ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని | World Snooker final, Amy kamani | Sakshi
Sakshi News home page

ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని

Published Tue, Nov 29 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని

ప్రపంచ స్నూకర్ ఫైనల్లో అమీ కమాని

దోహా: భారత క్రీడాకారిణి అమీ కమాని ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో అమీ కమాని 4-2 (60-50, 68-15, 50-30, 9-69, 20-57, 61-56) ఫ్రేమ్‌ల తేడాతో వరతనున్ సుక్రుతిహెన్‌‌స (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అమీ కమాని 4-1తో భారత్‌కే చెందిన చిత్రా మగిమైరాజన్‌పై గెలిచింది.

మరోవైపు పురుషుల విభాగంలో భారత స్టార్ క్రీడాకారుడు పంకజ్ అద్వా నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 6-5 (65-35, 64-75, 5-113, 75-0, 120-15, 76-20, 61-64, 98-0, 49-74, 0-120, 56-45) ఫ్రేమ్‌ల తేడాతో థనావత్ తిరపోంగ్‌పైబూన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-3 (13-63, 100-28, 133-7, 34- 72, 44-76, 83-20, 49-45, 70-43) ఫ్రేమ్‌ల తేడాతో కీన్ హూ మో (మలేసియా)పై నెగ్గగా... రెండో రౌండ్‌లో 5-3 (68-22, 51-72, 67-74, 95-19, 7-113, 83-1, 75-17, 84-19) ఫ్రేమ్‌ల తేడాతో బాబర్ మాసి (పాకిస్తాన్) ను ఓడించాడు. భారత్‌కే చెందిన మానన్ చంద్ర, లక్కీ వత్నాని ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. మానన్ చంద్ర 0-5తో మైకేల్ జడ్‌‌జ (ఐర్లాండ్) చేతిలో, లక్కీ వత్నాని 2-5తో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓటమి చవిచూశారు. 

ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలు, వ్యాపారులకే కాదు... క్రీడలకూ తగిలింది. దీని వల్ల ప్రొ రెజ్లింగ్ లీగ్ వారుుదా పడింది. నిజానికి ముందే అనుకున్న షెడ్యూలు ప్రకారం వచ్చే నెల 15 నుంచి ఈ ఫ్రాంచైజీ లీగ్ రెండో సీజన్ ఆరంభం కావాలి. కానీ నగదు కొరత కారణంగా కొన్నాళ్లు వారుుదా వేయాలని ఫ్రాంచైజీ యజమానులు, స్టేక్ హోల్డర్లు కోరడంతో లీగ్ ప్రమోటర్,  ప్రొ స్పోర్టిఫై డెరైక్టర్ విశాల్ గుర్నాని టోర్నీని వారుుదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త షెడ్యూలును బుధవారం (ఈనెల 30న) వెల్లడిస్తామని చెప్పారు. గతేడాదిలాగే ఫ్రాంచైజీ జట్లు ఆరే ఉంటాయని, జట్ల సంఖ్యను పెంచబోమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement