తో చి వీ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 4-1తో మర్వాన్ అల్ఫాల్సి (యూఏఈ)ని ఓడించాడు. తొలి మూడు గేమ్‌ల్లో దూకుడుగా ఆడిన కమల్ నాలుగో గేమ్‌లో నిరాశపర్చాడు. అయితే చివరి గేమ్‌ను 77-01తో నెగ్గాడు. మహిళల విభాగంలో విద్యా పిళ్లై 3-0తో ఫెర్నాండో ఇరినెన్ (బ్రెజిల్)పై గెలిచింది. విద్య 44 బ్రేక్‌ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో చిత్ర మగిమరాజన్ 3-1తో కార్మెలితా యుమితో (బ్రెజిల్)పై నెగ్గింది.