Group H
-
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్‌లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం
దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్ ‘హెచ్’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ కుడూస్ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్ సలిసు (24వ ని.లో) మరో గోల్ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్ ఆయూనే పాస్ అందించగా... కుడూస్ హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది. 168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్ చేసిన రెండు హెడర్ గోల్స్ ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్ ఇచ్చిన క్రాస్తో తొలి గోల్ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్ జిన్ కిక్ కొట్టగా, గోల్ పోస్ట్ ముందు గిడియాన్ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్ లారెన్స్ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు. ప్రపంచకప్‌లో నేడు ఈక్వెడార్ X సెనెగల్ రాత్రి గం. 8:30 నుంచి నెదర్లాండ్స్ X ఖతర్ రాత్రి గం. 8:30 నుంచి ఇరాన్ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి ఇంగ్లండ్ X వేల్స్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
రొనాల్డో... ఆఖరి అవకాశం
క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు క్రిస్టియానో రొనాల్డో. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్లో ప్రొఫెషనల్ లీగ్స్‌లో (ప్రీమియర్ లీగ్, లా లిగా, చాంపియన్స్ లీగ్, సెరియా లీగ్) అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్ సాధించాడు. కానీ ప్రపంచకప్ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను 2016లో యూరో చాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్ లీగ్ టైటిల్ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు. పోర్చుగల్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1966). ‘ఫిఫా’ ర్యాంక్: 9. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ విజేత. ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ యువ, సీనియర్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 117 గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్ డయాస్ కీలక ఆటగాళ్లు. ఘనా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 61. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విజేత. ‘బ్లాక్ స్టార్స్’గా పేరున్న ఘనా నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది. 2018 ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన ఘనా అంతకుముందు రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశను దాటి ముందుకెళ్లింది. ఈసారి తమ గ్రూప్‌లోని మూడు జట్లు పటిష్టమైనవి కావడంతో ఘనా సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. డెనిస్ ఒడోయ్, లాంప్టె, కుడుస్, అబ్దుల్ రహమాన్ కీలక ఆటగాళ్లు. ఉరుగ్వే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (1930, 1950). ‘ఫిఫా’ ర్యాంక్: 14. అర్హత ఎలా: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం. నిలకడలేని ప్రదర్శనకు మారుపేరైన ఉరుగ్వే 14వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతోంది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మూడు జట్లలో ఒకటైన ఉరుగ్వే ఈసారి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయలేము. గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్లెరా, కెప్టెన్ డీగో గోడిన్, మార్టిన్ సెసెరెస్, లూయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలకు 100 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్లు సత్తా చాటుకుంటే ఉరుగ్వే జట్టుకు గ్రూప్ దశ దాటడం ఏమంత కష్టం కాబోదు. దక్షిణ కొరియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (2002). ‘ఫిఫా’ ర్యాంక్: 28. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ రన్నరప్. ప్రపంచకప్‌లో ఆసియా నుంచి అత్యధికసార్లు బరిలోకి దిగిన జట్టు దక్షిణ కొరియా. ఇప్పటి వరకు 11 సార్లు పోటీపడిన కొరియా తాము ఆతిథ్యమిచ్చిన 2002 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏ ఆసియా జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1986 నుంచి ప్రతి ప్రపంచకప్‌నకు అర్హత పొందిన కొరియా 2002లో మినహా మిగతా అన్నిసార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. స్టార్ ప్లేయర్ సన్ హెయుంగ్ మిన్ ఫామ్ కొరియా విజయావకాశాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. –సాక్షి క్రీడా విభాగం -
పంకజ్‌కు రెండో విజయం
బెంగళూరు: భారత స్టార్ పంకజ్ అద్వానీ... ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన గ్రూప్-హెచ్ రెండో లీగ్ మ్యాచ్‌లో అతను 4-0 (99 (47)-24, 67 (45)-39, 65 (53)-0, 84 (63)-45)తో చి వీ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 4-1తో మర్వాన్ అల్ఫాల్సి (యూఏఈ)ని ఓడించాడు. తొలి మూడు గేమ్‌ల్లో దూకుడుగా ఆడిన కమల్ నాలుగో గేమ్‌లో నిరాశపర్చాడు. అయితే చివరి గేమ్‌ను 77-01తో నెగ్గాడు. మహిళల విభాగంలో విద్యా పిళ్లై 3-0తో ఫెర్నాండో ఇరినెన్ (బ్రెజిల్)పై గెలిచింది. విద్య 44 బ్రేక్‌ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో చిత్ర మగిమరాజన్ 3-1తో కార్మెలితా యుమితో (బ్రెజిల్)పై నెగ్గింది.