పంకజ్‌కు రెండో విజయం | Pankaj Advani and co impress in World Snooker Championship | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు రెండో విజయం

Published Fri, Nov 21 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

పంకజ్‌కు రెండో విజయం

పంకజ్‌కు రెండో విజయం

బెంగళూరు: భారత స్టార్ పంకజ్ అద్వానీ... ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన గ్రూప్-హెచ్ రెండో లీగ్ మ్యాచ్‌లో అతను 4-0 (99 (47)-24, 67 (45)-39, 65 (53)-0, 84 (63)-45)తో చి వీ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 4-1తో మర్వాన్ అల్ఫాల్సి (యూఏఈ)ని ఓడించాడు. తొలి మూడు గేమ్‌ల్లో దూకుడుగా ఆడిన కమల్ నాలుగో గేమ్‌లో నిరాశపర్చాడు. అయితే చివరి గేమ్‌ను 77-01తో నెగ్గాడు. మహిళల విభాగంలో విద్యా పిళ్లై 3-0తో ఫెర్నాండో ఇరినెన్ (బ్రెజిల్)పై గెలిచింది. విద్య 44 బ్రేక్‌ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో చిత్ర మగిమరాజన్ 3-1తో కార్మెలితా యుమితో (బ్రెజిల్)పై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement